చిట్టి పొట్టి పాటలు | Chitti Potti Patalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
చిట్టి పొట్టి పాటలు 
Chitti Potti Patalu
Rs 12/-

*చందమామ రావె, జాబిల్లి రావె
కొండెక్కి రావె, గోగుపూలు తేవే
బండెక్కి రావే, బంతి పూలు తేవే
పల్లకిలో రావె, పారిజాతం తేవే
తేఱెక్కి రావే, తేనెపట్టు తేవే
ఆటలాడ రావె, అబ్బయి(అమ్మాయి)కిచ్చి పోవె


*జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
గుర్రం తిన్న గుగ్గెళ్ళు జీర్ణం
ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణం
అబ్బాయి(అమ్మాయి) తాగిన ఉగ్గుపాలు జీర్ణం
నందిలాగ కూర్చొని తాబేలులాగా పాకి
లేడిలాగా లేచి కుందేలులా బాబు(పాప) పరిగెత్తాలి

*చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
అట్లు పొయ్యంగా ఆరగించంగా
రత్నాల చెమ్మచెక్క రంగులేయంగా
ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగా
పగడాల చెమ్మచెక్క పందిరేయంగా
పందిట్లో బాలలు పరుగులేయంగా
పరుగో పరుగు

పిల్లలకు ఏం చెప్పాలి?

వ్రాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్‌, దయా
శాలికి, శూలికిన్‌, శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్‌,
బాల శశాంక మౌళికిఁ, గపాలికి, మన్మథ గర్వ పర్వతో
న్మూలికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్‌.

   శివుడు మన్మథుని గర్వాన్ని నిర్మూలనం చేశాడు. మనం కూడా శివ భక్తులమై సంసారంలో ఉంటూనే కామవాంఛలను జయించాలి. అది గ్రహిస్తే యాభై ఏళ్లు దాటే సరికి కాస్త నెమ్మదిగా వైరాగ్య మార్గంలో పడతాం. అప్పుడు నిర్భయంగా ఉండగలుగుతాం. జీవితంలో ఏదైనా భయం కలిగించేదే. పాండిత్యం సంపాదిస్తే, అంతకన్నా ఎక్కువ పాండిత్యం ఉన్న వాడు వస్తాడని భయపడతాం. అందంగా ఉంటే ఈ అందం దెబ్బతింటుందేమోనని భయపడతాం. యవ్వనంలో ఉంటే ముసలితనం వచ్చేస్తుందని భయపడతాం. ధనవంతులమైతే అనుకోకుండా పేదవాళ్లమైపోతామేమో అని భయపడతాం. ఏ స్థితిలోనూ భయం కలిగించనిది ఒకే ఒక్కటి. అదే వైరాగ్యం. ‘నాకు అక్కర్లేదు!’ అనుకునే వాడు ఉన్నంత నిర్భయంగా మరెవ్వడూ ఉండడు. ‘నాకిది కావాలి!’ అనుకుంటే వంద రకాల తాపత్రయాలు పడాల్సిందే. ఆ గర్వాన్ని జయించాలంటే పార్వతీపరమేశ్వరులిద్దరినీ మనం ఆశ్రయించాలి. నారదుడు మొదలుకుని ముఖ్యమైన మునులందరూ నిరంతరం భగవంతుని ధ్యానంలో గడిపారు. వారి మనః పద్మాలలో శివుడు తుమ్మెదలా విహరిస్తున్నాడు. మనమూ అలా నిరంతరం భగవంతుని ధ్యానంలో గడుపుదాం. మనస్సులో భక్తి తప్ప మరేమీ ఉండకూడదు. ‘అంతా నువ్వే!’ అని భగవంతుణ్ణి వేడుకోవాలి. దేశం బాగుపడటానికి, జీవితం బాగుపడటానికి ఆధ్యాత్మికతను మించిన మార్గం లేదు. శంకరాచార్యుల నుంచి వివేకానందుల వరకు చెప్పింది అదే.

పదేళ్లలోపు పిల్లలను బడికి పంపించేటప్పుడు చెప్పవలసిన విషయాలు ఏమిటి? తీసుకొమ్మని చెప్పవలసిన జాగ్రత్తలేమిటి? చెయ్యవలసిన ఉపదేశాలేమిటి? అది మనం తెలుసుకుందాం!

ఇవ్వాళ చాలా మంది తల్లిదండ్రులు సమయం లేకపోవడం వల్ల, అశ్రద్ధ వల్ల చెప్పలేకపోతున్నారు. అవసరమైతే మోరల్‌ టీచింగ్‌ కోసం ఓ టీచర్‌ను పెట్టేస్తారు. ‘పిల్లలకు మోరల్‌ వాల్యూస్‌ నేర్పండీ’ అంటే అదేమన్నా కరాటేనా, కుంగ్‌ఫూనా! నేర్పితే వస్తాయా? పిల్లాడిని ఎదురుగా కూర్చోబెట్టుకుని ‘సత్యమునే పలుకుము, సత్యమునే పలుకుము’ అని చెబితే సత్యమే పలుకుతాడా! నైతిక విలువలు చెబితే వచ్చేవి కావు. తల్లిదండ్రుల ఆచరణలోనే పిల్లలు వాటిని గమనిస్తారు. అందుచేత తల్లిదండ్రులు తాము చెబుతున్న విలువలకు బద్ధులై ఉండాలి. బడికి వెళుతున్న పిల్లలకు ఎలాంటి విలువలు చెప్పాలి? ఈ విషయాన్ని అనంతామాత్యుడు ‘భోజరాజీయం’లో చెప్పాడు. అందులో ‘గోవ్యాఘ్ర సంవాదం’ అని ఒక ఘట్టం ఉంటుంది. భారతీయ సాహిత్యంలోనే చాలా గొప్ప ఘట్టం. అడవిలో సంచరించే ఓ గోవు దారి తప్పి పులి కంటబడుతుంది. పులి దాన్ని మింగేయబోతుంటే దాని బారి నుంచి తప్పించుకుని ఒక మాట అంటుంది. ‘నేను నీ ఆహారాన్ని. కాదనడం లేదు. కానీ నాకు చిన్న దూడ ఉంది. అది పాలు తాగే సమయం. దానికి పాలిచ్చి పావుగంటలో వచ్చేస్తాను. అప్పుడు నన్ను తినేయ్‌’ అంది. పులి ఆవు మాటలు విశ్వసించదు. ఆవు చాలా ప్రమాణాలు చేస్తుంది. పులి ఆ ప్రమాణాలను విశ్వసించింది. ఆవు మాటకు సరేనంది. ఆవు పరుగెత్తుకుంటూ వెళ్లి దూడకు పాలిచ్చింది. పాలు తాగే సమయంలోనే దూడకు కొన్ని బుద్దులు చెప్పింది. ఆ బుద్దులు ఎలా ఉన్నాయంటే...

ఒంటి చరింపకు పొలమున
నింటికిఁ గడు ప్రొద్దు గలుగ నేతెంచుచు రా
వెంట బడి పొడుచు గోవుల
జంట జనకు క్రయ్యబడకు సందడియగుచోన్‌.

పంట పొలాల్లో పచ్చగడ్డి ఉంది కదా అని ఒంటరిగా వెళ్లకు. సాయంత్రం పెందలాడే ఇంటికొచ్చెయ్‌. నీ దూడల్లోనే కొన్ని వెంట వచ్చినట్టే వచ్చి పొడుస్తుంటాయ్‌. అలా పొడిచే వాటికి దూరంగా ఉండు. వాటితో స్నేహం చేయకు. మందతో కలిసి పరుగెత్తాల్సి వచ్చినపుడు కయ్యలో పడిపోకుండా చూసుకో! అలా దూడకు బుద్దులు చెప్పి, ఆవు అంతే వేగంగా పులి దగ్గరకు తిరిగి వచ్చింది. చెప్పిన సమయంలోగా పులి దగ్గరకు చేరుకోవాలని పులి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చింది.

ఈ బుద్దులు ఇప్పటి పిల్లలకు బాగా నేర్పాలి. ‘ఎటైనా వెళ్లాల్సివస్తే నలుగురితో కలిసి వెళ్లండి. నలుగురితో కలిసి బస్సెక్కండి. నలుగురితో కలిసుండు’ అని చెప్పాలి. బడి నుంచి పెందలాడే ఇంటికి వచ్చేయాలని చెప్పాలి. ‘డాడీ, నేనూ నీ కోసం ఎదురుచూస్తుంటాం!’ అని చెప్పాలి. ఈ మాటలు చిన్న పిల్లలకే చెప్పాలి. పిల్లలు పెద్దయ్యాక చెప్పాల్సినవి కావు.
డా. గరికిపాటి నరసింహారావు

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment