దక్షిణామూర్తి స్తోత్రమాల | Dakshina Murthy Stotramala |  GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

దక్షిణామూర్తి స్తోత్రమాల 
 DakshinaMurthy Stotramala
Adipudi Sairam
Rs 12/-
దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.

బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత మరియు సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.

  ఇక ఈ నలుగురూ గురువు కోసం వెదుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ మరియు పరమశివుడినీ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ మరియు పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.

   పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి, అతని తేజస్సుకు ఆకర్షితులై, ఆయన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు.


శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం
Sri Dakshinamurthy Stotram

దర్పణదృశ్యమాననగరీ
తుల్యం విశ్వం నిజాంతర్గతం 
పశ్యన్నాత్మని మాయయా
 బహిరివోద్భూతం యథా నిద్రయా 
యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే
స్వాత్మానమేవాద్వయం 
తస్మై శ్రీగురుమూర్తయే నమ
 ఇదం శ్రీదక్షిణామూర్తయే . 1 ||

జగదిదం బీజస్యాంతరివాంకురో
 ప్రాఙ్నిర్వికల్పం పునః 
మాయాకల్పితదేశకాల
కలనావైచిత్ర్యచిత్రీకృతమ్ 
మాయావీవ విజృంభయత్యపి
 మహాయోగీవ యః స్వేచ్ఛయా 
తస్మై శ్రీగురుమూర్తయే నమ
ఇదం శ్రీదక్షిణామూర్తయే . 2 ||

స్ఫురణం యస్యైవ సదాత్మక
మసత్కల్పార్థగం భాసతే 
సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా
 యో బోధయత్యాశ్రితాన్ 
యత్సాక్షాత్కరణాద్భవేన్న
పునరావృత్తిర్భవాంభోనిధౌ 
తస్మై శ్రీగురుమూర్తయే నమ
ఇదం శ్రీదక్షిణామూర్తయే . 3 ||

నానాచ్ఛిద్రఘటోదరస్థిత
మహాదీపప్రభాభాస్వరం 
జ్ఞానం యస్య తు చక్షురాది
కరణద్వారా బహిః స్పందతే 
జానామీతి తమేవ భాంతమను
భాత్యేతత్సమస్తం జగత్ 
తస్మై శ్రీగురుమూర్తయే నమ
 ఇదం శ్రీదక్షిణామూర్తయే . 4 ||

ప్రాణమపీంద్రియాణ్యపి దేహం
చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీబాలాంధజడోపమాస్త్వహ
మితి భ్రాంతా భృశం వాదినః 
మాయాశక్తివిలాసకల్పిత
మహావ్యామోహసంహారిణే 
తస్మై శ్రీగురుమూర్తయే నమ
 ఇదం శ్రీదక్షిణామూర్తయే . 5 ||

మాయాసమాచ్ఛాదనాత్
రాహుగ్రస్తదివాకరేందుసదృశో 
సన్మాత్రః కరణోపసంహరణతో
 యోఽభూత్సుషుప్తః పుమాన్ 
ప్రాగస్వాప్సమితి ప్రబోధ
సమయే యః ప్రత్యభిజ్ఞాయతే 
తస్మై శ్రీగురుమూర్తయే నమ
ఇదం శ్రీదక్షిణామూర్తయే . 6 ||

జాగ్రదాదిషు బాల్యాదిష్వపి
తథా సర్వాస్వవస్థాస్వపి 
వ్యావృత్తాస్వనువర్తమాన
మహమిత్యంతః స్ఫురంతం సదా 
స్వాత్మానం ప్రకటీకరోతి
భజతాం యో ముద్రయా భద్రయా 
తస్మై శ్రీగురుమూర్తయే నమ
ఇదం శ్రీదక్షిణామూర్తయే . 7 ||

పశ్యతి విశ్వం కార్యకారణ
తయా స్వస్వామిసంబంధతః 
శిష్యాచార్యతయా తథైవ
 పితృపుత్రాద్యాత్మనా భేదతః 
స్వప్నే జాగ్రతి వా య ఏష
పురుషో మాయాపరిభ్రామితః 
తస్మై శ్రీగురుమూర్తయే నమ
 ఇదం శ్రీదక్షిణామూర్తయే . 8 ||

హిమాంశుఃభూరంభాంస్య
నలోఽనిలోఽంబరమహర్నాథో పుమాన్ 
ఇత్యాభాతి చరాచరాత్మక
మిదం యస్యైవ మూర్త్యష్టకమ్ 
నాన్యత్కించన విద్యతే
విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః 
తస్మై శ్రీగురుమూర్తయే నమ
 ఇదం శ్రీదక్షిణామూర్తయే . 9 ||

సర్వాత్మత్వమితి స్ఫుటీకృత
మిదం యస్మాదముష్మింస్తవే 
తేనాస్య శ్రవణాత్తదర్థమ
నాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ 
సర్వాత్మత్వమహావిభూతి
సహితం స్యాదీశ్వరత్వం స్వతః 
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణ
తం చైశ్వర్యమవ్యాహతమ్ . 10 ||






ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment