చాట్.. ట్రీట్!

చినుకులు పడుతుంటే.. చాలామంది చాట్ బండివైపు పరుగులు పెడుతుంటారు.. పానీపూరీనో.. చాట్‌మసాలానో లొట్టలేసుకుంటూ తింటుంటారు.. కానీ, బయటి ఫుడ్ ఎంతవరకు కరెక్ట్ అని భావిస్తున్నారు ఇప్పుడు చాలామంది! అందుకే ఇంట్లోనే హాయిగా చాట్ తయారు చేసి ట్రీట్ ఇచ్చేయండి.


కార్న్ చాట్


కావాల్సినవి :స్వీట్‌కార్న్ : 250 గ్రా., ఉల్లిగడ్డ : 1, కీరదోస ముక్కలు : అర కప్పు, క్యాప్సికమ్ : 1, 
పచ్చిమిర్చి : 2, కొబ్బరితురుము : 2 టేబుల్‌స్పూన్స్, టమాటాలు : 2, కారం : ఒక టీస్పూన్, 
నిమ్మరసం : ఒక టేబుల్‌స్పూన్, చాట్‌మసాలా : ఒక టీస్పూన్, సేవ్ : పావు కప్పు, బూందీ : అర కప్పు, కొత్తిమీర : చిన్న కట్ట, చక్కెర : చిటికెడు, ఉప్పు : తగినంత.

తయారీ :స్టెప్ 1 : స్వీట్‌కార్న్‌లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 
స్టెప్ 2 : దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, కీరా ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టమాటా ముక్కలు, కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. 
స్టెప్ 3 : ఇప్పుడు కారం, పచ్చిమిర్చి, చాట్‌మసాలా, ఉప్పు, చక్కెర, కొత్తిమీర వేసి కలుపాలి. 
స్టెప్ 4 : దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని నిమ్మరసం చల్లి సేవ్, బూందీ వేసి కలిపి సర్వ్ చేయాలి. టేస్టీ కార్న్ చాట్ రెడీ!

సమోసా చాట్


కావాల్సినవి :చెనా మసాలా : అర టీస్పూన్, ధనియాల పొడి : అర టీస్పూన్, జీలకర్ర పొడి : అర టీస్పూన్, టమాట : 1, బటర్ : ఒక టేబుల్‌స్పూన్, ఉల్లిగడ్డ : 1, 
చాట్‌మసాలా : అర టీస్పూన్, కారం : అర టీస్పూన్, సమోసాలు : 2, తెల్ల బఠాణీలు : ఒక కప్పు, పెరుగు : ఒక టేబుల్‌స్పూన్, గ్రీన్ చట్నీ : ఒక టేబుల్‌స్పూన్, స్వీట్ చట్నీ : ఒక టేబుల్‌స్పూన్, కొత్తిమీర : చిన్న కట్ట.

తయారీ :స్టెప్ 1 : బఠాణీల్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టాలి. 
స్టెప్ 2 : కడాయి తీసుకొని అందులో బటర్ వేసి కరిగాక.. బఠాణీలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి బాగా వేయించాలి. అవి వేగాక ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, చెనా మసాలా వేసి ఒక నిమిషం పాటు ఉంచాలి. 
స్టెప్ 3 : ఇవి వేగాక తగినన్ని నీళ్లు పోసి కలుపాలి. ఈలోపు సమోసాలను చిదిమి పెట్టుకోవాలి. వాటిని ఉడుకుతున్న వాటిలో వేసి పెట్టాలి. 
స్టెప్ 4 : ఇందులోనే గ్రీన్ చట్నీ వేసి కలిపి దించేయాలి. దీన్ని ఒక ప్లేట్‌లో వేసి ఉల్లిపాయ, స్వీట్‌చట్నీ, టమాటా ముక్కలు, పెరుగు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసి లాగించేయొచ్చు.

బనానా చాట్


కావాల్సినవి :అరటికాయ : 1, ఆలుగడ్డలు : 2, కరివేపాకు : ఒక రెమ్మ, పచ్చిమిర్చి పేస్ట్ : ఒక టేబుల్‌స్పూన్, జీలకర్ర : అర టీస్పూన్, ఆమ్‌చూర్ పొడి : అర టీస్పూన్, ఉల్లి ఆకు : పావు కప్పు (కట్ చేసినవి), ఎండుమిర్చి : 2, శనగపిండి : ఒక టేబుల్‌స్పూన్, పెరుగు : ఒక కప్పు, జీలకర్ర పొడి : పావు టీస్పూన్, చాట్‌మసాలా : పావు టీస్పూన్, కారం : అర టీస్పూన్, ఉల్లిగడ్డ : 1, సేవ్ : పావు టీస్పూన్ , గ్రీన్ చట్నీ : ఒక టేబుల్‌స్పూన్, స్వీట్ రెడ్ చట్నీ : ఒక టేబుల్‌స్పూన్, కొత్తిమీర : చిన్న కట్ట, నూనె, ఉప్పు : తగినంత.

తయారీ :స్టెప్ 1 : అరటికాయ పొట్టు తీసి తురిమి పెట్టుకోవాలి. ఆలుగడ్డలను ఉడికించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 
స్టెప్ 2 : ఒక గిన్నెలో అరటి తురుము, ఆలుగడ్డ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, ఆమ్‌చూర్ పొడి, ఉల్లి ఆకు, ఎండుమిర్చి, ఉప్పు వేసి బాగా కలుపాలి. 
స్టెప్ 3 : ఇప్పుడు శనగపిండి కలిపి కాసేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి వడల్లా ఒత్తుకోవాలి. కడాయిలో నూనె పోసి వీటిని బాగా వేయించాలి. 
స్టెప్ 4 : ఈ వడలను ఒక్కొక్కటి పేర్చి వాటి మీద టమాటా ముక్కలతో అందంగా గార్నిష్ చేయాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, పెరుగు, చాట్‌మసాలా, కారం, ఉల్లిపాయ ముక్కలు, సేవ్ చట్నీతో గార్నిష్ చేయాలి. పై నుంచి కొత్తిమీర చల్లాలి. వీటిని గ్రీన్‌చట్నీ, స్వీట్ రెడ్ చట్నీతో కలిపి తింటే ఆ టేస్టే వేరు.


స్వీట్ పొటాటో చాట్


కావాల్సినవి :కందగడ్డలు : 2, కార్న్‌ఫ్లోర్ : ఒక టీస్పూన్, బియ్యం పిండి : ఒక టీస్పూన్, చాట్ మసాలా : అర టీస్పూన్, జీలకర్ర పొడి : అర టీస్పూన్, పచ్చిమిర్చి : 2, ఎండుమిర్చి : 1, రాక్ సాల్ట్ : పావు టీస్పూన్, ఆమ్‌చూర్ పొడి : అర టీస్పూన్, గరం మసాలా పొడి : అర టీస్పూన్, నిమ్మరసం : ఒక టేబుల్‌స్పూన్, గ్రీన్ చట్నీ : అర కప్పు, స్వీట్ చట్నీ : అర కప్పు, సేవ్ : అర కప్పు, ఉల్లిగడ్డ : 1, కొత్తిమీర : చిన్న కట్ట, ఉప్పు, నూనె : తగినంత.

తయారీ :స్టెప్ 1 : కందగడ్డలను ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి. వీటిని అర అంగుళం పొడవు ఉండేలా కట్ చేసుకోవాలి. 
స్టెప్ 2 : ఒక గిన్నెలో ఈ ముక్కలను వేసి అందులో కార్న్‌ఫ్లోర్, బియ్యం పిండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, రాక్ సాల్ట్, చాట్‌మసాలా, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్ పొడి, గరం మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. 
స్టెప్ 3 : కడాయిలో కొద్దిగా నూనె పోసి అన్నీ కలిపిన కందగడ్డలను రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్‌లో పెట్టేయాలి. 
స్టెప్ 3 : ఇప్పుడు పై నుంచి గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, చాట్‌మసాలా, సేవ్, చివరగా స్వీట్ చట్నీ, కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి. నోరూరించే స్వీట్ పొటాటో చాట్ మీ ముందుంటుంది.
-సంజయ్ తుమ్మ  సెలబ్రిటీ చెఫ్
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment