వర్షాకాలంలో నిమ్మకాయ.. తింటే మంచిదేనా? | Lemon in the rainy season .. is it good? | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


వర్షాకాలంలో నిమ్మకాయ.. తింటే మంచిదేనా?


    ‘చూస్తే పచ్చన.. కోస్తే తెల్లన.. తింటే పుల్లన’ అంటే ఏది అనడిగితే చటుక్కున గుర్తుకొచ్చేది నిమ్మకాయ. తెలుగు లోగిళ్లలో నిమ్మకాయ పచ్చడి లేని వంటగది ఉండదంటే అతిశయోక్తి కాదు. మరి ఇంతలా మనకు తెలిసిన నిమ్మకాయపై ఇప్పటికీ కొన్ని అపోహలున్నాయి. వాటిల్లో, వర్షాకాలంలో నిమ్మకాయ తింటే జలుబు చేస్తుందన్నది ముఖ్యమైంది. ఇది నిజమేనా.. నిమ్మకాయ తింటే జలుబు చేస్తుందా? దానిలోని ఇమ్యునిటీ సంగతేంటి? అసలెందుకీ అపోహలంటే..


పుట్టుకపై స్పష్టత లేదు: మనకు బాగా పరిచయమైన నిమ్మ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై స్పష్టత లేదు. కొందరేమో ఆసియాలో పుట్టింది, అందుకే భారత్‌లో ప్రాచుర్యం పొందింది అంటుంటారు. నిమ్మ పుట్టుక తాలూకు ఆధారాలు హిమాలయాల్లో ఉన్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ అందుకు సరైన రుజువులు లేవు. సిట్రస్‌ పండ్ల డీఎన్‌ఏ ఆధారంగా హిమాలయ పర్వత పాదాల వద్ద ఇవి ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. మరికొందరేమో ఇవి రెండో శతాబ్దంలోనే ఇటలీలోకి వచ్చాయని అంటుంటారు. చైనా, బర్మా ఇలా ఒక్కొక్కరూ ఒక్కో చోటు చెబుతున్నారు.

ఆయుర్దాయం 50ఏళ్లు: నిమ్మ చెట్ల ఆయుర్దాయం సగటున 50 ఏళ్లు. ఎటువంటి వ్యాధులు రాకుండా సక్రమంగా పెంచగలిగితే సుమారు వందేళ్లకు పైగా బతుకుతుంది. దీని జీవిత కాలంలో 10 నుంచి 20 అడుగుల పొడవు పెరుగుతుంది. ఏడాది మొత్తం నిమ్మకాయల దిగుబడి వస్తుంది కాబట్టి సగటున ఒక్కో ఏడాది 6నుంచి 10 సార్లు పంట తీసుకునే వీలుంటుంది. ఒక్కో చెట్టు ఏడాదికి 225 నుంచి 270 కేజీల కాయలను ఉత్పత్తి చేస్తుంది.

ఇంటి ఔషధం: మనిషికి కావల్సిన విటమిన్‌ ‘సి’ నిమ్మకాయలో ఉంటుంది. విటమిన్‌ ‘సి’ తో పాటు బీ6, ఏ, ఈ విటమిన్లు, ఫోలేట్‌, నియాసిన్‌, థయామిన్. రిబోఫ్లేవిన్‌, పాంటోథెనిక్‌ ఆమ్లం, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇంతమోతాదులో పోషకాలు ఉండటం వల్ల..నిమ్మకాయ తరచుగా తీసుకునే వాళ్లకు బీపీ, మధుమేహం, మలబద్ధకం, జీర్ణవ్యవస్థకు చెందిన వ్యాధులు దరి చేరవు.


ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. మలేరియా, కలరా, డిఫ్తీరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులను నియంత్రిస్తాయి. సీజన్‌తో సంబంధం లేకుండా నిమ్మకాయల్ని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను నిమ్మకాయ త్వరగా ఆరికడుతుంది. ప్రతి రోజూ కొద్దిపాళ్లలో నిమ్మరసాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే అది రోగనిరోధకతను పెంచి జలుబు, దగ్గు నుంచి ఉపశమనం అందిస్తాయి. వర్షాకాలంలో నిమ్మకాయ తింటే జలుబు చేస్తుందని చాలా మంది అపోహ పడుతుంటారు. నిజానికి జలుబు చేసినప్పుడు నిమ్మకాయ బద్దను కొద్దిగా తీసుకోవడం వల్ల అందులో ఉంటే సిట్రస్‌.. జలుబు కారక రైనో వైరస్‌ వ్యాప్తిని నిరోధిస్తుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment