సినిమాకెళితే.. సినిమాయే..!! 

పర్సు ఖాళీ చేస్తున్న థియేటర్లు
తినుబండారాల పేరుతో దోపిడీ
భారీగా ధరలు, బయటి వాటికి నో..!
మూడు గంటల కాలక్షేపానికి వేలు ఖర్చు
అమలు కాని ప్రభుత్వ ఆదేశాలు

నెల్లూరు: సినిమా.. ప్రజలకు దీనంత కాలక్షేపం మరొకటి ఉండదు. నాడు.. నేడు... రేపు సినిమాలకు ఉండే క్రేజే వేరు. సీరియల్స్‌, షార్ట్‌ ఫిలిమ్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్స్‌.. ఇలా ఎన్ని వస్తున్నా కొత్త సినిమాల కోసం ప్రజలు ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ సినిమా విడుదలైన వెంటనే థియేటర్లలో క్యూ కడతారు. సినిమా బాగుంటే ఇక హాళ్లలో సందడి చెప్పనక్కర్లేదు. అంతలా ప్రజలు సినిమాలకు బానిసలయ్యారనుకున్నారో... లేక ఏం చేసినా సినిమా చూడడం మానరనుకుంటున్నారో తెలియదు కానీ మాల్స్‌, మల్టీప్లెక్స్‌లలోని సినిమా హాళ్ల యాజమాన్యం తినుబండారాల పేరుతో ప్రేక్షకులను దోచేస్తున్నాయి. సినిమా హాల్స్‌లో ఆగస్టు 1 నుంచి ఎంఆర్పీకే తినుబండారాలు అమ్మాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా వాటిని పట్టించుకున్న థియేటర్‌ కనిపించడం లేదు.



భగ్గుమంటున్న ధరలు
సినిమా టిక్కెట్‌ ధర రూ.5 నుంచి రూ.180 చేరుకుంది. విడతల వారీగా టిక్కెట్‌ రేటు పెరుగుతున్నా ప్రజలు పెద్దగా ఆలోచించడం లేదు. నలుగురు సభ్యులున్న కుటుంబం సినిమాకు వెళితే టిక్కెట్లకు రూ.720 చెల్లిస్తే తినుబండారాల కోసం అంతకంటే ఎక్కువ సమర్పించాల్సి వస్తోంది. మాల్స్‌, మల్టీప్లె క్స్‌లలో సినిమాకు వెళితే వేల రూపాయలు వదిలిపోతున్నా యి. అక్కడ తినుబండారాలు, కూల్‌ డ్రింక్స్‌, పాప్‌కార్న్‌ వంటి వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఓ పాప్‌కార్న్‌ ప్యాక్‌ రూ.110, పఫ్‌ రూ.50, 4 సమోసాలు రూ.50, కూల్‌డ్రింక్‌ రూ.60, స్వీట్‌ రూ.50, పిజ్జా రూ.220, వాటర్‌ బాటిల్‌ రూ.40... ఇవీ థియేటర్లలో ధరలు!. సినిమాకు వచ్చిన వారు సాధారణంగా ఇంటర్‌వెల్‌ సమయంలో ఏదో ఒకటి తింటారు. అయితే, హాళ్లలో ధరలు చూసి ప్రేక్షకులు నోరెళ్లబెడుతున్నా రు. కుటుంబంతో వచ్చిన వారు, ముఖ్యంగా పిల్లలతో కలసి సినిమాకు వెళితే ఫుడ్‌ ఐటమ్స్‌ ధర ఎంతయినా కొనకతప్ప డం లేదు. ఈ ధరల వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుం బాలు ఎప్పుడైనా ఒకసారి సినిమాకు వెళితే ఆ నెలలో మరో ఖర్చును తగ్గించుకోవాల్సిన పరిస్థి తి వచ్చింది.


బయటివాటికి నో..!
థియేటర్లలో ధరలు ఎక్కువగా ఉంటాయి కదా.. ఇంటినుంచో, బయట షాపుల నుంచో తి నుబండారులు తీసుకెళదామని సగటు ప్రేక్ష కుడు ఆశిస్తాడు. అయితే చాలా థియేటర్లలో బయటి తిండిని అనుమతించడం లేదు. థియేటర్లలోకి వెళ్లే ముందే ప్రేక్షకులను తనిఖీ చేసి బయటి తినుబండారాలుంటే సిబ్బంది తీసేసుకుంటున్నారు. దీంతో ప్రజలకు ఆ అవకాశం కూడా లేకుండా పోతోంది.


తనిఖీలు శూన్యం
మాల్స్‌, మల్టీప్లెక్స్‌లలోని థియేట ర్లతోపాటు జిల్లాలోని 78 సినిమా హాళ్లలో తినుబండారాలు అధిక ధరకు అమ్ముతున్నారు. ఈ ధరలు, తినుబండారాల నాణ్యత ను అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో అధికారులు సినిమా హాళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నా మన జిల్లాలో మాత్రం ఆ ఊసే లేదు.


ఎవరికి ఫిర్యాదు చేయాలి?
సినిమా హాళ్లలో తినుబండా రాలు, కూల్‌డ్రింక్స్‌ ధరలు ఆకా శాన్ని అంటుతున్నాయి. ఇంత ధర ఏంటని ప్రశ్నిస్తే ఇష్టముంటే కొను.. లేకుంటే వెళ్లు! అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఈ ధరలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదు. - ప్రదీప్‌

అప్పు చేయాలి !
ఇటీవల కాలంలో నగరంలో ఉన్న సినిమా హాళ్లలో తినుబండారాల ధరలు విపరీతంగా పెంచేశారు. దీంతో కుటుంబం అంతా సినిమాకు వెళి తే రూ.3వేలు ఖర్చవుతోంది. అప్పు చేసి సినిమాకు వెళ్లాల్సిన పరిస్థితి. - బత్తల ఉదయ్‌కుమార్‌
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment