
మీ ఈమెయిల్ ఇక భద్రంగా!
ఈ మధ్యకాలంలో గూగుల్ సంస్థ తన ‘జీమెయిల్’లో చాలా మార్పులు చేసింది. ఏకంగా దాని రూపురేఖలను మార్చేసి దాని లుక్‌ను కొత్తగా మార్చింది. కానీ దీని లుక్‌కు నెటిజన్ల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. అంతే కాదు త్వరలోనే జీమెయిల్‌లో త్వరలోనే ‘కాన్ఫిడెన్షియల్ మోడ్’ ఫీచర్‌ను ప్రవేశపెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లే ఇటీవల ఈ ఫీచర్‌ను జీమెయిల్ యాప్‌లో పొందుపరిచింది. కొన్నిసార్లు మనం పంపిన ఈ-మెయిల్‌ను మనకు తెలియకుండానే ఇతరుల బారిన పడుతుంది. ఈమెయిల్ ఎక్కువకాలం అలా వేరొకరి మెయిల్స్‌లో ఉండిపోవడం వల్ల దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువ.
అందుకే అలాంటి సమస్యలు లేకుండా ఈ కాన్ఫిడెన్షియల్ మోడ్‌ను రూపొందించింది గూగుల్. తాజాగా జీమెయిల్ యాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మనం పంపాలనుకున్న ఈమెయిల్‌కు టైమ్ సెట్ చేసి పంపించవచ్చు. నిర్ణీత గడువు అయిపోయాక ఆ మెయిల్ దానంతట అదే డిలీట్ అయపోతుంది. ఈ గడువు ఒక రోజు నుంచి అయిదేళ్ల వరకూ సెట్ చేసుకోవచ్చు. మీరు పంపిస్తున్న ఈమెయిల్‌కు పాస్‌కోడ్ కూడా సెట్‌చేసుకోవచ్చు. కంపోజ్ బాక్స్‌లో టైమర్ గుర్తు ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పాస్‌కోడ్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ పాస్‌కోడ్ పంపించాలంటే వాళ్ల మొబైల్‌నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
----------------------------------------------
స్పామ్ మెయిల్స్ సంగతులివి!
మీ మెయిల్ అకౌంట్‌లోకి మీ ప్రమేయం లేకుండా అవసరం లేని స్పామ్ మెయిల్స్ ఎన్ని వస్తున్నాయో ఎప్పుడైనా గమనించారా? ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఇబ్బంది పెడుతున్న అతిపెద్ద సమస్య ఇది. మరి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందామా!
మీ మెయిల్ ఐడి ఎలా తెలుసుకుంటారో తెలీదు, ఎక్కడెక్కడినుండో ఏవేవో మెయిల్ మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. మెయిల్ ఐడిలను వాళ్లు ఎక్కడి నుంచి తీసుకుంటారంటే...
ఇలా చేస్తారు!
తెలిసో తెలియకో ఇంటర్నెట్లో పలురకాల వెబ్‌సైట్లలో మీరు ఈమెయిల్ సబ్‌స్ర్కిప్ష్రన్ చేస్తూ ఉంటారు. అసలు సబ్‌స్ర్కైబ్ చేసాం అన్న విషయమే చాలామంది గుర్తుండదు. ఉదాహరణకు మీరు ఒక వెబ్‌సైట్ చూస్తారు, దాని నుండి బయటకు వచ్చే సమయంలో స్ర్కీన్ మీద మీకు ఇలాంటి సమాచారం కావాలంటే మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి అంటూ ఒక మెసేజ్ కనిపిస్తుంది. మెయిల్ ఐడి ఇస్తే ఏం పోయిందిలే అని ఉదారంగా మీ మెయిల్ ఐడి టైప్ చేసి బయటకు వచ్చేస్తారు. ఇకపై ఆ వెబ్‌సైట్ రోజుకు ఒకసారి గానీ, కొన్ని సైట్లు అయితే ప్రతి ఐదారు గంటలకు ఒకసారి మెయిల్స్‌పంపిస్తూనే ఉంటాయి, మన ఇనబాక్స్ నిండి పోతూనే ఉంటుంది.
అలాగే కొన్నిసార్లు బయట ఎక్కడికైనా సినిమా ధియేటర్లు, రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల లక్కి డిప్ ల పేరిట మన పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వంటి విషయాలు కూడా సేకరిస్తారన్న విషయం తెలిసిందే. మన నుండి అలా కలెక్ట్ చేసిన సమాచారం వారి మార్కెటింగ్ అవసరాలకు దుర్వినియోగం చేయడం మాత్రమే కాకుండా, భారీ మొత్తంలో మెయిల్ ఐడీలను సేకరించి వాటిని తక్కువ ధరకు అమ్ముకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఒక లక్ష మెయిల్ ఐడిలు ప్రస్తుతం కేవలం 100 నుండి 500 రూపాయలకు అమ్మబడుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా వివిధ పద్ధతుల్లో సేకరించిన మెయిల్ ఐడిలు బల్క్‌గా డార్క్ వెబ్ వంటి ప్రదేశాల్లో తక్కువ ధరకు అమ్మబడుతూ ఉన్నాయి. సో మీకు తెలియకుండానే మీ మెయిల్ ఐడీ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది.
అంతమందికి ఎలా పంపిస్తారు?
సహజంగా జీమెయిల్ వంటి ప్రతీ మెయిల్ సర్వీస్ గరిష్టంగా ఒక్కో యూజర్ రోజుమొత్తంమీద ఐదు వందలకు మించి మెయిల్స్ పంపడానికి వీల్లేకుండా లిమిట్ పాటిస్తూ ఉంటుంది. కావాలంటే మీకు మీరు ఏరోజైనా 500 మెయిల్స్‌పంపిస్తే ఆ తర్వాత ఒక్కటి కూడా అదనంగా పంపడానికి సాధ్యపడదు. ఒక సాధారణ యూజర్ స్పామ్ మెయిల్స్ పంపకుండా అడ్డుకోవడం కోసం ఈ ఏర్పాటు చేయబడి ఉంటుంది. అయితే వ్యాపార సంస్థలు బల్క్ మెయిల్స్‌పంపడం కోసం అవి వెబ్‌సైట్లని సెటప్ చేసుకునేటప్పుడు హోస్టింగ్ కంపెనీలు మెయిల్ సర్వర్‌ని కూడా సెటప్ చేసి అందిస్తూ ఉంటాయి. ఆ వెబ్‌సైట్ యొక్క ఐపి అడ్రస్ ద్వారా ఇకపై పెద్ద మొత్తంలో మెయిల్స్ పంపించుకోవచ్చు.
అయితే ఇక్కడ కూడా గూగుల్ నిశితంగా పరిశీలిస్తూనే ఉంటుంది. ఏదైనా వెబ్‌సైట్ తన యూజర్లకు పంపించిన మెయిల్స్‌ని ఎక్కువమంది స్పామ్‌గా రిపోర్ట్ చేస్తున్నట్లయితే ఆ ఐపి అడ్రస్‌ని గూగుల్ బ్లాక్‌లిస్ట్‌లో పెడుతుంది. ఆ వెబ్సైట్ ఇకపై పంపించే మెయిల్స్‌నేరుగా స్పామ్ ఫోల్డర్‌లోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తుంది. అందుకే మీరు గమనించారో లేదో మీరు ఏమీ ప్రయత్నం చేయకుండానే, మీ జీమెయిల్ స్పామ్ ఫోల్డర్‌లో చాలా మెయిల్స్ పేరుకుపోతూ ఉంటాయి. ఎప్పుడైనా మనకు మనం వెళ్లి మాత్రమే వాటిని చూడాల్సి ఉంటుంది, అప్పటివరకు మన నోటీస్‌కి కూడా ఇవి రావు. అంతేకాదు, మెయిల్ ఛింప్ వంటి ఇమెయిల్ మార్కెటింగ్ సర్వీసులు భారీ మొత్తంలో మెయిల్ ఐడిలకు న్యూస్ లెటర్లు, మెయిల్స్‌డిజైన్ చేసుకుని పంపించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఎంత మందికి పంపాలి, ఎలాంటి సదుపాయాలు ఉంటాయి అన్నదాన్ని బట్టి ఇవి ప్యాకేజీల వారీగా డబ్బులు వసూలు చేస్తాయి.
ఇలాంటి ఇమెయిల్ మార్కెటింగ్ సర్వీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన, వీటిద్వారా ఎవరైనా మనలాంటి వారికి భారీ మొత్తంలో మెయిల్స్ పంపించినా కూడా అవి స్పామ్ ఫోల్డర్‌లోకి వెళ్లకుండా మన ఇన్‌బాక్స్‌లోకి వస్తాయి. మెయిల్ క్యాంపెయిన్‌లను నిర్వహించుకోవడం కోసం కొన్ని వెబ్‌సైట్లు ఇంత ముందు చెప్పుకున్నట్టు మెయిల్ సర్వర్‌తో పాటు ఇంటర్‌స్పియర్ ఇమెయిల్ మార్కెటర్ వంటి పెయిడ్ స్ర్కిప్ట్‌లను (సాఫ్ట్‌వేర్) కూడా వినియోగిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటిది ఏది వాడినప్పటికీ జీమెయిల్ వంటి సంస్థలు నిర్దేశించే ప్రమాణాలను పాటించకపోతే మాత్రం ఆయా మెయిల్స్‌నేరుగా స్పామ్‌లోకే వెళతాయి.
అందుకే ఇమెయిల్ మార్కెటింగ్ చేసేవారు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఒకేసారి వేలాదిమందికి పంపించకుండా నిమిషానికి 100, 500 మెయిల్స్ అంటూ రేట్ లిమిటింగ్ అనుసరిస్తుంటారు. వీటిలో ప్రతి మెయిల్ ఐడి విడివిడిగా టైపు చేయాల్సిన పనిలేదు. మనబోటి సాధారణ యూజర్ల మెయిల్ ఐడిలు వేలు, లక్షలకొద్దీ సేకరించి ఒక ఎక్సెల్ షీట్ ద్వారానో, సిఎస్‌వి ఫైల్ ద్వారానో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా ఆయా ఐడిలకు కంపెనీలు సెట్ చేసిన మెయిల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి.
ఇది మరీ ఘోరం!
వాస్తవానికి జీమెయిల్ వంటి ప్రముఖ మెయిల్ సర్వీసులు బల్క్ మెయిల్ విషయంలో కొన్ని పరిమితులు విధిస్తుంటాయి. కంపెనీలు మన లాంటి యూజర్లని పంపించే మెయిల్ మెసేజ్‌ల క్రింద తప్పనిసరిగా అన్‌సబ్‌స్కైబ్ర్ లింకులు పెట్టాలన్నది ఒక రూల్. అందుకే మీరు గమనించారో లేదో వివిధ స్పామ్, మార్కెటింగ్ మెయిల్స్‌మనకు వచ్చినప్పుడు వాటి అడుగుభాగంలో సిగిరెట్ పెట్టెమీద ఆరోగ్యానికి హానికరం అని ఎంత చిన్న అక్షరాలతో ఉంటుందో అంతే చిన్న అక్షరాలతో అన్‌సబ్‌స్ర్కైబ్ అనే లింక్ ఉంటుంది. కనీసం చాలామంది ఆ విషయం గమనించను కూడా గమనించరు.
సరే నాబోటి, మీ బోటి వారు ఆ లింకులను క్లిక్ చేసి, ఆ న్యూస్ లెటర్ నుండి ఇకపై మెయిల్స్‌రాకుండా అన్‌సబ్‌స్కైబ్ చేశారనుకోండి. అంతటితో ఊపిరి పీల్చుకుంటే పొరబాటే. ఇక్కడ నుంచి మరో కథ మొదలవుతుంది. ప్రతీ సంస్థా యాక్టివ్ మెయిలింగ్ లిస్ట్ ఎలాగైతే మెయింటైన్ చేస్తుందో, బయటకు వెళ్లిపోయిన వారి మెయిల్ ఐడిలను కూడా డేటాఆబేస్‌లో ఓ టేబుల్‌లో భద్రపరుచుకుంటుంది. చాలా సందర్భాల్లో చాలా కంపెనీలు తమ సర్వీస్ నుండి అన్‌సబ్‌స్కైబ్ చేసిన బయటకు వెళ్లిపోయిన వారి మెయిల్ ఐడిలను ఇతర కంపెనీలకు, మార్కెటింగ్ సంస్థలకు డబ్బులకు అమ్ముకుంటూ ఉంటున్నాయి. దీంతో మీకు వేరొక చోటి నుండి స్పామ్ మెయిల్స్‌మళ్లీ మొదలవుతాయి.
జీమెయిల్ ఏం చేస్తోంది?
వాస్తవానికి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన స్పామ్ ఫిల్టర్లు ఉన్న మెయిల్ సర్వీస్‌గా జీమెయిల్‌ని పేర్కొనవచ్చు. దీంట్లో శక్తివంతమైన స్పామ్ ఫిల్టరింగ్ ఆల్గారిథమ్ వాడబడుతుంది. ఏది స్పామో, ఏది మామూలు మెయిలో గుర్తించడం కోసం జీమెయిల్‌లో కొన్ని వందల రూల్స్, ఫిల్టర్లు ఛెక్ చేయబడతాయి. అంటే మీరు నాకు ఒక మెయిల్ పంపారనుకోండి. మీకు తెలియకుండానే గూగుల్ మీరు పంపిన మెయిల్ స్పామా మామూలు మెయిలా అన్నది దానికుండే వైయుక్తిక లక్షణాలను బట్టి వందలకొద్దీ స్పామ్ ఫిల్టర్లతో ఛెక్ చేసి అది మంచి మెయిల్ అయితేనే నా ఇన్‌బాక్స్‌కి పంపిస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్పామ్‌ని గుర్తించి అడ్డుకోవడం కోసం గూగుల్ సంస్థ మెషీన్ లెర్నింగ్‌ని కూడా అనుసరిస్తోంది. జీమెయిల్ ఇంత కట్టుదిట్టంగా ఉంది కాబట్టే కనీసం జీమెయిల్ యూజర్ల ఇన్‌బాక్స్‌లు ఇంత శుభ్రంగా ఉంటున్నాయి.-నల్లమోతు శ్రీధర్
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment