పాడుతా యాప్‌తో.. తీయగా..! | singing | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


పాడుతా యాప్‌తో.. తీయగా..!

అప్పుడప్పుడూ కూనిరాగాలు తీస్తున్నారా? విన్నవారు స్వరం బాగుందని కాంప్లిమెంట్‌ ఇచ్చారా? అయితే, మీలో ఓ ‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌’ ఉన్నట్టే! అందుకు కాస్త శిక్షణ తీసుకుంటే సరి! వెంటనే ఫోన్‌ అందుకోండి. సంగీత సాధనకు యాప్‌లు ఉన్నాయ్‌. అన్నీ ఉచితమే.



శిక్షణ... సాధన 
‘ముని’ తోడుగా... Riyaz


కర్ణాటక, హిందూస్తానీ, శాస్త్రీయ... ఇలా మీకు ఇష్టమైన సంగీతంలో సాధన చేసేందుకు యాప్‌లో కోర్సుల్ని ఎంపిక చేసుకోవచ్చు. సాధన చేస్తూ పాడొచ్చు. మీ స్వరాన్ని వినేందుకు ప్రత్యేక ‘వోకల్‌ ట్రైనర్‌’ ఉంది. పేరు ముని. కృత్రిమ మేధస్సుతో మీరెప్పుడు పాడినా వినేందుకు ముని సిద్ధంగా ఉంటుంది. సీనియర్ల సలహాల్ని తీసుకోవచ్చు. 
ఆండ్రాయిడ్‌: https://goo.gl/WRES59 
యాపిల్‌: https://goo.gl/Z4CLxP


‘పాప్‌’ స్టార్‌ని చేస్తుంది.. The True School 

తెలుగు పాటలు, సంగీతంపై కాస్తో.. కూస్తో పరిజ్ఞానం ఉంటే హిందీ ఆపై ఇంగ్లిష్‌ పాటల్ని సాధన చేసేందుకు సరైన వేదిక. నాలుగు లెవల్స్‌లో కోర్సులు అందిస్తున్నారు. వీడియో ట్యుటోరియల్స్‌లో సాధన సాగుతుంది. ఆల్బమ్స్‌లోని ట్రెండింగ్‌ పాటల్ని సెలెక్ట్‌ చేసుకుని ముక్కలుగా విడగొట్టి సాధన చేయొచ్చు. ‘లెర్న్‌, టెస్ట్‌’ మోడ్స్‌లో నేర్చుకుని తిరిగి పాడొచ్చు. పాడిన వాటిని పోస్ట్‌ చేసి మ్యూజిక్‌ టీచర్‌ నుంచి స్పందన కోరొచ్చు. 
ఆండ్రాయిడ్‌: https://goo.gl/tP81fA 
యాపిల్‌: https://goo.gl/tcsMBi


గొంతుని సవరిస్తుంది.. Voloco

ఎంతో కొంత సాధన చేశాక పాడాలనిపిస్తుంది. ప్రయత్నిస్తారు. కానీ, స్వరాన్ని ఇంకా సవరించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ పనిని యాప్‌కి అప్పగించొచ్చు. ‘రియల్‌ టైమ్‌ వాయిస్‌ ప్రాసెసింగ్‌’తో రికార్డింగ్‌ చేయొచ్చు. దీంతో వాయిస్‌ రికార్డింగ్‌లో నాణ్యత పెరుగుతుంది. కేవలం వాయిస్‌నే కాకుండా వీడియో మోడ్‌లో పాడుతూ సెల్ఫీ వీడియో తీసుకోవచ్చు. ట్రాక్స్‌ని సోషల్‌ మీడియాలో పంచుకునే వీలుంది. 
ఆండ్రాయిడ్‌: https://goo.gl/r3kS75 
యాపిల్‌: https://goo.gl/xWoFnY


మీ స్వర సామర్థ్యమెంత? 
Learn to Sing - Sing Sharp

మీరెంత హై పిచ్‌లో పాడతారు. అదే మీ ‘వోకల్‌ రేంజ్‌’ ఎంతో తెలుసా? అయితే, యాప్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాదు... ‘వామ్‌ అప్‌’ మెనూలోకి నాలుగు మాధ్యమాల్లో పాటల్ని సాధన చేయొచ్చు. మీ లోకల్‌ ఆల్బమ్స్‌లోని పాటల్ని పాడేందుకు ‘సింగ్‌ సాగ్స్‌’లోని ‘యువర్‌ సాంగ్స్‌’ ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. సోషల్‌ నెట్‌వర్క్‌లోని మిత్రుల్ని కూడా కొన్ని పాటల్ని సూచించమని ఆడగొచ్చు. ప్రీమియం కోర్సులు కూడా ఉన్నాయి. 
ఆండ్రాయిడ్‌: https://goo.gl/kxe7fo 
యాపిల్‌: https://goo.gl/Vc1nqU


కాస్త భిన్నంగా.. 

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ లేకుండా.. తీయని గొంతుతో పాటందుకుంటే. అదీ ఒక పాట కాదు.. మీకు ఇష్టమైన నాలుగైదు పాటల పల్లవిలను పాడేసి ఒకేదాంట్లో ‘కొలేజ్‌’ ఎఫెక్ట్‌తో కలిపేస్తే! అదెలా సాధ్యమంటే Acapella Maker - Video Collage వాడితే సరి. దీంతో వీక్షకులు ఒకే ఫ్రేములో ఒకటి కంటే ఎక్కువ పాటల్ని ప్లే చేస్తూ చూడొచ్చు. యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక కొలేజ్‌ ‘లేఅవుట్‌’ని సెలెక్ట్‌ చేయాలి. తర్వాత ట్రాక్‌ నిడివి ఎంతో ఎంపిక చేసి ఒక్కో దాంట్లోని ప్లస్‌ గుర్తుని క్లిక్‌ చేస్తూ పాటల్ని రికార్డు చేయాలి. యాపిల్‌ యూజర్లు Acapella from PicPlayPost యాప్‌ని ప్రయత్నించొచ్చు. 
ఆండ్రాయిడ్‌: https://goo.gl/f3guhM 
యాపిల్‌: https://goo.gl/ithXoo


‘స్టార్‌’ అయ్యేందుకు...

యాప్‌ శిక్షణ... సాధన ముగిస్తే. ఇంకేముందీ.. మీ టాలెంట్‌ని చూపించడమే. అప్పుడేగా మీరో సోషల్‌ మీడియా స్టార్‌ అయ్యేది. ఆలస్యం చేయకుండా వీటిని ప్రయత్నించొచ్చు.


ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు..Smuleవంట గదో.. స్నానాల గదో కాదు. ప్రపంచం మొత్తం మీరు పాడిన పాట వింటుంది. ఎందుకంటే ఇదో గాయకుల కమ్యూనిటీ. సోలోగానే కాకుండా స్నేహితులతోనూ కలిసి పాడొచ్చు. సరైన జోడీ లేకుండా ఎలా? అనుకోవక్కర్లేదు. కమ్యూనిటీలో ఆహ్వానాన్ని పంపి డ్యూయట్‌లూ పాడొచ్చు. యాప్‌లోకి వెళ్లగానే ట్రెండింగ్‌లోని పాటలు కనిపిస్తాయి. స్వరంలో లోపాలేమైనా ఉంటే యాప్‌లోని ఆప్షన్స్‌తో సరిదిద్దుకోవచ్చు. వీడియోలతో మ్యూజిక్‌ రికార్డింగ్‌ చేస్తే పలు రకాల ఫిల్టర్లను అప్లై చేసుకునే వీలుంది. 
ఆండ్రాయిడ్‌: https://goo.gl/Fmp4mR 
యాపిల్‌: https://goo.gl/jt5hqB


అంతా ఉచితం.. StarMaker

భాష ఏదైనా పాడుతూ పాటల పల్లకిలో ఊరేగేందుకు ప్రత్యేక అడ్డా. యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక సైన్‌ఇన్‌ అయ్యేటప్పుడే భాషని ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు ఆంగ్ల భాష తెలియని వారు మొత్తం యాప్‌ని తెలుగు భాషలోనే యాక్సెస్‌ చేయొచ్చు. ప్రాచుర్యం పొందిన గ్రూపుల్ని ‘ఫాలో’ అవ్వొచ్చు. కమ్యూనిటీలో మీ ప్రియ మిత్రుల్ని వెతికి కలిసి పాడొచ్చు. మీరు పాడాలనుకునే పాటల్ని వెతికేందుకు సెర్చ్‌ ఆప్షన్‌ ఉంది. లోకేషన్‌ని ఎనేబుల్‌ చేస్తే మీరున్న ప్రాంతానికి దగ్గరగా ఉన్నవారితో జోడీ కట్టొచ్చు. మీకు పాటలకొచ్చే ఫాలోయింగ్‌తో మీరో ‘స్టార్‌’గా అవతరించొచ్చు. ఫాలో అయ్యేవారంతా మీ ఫ్యాన్స్‌ అన్నమాట. 
ఆండ్రాయిడ్‌:https://goo.gl/usPfZd 
యాపిల్‌: https://goo.gl/h73ktT


మ్యూజిక్‌ లవర్స్‌ కోసం.. Sargam 

తెరపై లిరిక్స్‌ ప్లే అవుతూ వెళ్తుంటే... సోలోగా.. జోడీగా.. పాటలు పాడొచ్చు. మీ స్వరానికి తగినట్టుగా మ్యూజిక్‌ ట్రాక్స్‌లో మార్పులు చేయొచ్చు. పాడే పాటలో ‘కోరస్‌’నీ జత చేయొచ్చు. 
ఆండ్రాయిడ్‌: https://goo.gl/oNtQqa


ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment