atla taddi, atla taddi vratha katha, atla thadiya, atla taddi importance, atla taddi nomu, atla taddi vrat katha, dr anantha lakshmi atla taddi, atla thaddi, telugu vrathaalu, atla taddi festival, atla taddi nomu katha, dharma sandehalu, atla taddi pooja, atla taddi pooja vidhanam, atla taddi nomu pooja, atla taddi story, atla taddi nomu in telugu, atla tadde ante emiti, atla taddi special, atla taddi vratham ela cheyali, andhra, pooja, chirravuri, vrathalu, puja, poojatv telugu


      “అట్లతద్దె” రోజున గౌరీపూజ చేయండి
     Atla Taddi Gowri Pooja
   
atla taddi, atla taddi vratha katha, atla thadiya, atla taddi importance, atla taddi nomu, atla taddi vrat katha, dr anantha lakshmi atla taddi, atla thaddi, telugu vrathaalu, atla taddi festival, atla taddi nomu katha, dharma sandehalu, atla taddi pooja, atla taddi pooja vidhanam, atla taddi nomu pooja, atla taddi story, atla taddi nomu in telugu, atla tadde ante emiti, atla taddi special, atla taddi vratham ela cheyali, andhra, pooja, chirravuri, vrathalu, puja, poojatv telugu
  



ఆశ్వీయుజ బహుళ తదియనాడు వచ్చే అట్లతద్దె పండుగ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఉపవాసముండాలి. ఇంట్లో తూర్పుదిక్కున మంటపము ఏర్పాటుచేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, స్లోకాలు, పాటలు చదవడం, పాడడం చేయాలి. సాయంత్రం చంద్రదర్శనానికి తర్వాత తిరిగి స్నానం చేసి మళ్లీ గౌరీపూజచేసి, 10 అట్లు నైవేద్యముగాపెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 10 అట్లు, 10 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్దెనోము కథను చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక వస్త్రములు, దక్షినతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈ పండుగలో విశేషము. ఈ పండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లికాని అమ్మాయిలకు గుణవంతుడైన భర్త లభిస్తాడని, పెళ్ళైనవారికి పిల్లకు కలుగుతారని, ఐదోతనముతోపాటు, పుణ్యము లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న విశ్వాసం .



కాగా.. అట్ల తద్దె లేదా అట్ల తదియగా పిలువబడే ఈ పండుగ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. “అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు” అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగువారికి వాయినాలివ్వటం పరిపాటి. ఆ రోజు సాయంత్రం వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదిలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు. 




త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్భలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్దె అని పురాణాలు చెబుతున్నాయి. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే ఈ వ్రతంలో చంద్రారాధన ప్రధానమైన పూజ. చంద్రకళల్లో కొలువైవున్న ఆ పరాశక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యము పెరుగుతుందని విశ్వాసం.అలాగే ఈ వ్రతాన్ని ఆచరించే మహిళల కుటుంబములో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతర్ధానముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం.



ఇంకా రజోదయమునకు కారకుడైన కుజుడు ఋతుచక్రాన్ని సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడని విశ్వాసం. అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు ప్రీతికరమైన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావమురాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు కూడా ఇవి దోహదపడుతాయని పురోహితులు అంటున్నారు. అందుకే అట్లతద్దె రోజున ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారని పండితులు చెబుతున్నారు.

అట్లతద్ది వ్రతము



అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు.కన్నెపిల్లలు ఎంతగానో ఎదురుచూసే పండుగ ఇది. కాబోయే భర్త గురించి వారి ఊహలు, ఆశలు నెరవేరాలని కోరుకుంటూ నోచుకునే నోము ఈ పండగలో ప్రత్యేకం. తెలుగింటి ఆడపిల్లలంతా ఉత్సాహంగా జరుపుకునే పర్వం ఇది. చల్లని రాత్రి దుప్పటి ముసుగు తీయకముందే నిదుర లేచి, పండిన గోరింటాకును చూసుకుని మురిసిపోవడం, తక్కువగా పండితే ముసలి మొగుడొస్తాడని వేళాకోళాలాడుకోవడం, పొద్దు పొడిచే లోపలే చద్ది తినడం, ఆడపిల్లలంతా ఒక్కచోటచేరి ఆటలాడటం, ఉయ్యాలలూగడం అన్నీ సరదాలే. దీన్ని ఎక్కువగా కృష్ణా, గోదావరి ప్రజలు జరుపుకుంటారు.



త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగ చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతరార్ధముంది. నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగా పెడితే కుజదోష పరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగా వుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భదారణలోఎటువంటి సమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన దాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావము రాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.అట్లతద్ది పండుగను ఉత్తభారత దేశంలో 'కర్వా ఛౌత్' అనే పేరుతో జరుపుకుంటారు.
ఉద్యాపన


ఈ వ్రతం అశ్వయుజమాసం, బహుళ తదియనాడు ఉపవాసం చేసి, చంద్రోదయం అయ్యేవరకు ఏమీ తినకూడదు. గౌరీదేవికి పది అట్లు నివేదన చేయాలి. అలా తొమ్మిది సంవత్సరములు చేసి, 10వ సంవత్సరమున, 10మంది ముత్తైదువులను పిలిచి, వారికి తలంటు స్నానము చేయించి, 10 అట్లు, పసుపు, కుంకుమ, రవికల బట్ట, దక్షిణ తాంబూలము సమర్పించి, సంతృప్తిగా భోజనము పెట్టాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈ పండుగలో విశేషము. దీనినే 'ఉయ్యాలపండగ' అనీ, 'గోరింటాకుపండగ' అనీ అంటారు. ఈ పండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళి కాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్తగా లభిస్తాడని, పెళ్ళైనవారికి పిల్లలు కలుగుతారని, ఐదవతనముతోపాటు, పుణ్యము లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న నమ్మకము.



ఈ పండగ వైభవము పట్టణాలకంటే పల్లెలో ఎక్కువగా కనిపిస్తుంది. అందరూ ఉత్సాహముగా జరుపుకుంటారు. తొలి కోడి కూసినప్పుడే లేచి ఉట్టికింద కూర్చొని గోంగూరపచ్చడి, కందిపులుసు మొదలైన వాటితో చద్ది అన్నము తిని తాంబూలం వేసుకుంటారు. ఇక అప్పటి నుండి నిద్ర పోరు. ఆట పాటలతో గడుపుతారు. అట్లతద్దోయ్ ఆరట్లో, ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అని పాటలు పాడుతూ ఉయ్యాలలూగుతారు. ఉయ్యాలలు ఇంట్లోకాక తోటలలో పెద్ద పెద్ద చెట్లకి వేస్తారు.  ఈ పండుగని అందరూ జరుపుకుంటారు. అందుకే అస్టాదశ వర్ణాలవారికి అట్లతద్దె అనే పేరు వచ్చింది.
ఉయ్యాల పండుగ

atla taddi, atla taddi vratha katha, atla thadiya, atla taddi importance, atla taddi nomu, atla taddi vrat katha, dr anantha lakshmi atla taddi, atla thaddi, telugu vrathaalu, atla taddi festival, atla taddi nomu katha, dharma sandehalu, atla taddi pooja, atla taddi pooja vidhanam, atla taddi nomu pooja, atla taddi story, atla taddi nomu in telugu, atla tadde ante emiti, atla taddi special, atla taddi vratham ela cheyali, andhra, pooja, chirravuri, vrathalu, puja, poojatv telugu


ఆడపిల్లలంతా పట్టు పరికిణీలతో ముచ్చటగా ముస్తాబవుతారు. ఉత్సాహంగా ఊయలలూగుతూ, పాటలు పాడుతూ, నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటారు. ఊరిలో వుంటే పెద్ద చెట్టు దగ్గర ఉయ్యాల కట్టి అమ్మాయిలంతా అక్కడచేరి ఆడిపాడతారు. ఈ సందట్లో మగవారికి ప్రవేశం లేదు. ఆడవారిదే రాజ్యం. తదియ రోజున ఊయల ఊగకపోతే ముసలి మొగుడొస్తాడని నమ్ముతారు.  అట్లతద్ది రోజున నోములు నోచుకునే వారుంటారు. ఈ నోముల వెనుక ఒక పురాణ కథ కూడా వుంది.

అట్లతద్ది కథ


అట్లతద్ది నోము 
(Atla Taddi Nomu)

పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.
ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి 'అదిగో చంద్రోదయమైంది. అమ్మా!కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో' అన్నాడు.
రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి 'చంద్రోదయ ఉమావ్రతం' అని పేరు వచ్చింది. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిథిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది.
ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. “అయ్యో అట్లతద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా! నా స్నేహితురాళ్ళకందరికీ మంచి యౌవనవంతులైన భర్తలు లభించారు. నేనేమి అపచారం చేశాను?” అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై" నీ అన్న అజ్ఞానం, నీ పై అతనికుండే ప్రేమవల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వయుజ బహుళ తదియ, నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యౌవనవంతుడవుతాడు" అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్తమీద వేసేసరికి అతడు యౌవనవంతుడయ్యాడు . కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు.
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాల్తో అట్లతద్ది జరుపుకుంటారు. అట్లతద్దికి ముందురోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు, పాదాలకు, గోరింటాకు పెట్టుకుని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం.
ఒక పండుగ వస్తే, అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు.దాని కోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారుచేయటం ఒక పెద్ద కార్యక్రమం. అట్లతద్దినాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతారు. మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో ఊయల కడతారు. పెరట్లో చెట్లకి కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు.
అట్లతద్దినాడు తెల్లవారుఝామున లేస్తారు.అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. 'అట్లతద్దోయ్, ఆరట్లోయ్ ముద్దపప్పు మూడట్లోయ్' అంటూ అరుస్తూ ఇరుగు పొగురు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో బాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్లి ఆనందం పొందుతారు.
అట్లతద్ది అంతరార్ధం
త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరీ మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై వున్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్ర వచనం.
ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం వుంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. ఋతుచక్రం సరిగా వుండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ వుండవు. మినప పిండి, బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలిగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి.
ఆశ్వయుజ బహుళ తదియనాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకూ ఎంతో శుభప్రదమైనది. పిల్లలు, పెద్దలు, అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈరోజున తెల్లవారు ఝామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి.చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీపూజ చేసి, ఆమెకు పది అట్లు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ముత్తయిదువులకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనంగా సమర్పించాలి.
అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షింతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. పదిరకాల ఫలాలను తినడం, పదిమార్లు తాంబూలం వేసుకోవడం, పదిమార్లు ఊయల ఊగడం, ఈ పండుగలో విశేషం.గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు గనుకే ఈ పండుగకు అట్లతద్ది అనే పేరు వచ్చింది.
దీనినే ఉయ్యాల పండుగనీ, గోరింటాకు పండుగ అనీ అంటారు.ఈవిధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళికాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్త లభిస్తాడని, పిల్లలు కలుగుతారని, ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తర తరాల నుంచి వస్తున్న నమ్మకం.పది మంది ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవికెలగుడ్డ, దక్షిణ తాంబూలాలు మరియు పది అట్లు వాయనమిచ్చి, భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి.
పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి, ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి. సృష్టి స్థితి లయలకు కారకులయిన బ్రహ్మ,విష్ణు, పరమేశ్వరుల భార్యలు సరస్వతి, లక్ష్మి, పార్వతులకు నేల పొడవునా ఉత్సాహం సాగే మాసం ఈ ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం.
కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా పాడినా వాళ్ళంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెప్తున్నాయి పురాణాలు.






నోము విధానం


నోము చేసుకునే స్త్రీలు ఉదయం ఉపవాసం చేసి సాయంత్రం పది పోగులతో దారాన్ని చేతికి కట్టుకుని, పదిమంది ముతైదులకు తలంటు స్నానం చేయించి, వాయినం ఇవ్వాలి. పసుపు, కుంకుమలు, రవికలగుడ్డ, తాంబూలంతోపాటుగా పదకొండు అట్లను వాయనంలో ఇస్తారు. పది సంవత్సరాలు ఈ నోమును నోచుకుంటారు. సంవత్సరానికి ఒక ముతైదుకు వాయినం ఇచ్చేవారు కొందరైతే, పదిమందికీ ఒకేసారి ఇచ్చేవారు కొందరు. వాయినం పుచ్చుకున్న అట్లను వారుతప్ప వేరొకరు తినకూడదనే నియమం వుంటుంది. 
నోము విధానంలో కొందరిది వేరొక పద్ధతి. ఈ నోము నోచుకునే అమ్మాయిలు ఐదుగురు ముత్తైదువులకి పదకొండు అట్లు, తాంబూలంతో కలిపి ఇస్తారు. బియ్యపు పిండితో చేసిన దీపాలను వెలిగించి ఆ అట్ల మీద పెట్టి ఇవ్వడం మరో సంప్రదాయం. అంతేకాక పోతురాజుకు పదకొండు అట్లను నైవేద్యంగా ఇస్తారు. అమ్మవారితోపాటు అయ్యవారి అంశగా ఇక్కడ పోతురాజును కొలుస్తారు. ప్రతిగ్రామంలోనూ అట్లతద్దికి ఆడవారంతా గ్రామదేవత గుడిదగ్గర ఈ వాయినాలను ఇచ్చి పుచ్చుకోవడం చేస్తారు. 

శాస్త్రీయ దృక్పథం


ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం.వర్షాల సమయంలో విరివిగా లభించే ఉసిరి, గోంగూర వంటి వాటిని తినడం ద్వారా కంటిసమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. గోర్లకు ఆరోగ్యం కూడా. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.
స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ ప్రత్యేకత అని ఇట్టే అర్థం అవుతుంది. సాంప్రదాయ వాదమైనా, శాస్త్రీయ దృక్కోణమైనా, పెద్దలు చెప్పే ఆచారమైనా మానవుల జీవన గతిలో కించిత్‌ మార్పును చొప్పించి, సంతోషాలను అందించేందుకు ఉద్దేశింపబడిందే. హైటెక్‌ యుగంలో పండుగలను కూడా సినిమాలతోనో, షికార్లతోనో గడిపేస్తున్నాం. అసలు పండుగల్లో దాగున్న ఆంతర్యమేమిటో అర్థం చేసుకుంటే సామాజిక ప్రగతికి అవి ఎంత దోహదకారులో తెలుస్తుంది.
atla taddi, atla taddi vratha katha, atla thadiya, atla taddi importance, atla taddi nomu, atla taddi vrat katha, dr anantha lakshmi atla taddi, atla thaddi, telugu vrathaalu, atla taddi festival, atla taddi nomu katha, dharma sandehalu, atla taddi pooja, atla taddi pooja vidhanam, atla taddi nomu pooja, atla taddi story, atla taddi nomu in telugu, atla tadde ante emiti, atla taddi special, atla taddi vratham ela cheyali, andhra, pooja, chirravuri, vrathalu, puja, poojatv telugu

ఆటల నోము అట్లతద్ది!

పడుచుల ఊహలకు మరింత ఊతమిస్తూ అరచేతులనే కాదు చెక్కిళ్లనూ ఎరుపెక్కించే పండగే అట్లతద్ది. మెచ్చినవాడే భర్తగా రావాలని కన్నెపిల్లలూ, మూడుముళ్లూ వేసినవాడిని కొంగునముడేసుకోవాలని ముత్తయిదువులూ నోచే నోమే అట్లతద్ది. పట్టుపరికిణీల అందాలతో ఊయలల సందడితో వాయనాల ఘుమఘుమలతో కొత్తసందళ్లు తెచ్చే ఈ పండగ (అక్టోబరు 27) చేసే ఇంటికే కాదు చూసే ఊరికీ ఉత్సవమే.

మన పండగలన్నీ మన జీవనవిధానానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అందులో భక్తి ఎంతగా కనిపిస్తుందో, సంస్కృతీ అంతే స్పష్టంగా ఉంటుంది. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకునే వేడుకే అట్లతదియ. ఇది పూర్తిగా ఆడపిల్లల పండగ. అక్కడక్కడా మగపిల్లలు ఉప్పు పొట్లాలు తిప్పి సందడి చేసినా ముందురోజు రాత్రి గోరింటాకు పెట్టుకోవడం దగ్గర్నుంచి మర్నాడు సాయంత్రం ముత్తయిదువులకు వాయనాలు ఇచ్చేవరకూ హడావిడి అంతా కన్నెపిల్లలదే. ఆశ్వయుజ బహుళ తదియను అట్లతదియ లేదా అట్లతద్ది అంటారు. ఆ రోజున మహిళలంతా ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. అట్లతదియకు ముందురోజును భోగి అంటారు. నిజానికి తదియ సందడంతా భోగి రోజునుంచే మొదలైపోతుంది. భోగినాడు పెరట్లోని గోరింటాకును మెత్తగా నూరి అందంగా తమ అరచేతులకు అలంకరించుకుంటారు. మరుసటిరోజు అట్ల పండగ. చల్లని రాత్రి దుప్పటి ముసుగు తీయకముందే నిద్రలేవడం, పండిన గోరింటాకుని చూసుకుని మురిసిపోవడం, పట్టుపావడాలు కట్టుకుని ముస్తాబవడం, చద్దన్నం తినడం, తాంబూలాలు వేసుకోవడం, ఆడపిల్లలంతా ఒక్కచోట చేరి ఆడిపాడటం, ఊయలలూగడం... అన్నీ సరదాలే.

మొదటి నోము అమ్మదే 
పరమశివుడిని భర్తగా పొందాలని తపస్సుచేసిన గౌరీదేవికి త్రిలోకసంచారి అయిన నారదుడు ఈ వ్రతం గురించి చెప్పాడని పురాణాలు తెలుపుతున్నాయి. నారదుడి ప్రోద్బలంతో అమ్మవారు అట్లతద్ది నోమును నోచుకుని, పరమేశ్వరుడి అర్ధాంగి అయ్యింది. ఈ నోములో చంద్రారాధన ప్రధానమైంది. అందుకే సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి, రాత్రి చంద్రదర్శనం తర్వాతే ఫలహారం తీసుకుంటారు. ఈ వ్రతంలో గౌరీదేవికి అట్లు నైవేద్యంగా పెడతారు. నవగ్రహాల్లో కుజుడికి అట్లంటే మహా ప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా పెట్టడం వల్ల కుజదోషాలు ఏమైనా ఉంటే పరిహారమవుతాయని చెబుతారు. అంతేకాదు అట్లకు ఉపయోగించే మినుములు రాహువుకూ, బియ్యం చంద్రుడికీ సంబంధించిన ధాన్యాలు. వీటితో చేసిన అట్లను దానం ఇవ్వడం వల్ల ఆయా గ్రహదోషాలు తొలగి, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయంటారు. అందుకే అయిదు సంవత్సరాలు దాటిన అమ్మాయిల దగ్గర్నుంచి పెద్దవాళ్లవరకూ అందరూ ఈ నోమును నోచుకుంటారు. సాక్షాత్తూ ఉమాదేవే ఈ వ్రతం ఆచరించడంతో దీన్ని ‘చంద్రోదయ ఉమావ్రతం’ అని కూడా అంటారు.


వ్రత కథ 
పూర్వం ఒక రాజకుమారి తన స్నేహితురాళ్లతో కలిసి మంచి భర్తని పొందేందుకు అట్లతద్ది నోముని నోచుకుంది. నోములో భాగంగా ఉపవాసం ఉన్న రాజకుమారి ఆకలికి తాళలేక సాయంవేళకేసొమ్మసిల్లిపోయింది. రాజకుమారి అలా శోషవచ్చి పడి ఉండటాన్ని చూడలేని ఆమె సోదరుడు, చంద్రోదయం అయిపోయిందని నమ్మించి ఆమె ఆహారం తీసుకునేలా చేశాడు. యుక్తవయసు వచ్చిన రాజకుమారికీ ఆమె స్నేహితురాళ్లకీ పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఆ రోజు నోము నోచుకున్న వారందరికీ మంచి భర్తలు లభించగా... రాజకుమారికి మాత్రం ఎన్ని సంబంధాలు చూసినా ముసలి వ్యక్తులే వచ్చేవారు. దీంతో విసుగు చెందిన రాజకుమారి అడవులకు వెళ్లి పార్వతీపరమేశ్వరుల కోసం తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన ఆదిదంపతులు ప్రత్యక్షమై జరిగిన లోపాన్ని వివరించి, ఎలాంటి విఘ్నాలూ లేకుండా మళ్లీ వ్రతం చేయమని చెప్పారు. రాజకుమారి మరోసారి శ్రద్ధగా ఆ వ్రతాన్ని ఆచరించడంతో ఆమెకు మంచి భర్త లభించాడు.

పాటల్లో పరమార్థం 
అట్లతద్దికి పాడుకునే పాటలు ఇప్పటికీ తెలుగువారి నోళ్లలో నానుతున్నాయి. ‘అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌ ముద్దపప్పోయ్‌ మూడట్లోయ్‌...’, ‘చెమ్మ చెక్క చారడేసి మొగ్గ... అట్లుపోయంగా ఆరగించంగా...’ మొదలైన పాటలు ఈ వ్రత విధానాన్ని వివరించడంతోపాటు ఆడపిల్లలకు అట్లతద్ది మీద ఉన్న మక్కువనూ తెలియజేస్తున్నాయి.

‘... రాముడంతటివాడె రట్టుపడ్డాడు 
మానవులకెట్లమ్మ మాటపడకుండ 
దేవిసీతమ్మ కూడ జననిందపడెను 
మానవులకెట్లమ్మ మాటపడకుండ..’ 
... ఇలా, సీతారాములకు కూడా నింద తప్పలేదని తెలుపుతూ, లోకం తీరును 
చెబుతుందీ పాట. అంతేకాదు అవతారపురుషులే కష్టాలూ అపనిందలూ మోయాల్సి వచ్చింది మానవమాత్రులం మనమెంత... కష్టాల్ని ఎదుర్కొంటూ, అపవాదుల్ని 
తప్పించుకుంటూ ముందుకెళ్లాలన్న మహత్తర సందేశం దాగుంది ఇందులో!
#AtlaTaddi



ఉండ్రాళ్ల తద్దె

లోకమాత, జగజ్జనని పార్వతీదేవి స్వయంగా ఆచరించిన వ్రతమిది. పరమేశ్వరున్ని తన పతిగా పొందాలని తపస్సు ఆచరించింది. భాద్రపద మాసం బహుళ తదియనాడు స్వామి ఆమెను అనుగ్రహించి సతీమణిగా స్వీకరించాడు. మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని ఆమె వరమిచ్చింది. అందుకనే ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి.

రెండు రోజుల పాటు ఈ నోమును జరుపుకోవాల్సివుంటుంది. తదియ ముందు విదియ రోజున విఘ్నేశ్వరున్ని ఆరాధించి కుడుములతో నైవేధ్యం ఇవ్వాలి. ఆ సాయంత్రం రోజున ముత్తయిదవులను తదియ నాడు జరిగే వ్రతానికి ఆహ్వానిస్తారు. తదియ రోజున వేకువ జామునే స్నానం చేసి ఆటలాడుతారు. అనంతరం మధ్యాహ్నం అమ్మవారి పూజలో భాగంగా ఉత్తరేణి మొక్కకు నమస్కరిస్తారు. ఉమాదేవికి 16 ఉండ్రాళ్లను సమర్పిస్తారు. పంచ ముత్తయిదువులకు చీర, ఉండ్రాళ్లు, తాంబులాలను వాయినంగా ఇస్తారు.

పరమేశ్వరుడే స్వయంగా ఈ వ్రతవిధానాన్ని పార్వతీమాతకు వివరించినట్టు పురాణగ్రంథాలు తెలుపుతున్నాయి. ఉండ్రాళ్ల తద్దెను పదహారు కుడుముల నోము, షోడశోమావ్రతంగా కూడా పిలుస్తారు.



ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

2 comments:

 1. సౌభాగ్యాల నోము!

  తెలుగునాట మహిళలకే ప్రత్యేకమైన పండుగల్లో ‘అట్ల తద్ది’ ఒకటి. వివాహితలు సౌభాగ్యాన్నీ, పెళ్ళి కావలసిన అమ్మాయిలు మంచి వరుడినీ ఆశిస్తూ చేసుకొనే వేడుక ఇది.

  తద్దె, తద్ది, తద్దియ... ఇవన్నీ తదియకు పర్యాయాలు. ఆశ్వయుజ బహుళ తదియ రోజున జరుపుకొనే వేడుకను ‘అట్ల తద్ది’, ‘అట్ల తద్దె’ అని పిలుచుకుంటారు. గౌరీదేవిని ఆరాధించడం, చంద్రుణ్ణి పూజించడం ప్రధానంగా సాగే ఈ పండుగను వయోభేదం లేకుండా స్త్రీలు ఆచరిస్తారు.

  పురాణ కథల ప్రకారం, శివుడిని భర్తగా పొందాలని గౌరీదేవి కోరుకుంది. అందుకు మార్గం చెప్పాలని నారద మహర్షిని కోరగా, ‘అట్ల తదియ’ వ్రతాన్ని ఆచరించాలని సూచించాడని పురాణాల మాట. అట్ల తద్దె నోము నోచిన గౌరీదేవి పరమేశ్వరుడిని పతిగా పొందడంతో పాటు, ఆయనలో అర్ధభాగంగా స్థానం సంపాదించుకుంది. సాక్షాత్తూ జగన్మాత చేసిన ఈ నోమును ఆచరించి, ఆమెను పూజించడం సకల శుభప్రదమనీ, ఈ వ్రతం సౌభాగ్యదాయకం, కుటుంబ సౌఖ్య ప్రదాయిని అనీ పెద్దలు చెబుతారు.

  గోరింటాకు పండుగ
  అట్ల తద్ది రోజున హడావిడి అంతా పిల్లలదే. ముందురోజు గోరింటాకు తెచ్చుకొని, రుబ్బి మహిళలు, పిల్లలు చేతులకూ, పాదాలకూ పెట్టుకుంటారు. అందుకే దీనికి ‘గోరింటాకు పండుగ’ అనే పేరు వచ్చింది. మర్నాడు తెల్లారుజామున తినడం కోసం ముందుగానే గోంగూర పచ్చడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగు లాంటివి సిద్ధం చేసుకుంటారు. తదియ రోజు తెల్లవారుజామునే లేచి, సిద్ధమై, పెరుగన్నం, ఇతర పదార్థాలతో భోజనం చేస్తారు. తాంబూలాలు వేసుకుంటారు. ఎవరి నోరు బాగా పండితే వారికి అంత మంచి భర్త వస్తాడని పరిహాసాలు ఆడుకుంటారు. చక్కగా అలంకరించుకొని, ఇరుగు పొరుగు మహిళలతో, పిల్లలతో ఆటలు ఆడుతారు. ‘అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌’ అంటూ పాటలు పాడుతారు. ఊయలూగుతూ సరదాగా గడుపుతారు. పల్లెల్లో ‘ఊయల పండుగ’ అని కూడా ‘అట్ల తద్ది’ని పిలుస్తారు.

  అట్ల నివేదన అంతరార్థం
  అట్ల తదియ వ్రతానికే ‘చంద్రోదయ ఉమావ్రతం’ అనే పేరు కూడా ఉంది. చంద్రోదయం అయ్యాక గౌరీదేవిని పూజించి, అట్లు పోసి, నైవేద్యం పెడతారు. ముత్తయిదువలకు వాయినాలు ఇస్తారు. అట్ల తద్ది నోము కథ చదువుకొని, కథాక్షతలు తల మీద వేసుకొని, భోజనం చేస్తారు. ఈ వ్రతం కోసం అట్లను బియ్యం, మినుములతో చేస్తారు. బియ్యం చంద్రుడికీ, మినుములు రాహువుకీ ఇష్టమైన ధాన్యాలు. అట్లు కుజుడికి ప్రీతికరమనీ, వీటిని అమ్మవారికి నివేదించి, ముత్తయిదువలకు వాయనంగా ఇవ్వడం వల్ల ఆ గ్రహాలకు సంబంధించిన దోషాలు పోతాయంటారు. దీనివల్ల వివాహ, సంసార, గర్భధారణ సమస్యలు తీరుతాయని పెద్దల మాట. చంద్రుని ఆరాధన ఈ వ్రతంలో ప్రధానం. చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి ద్వారా మహిళల సౌభాగ్యం పెరుగుతుందనీ, నిష్ఠగా ఈ వ్రతం ఆచరిస్తే పెళ్లికాని అమ్మాయిలకు ఉత్తముడైన భర్త లభిస్తాడనీ, వివాహితల జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందనీ తెలుగు ప్రాంతాల్లో నమ్మిక.

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete