శ్రీకృష్ణమిశ్రియ దశాభుక్తి ఫల నిర్ణయం | SriKrishnaMisriya DasaBhukthi Phala Nirnayam Keywords for SriKrishnaMisriya DasaBhukthi Phala Nirnayam: SriKrishnaMisriyaDasaBhukthiPhalaNirnayam, Sri Krishna Misriya DasaBhukthi Phala Nirnayam, Dasantardhasa Phalitalu, JyotishaRatnakaram, Sri Vellala Seetaramaiah, SriVellala Seetaramaiah, Astrology, Jyotisyamu, Jatakamu, Mohan publications, | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


శ్రీకృష్ణమిశ్రియ 
దశాభుక్తి ఫల నిర్ణయం 
SriKrishnaMisriya 
DasaBhukthi Phala Nirnayam
SriVellala Seetaramaiah
                                  Rs 300/-

     జన్మాంతరమందు పుణ్య పాప రూపకంబగు నెట్టి కర్మ సంపాదింపబడెనో దాని యనుభవ మీ జన్మమందు గలిగి యాఫలము దశాంతర్దశాదులవల్ల సమస్త జనులును తమ తమ జాతకములయందలి జననకాల గ్రహములయొక్క బలాబలముల కనుగుణముగా శుభాశుభఫలముల నెఱుంగవచ్చును. అట్లు తెలియుటయేగాక ఆ దశాదులవల్ల కలిగెడు యనిష్టములకు యధావిధిగా శాంతులు చేయుటవల్ల ననిష్ట పరిహారమై జాతకుడు అభీష్ఠసిద్ధిని, సుఖమును పొందును. కాబట్టి జన్మకాల ఘడియలనుబట్టి కాల సాధన లగ్న స్ఫుట సాధనలవల్ల గ్రహములను కనుగొని స్థానాధిషడ్బలములవల్లను, ఆధిపత్యస్థితి సాహచర్య, వీక్షణాదులవల్లను, మహాదశానాధునకును అంతర్ధశానాధునకు గల సంబంధా సంబంధ మూలకముగ గ్రహములకును కలిగెడు శుభా శుభత్వములను చక్కగా పరిశీలించి బలాబలములను, గుణదోషములను గణితమార్గములవల్ల గణన చేసి పిమ్మట వాని వాని శుభాశుభ ఫలములను చెప్పినట్లయిన స్ఫుటతరముగా నుండును.

అయినను ఫల భాగమునకు సంబంధించిన జ్యోతిష గ్రంథము లనేకములున్నను, పై చెప్పిన ప్రకారముగా ఫలములను క్రోఢీకరించి తెలిపెడి గ్రంథము లేనట్టి కొఱతను దీర్చుటకై అనేక ప్రాచీన జ్యోతిష గ్రంథముల యందలి ఫల భగాధ్యాయములలోని ముఖ్య సారాంశమును ఒకచోట చేర్చి సవిస్తరముగా సంస్కృతభాషలో వ్రాయబడియున్న ఈ జాతక గ్రంథమును ఆంధ్రీకరించియున్నాను. ఈ గ్రంథమును జ్యోతిషాభిమానులందరు తగు ప్రోత్సాహమిత్తరని ప్రార్థన.    - శ్రీవెల్లాల సీతారామయ్య

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment