ఎంత పెద్ద ఫైల్‌ అయినా.. 
   ఎంత దూరమయినా సరే.. షేరింగ్ ఈజీ

ఖమ్మం: టెక్స్ట్‌ ఫైళ్లు, ఫొటోలు, వీడియోలు.. ఇలాంటివాటిని షేర్‌ చేయడానికి చాలా పద్ధతులున్నాయి. అయితే ఫైల్‌ సైజ్‌ పెరిగితే చాలా యాప్స్‌ షేరింగ్‌కు సహకరించవు. ఈమెయిల్‌, టెలీగ్రామ్‌, వాట్సాప్‌ ఫైళ్లను పంపడానికి విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటితో కేవలం 100 నుంచి 300 మీటర్ల పరిధిలోనే మొబైళ్లు, ట్యాబ్స్‌ ద్వారా ఫైళ్లను పంచుకోగలం. అయితే ఎంత పెద్ద ఫైల్‌ అయినా ఉచితంగా పంపడానికి కొన్ని సైట్లు ఉన్నాయి. వాటి ద్వారా సులభంగా షేర్‌ చేసుకోవచ్చు. ముఖ్యంగా సూపర్‌ భీమ్‌,(super beam) స్మాష్‌ (smash).. సైట్ల ద్వారా ఎంత పెద్ద ఫైల్‌ అయినా కావాల్సిన చోటుకు సులభంగా పంపొచ్చు.

సూపర్‌ భీమ్‌(beam)
ప్లేస్టోర్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించవచ్చు. దీని ద్వారా ఎంత పెద్ద సైజు ఫైల్‌ అయినా సులభంగా షేర్‌ చేసుకోవచ్చు. ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫైల్స్‌ పంపేవారికి తీసుకునే వారికి మధ్య ఒక డైరెక్ట్‌ కనెక్షన్‌ ఉంటుంది. ఈ కనెక్షన్‌ 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మనం పంపిన ఫైల్స్‌ను అవతలివారు రీసివ్‌ చేసుకుంటే అది డేటా సర్వర్‌లో స్టోరవదు. అయితే అవతలి వారు ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వరకు ఈ వెబ్‌ సైట్‌ను ఓపెన్‌చేసి ఉంచాలి. ఆ లింకు క్లిక్‌ చేయగానే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్‌ అయిపోతుంది.

స్మాష్‌ (smash)
అన్‌ లిమిటెడ్‌ ఫైల్స్‌ను షేర్‌ చేసుకోవడానికి మరో మంచి ఆప్షన్‌ స్మాష్‌. ఈ సైట్‌ జస్ట్‌భీమ్‌

   ఇట్‌ సైట్‌లో ఉంటుంది. ఈ సైట్‌లో డైరెక్ట్‌ కనెక్షన్‌ ఉండదు. మొదట మన ఫైల్స్‌ను ఈ సైట్‌ సర్వర్‌లోకి అప్‌లోడ్‌ చేస్తుంది. ఆ తర్వాత లింక్‌ జనరేట్‌ చేసి ఫైల్స్‌ను షేర్‌ చేస్తుంది. స్మాష్‌ ద్వారా ఫైల్‌ షేర్‌ చేసేముందు ఆ ఫైల్‌కు ఒకటి నుంచి ఏడు రోజుల పాటు వాలిడేట్‌ టైమ్‌ సెట్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు సెక్యూరిటీ కోసం ఆయా ఫైల్స్‌కు పాస్‌వర్డ్‌ పెట్టుకోవచ్చు. దీనిలో మన మెయిల్‌కి కూడా షేరింగ్‌ లింక్‌ను పంపొచ్చు. 8జీబీ ఫైల్‌ కూడా 15 నుంచి 20 నిమిషాలలోనే సెండ్‌ అవుతుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

2 comments:

 1. నా దగ్గర ఉన్న స్మార్ట్‌ఫోన్‌ స్లో అవడంతో రిపేర్‌కిస్తే అది బాగు చేసినప్పటి నుండి ఏవేవో అప్లికేషన్లు ప్రతీ ఐదు నిముషాలకోసారి నెట్‌ నుండి డౌన్‌లోడ్‌ అవుతున్నాయి. క్యాన్సిల్‌ చేస్తున్నా మళ్లీ మళ్లీ వస్తున్నాయి, అవి రాకుండా ఏం చేయాలో చెప్పండి.
  - జగదీల్‌ రాయుడు, అనంతపురం


  మీ ఫోన్లో మాల్‌వేర్‌ ఇన్‌ఫెక్ట్‌ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది కమాండ్‌ కంట్రోల్‌ సర్వర్‌ నుండి ఆదేశాలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు పలురకాల అప్లికేషన్లను మీ ఫోన్‌లోకి డౌన్లోడ్‌ చేస్తూ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు క్యాన్సిల్‌ చేసినా ఆ మాల్‌వేర్‌ పోనంత వరకూ ఫలితముండదు. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్‌ యాంటీవైరస్‌ అప్లికేషన్‌లో ఏమీ ఇలాంటి వాటిని అడ్డుకోలేవు. మీరు చేయగలిగిందల్లా మీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌లో ఉన్న ఫొటోలు, ఇతర డేటాని బ్యాకప్‌ తీసుకుని ఫోన్‌ని ఫ్యాక్టరీ రీసెట్‌ చెయ్యడమే. దాంతో మీ సమస్య పరిష్కరించబడుతుంది.

  ReplyDelete
 2. యాప్‌ ఒక్కటే..
  సేవలు బోలెడు


  మొబైల్‌ యూనిక్‌ యాప్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం
  టీయాప్‌ ఫోలియోతో సులభతరం
  స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు అన్ని సేవలు ఫింగర్‌టిప్స్‌తోనే..

  ప్రభుత్వ సేవలను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తయారుచేసిన ఈ యాప్‌ పేరు ‘టీ యాప్‌ ఫోలియో’. ఈయాప్‌ ద్వారా ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటురంగాల సేవలకు బిల్లులు చెల్లించవచ్చు. అంతేగాక మొబైల్‌ రీచార్జ్‌, టాక్స్‌ పేమెంట్‌లతోపాటు సుమారు 200 సేవలు అందుబాటులో ఉన్నాయి.


  మిర్యాలగూడ టౌన్‌(నల్గొండ): మీసేవా కార్యాలయాలతో పనిలేకుండా ఇంట్లో కూర్చొని మొబైల్‌ద్వారా విద్యార్థులు సర్టిఫికేట్లను సులభతరంగా పొందే వీలుంది. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన ఈసీలు, పహాణీలు, పట్టేదారు పాస్‌పుస్తకాలు పొందవచ్చు. రవాణా శాఖ సేవలు, భక్తులకు అవసరమయ్యే దర్శన టికెట్లు, రూ మ్‌లను బుక్‌ చేసుకోవచ్చు. జంటనగరాల్లోని గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఉన్న ఇంటి పన్ను, ఆదాయ పన్నులను సైతం ఈ యాప్‌ ద్వారా చెల్లించే సదుపాయం ఉంది టీ యాప్‌ ఫోలియోలో.

  స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు
  స్మార్ట్‌ఫోన్‌ కలిగిన ప్రతి వినియోగదారుడు టీ యాప్‌ ఫోలియో ద్వారా సేవలు పొందవచ్చు. విద్యార్థులకు అవసరమయ్యే ఇన్‌కమ్‌, క్యాస్ట్‌, రెసిడెన్సీ, బర్త్‌ సర్టిఫికేట్ల వరకు ఈ యాప్‌లో అప్లై చేసుకోవచ్చు. రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు రెన్యువల్‌, ఆర్సీ, ఎన్‌వోసీలను పొందే వీలుంది. వ్యవసాయానికి సంబంధించిన పహాణీ, ఆర్‌వోఆర్‌1- బీ, మ్యుటేషన్‌ సర్టిఫైడ్‌ కాపీ, రిజస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, పట్టేదారు పాస్‌ పుస్తకం మొదలుకొని నో అబ్జక్షన్‌ సర్టిఫకేట్‌ కూడా ఈయాప్‌ ద్వారా రెన్యువల్‌ చేసుకోవచ్చు. దీనికోసం అప్లికేషన్‌ సబ్మిట్‌ చేసిన తర్వాత 45 రోజుల సమయం పడుతుంది. అప్లై చేసుకున్న సర్టిఫికేట్‌ మనకు అందేవరకు స్టేటస్‌ మొబైల్‌లోనే చూడొచ్చు. తెలంగాణలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు స్వామివారి సేవకు కావాల్సిన టికెట్లు, రూమ్స్‌ బుక్‌ చేసుకోవడానికి ఈ యాప్‌ చాలా ఉపయోగపడే విధంగా ఉంది.

  మొబైల్‌ రీచార్జ్‌, బిల్లుల చెల్లింపు
  మొబైల్‌ రీచార్జ్‌లతో పాటు ఎలక్ట్రిసిటీ, వాటర్‌, టెలిఫోన్‌, ఇంటర్‌నెట్‌, డీటీహెచ్‌, డాటాకార్డ్‌, ట్రాఫిక్‌ చలానాల చెల్లింపులు ఈ యాప్‌ ద్వారా సులభతరం చేసింది ప్రభుత్వం. మీ విద్యార్థులు ఉపయోగార్థం తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన టీశాట్‌ సేవలను ఈ యాప్‌ద్వారా పొందే వీలుంది. అంతేగాక ఇన్ఫర్మేషనల్‌ సర్వీసెస్‌ ద్వారా స్టేట్‌ పోర్టల్స్‌ మెట్రో సేవలతో పాటు సాధారణ విద్యార్థులకు సాంకేతిక విద్యామెలుకువలు నేర్పే టాస్క్‌ సేవలు అందుబాట్లోకి తెచ్చిందీ యాప్‌. నగదు లావాదేవీలు కష్టతరంగా ఉన్నందున అన్నిరకాల మనీ ట్రాన్స్‌ఫర్స్‌ను టీ యాప్‌ ఫోలియో ద్వారా నిర్వహించుకునే వీలుంది. వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌, పెట్రో ఉత్పత్తుల వివరాలు, సమీపంలోని మీ సేవా కేంద్రాలు, రేషన్‌ దుకాణాలు, బస్సు, రైల్వే స్టాప్‌లను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.


  ఇన్‌స్టలేషన్‌ చేయండిలా..
  మొబైల్‌లోని ప్లేస్టోర్‌లోకి వెళ్లి సర్చ్‌బార్‌లో టీయాప్‌ ఫోలియో అని టైప్‌ చేయాలి. మొదటిగా ఉన్న యాప్‌ను ఇన్‌స్టాల్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. యాప్‌లోకి వెళ్లాలంటే న్యూ యూజర్‌ ఆప్షన్‌ను క్లిక్‌చేసి మొబైల్‌ నెంబర్‌, ఈ మెయిల్‌ ఐడీ ఎంటర్‌ చేసి సైన్‌అ్‌ప కావాలి. అన్ని పర్మిషన్లు యాక్సెప్ట్‌ చేయాలి. తదనంతరం యాప్‌కు సంబంధించిన అంశాలన్నీ కనిపిస్తాయి. ఆ తరువాత మెనూ బార్‌ ప్రకారం మై ప్రొఫైల్‌, మై ట్రాన్జక్షన్స్‌, అప్లికేషన్స్‌, సర్టిఫికేట్స్‌, మీ సేవ స్టేటస్‌ దర్శనమిస్తాయి. అందులో మనకు కావాల్సిన సేవలను క్లిక్‌ చేసుకొని ముందుకుసాగాలి.

  ReplyDelete