Ayyappa | Lord Ayyappa | BhakthiBooks | BhaktiBooks | Mohanpublications | Women Allowed in Temple | Hindu News | Ayyappa Temple | Telugu Books | Lord Ayyappan


 Ayyappa | Lord Ayyappa | BhakthiBooks | BhaktiBooks | Mohanpublications | Women Allowed in Temple | Hindu News | Ayyappa Temple | Telugu Books | Lord Ayyappanతొలగిన అడ్డంకి 
మహిళలందరికీ శబరిమల ఆలయ ప్రవేశం 
రుతుక్రమాన్ని కారణంగా చూపి నిషేధించడం తగదు 
అది రాజ్యాంగ విరుద్ధం 
సర్వోన్నత న్యాయస్థానం ప్రకటన 
దిల్లీ 
శబరిమలలోని అయ్యప్ప దేవాలయం ప్రవేశంపై శతాబ్దాలుగా ఉన్న సంప్రదాయాన్ని కొట్టివేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరూ ఆలయంలోకి వెళ్లవచ్చంటూ ప్రకటించింది. రుతుకాలం వయసులో ఉండే 10-50 ఏళ్లలోపు బాలికలు, మహిళలకు ఆలయ ప్రవేశాన్ని నిరోధిస్తూ పాటిస్తున్న సంప్రదాయం చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర ఆధ్వర్యంలో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజార్టీతో ఈ మేరకు తీర్పును వెలువరించింది. కొన్ని వయసుల వారిని ఆలయంలోకి రానీయకుండా నిషేధించే సంప్రదాయం వివక్ష కిందకు వస్తుందని, అది హిందూ మహిళల హక్కులను ఉల్లంఘిస్తుందని పేర్కొంది. జస్టిస్‌ దీపక్‌ మిశ్రతో పాటు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌లు ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. ధర్మాసనంలో ఏకైక మహిళ అయిన జస్టిస్‌ ఇందూ మల్హోత్రా మాత్రం అసమ్మతి తీర్పు రాశారు. మతపరమైన ఆచారాలను కోర్టులు నిర్ణయించలేవని పేర్కొన్నారు. న్యాయమూర్తులు నాలుగు సెట్ల తీర్పులను వెలువరించారు. తన తరఫున, జస్టిస్‌ ఖన్విల్కర్‌ తరఫున ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర తీర్పు రాశారు. (అక్టోబరు రెండో తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్‌ మిశ్రకు ఇదే చివరి తీర్పు కానుండడం గమనార్హం.)

జస్టిస్‌ నారిమన్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌లు వీరి అభిప్రాయాలతో ఏకీభవిస్తునే వేర్వేరు తీర్పులు రాశారు. మొత్తం 411 పుటల తీర్పు వెలువడింది. రుతు క్రమంలో ఉండే మహిళలను రానీయకపోవడం ‘తప్పనిసరి మత సంప్రదాయం’ అని ఆలయాన్ని పర్యవేక్షిస్తున్న ట్రావంకోర్‌ దేవసం బోర్డు (టీడీబీ) చేసిన వాదనను తిరస్కరించింది. శారీరక కారణాల పేరుతో మహిళల అణచివేతను చట్టబద్ధం చేయకూడదని పేర్కొంది. ఒక వైపు మహిళలను దేవతలని కీర్తిస్తునే, వారిపై కఠిన ఆంక్షలు విధించడం ద్వంద్వ ప్రవృత్తి అని, దీన్ని విడనాడాల్సి ఉందని తెలిపింది. ప్రజా జీవన భద్రత, నైతికత, ఆరోగ్యం అన్న రంగులు పూసి మహిళలపై వివక్ష చూపడం తగదని పేర్కొంది. 
ఈ తీర్పును మహిళా హక్కుల నేతలు స్వాగతించారు. పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని కేరళకు చెందిన కొందరు మహిళలు మాత్రం తాము ఆలయ ప్రవేశం చేయబోమని చెప్పారు. సంప్రదాయాలను, హిందూ ఆచారాలను గౌరవిస్తామని స్పష్టం చేశారు. ఈ తీర్పును అమలు చేయాల్సి ఉంటుందని టీడీబీ వర్గాలు తెలిపాయి.

శబరిమల చరిత్రను లోతుగా ప్రస్తావించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ 
శబరిమల చరిత్ర, అయ్యప్ప స్వామి జననం, భక్తుల దీక్ష వంటి విషయాల గురించి లోతైన సమాచారాన్ని జస్టిస్‌ చంద్రచూడ్‌ తన తీర్పులో ప్రస్తావించారు. దేశంలో ఎన్నో అయ్యప్ప దేవాలయాలున్నప్పటికీ.. శబరిమలలో స్వామి ‘నైష్టిక బ్రహ్మచారి’గా కొలువుదీరినట్లు ఆయన తెలిపారు. లైంగికపరమైన విషయాలకు దూరంగా ఉండటం ద్వారా.. స్వామి శక్తులు పొందుతారన్నది భక్తుల విశ్వాసమని చంద్రచూడ్‌ పేర్కొన్నారు. శివుడు, విష్ణువుల నుంచి అయ్యప్ప ఉద్భవించిన తీరు.. మహారాజు రాజశేఖర వేటకు వెళ్లినప్పుడు పంబా నది వద్ద పసివాడిగా ఉన్న అయ్యప్ప లభించడం గురించి వివరించారు. పులి పాల కోసం అయ్యప్పను అడవులకు పంపే ఘట్టాన్ని కూడా చంద్రచూడ్‌ పేర్కొన్నారు. అయ్యప్ప పులుల మందతో తిరిగివచ్చి మహారాజు, ఇతరులకు మహిమలు చూపడం.. శబరిమల దీక్ష నియమాలను వివరించడం గురించి ప్రస్తావించారు.
తప్పనిసరి మత సంప్రదాయం కాదు
-జస్టిస్‌ దీపక్‌ మిశ్ర
‘‘శబరిమలలో అనుసరిస్తున్న సంప్రదాయాన్ని ‘తప్పనిసరి మత పర ఆచారంగా’ పరిగణించలేం. మతమంటే జీవితాన్ని దైవంతో అనుసంధానం చేసే జీవన విధానమే. ఆరాధనలో వివక్ష ఉండకూడదు. ఆరాధనలో పాటించాల్సిన సమానత్వంపై పితృస్వామ్య వ్యవస్థ భావజాలం పైచేయి సాధించకూడదు’’.
కేరళ చట్టంలోని నిబంధన కొట్టివేయతగ్గది
-జస్టిస్‌ నారిమన్‌
‘‘10-50 ఏళ్లలోపు ఉన్న మహిళలను ఆలయంలోకి అనుమతించకూడదన్న సంప్రదాయం రాజ్యాంగంలోని అధికరణం 25(1), అధికరణం 26లకు విరుద్ధంగా ఉంది. మహిళల ప్రవేశాన్ని నిరోధిస్తున్న కేరళ హిందూ ప్రార్థనా స్థలాల (ప్రవేశాలకు అనుమతి) నిబంధనలు-1965లోని నిబంధన-3(బి) కొట్టివేయదగ్గది.’’
అయ్యప్ప భక్తులది ప్రత్యేకమైన మత శాఖేమీ కాదు
-జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ 
‘‘మహిళలకు ఆరాధన హక్కును నిరోధించడానికి మతాన్ని ముసుగుగా ఉపయోగించకూడదు. ఇది మానవుల గౌరవానికే వ్యతిరేకం. మతానికి సంబంధం లేని కారణాలతో శతాబ్దాల తరబడి మహిళలపై నిషేధం కొనసాగుతోంది. అయ్యప్పస్వామి భక్తులది హిందూ మతమే. ప్రత్యేకమైన మత శాఖ ఏమీ కాదు. శారీరక పరిస్థితిని కారణంగా చూపి, మహిళల గౌరవాన్ని భంగపరుస్తూ ఉండే ఎలాంటి మతపరమైన సంప్రదాయమైనా అది రాజ్యాంగ వ్యతిరేకమే. ఇది మహిళల స్వేచ్ఛ, సమానత్వం, గౌరవాన్ని హరిస్తోంది.’’
ఒక్క శబరిమలతో ఆగదు
-జస్టిస్‌ ఇందూ మల్హోత్రా 
‘‘దేశంలో లౌకికవాద వాతావరణాన్ని కొనసాగించాలంటే లోతైన అర్థాలు ఉన్న మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. సతీ సహగమనంలాంటి సాంఘిక దురాచారాలను తప్పిస్తే ఎలాంటి సంప్రదాయాలను కొట్టివేయవచ్చో అని చెప్పాల్సిన పని న్యాయస్థానాలది కాదు. దేవున్ని ఆరాధించే విషయంలో కోర్టులు వాటి ఆలోచనలను రుద్దకూడదు. ఇక్కడ మహిళల సమానత్వ హక్కుకు, అయ్యప్ప భక్తుల ప్రార్థన హక్కుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమస్య ఒక్క శబరిమలతో ఆగదు. ఇతర ప్రార్థనా స్థలాలపైనా ప్రభావం చూపుతుంది. మతపరమైన వ్యవహారాల్లో హేతువాదాన్ని తీసుకురాకూడదు. భారత దేశం విభిన్న మతాచారాలకు నిలయం. రాజ్యాంగం ప్రకారం తాము నమ్మిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. సమానత్వం హక్కు పేరుతో రాజ్యాంగంలోని 25వ అధికరణం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అయిన ఆరాధించే హక్కును తోసిరాజనడానికి వీల్లేదు.’


అయ్యప్ప స్వామికి హక్కుల్లేవా? | Ayyappa | Lord Ayyappa | BhakthiBooks | BhaktiBooks | Mohanpublications | Women Allowed in Temple | Hindu News | Ayyappa Temple | Telugu Books | Lord Ayyappan


అయ్యప్ప స్వామికి హక్కుల్లేవా?


గుడి, మహిళల హక్కుల సంగతి సరే!
దేవుడి విశ్వాసాలకు విలువ లేదా?
దేవుడూ న్యాయబద్ధ వ్యక్తేనని సుప్రీం కోర్టే గతంలో స్పష్టం చేసింది
అందువల్ల దేవుడికీ హక్కులన్నీ ఉంటాయి
బ్రహ్మచారిగా ఉండే హక్కు ఆయనకుంది
దాన్ని పరిరక్షించే బాధ్యత ఆలయానిదే
యువ న్యాయవాది సాయిదీపక్‌ వాదన
10 నిమిషాలు అడిగి 2 గంటల ధాటి
భేష్‌ అన్న సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ, ఆగస్టు 1: గుడి హక్కుల కోసం వాదించే న్యాయవాదులున్నారు. మహిళల హక్కుల కోసం వాదించే న్యాయవాదులున్నారు. మరి దేవుడి హక్కుల సంగతేంటి? ఆయన హక్కుల గురించి వాదించేదెవరు? అంటూ హైదరాబాదీ న్యాయవాది జె.సాయి దీపక్‌ అందర్నీ ఆకట్టుకున్నారు. తనను దేవుడి తరఫు న్యాయవాదిగా ప్రకటించుకున్నారు. ఆయన వాదనలో వాక్పటిమ, లాజిక్‌ రెండూ ఉన్నాయని స్వయంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రశంసించారు. ఆయన వాదన జ్ఞానబోధకంగా ఉందని మరో న్యాయమూర్తి జస్టిస్‌ రోహింగ్టన్‌ ఫాలీ నారీమన్‌ వ్యాఖ్యానించారు. శబరిమల ఆలయంలో 10-50 మధ్య వయస్సు మహిళలకు ప్రవేశంపై వాజ్యంలో గతవారం వాదనల సందర్భంగా ‘పీపుల్‌ ఫర్‌ ధర్మ’ తరఫున వాదించిన ఆయనకు ధర్మాసనం తొలుత పది నిమిషాల సమయం ఇచ్చింది. తొలి ఐదు నిమిషాల్లోనే పలు మౌలిక ప్రశ్నలతో సాయి దీపక్‌ ఆకట్టుకున్నారు.

దాంతో మధ్యాహ్న భోజనం తర్వాత మళ్లీ ఆయనకు అవకాశమిచ్చారు. అనర్గళంగా ఆయన వాదన మరో 1.45 గంటల పాటు సాగింది. ఆ రోజు కోర్టు సమయం ముగిసే వరకు ఆయన వాదనలే కొనసాగాయి. ఆ కేసుకు సంబంధించి వాదనలు బుధవారం ముగిశాయి. ఉభయ పక్షాల న్యాయవాదులు ఇంకా ఏమైనా చెప్పదలచుకుంటే తమ వాదనలను సంక్షిప్తంగా ఏడు రోజుల్లోగా తమకు సమర్పించాలని ఆదేశించింది. తీర్పును వాయిదా వేస్తున్నామని తెలిపింది. పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలపై కొన్ని రోజులపాటు వాదోపవాదాలు కొనసాగాయి. కాగా, 10-50 ఏళ్ల లోపు మహిళలను ఆలయంలోకి అనుమతించాలని తాము కోరుకుంటున్నట్లు కేరళ ప్రభుత్వం ఈనెల 18న ధర్మాసనానికి తెలియజేసింది. గత గురువారం సాయిదీపక్‌ వాదన ప్రధానంగా న్యాయ బద్ధమైన వ్యక్తి(జ్యూరిస్టిక్‌ పర్సన్‌)గా అయ్యప్ప స్వామి హక్కులపై సాగింది. రాజ్యాంగంలోని 21, 25, 26 నిబంధనల కింద అయ్యప్ప హక్కులు ఇందులో ఇమిడి ఉన్నాయని చెప్పారు.

నైష్ఠిక బ్రహ్మచారిగా ఉండే హక్కును రాజ్యాంగంలోని 25వ నిబంధన కింద గుర్తించాలని ధర్మాసనాన్ని కోరారు. మహిళల ప్రవేశాన్ని నియంత్రించాలన్నారు. దేవుడిని రక్త మాంసాలున్న మనిషిలా, రాజ్యాంగ హక్కులున్న న్యాయబద్ధమైన వ్యక్తిగా గుర్తిస్తూ ఎవరూ వాదనలు వినిపించలేదని, అందుకే తనకు ధర్మాసనం అవకాశం ఇవ్వాలని కోరారు. దేవుడిని న్యాయబద్ధమైన వ్యక్తిగా గతంలోనే సుప్రీంకోర్టు గుర్తించిందని ప్రస్తావించారు. ఆర్టికల్‌ 21 కింద ఆలయం యజమాని అయిన దేవుడికి తన ఇంట్లో ప్రైవసీ హక్కు ఉంటుందని వాదించారు. నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవడం అందులో భాగమేనన్నారు. భగవదేచ్ఛనే సంప్రదాయాల రూపంలో ఆలయం పరిరక్షిస్తోందని చెప్పారు. ఆర్టికల్‌ 25(1) కింద వ్యక్తులకు తమ ధర్మాన్ని పాటించే స్వేచ్ఛ ఉన్నట్లే దేవుడికి కూడా తన ధర్మాన్ని పాటించే స్వేచ్ఛ ఉందని వాదించారు. దేవుడి విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. పిటిషనర్ల హక్కుల కోసం దేవుడి హక్కులను హరించడం కుదరదని వాదించారు.

పిటిషనర్ల హక్కులు దేవుడి హక్కులకు లోబడి ఉండాలన్నారు. వందల మందిని చంపిన ఉగ్రవాదికి న్యాయ సహాయాన్ని అందిస్తున్నపుడు, అలాంటి వారికి మరణశిక్ష అమలుపై అర్ధరాత్రి విచారణ చేపడుతున్నపుడు దేవుడికి అన్యాయం జరుగుతున్నపుడు ఆయన తరఫున వచ్చి వాదించడం సమంజసమేనని సాయిదీపక్‌ అన్నారు. 13 ఏళ్ల బాలుడిగా తాను అయ్యప్ప దీక్ష తీసుకున్నానని, ఆయన భక్తుడిని కాకపోయినా ఆయన తరఫున వాదించి ఉండేవాడినని చెప్పారు. దీన్ని లింగ వివక్ష కోణంలో చూడటం సరికాదన్నారు. మహిళల ప్రవేశంపై నియంత్రణను హాస్యాస్పద నిబంధనగా భావిస్తున్న వారికి నిజానికి ఆ దేవుడి మీద భక్తి ఉందా? అన్న ప్రశ్న ఉదయిస్తోందని చెప్పారు.


శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీం చరిత్రాత్మక తీర్పు | keralaAyyappa Swami Templesupreme courtWomen entry in Sabarimala Temple Sabarimala | Sabarinivasa | Suprem Court | Entry For Women | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


శబరిమల ఆలయ ప్రవేశంపై
 సుప్రీం చరిత్రాత్మక తీర్పు


ఆలయ ప్రవేశం రాజ్యాంగ హక్కు

 keralaAyyappa Swami Templesupreme courtWomen entry in Sabarimala Temple

శబరిమల ఆలయంలోకి మహిళలను నిరాకరించడంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత శబరిమల అ య్యప్ప స్వామి ఆలయంలో మహిళలూ పూజలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎటువంటి వివక్షకు తావులేకుండా పురుషులతోపాటు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొంది. ఆలయంలోకి 10 నుంచి 50 మధ్య వయసు గల మహిళల ప్రవేశంపై శబరిమల దేవస్వమ్‌ బోర్డు నిషేధం విధించటాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ పక్షాన సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్, అమికస్‌ క్యూరీగా రాజు రామచంద్రన్‌ వాదించారు. మహిళలను ఆలయంలోకి రానివ్వక పోవటం ప్రాథమిక హక్కులను నిరాకరించడం, అంటరానితనం పాటించడం వంటిదేనన్నారు. ఆల యంలోకి మహిళల అనుమతికి సంబంధించి ఎటువంటి చట్టాలు లేనప్పటికీ వారిని పూజలు చేయకుండా అడ్డుకోవటం వివక్ష చూపడమేనని కోర్టు పేర్కొంది. ‘ పురుషులకు ఉన్న చట్టాలే మహిళలకూ వర్తిస్తాయి. మహిళలకు ఆలయ ప్రవేశానుమతి చట్టాలపై ఆధారపడి లేదు. అది ఆర్టికల్స్‌ 25, 26 ప్రకారం రాజ్యాం గం కల్పించిన హక్కు’ అని తెలిపింది.

రాష్ట్రం లోని అన్ని ఆలయాల్లోకి మహిళల ప్రవేశంపై సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ కేరళ ప్రభుత్వ లాయరు తెలపడంపై స్పందించిన కోర్టు.. ‘పిటిషనర్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాదనలు వినాల్సిన అవసరం లేకపోవటం ఒక్కటే దీని వల్ల కలిగిన ప్రయోజనం. 2015లో ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించిన కేరళ ప్రభుత్వం.. రెండేళ్ల తర్వా త 2017లో అనుమతి నిరాకరించింది. కాలా న్ని బట్టి మీరు నిర్ణయాలు మార్చుకుంటున్నా రు’ అని వ్యాఖ్యానించింది.


ఇదే అంశంలో యంగ్‌ ఇండియా లాయర్స్‌ అసోసియేషన్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు కొనసాగనున్నాయి. మహిళలకు శబరిమల ఆ లయ ప్రవేశం నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడాది అక్టోబర్‌లో దాఖలైన పిటి షన్‌ను కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ బెంచ్‌ మహిళలను ఆలయం లోకి నిరాకరించడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందా లేదా అనే దానితోపాటు కీలకమైన అంశాలపై వాదనలు వింటుంది.

12 ఏళ్ల న్యాయపోరాటం
► 1965 నాటి కేరళలోని హిందూ ప్రార్థనా స్థలాల (ప్రవేశ అధికారం)నిబంధన 3(బి) కింద ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధానికి చట్టబద్ధత కల్పించారు. 

► ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 2006లో ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. లింగభేదం ఆధారంగా పౌరుల పట్ల వివక్ష చూపరాదని, అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న రాజ్యాంగ నిబంధనకు ఇది విరుద్ధంగా ఉందని, మతాచారాలను పాటించే స్వేచ్ఛకు కూడా భంగం కలిగిస్తోందని పిటిషనర్‌ పేర్కొన్నారు. 

► విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు అదే ఏడాది కక్షిదారులకు నోటీసులిచ్చింది. 

► 2008 మార్చి7న ఈ కేసును త్రిసభ్య బెంచ్‌కు అప్పగించగా ఏడేళ్ల పాటు ఎలాంటి పురోగతీ లేదు. 

► 2016 జనవరి 11న సుప్రీంకోర్టు బెంచ్‌ మళ్లీ కేసు విచారణను మొదలు పెట్టింది. 

► కేసు విషయంలో కేరళ ప్రభుత్వం మూడుసార్లు తన వైఖరిని మార్చుకోవడం గమనార్హం. 2006లో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం పిటిషన్‌ను సవాలు చేయరాదని నిర్ణయించగా, తర్వాత పగ్గాలు చేపట్టిన యూడీఎఫ్‌ సర్కారు మహిళలపై నిషేధాన్ని సమర్థించింది. మళ్లీ అధికారం చేపట్టిన ఎల్‌డీఎఫ్‌ తన పూర్వ వైఖరినే వ్యక్తపరిచింది. 

► త్రిసభ్య బెంచ్‌ 2017లో కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment