ముచ్చట గొలిపే మెహందీ | Mehandi |

ముచ్చట గొలిపే మెహందీ

ముచ్చట గొలిపే మెహందీ | Mehandi |

ఆషాఢం వచ్చేసింది.. పసి పాపాయి నుంచి పండు ముదుసలి వరకు.. చేతినిండా గోరింటాకుతో నింపేస్తారు.. చందమామను చేతిలో పెట్టి.. వేలికి గోరింట రాసేస్తారు.. కానీ దాన్ని మెత్తగా నూరి కోన్‌లా చేసి.. సరికొత్త డిజైన్లను చేతి మీద ఆవిష్కరించొచ్చు.. చేతినే ఓ కాన్వాస్‌గా మలుచొచ్చు.. అయితే ఒక్క నిమిషం.. మన దేశంలోని కొన్ని రాష్ర్టాలు.. మన పక్క దేశాలకు మెహందీలకి ఒక ప్రత్యేకత ఉంది.. ఆ డిజైన్లను ఎలా వేసుకోవాలి.. అవి ఎలా ఉంటాయో.. ఈ వారం ఈ జంటకమ్మలో చెప్పాలనుకుంటున్నాం.. మురిపాల చేతుల్లో ముచ్చట గొలిపే ఆ మెహందీ డిజైన్లు ఇవే..

- సౌమ్య పలుసమరాఠీ మెహందీఈ డిజైన్ రాజు, రాణి చేతుల మీద కనిపిస్తారు. అంటే.. బొమ్మలతో ఈ మెహందీ వేస్తారన్నమాట. ఆ బొమ్మల చుట్టూ మన క్రియేటివిటీని జోడించి పువ్వులు, లతల డిజైన్లు వేయాలి. ఇందులో మీరు వేసుకునే అవుట్‌పుట్‌కి మ్యాచ్ అయ్యేలా అంటే పటోలా చీర బార్డర్ డిజైన్ తీసుకొని ఈ మెహందీ వేసుకోవచ్చు. బ్లాక్ కలర్ కోన్‌తో ఈ మెహందీ డిజైన్ వేస్తారు. ఇందులో ఎక్కువ గ్రాఫికల్ డిజైన్స్ కనిపిస్తాయి.

గుజరాతీ మెహందీఈ డిజైన్లలో చిందరవందర ఎక్కడా కనిపించదు. నీట్‌గా ఈ డిజైన్ కండ్లకు అందంగా కనిపిస్తుంది. పువ్వులు, నెమళ్లు ఈ డిజైన్‌తో కనిపిస్తాయి. ఎక్కువగా చేతులకు బ్యాంగిల్ డిజైన్లు ఇందులో దర్శనమిస్తుంటాయి. అలల మాదిరిగా ఈ డిజైన్ ఉంటుంది. ఇందులో ఇంకా చెక్స్ ప్యాటర్న్ ఫేమస్. దాన్ని ఎక్కువగా కాళ్లకు వేస్తారు.

కేరళ మెహందీఅన్ని డిజైన్లలో ఇది వేయడం చాలా సులువు. మెహందీ వేయడం నేర్చుకునే వాళ్లు సైతం ఈ డిజైన్ వేయొచ్చు. వంపులు లేకుండా సన్నని తీగలు లేదా ఒక పువ్వుతోనే చెయ్యి మొత్తం నింపేయొచ్చు. కాకపోతే హెన్నా కోన్‌తో మాత్రమే ఈ డిజైన్ వేయాల్సి ఉంటుంది. తొందరగా అవ్వాలన్నా, సింపుల్‌గా కనిపించాలన్నా దీన్ని ఎంచుకోండి.

ఇండో అరబిక్ మెహందీపేరు చూస్తూనే సగం అర్థం అయి ఉంటుంది. ఇండియన్, అరబిక్ స్టైల్‌ని మిక్స్ చేస్తే వచ్చే డిజైన్‌కే ఆ పేరు పెట్టారు. పెండ్లిళ్లలో వధువు కోసం ఈ డిజైన్ని ఎక్కువగా ఎంపిక చేస్తారు. చుట్టూ, ఫిల్లింగ్ కోసం ఇందులో అరబిక్ డిజైన్ని వాడుతారు. ఇక మొత్తం స్టైల్ మాత్రం ఇండియన్ స్టైల్లో ఉంటుంది. దీన్ని హెన్నాతోనే వేస్తారు.

సౌత్ ఇండియన్ మెహందీదక్షిణాది ఎప్పుడూ ప్రత్యకమే. అలాగే మెహందీ డిజైన్లలోనూ. ఈ డిజైన్లలో పువ్వులు, నెమళ్లు, మామిడి పిందెలు కనిపిస్తాయి. డిజైన్‌లో ఖాళీ స్థలం పెద్దగా కనిపించదు. ఇందులో కాస్త అరబిక్ డిజైన్ కూడా మిక్స్ అయి ఉంటుంది. దీంట్లో కాంప్లెక్స్ డిజైన్స్ ఎక్కువ కనిపిస్తాయి. అకేషన్లలో సంప్రదాయ దుస్తులు వేసుకుంటే ఈ డిజైన్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

మొఘలాయి మెహందీఅసలు మొఘలాయిల కాలం నుంచే ఈ మెహందీ డిజైన్ పుట్టింది అంటారు. అందుకే దీనికి ప్రత్యేక స్థానం కల్పించారు. దీన్ని యూనిక్ స్టైల్‌గా కూడా చెప్పొచ్చు. దీంట్లో చుక్కలు ఎక్కువ కనిపిస్తాయి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చుక్కలతో చుట్టేస్తారు. ఈ డిజైన్ చాలా డీటెయిల్డ్‌గా కనిపిస్తుంది. కాబట్టి అప్పటి డిజైన్ అయినా ఇప్పటికీ రాజ్యమేలుతుంది.

మొరోకాన్ మెహందీఈ మెహందీ డిజైన్ మధ్య తూర్పు ప్రాంతం నుంచి వచ్చిందని అంచనా. ఈ డిజైన్‌లో ఎక్కువగా రేఖాగణితంలోని బొమ్మలు కనిపిస్తాయి. చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు, త్రిభుజాలే ఈ డిజైన్ ప్రామాణికం. వాటన్నిటినీ కలిపి ఈ మెహందీ వేస్తారు. ఒకవేళ ఇందులో పూల డిజైన్ వేయాలన్నా ఈ ఆకారాలు ఉండాల్సిందే! ఈ డిజైన్లను 
ఎక్కువగా చేతులు, కాళ్లకే కాదు.. భుజాలు, మెడ, వీపు భాగంలో వేసుకోవడానికి ఇష్ట పడుతారు.


చైనీస్ మెహందీచైనాలో టాటూలు ఎక్కువ వేయించుకుంటారు. దాని నుంచి ప్రేరణ పొంది ఈ డిజైన్లను రూపొందించారు. కొత్త తరహా మెహందీ కోరుకునే వాళ్లు ఈ డిజైన్ వేయించుకోవచ్చు. దీనికి ప్రత్యేక ప్యాటర్న్లంటూ ఉండదు. కాకపోతే ఈ డిజైన్ చేతిని ఆక్రమించదు. వెస్ట్రన్ దుస్తులకు ఇది బాగుంటుంది.

అరబిక్ మెహందీఈ డిజైన్‌ని మోడర్న్ స్టైల్‌గా పిలుస్తారు. పైగా దీన్నే మగువలు ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడుతారు. ఎందుకంటే దీనికి ఎక్కువ సమయం పట్టదు. ఎవరైనా సులువుగా వేసేయొచ్చు. సింపుల్ లైన్లు, పువ్వులు, చుక్కలు, ఆకులు.. ఇలా ఖాళీ లేకుండా చేతిని నింపేయాలి. ఇది వేసేవాళ్ల క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రొఫెషనల్స్ కాకున్నా ఈ మెహందీని వేయొచ్చు. 


మార్వారీ మెహందీఈ మధ్యకాలంలో ఫేమస్ మెహందీ డిజైన్ ఇది. ఈ డిజైన్లలో గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల డిజైన్ చూడడానికి చక్కగా కనిపిస్తుంది. దీని ద్వారా కేవలం పువ్వులతోనే చేతిని మొత్తం నింపేయొచ్చు. మామూలుగా చేతులను నింపి కాళ్లను తక్కువగా నింపేస్తారు. కానీ ఈ డిజైన్లలో కాళ్లను కూడా డిజైన్‌తో నింపేస్తారు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment