ఆలయంలో అగ్ని!

ఆ ఆలయంలోకి అడుగుపెడితే భగభగమండే మంటలు కనిపిస్తాయి. ఆ మంటలను దేవుడి స్వరూపంగా అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందంటే...
దేవాలయంలో దీపం వెలిగిస్తాం. కానీ ఈ ఆలయంలో దీపం వెలిగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని వందల ఏళ్లుగా ఆ ఆలయంలో అగ్నిగుండం వెలుగుతూనే ఉంది. అజర్‌బైజాన్‌లోని బాకూలో ఉన్న ఈ ఆలయం పేరు ‘అటె్‌సగాహ్’. గుడిలోపల మాత్రమే కాకుండా, మండపం పైన నాలుగు వైపులా అగ్ని జ్వాలలు ఉంటాయి. అందుకే ఈ ఆలయాన్ని ‘ఫైర్ టెంపుల్’ అని కూడా పిలుస్తారు.
అగ్నిగుండం అంటే ఎవరో వెలిగించింది కాదు. సహజసిద్ధంగా మండుతున్న మంటలు అవి. ఈ ఆలయంలో జొరాస్ట్రియన్లు, హిందువులు ఎక్కువగా పూజలు నిర్వహిస్తుంటారు.
17వ శతాబ్దంలో వర్తకం కోసం అక్కడికి వెళ్లిన హిందువులు పవిత్ర ప్రదేశంగా భావిస్తున్న ఆ స్థలంలో ఆలయం కట్టించారు. ఆ మంటలను దేవుని స్వరూపంగా అక్కడి ప్రజలు భావిస్తారు.
ఆలయంలో మంటలు రావడానికి భూమిలోపల ఉన్న సహజ వాయువు కారణం. సహజవాయువు ఆక్సిజన్‌తో కలిసి మండుతోంది. కొన్ని వందల ఏళ్లుగా మండుతూనే ఉంది. ఈ ప్రాంతంలో సహజ వాయు నిక్షేపాలు ఎక్కువ.
కొంత కాలం క్రితం సహజ వాయువు నిక్షేపాలు తగ్గిపోవడంతో మంటలు ఆరిపోయాయి. దేవుడికి కోపం రావడం మూలంగానే మంటలు ఆరిపోయాయని అక్కడి ప్రజలు భావించారు. అప్పటి నుంచి ప్రజలే ఆలయంలో మంటలు వెలిగించి పూజలు చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment