పుస్తకం చదవడం వల్ల లాభాలు





పుస్తకం చదవడం వల్ల లాభాలు

లైఫ్ బ్యూటిఫుల్ గా, జాయ్ ఫుల్ గా కనిపించాలన్నా లైఫ్ అంటే బోల్డంత ఇష్టం రావాలన్నా, ప్రాబ్లం ఎదురవగానే భయపడకుండా ధైర్యంగా పేస్ చేయాలన్నా న్యాయంగా ఆలోచించాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా మంచి లైఫ్ స్టైల్ కావాలన్నా.... చివరికి హెల్తీగా ఉండాలన్నా... అన్నిటికి ఒకటే సీక్రెట్ ... "బుక్ రీడింగ్" అని చెబుతున్నారు.

బుక్ రీడింగ్ ఉపయోగాల గురించి అందరికి తెలిసిందే. అయితే మనకీ తెల్సిన ఉపయోగాలు కాకుండా ఇంకా ఎన్నో ఉపయోగాలు ఈ బుక్ రీడింగ్ హాబిట్ వల్ల కలుగుతాయని నిరూపించారు న్యూరాలజీ డాక్టర్ మార్గరేట్ బ్లేకర్. షార్ప్ బ్రెయిన్ కావాలంటే బుక్స్ చదవటం అలవాటు చేసుకోండి అంటున్నారీ డాక్టర్.

బుక్స్ చదివే అలవాటు ఉన్నవారిలో కాన్సెంట్రేషన్, సూపర్ మెమోరీ, రీసనింగ్, డెసిషన్ మేకింగ్ మాములు వ్యక్తుల కన్నా ఎక్కువగా ఎక్కువగా వుంటాయని డాక్టర్ మార్గరేట్ పరిశోధనలో తేలిందట. అలాగే రిలేషన్స్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయటానికి, ఎమోషనల్ బాలన్స్ కి కూడా బుక్ రీడింగ్ హెల్ప్ చేస్తుంది అంటున్నారు.

మెదడుకి దెబ్బ తగిలిన వ్యక్తులని కేవలం బుక్ రీడింగ్ తో హెల్తీ గా మార్చి చూపించారు డాక్టర్ మార్గరేట్ బ్లేకర్. అందుకే బ్రెయిన్ పవర్ పెరగాలంటే బుక్ రీడింగ్ కు మించిన ఆప్షన్ లేదని గట్టిగా చెబుతున్నారు. ఈయన అందమైన జీవితం కోసం హెల్తీ హాబిట్ బుక్ రీడింగ్.


6 నిమిషాల చదువుతో.. 
    రెండింతల ఒత్తిడి మాయం


చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం మాత్రం కొనుక్కో అన్నాడో మహనీయుడు. ఆస్తులు సంపాదిస్తే కరిగిపోవచ్చు, దాచిన సొత్తు దొంగలపాలు కావచ్చు, ఒక్కోసారి ఆత్మీయులు కూడా దూరం కావచ్చు కానీ ఎప్పటికీ తరిగిపోనిది, మనతో శాశ్వతంగా ఉండేది మనం సంపాదించిన విజ్ఞానమే. ఒక్కసారి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే తుదివరకు అది మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. మహోన్నత విజ్ఞానాన్ని అందించేది పుస్తకం. అందుకే పుస్తకం ఎప్పుడూ మన చేతిని అలంకరించి ఉండాలని చెప్పారు పెద్దలు. కానీ పుస్తకం హస్తభూషణం అనే నానుడికి చెల్లు చీటీ కాలం రాబోతోందని అనిపిస్తోంది. ఇప్పుడు సెల్‌ఫోనే హస్తభూషణంగా కనబడుతోంది తప్ప పుస్తకం జాడ లేదు. నేటి సమాజంలో ఎంతమంది పుస్తకాలు చదువుతున్నారు? అరచేతిలో ఇమిడిపోయే సెల్‌ఫోన్‌తోనే కాలం బిజీగా గడిచిపోతూ ఉండటంతో పఠనాసక్తి తగ్గిపోతోంది. మరి ఇక పుస్తకం సంగతేంటి? 


పుస్తకం విలువను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనకు లేదా?ఎంతసేపూ పిల్లలు, యువతీయువకులు కంప్యూటర్లతో కుస్తీ పడుతూ, పుస్తకం మరిచిపోతున్నారు. అపార విజ్ఞానాన్ని కేవలం ర్యాంకులకు పరిమితం చేస్తున్నారు. 
నేటి సామాజిక, రాజకీయ వాతావరణం పుస్తకపఠనం, జ్ఞానార్జనకు ప్రోత్సాహకరంగా లేకున్నా, జీవనసరళి కొత్తరకం కాలక్షేపాల వైపు, వ్యాపకాల వైపు మనుషులను మళ్లిస్తున్నా పుస్తకం తన సంప్రదాయక సుగంధాన్ని కోల్పోలేదు. అది తన ఆధునికతను చాటు కుంటూ కొత్త ఒరవడి సృష్టిస్తోంది. 


ఆరు నిమిషాలు చదివితే..మానసిక ఒత్తిడి తగ్గేందుకు ఎలాంటివారైనా సంగీతాన్ని ఇష్టపడతారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఒత్తిడి కారణంగా ఉద్రేకపూరితమైన నరాలు మాత్రం పుస్తకాలు చదవడం ద్వారా వేగంగా ఉపశమనం పొందుతాయని ఇటీవల కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటానికి పుస్తక పఠనం చాలా మెరుగైన పరిష్కార మార్గమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరు నిమిషాల పాటు చదవడం ద్వారా మానసిక ఒత్తిడి మూడింట్లో రెండింతలు తగ్గిపోతుంది అని అధ్యయనాలు వెల్లడించాయి. ఒంటరితనంతో బాధపడుతున్న వారికి పుస్తకమే అసలైన నేస్తం. పుస్తకం ఒంటరి తనాన్ని పారద్రోలి సరికొత్త ప్రపంచానికి మనల్ని చేరువ చేస్తుంది. 


ఎక్కువ చదివేది మనవాళ్ళేప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సేపు పుస్తకాలు చదివేది భారతీయులే. భారతీయులు సగటున వారానికి 10.2 గంటలు పుస్తకపఠనం చేస్తారని దశాబ్దం క్రితం చేసిన ఒక అధ్య యనంలో తేలింది. 2013లో చేసిన మరో అధ్య యనంలో ఈ సగటు సమయం 10.4 గంటలకు పెరిగింది. టీవీలు, సినిమాలు, ఇంటర్‌నెట్‌లతో మారుతున్న జీవనశైలి కారణంగా ఇటీవల పుస్తకపఠనంపై మోజు తగ్గిందనుకున్నాం కానీ ఇప్పటివరకూ ఎక్కువగా పుస్తకాలు చదివేవారిలో మన భారతీయులే టాప్‌లో ఉన్నారని, వాటి ప్రభావం మనపై చాలా ఉందని ఈ నివేదిక చెబుతోంది. 


ఊహాశక్తికి మార్గంపుస్తకంలోకి తొంగి చూస్తేనే కదా ఎవరికైనా అక్షరం రుచి ఏమిటో తెలిసేది. వాటి రుచి చూసినప్పుడే అక్షరం మహిమ ఏమిటో అర్థం అవు తుంది. సినిమా, టెలివిజన్‌ కాలుష్యం నుంచి, గాడ్జెట్‌ వ్యసనాల నుంచి కాసేపు తప్పించుకుని పుస్తకాల ప్రపంచంలోనికి తొంగి చూడగలిగిన వారే ఆ మహిమను గుర్తించగలరు. పుస్తకం కొనడం ఎందుకు? ఇంటర్‌నెట్‌లో అనేక రకాల బుక్స్‌ అందుబాటులో ఉన్నాయి కదా అనే ఆలో చనే ఇప్పుడు ఎక్కువ మందికి. ఇంటర్‌నెట్‌ పుణ్యమా అని కనీసం వార్తాపత్రిక కూడా కొనుక్కోకుండా ఇంటర్‌నెట్‌లోనే అన్నీ ఫ్రీగా చదివేస్తున్నాం. కానీ దానితో పాటే రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. అదేపనిగా కూర్చుని ఇంటర్‌నెట్‌లో చదవడం వల్ల కళ్లు పాడవడం, ఊబ కాయం వంటి సమస్యలకు అవకాశాలు ఎక్కువ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పైగా కంప్యూటర్‌పై చదవడం వల్ల ఊహాశక్తికి తావు ఉండదు, సంభాషణల ద్వారా చిత్రాలను మనసులో ఊహించుకోగలం తద్వారా ఊహాశక్తి పెంపొందు తుందని పరిశోధకులు చెబుతున్నారు. 


టీనేజ్‌లో పఠన లాభాలుటీనేజీలో పుస్తకాలు చదివే అలవాటు వల్ల చాలా లాభాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది లక్ష్యాన్ని నిర్ధారించుకునే స్పృహ ఏర్పడుతుంది. లక్ష్యాన్ని చేరుకునే పట్టుదల వస్తుంది. సామాజిక సమస్యలపై అవగాహన కలుగుతుంది. పఠనాన్ని ఆహ్లాదకరమైన అనుభవంగా భావించేవాళ్లు మిగిలిన వాళ్లతో పోల్చితే భిన్నంగా ఆలో చించగలరు. క్లిష్ట సమస్యలకు సులువైన పరిష్కారాలను కనుక్కోగలరు. పదిమందిలో ఆకర్షణీయంగా మాట్లాడే నైపుణ్యం పెరుగుతుంది. తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోగలరు. భాషా సామర్థ్యం అలవడుతుంది. కొత్త భాషలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. స్వీయ విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల మన తప్పులు, లోపాలను ఇతరులు వేలెత్తి చూపడానికి ముందే మనం సరిదిద్దుకోవచ్చు. 


పిల్లల్లో పఠనాసక్తి కలగాలంటే..డిజిటల్‌ మీడియా, టీవీ, ఇంటర్నెట్‌ పుణ్యమా అని పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు తప్పి పోతోంది. పుస్తకాలు చదవాలన్న ఆలోచనే వారికి రావడం లేదు. వారి దృష్టిలో పుస్తకం అంటే పాఠ్యపుస్తకాలే. అంతేకాదు కొందరు తల్లిదండ్రులు కూడా పిల్లల్లో పఠనాసక్తిని ప్రోత్సహించడం లేదు. బాల్యం నుండే పిల్లల జీవితంలో పుస్తక పఠనాన్ని భాగంగా చేయాలి. పాఠ్యపుస్తకాల్లో లేని ఎన్నో రెట్ల జ్ఞానం ఇతర పుస్తకాల్లో ఉంటుందన్నది వాస్తవం. పిల్లల్లో పుస్తకం పట్ల ఆసక్తి కలిగించడానికి కథలు, కామిక్స్‌ పుస్తకాల్ని పెద్దవాళ్లే పెద్దగా చదివి వినిపించాలి దీని వల్ల రానురాను వారిలో ఆసక్తి పెరుగుతుంది. వీలైనంతవరకు అనేక రకాలైన పుస్తకాలు అందుబాటులో ఉంచితే, కళ్ళతో చూసి చదవాలన్న కుతూహలం పెరుగుతుంది. పిల్లలకు బొమ్మలు ఎక్కువగా ఉండే పుస్తకాలు ఇస్తేనే మంచిది. 


ఈ-బుక్స్.. పుస్తకాలు చదివే విధానంలో, పుస్తకాల రూపురేఖల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం పుస్తకాలన్నీ కంప్యూటర్‌ డెస్క్‌ మీదకి మారుతున్నాయి. అచ్చు పుస్తకాలు ఈ- బుక్స్‌గా కంప్యూటర్స్‌లోకి, మొబైల్‌ ఫోన్లలోకి మారి చదువరులకు అనుగుణంగా ఈ - రీడింగ్‌లో లభ్యమవుతున్నాయి. ఇందులోనూ ఆడియో బుక్స్‌ చదవడానికి, వినడానికి సులభ మార్గాలు. బిలియన్‌ డాలర్‌ బుక్‌ ఇండస్ర్టీలు తమ బుక్‌ స్టోర్స్‌ను మారుతున్న పఠనాభిరుచులకు అనుగుణంగా ఆన్‌ లైన్‌లోకి మార్చుకుంటున్నాయి. సాంకేతికంగా ఇది ఆహ్వానించదగిన పరిమాణం. అమెరికాలో సగటు అమెరికన్‌ సంవత్సరానికి నాలుగు పుస్తకాలు మాత్రం చదవడానికి ఇష్టపడతాడని ఒక సర్వే తెలిపింది. 

పుస్తకంతో ఎవరెంత సేపు
పిల్లల్లో పఠనాసక్తి తగ్గుతోందని ఐక్యరాజ్య సమితి ఇటీవలి సర్వే వెల్లడించింది. 33.27 కోట్ల మంది యువతలో 41.7 శాతం కాల్పనిక సాహిత్యం (ఫిక్షన్‌) చదువుతున్నారు. 23.8 శాతం మంది కాల్పనికేతర సాహిత్యం (నాన్‌ ఫిక్షన్‌) చదువుతుండగా, 34.5 శాతం రెండు రకాల సాహిత్యాన్నీ చదువుతున్నారు. పాఠ్యేతర పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలు రోజూ చదువుతున్నవారు 26 శాతం, వారానికి ఒక సారి చదివేవారు 48.8 శాతం ఉండగా, సంవత్సరానికి ఒకసారి చదివేవారి శాతం 1.6గా ఉంది. కాగా పిల్లలకు సంబంధించి చూస్తే, 25 శాతం పిల్లలు గంట కన్నా తక్కువ కేటాయిస్తూ ఉండగా, 32 శాతం మంది రెండు గంటల సమయం పఠనానికి కేటాయిస్తున్నారు. 35 శాతం మంది పిల్లలు మూడు నుంచి ఐదు గంటలు సమయం కేటాయిస్తుండగా, ఏడు శాతం మంది ఏడు గంటల సమయం కేటాయిస్తున్నారు. ఏడు గంటల కన్నా ఎక్కువ సమయాన్ని పుస్తక పఠనం కోసం కేటాయించేవారు కేవలం ఒక్కశాతం మందే ఉండగా మూడు శాతం మంది అంత ర్జాలంలో పుస్తక పఠనం చేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మా యిలే ఎక్కువగా పుస్తకాలు చదువుతున్నారు. దీని వల్ల అబ్బాయిల కంటే అమ్మాయిల్లోనే సానుకూల దృక్పథం ఎక్కువగా కనిపిస్తుంది.



ప్రియమైన నేస్తం...

పుస్తకాలు చదవడం ఓ మంచి అలవాటు. ప్రతిరోజు ఒక చిన్న కవిత, నచ్చిన వ్యాసం, న్యూస్‌ పేపర్స్‌, వ్యాసాలు, నవలలు, వారా ప్రతికలు, కథలు వంటివి క్రమం తప్పకుండా చదివితే ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నాయి కొన్ని పరిశోధనలు. స్నేహితులు, బంధువులు, నమ్మిన వారు మోసం చేయోచ్చు. కానీ పుస్తకాలు ఎవరినీ మోసం చేయవు. 
అయితే వాటిని చదివే విధానం, చూసే దృష్టిని బట్టి వాటి ప్రభావం ఉంటుంది. అలాంటి ప్రియమైన నేస్తాలను జీవితానికి పరిచయం చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పుస్తకాలు చదవడం ఓ అలవాటుగా మారితే మెదడుకు, శరీరానికి ప్రశాంతత, మంచి వ్యాయామం కూడా. చాలా మందికి పుస్తకాలు చదివే అలవాటు ఉండదు. దీని వల్ల ఎన్నో కోల్పోతారు. అలా మిస్‌ కాకుండా ఉండాలంటే కింది విషయాల గురించి తెలుసుకోవాల్సిందే!
ఒత్తిడి నుంచి ఉపశమనం...
వ్యక్తిగత కారణాలు, ఇతర సమస్యలు, ఆఫీసు పనుల వల్ల ఒత్తిడికి గురవుతున్నారా! అయితే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే ఒక చిన్న నవలను చదవడం మొదలు పెట్టండి. రోజూ ఉండే సమస్యలను పక్కన పెట్టి నవలను ఏకాగ్రతతో చదివితే మంచిది. ఇలా చేయడం వల్ల ఆలోచన విధానం మారడంతో పాటు ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యల నుంచి క్రమంగా బయటపడతారు.
జ్ఞాపకశక్తి పెరుగుతుంది...
చదివినదాంత గుర్తుండకపోవచ్చు, కానీ చదివిన దాంట్లో ఏదో ఒక వాక్యం మనసును, మెదడును గట్టిగా హత్తుకుంటుంది. దాని వల్ల ఇంతో కొంత జ్ఞానపశక్తి పెరుగుతుంది. అయితే చదవటం చాలా కష్టమైన పని అని ఫీలయ్యేవారు ఇలా చేయండి! ఇప్పటి నుంచే చిన్న చిన్నగా చదవడం ప్రారంభించండి. ఈ అలవాటు వల్ల జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను దైర్యంగా పరిష్కరించుకుంటారు.
సాహిత్యంపై అవగాహన... 
ఎక్కువగా చదవడం వల్ల వ్యాకరణం సులభంగా అర్థం అవుతుంది. దీని వల్ల చాలా సులభంగా, సరళంగా రాయడం, మాట్లాడటం నేర్చుకుంటారు. అలాగే ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం, శాస్త్రీయ ఆలోచన విధానం, సాహిత్యం పట్ల అవగాహన ఏర్పడుతుంది.
మానసికంగా దృఢంగా...
మానసికంగా బలహీనంగా ఉన్న వారు... పుస్తకాలు చదవడం వల్ల మానసిక సామర్థ్యాం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే మతిమరుపు (అల్జీమర్స్‌)తో బాధపడేవారు రోజూ పుస్తకాలు చదవడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. ఈ అలవాటు వల్ల సోమరితనం దూరం కావడంతో పాటు మెదడును చురుగ్గా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉన్న వారు చదవడంతో పాటు పజిల్స్‌, చెస్‌ వంటి ఆటలు ఆడటం వల్ల శక్తిసామర్థ్యాలు మరింత పెరుగుతాయి. 
కథలోని ఎత్తుగడలు...
ఒక పుస్తకం చదవడం వల్ల దాంట్లో ఉండే ఎన్నో పాత్రలు, వాటి మూలాలు, లక్ష్యాలు, చరిత్ర, అనవసరమైన, అవసరమైన విషయాల గురించి తెలుసుకుంటారు. అలాగే కథలో ఉండే ఎత్తుగడలు స్పష్టంగా అర్థం అవుతాయి. కథలు, నవలలు చదవడం వల్ల సృజనాత్మకజ్ఞానం పెరుగుతుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment