కౌగిలించుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయో తెలిస్తే షాక్ అవుతారు.. అందరు తెలుసుకోండి../health-benefits-of-hugging |

ఆనందంతో ఉప్పొంగిన, బాధతో వున్నా, ఒత్తిడితో సతమతమైపోతున్నా ఇలా ఎలాంటి భావాన్నైనా సరే ఒకరితో పంచుకోవడానికి వారధిలా ఉండేదే ఈ ‘కౌగిలింత’. అందుకే మనసుకు ఏ ఫీలింగ్ కలిగినా ఒక్కసారి ఆత్మీయులను ఆప్యాయంగా హత్తుకుంటే మనసులో ఉండే బాధలు, ఒత్తిళ్లన్నీ పటాపంచలైపోతాయంటున్నారు పరిశోధకులు.

గుండె ఆరోగ్యానికి..
వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల ఆందోళనలు, ఒత్తిళ్లు తగ్గిపోయి గుండె, శ్వాసవ్యవస్థలు ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటాయో అలాగే కౌగిలించుకోవడం వల్ల కూడా అదేవిధమైన ఫలితాలే ఉంటాయని పలు అధ్యయనాలు రుజువు చేసాయి..

రోగనిరోధక వ్యవస్థ పటిష్టం..
ఆత్మీయులను, మనసుకు నచ్చిన వారిని గాఢంగా హత్తుకోవడం వల్ల శరీరంలో ఉండే థైమస్ గ్రంథి ప్రేరేపణకు గురవుతుంది. దీనివల్ల శరీరంలో తెల్లరక్తకణాల ఉత్పత్తి మెరుగవుతుంది. ఇవి వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. తద్వారా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

మానసికంగా..
ఇద్దరు వ్యక్తులు కౌగిలించుకోవడం వల్ల వారి శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తవుతుంది. ఇది వారిలో ఉండే బాధ, కోపం, ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి నెగెటివ్ భావాలతో పోరాడి వాటిని దూరం చేస్తుంది. అలాగే శరీరంలో సెరటోనిస్ స్థాయిల్ని కూడా పెంచుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత లభించి అనిర్వచనీయమైన ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే నచ్చినవారిని కౌగిలించుకోవడం వల్ల మనలో ఉండే నెగెటివ్ ఆలోచనలన్నీ తొలగిపోయి మనపై మనకు నమ్మకం, నిజాయతీ, ఆత్మగౌరవం పెంపొందుతాయి..

రిలాక్సవ్వడానికి..
కౌగిలింత ఇతరులపై ఉండే ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రమే కాదు.. శారీరకంగా రిలాక్సవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అదెలాగంటే.. గాఢంగా ఆలింగనం చేసుకోవడం వల్ల శరీరమంతా రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుందట. అలాగే కండరాలు, ఇతర శరీర భాగాల్లో ఉండే నొప్పులు మాయమై ప్రశాంతత సొంతమవుతుందనేది నిపుణుల అభిప్రాయం.

మనస్ఫూర్తిగా..

* ఇద్దరు వ్యక్తులు మనస్ఫూర్తిగా కౌగిలించుకోవడం వల్ల ఒకరిపై మరొకరికి నమ్మకం, విశ్వాసం ఏర్పడడంతో పాటు ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ స్థాయులు రెట్టింపవుతాయి.

* ఎదుటివారి పైన ఉండే ప్రేమను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే శక్తిమంతమైన సాధనం కౌగిలింత.

* కౌగిలింత వల్ల సంబంధాలు మరింత దృఢమవుతాయి.

* కౌగిలింత వల్ల ఇద్దరి చర్మాలు రాపిడికి గురై ఒకరి శరీరం నుంచి విద్యుచ్ఛక్తి మరొకరికి ప్రవహించి తద్వారా నాడీవ్యవస్థ ప్రభావితమవుతుందట.

* బాల్యంలో తల్లిదండ్రుల ఆలింగనానికి నోచుకోని పిల్లల్లో ఐక్యూ మందగిస్తుందని.. తద్వారా నడవడం, మాట్లాడడం, చదవడం.. వంటివి ఆలస్యంగా వస్తాయన్నది ఓ అధ్యయనంలో వెల్లడైన అంశం.

* గాఢంగా, మనస్ఫూర్తిగా హత్తుకోవడానికి ఎవరూ అందుబాటులో లేకపోయినా బొమ్మల్ని, పెంపుడు జంతువుల్ని కౌగిలించుకోవడం కూడా మంచిదేనంటున్నారు నిపుణులు.

మరి మీరు కూడా ఏ భావాన్నైనా మీ ఆత్మీయుల వద్ద కౌగిలింత ద్వారా వ్యక్తపరచడం నేర్చుకోండి.. చక్కటి ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసాన్ని కూడా సొంతం చేసుకోండి..
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment