విడాకులు | Divorce | పాడుతా యాప్‌తో.. తీయగా..! | singing | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
మా‘విడాకులు’ 
చిన్నపాటి మనస్పర్థలకే కూలుతున్న కాపురాలు 
స్వల్ప వివాదాలతో విడిపోతున్న జంటలు 
మహానగరంలో ఏటేటా పెరుగుతున్న విడాకుల కేసులు 
సర్దుబాటు ధోరణి నశించడమే కారణమంటున్న నిపుణులు 
విడాకులు | Divorce | పాడుతా యాప్‌తో.. తీయగా..! | singing | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
పెద్దలు కుదిర్చిన పెళ్లి. చూడచక్కని జంట. ఏడాది తిరక్కుండానే పండంటి బిడ్డ పిల్లాడు. చిన్నారిని ఊయల్లో వేసే రోజు ఇల్లంతా సందడి. దంపతుల మధ్య మాత్రం వాగ్వాదం. అసలు విషయం ఏమిటంటే.. ఇరువైపు కుటుంబాల్లో పూజా కార్యక్రమాలు భిన్నంగా నిర్వహిస్తుంటారు. పిల్లాడి వేడుక తమ ఆచారం ప్రకారం జరగాలంటే.. తమ ఆచారమే అనుసరించాలంటూ ఇరువురూ పట్టుదలకు పోవడం గొడవకు దారితీసింది. భర్తపై.. ఇల్లాలు కేసు పెట్టింది. ఇదే కారణంతో భర్త విడాకుల కోసం న్యాయస్థానం వరకూ వెళ్లాడు.ఈనాడు - హైదరాబాద్‌

భార్యభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు చినికిచినికి గాలివానగా మారుతున్నాయి. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఠాణా వరకూ చేరుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో వాదులాడుకుంటున్న జంటలు...ఇగో వలలో చిక్కి విడిపోయేందుకు సిద్ధపడుతున్నాయి. పచ్చని కాపురాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో ఏటేటా విడాకుల కేసులే దానికి నిదర్శనం. 
నెలకు వంద కేసులు: తమకు విడాకులు మంజూరు చేయాలంటూ గ్రేటర్‌ పరిధిలోని మూడు కుటుంబ న్యాయస్థానాల్లో సగటున నెలకు 100 జంటలు దరఖాస్తు చేస్తుండగా..కలెక్టరేట్‌ కార్యాలయంలోని కుటుంబ న్యాయ సలహా కేంద్రానికి ప్రతి నెలా 30-40 కేసులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గృహహింస కింద నమోదవుతున్న కేసుల్లో 98-99 శాతం భర్తల నుంచి వేధింపులు చవిచూస్తున్నట్లుగా భార్యలు చేస్తున్న ఫిర్యాదులే కావడం గమనార్హం. ఆ కేసుల్లో 75 శాతం వరకూ చిన్నపాటి తగాదాలే కారణంగా ఉన్నట్టు అధికారులు విశ్లేషిస్తున్నారు.

వివాదాలు విభిన్నం.. విడిపోవడమే లక్ష్యం 
హైదరాబాద్‌ భిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడి ఆలుమగల మధ్య మనస్పర్థలు కూడా విభిన్నంగానే ఉన్నాయి. హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, కొండాపూర్‌ ఉండే జంటల్లో అధికశాతం ఉద్యోగులే. అందులోనూ టెక్కీలు ఎక్కువ. పని ఒత్తిడితో పరస్పరం మాట్లాడుకునేందుకు కూడా సమయం వెచ్చించలేని పరిస్థితి. ‘ఇదే ఆలుమగల మధ్య స్పర్థలకు దారితీస్తోంది. ఎవరికి వారు తమ మాటే చెల్లుబాటు కావాలనే ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం సజావుగా సాగే కాపురంలో కలతలకు కారణమవుతోంది’ అని రాచకొండ కమిషనరేట్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మంజుల తెలిపారు. కొన్నికేసులను ఉదహరించారు.

* అత్యవసరవేళ తల్లిదండ్రులకు డబ్బు పంపినా అదేదో పెద్దనేరం అన్నట్లుగా భర్త నుంచి సూటిపోటి మాటలు. 
* అత్తమామలతో కలసి ఉండవద్దనే భావన ఈ తరం గృహిణిల్లో పెరగటం.. తత్కారణంగా మాటపట్టింపులు. 
* పండుగలు, బోనాలు, వేడుకల సమయంలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని భర్త..లేదు తన పుట్టింటికే వెళ్లాలని భార్య పట్టుపట్టడంతో మాటామాటా పెరగడం. 
* పిల్లల్ని చేర్పించే పాఠశాల ఎంపికలోనూ తమ మాటే నెగ్గాలనే ధోరణి. 
* ఉద్యోగం చేసే భార్య ఏటీఎం కార్డులు తన వద్దే ఉండాలన్న భర్త వాదనతో విభేదించడం.
మతాలు వేరైనా ప్రేమించి పెళ్లిచేసుకుందో జంట. పాప పుట్టాక పంతంపట్టిన ఇరు కుటుంబాలు దగ్గరయ్యాయి. దంపతులు మాత్రం.. కుమార్తెకు తమతమ సంప్రదాయ పేర్లే పెట్టాలంటూ వివాదానికి దిగారు. వారి మధ్య దూరం పెరిగింది.. విడిపోయే వరకు వచ్చింది.


చిచ్చుపెడుతోన్న చరవాణి 
పడకగది వరకూ చేరిన స్మార్ట్‌ఫోన్‌ పుణ్యమానీ చాలా కాపురాలు కూలిపోతున్నాయి. కొందరు లైంగిక పటుత్వ లోపాన్ని కప్పిపుచ్చుకుని భార్యలను నిత్యం అనుమానిస్తూ హింసిస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులు ఏడాడి వ్యవధిలో 10-15శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అశ్లీల వెబ్‌సైట్ల ప్రభావానికి గురై పడకగదిలో అసహజ లైంగిక విధానాలు అనుసరిస్తూ భార్యలను వేధిస్తున్న కేసులు 10 శాతం వస్తున్నట్లు ఓ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. సున్నితమైన సమస్యను బయటకు చెప్పలేని బాధితులు గృహహింసగానే ఫిర్యాదులో పేర్కొంటున్నట్లు వివరించారు.
    సర్దుకుపోలేకనే దూరం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని దంపతులు కూడా చిన్నపాటి అంశాలకే గొడవలు పడుతున్నారు. తనమాటే వినాలనే భావన ఇద్దరిలోనూ పెరగటం వారి దూరం పెంచుతోంది. సమస్యపై కలిసి చర్చించుకునేందుకు యువత ఆసక్తి చూపట్లేదు. సర్దిచెప్పాల్సిన పెద్దలు కూడా రెచ్చగొడుతున్నారు. సగం జంటలు విడాకులు తీసుకోవడానికి మూడో వ్యక్తి ప్రమేయమే కారణం. ఒక్కసారి పోలీస్‌ కేసు నమోదయ్యాక భర్తలు కలసి ఉండేందుకు ఇష్టపడట్లేదు. కౌన్సెలింగ్‌ జరుగుతున్న సమయంలోనే విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. దంపతులు గొడవకు కారణాలను గుర్తించి కూర్చుని మాట్లాడుకుంటే చాలా వరకూ పరిష్కారమవుతాయి.
- పి.సునీతాదేవి, లీగల్‌ కౌన్సెలింగ్‌ నిపుణురాలు, 
హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment