tag:blogger.com,1999:blog-5360619685228853756.post8975810354923633613..comments2023-06-25T05:13:23.792-07:00Comments on Bhakti Books | Telugu Books | kathalu | Mohan Publications | FREE pdf | Devullu | Bhakti Pustakalu: Atla Taddi Gowri Pooja “అట్లతద్దె” రోజున గౌరీపూజ చేయండిDevullu.com | Mohan Publicationshttp://www.blogger.com/profile/02976722752184429417noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5360619685228853756.post-64767760205196206452018-10-25T17:45:21.024-07:002018-10-25T17:45:21.024-07:00This comment has been removed by the author.Devullu.com | Mohan Publicationshttps://www.blogger.com/profile/02976722752184429417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5360619685228853756.post-16870787023605230872018-10-25T17:36:19.502-07:002018-10-25T17:36:19.502-07:00సౌభాగ్యాల నోము!
తెలుగునాట మహిళలకే ప్రత్యేకమైన పండ...సౌభాగ్యాల నోము!

తెలుగునాట మహిళలకే ప్రత్యేకమైన పండుగల్లో ‘అట్ల తద్ది’ ఒకటి. వివాహితలు సౌభాగ్యాన్నీ, పెళ్ళి కావలసిన అమ్మాయిలు మంచి వరుడినీ ఆశిస్తూ చేసుకొనే వేడుక ఇది.

తద్దె, తద్ది, తద్దియ... ఇవన్నీ తదియకు పర్యాయాలు. ఆశ్వయుజ బహుళ తదియ రోజున జరుపుకొనే వేడుకను ‘అట్ల తద్ది’, ‘అట్ల తద్దె’ అని పిలుచుకుంటారు. గౌరీదేవిని ఆరాధించడం, చంద్రుణ్ణి పూజించడం ప్రధానంగా సాగే ఈ పండుగను వయోభేదం లేకుండా స్త్రీలు ఆచరిస్తారు.

పురాణ కథల ప్రకారం, శివుడిని భర్తగా పొందాలని గౌరీదేవి కోరుకుంది. అందుకు మార్గం చెప్పాలని నారద మహర్షిని కోరగా, ‘అట్ల తదియ’ వ్రతాన్ని ఆచరించాలని సూచించాడని పురాణాల మాట. అట్ల తద్దె నోము నోచిన గౌరీదేవి పరమేశ్వరుడిని పతిగా పొందడంతో పాటు, ఆయనలో అర్ధభాగంగా స్థానం సంపాదించుకుంది. సాక్షాత్తూ జగన్మాత చేసిన ఈ నోమును ఆచరించి, ఆమెను పూజించడం సకల శుభప్రదమనీ, ఈ వ్రతం సౌభాగ్యదాయకం, కుటుంబ సౌఖ్య ప్రదాయిని అనీ పెద్దలు చెబుతారు.

గోరింటాకు పండుగ
అట్ల తద్ది రోజున హడావిడి అంతా పిల్లలదే. ముందురోజు గోరింటాకు తెచ్చుకొని, రుబ్బి మహిళలు, పిల్లలు చేతులకూ, పాదాలకూ పెట్టుకుంటారు. అందుకే దీనికి ‘గోరింటాకు పండుగ’ అనే పేరు వచ్చింది. మర్నాడు తెల్లారుజామున తినడం కోసం ముందుగానే గోంగూర పచ్చడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగు లాంటివి సిద్ధం చేసుకుంటారు. తదియ రోజు తెల్లవారుజామునే లేచి, సిద్ధమై, పెరుగన్నం, ఇతర పదార్థాలతో భోజనం చేస్తారు. తాంబూలాలు వేసుకుంటారు. ఎవరి నోరు బాగా పండితే వారికి అంత మంచి భర్త వస్తాడని పరిహాసాలు ఆడుకుంటారు. చక్కగా అలంకరించుకొని, ఇరుగు పొరుగు మహిళలతో, పిల్లలతో ఆటలు ఆడుతారు. ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్’ అంటూ పాటలు పాడుతారు. ఊయలూగుతూ సరదాగా గడుపుతారు. పల్లెల్లో ‘ఊయల పండుగ’ అని కూడా ‘అట్ల తద్ది’ని పిలుస్తారు.

అట్ల నివేదన అంతరార్థం
అట్ల తదియ వ్రతానికే ‘చంద్రోదయ ఉమావ్రతం’ అనే పేరు కూడా ఉంది. చంద్రోదయం అయ్యాక గౌరీదేవిని పూజించి, అట్లు పోసి, నైవేద్యం పెడతారు. ముత్తయిదువలకు వాయినాలు ఇస్తారు. అట్ల తద్ది నోము కథ చదువుకొని, కథాక్షతలు తల మీద వేసుకొని, భోజనం చేస్తారు. ఈ వ్రతం కోసం అట్లను బియ్యం, మినుములతో చేస్తారు. బియ్యం చంద్రుడికీ, మినుములు రాహువుకీ ఇష్టమైన ధాన్యాలు. అట్లు కుజుడికి ప్రీతికరమనీ, వీటిని అమ్మవారికి నివేదించి, ముత్తయిదువలకు వాయనంగా ఇవ్వడం వల్ల ఆ గ్రహాలకు సంబంధించిన దోషాలు పోతాయంటారు. దీనివల్ల వివాహ, సంసార, గర్భధారణ సమస్యలు తీరుతాయని పెద్దల మాట. చంద్రుని ఆరాధన ఈ వ్రతంలో ప్రధానం. చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి ద్వారా మహిళల సౌభాగ్యం పెరుగుతుందనీ, నిష్ఠగా ఈ వ్రతం ఆచరిస్తే పెళ్లికాని అమ్మాయిలకు ఉత్తముడైన భర్త లభిస్తాడనీ, వివాహితల జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందనీ తెలుగు ప్రాంతాల్లో నమ్మిక.Devullu.com | Mohan Publicationshttps://www.blogger.com/profile/02976722752184429417noreply@blogger.com