------
online లో
క్లిక్ చేయగలరు.
------











వ.సం
|
శ్రీ అమ్మవారి దివ్య అలంకరములు
|
చీర రంగు
|
ది:10-10-2017
|
స్వర్ణ కవచం
| |
ది:11-10-2017
|
లేత పింక్ రంగు చీర
| |
ది:12-10-2017
|
ఆరెంజ్ కలర్ చీర
| |
ది:13-10-2017
|
గంధపు పసుపు రంగు చీర
| |
ది14-10-2017
|
ప్యూర్ గోల్డ్ జరీ
| |
ది:15-10-2017
|
పింక్ (నిండు) చీర
| |
ది16-10-2017
|
శ్రీ మహాలక్ష్మిదేవి
|
తెలుపు రంగు చీర
|
ది:17-10-2017
|
నిండు ఎరుపు రంగు చీర
| |
ది:18-10-2017
|
బ్రౌన్ / ఎరుపు కలనేత జరీ చీర
| |
పచ్చ రంగు చీర
|
ఆదిశక్తికి ఆరగింపు
దసరా ఈసారి పదకొండురోజుల వేడుక, ఆ జగన్మాతను పదకొండు రూపాల్లో పూజించుకునే శుభసందర్భం ఇది. మరి ఆ అలంకారాలకు తగినట్లుగా నైవేద్యాలూ ఉండాలి కాబట్టి.. అవేంటో చూసేద్దాం.
చక్కెర పొంగలి
కావల్సినవి: బియ్యం- ముప్పావుకప్పు, పెసరపప్పు- పావుకప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు - పావుకప్పు చొప్పున, కిస్‌మిస్- పదిహేను, బెల్లం- అరకప్పు, చక్కెర- ముప్పావుకప్పు, యాలకులు- నాలుగు, పచ్చ కర్పూరం, - చిటికెడు, నెయ్యి- అరకప్పు.
తయారీ: బాణలిని పొయ్యిమీద పెట్టి పెసరపప్పును వేయించాలి. పచ్చివాసన పోయాక దింపేయాలి. అదే బాణలిలో రెండు చెంచాల నెయ్యి కరిగించి జీడిపప్పు, కిస్‌మిస్, కొబ్బరి ముక్కల్ని విడివిడిగా వేయించుకుని తీసుకోవాలి. కుక్కర్‌లో బియ్యం, వేయించిన పెసరపప్పూ, రెండున్నర కప్పుల నీళ్లు తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. మూడు కూతలు వచ్చాక దింపేయాలి. ఓ గిన్నెలో బెల్లం, చక్కెర, అరకప్పు నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. ఈ రెండూ కరిగి లేతపాకంలా అయ్యాక దింపేయాలి. ఈ పాకాన్ని వడకట్టి ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసి మళ్లీ పొయ్యి మీద పెట్టాలి. అందులో ముందుగా వేయించిన పెట్టుకున్న కొబ్బరిముక్కలూ, జీడిపప్పూ, కిస్‌మిస్, యాలకులపొడీ, పచ్చకర్పూరం, మిగిలిన నెయ్యి వేసేయాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి నెయ్యి పైకి తేలుతుంది. అప్పుడు దింపేయాలి.
అప్పాలు
కావల్సినవి: బియ్యప్పిండి- ముప్పావుకప్పు, గోధుమపిండి- పావు కప్పు, బెల్లం- కప్పు, నీళ్లు- కప్పు, నూనె- వేయించేందుకు సరిపడా.
తయారీ: ఓ గిన్నెలో నీళ్లూ, బెల్లం తరుగు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. బెల్లం కరిగి లేత పాకం వచ్చాక బియ్యప్పిండీ, గోధుమ పిండి వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలిపి దింపేయాలి. ఇది చల్లారేలోగా బాణలిలో వేయించేందుకు సరిపడా నూనె వేడిచేయాలి. బియ్యప్పిండి ముద్దను కొద్దిగా తీసుకుని నూనెరాసిన ప్లాస్టిక్‌కవరుపై ఉంచి.. బిళ్లలా అద్దుకుని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకోవాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకుంటే చాలు. అప్పాలు సిద్ధమైనట్లే.
చిట్టిగారెలు
కావల్సినవి: మినప్పప్పు- చిన్నగ్లాసు(నాలుగైదు గంటల ముందు నానబెట్టుకోవాలి), బియ్యప్పిండి- మూడు గ్లాసులు(నాలుగైదు గంటల ముందు బియ్యాన్ని నానబెట్టి పిండి పట్టించాలి),ఉప్పు- కొద్దిగా, నూనె- వేయించడానికి సరిపడా.
తయారీ: మినప్పప్పును గారెల పిండిలా రుబ్బుకోవాలి. అందులో బియ్యప్పిండి, తగినంత ఉప్పు కలపాలి. ఈ పిండిని చిన్న ఉండలుగా చేసుకుని తడివస్త్రంపై ఐదారు వేయాలి. వాటిపై మరో తడి వస్త్రాన్ని కప్పి గ్లాసు లేదా కప్పుతో నొక్కినట్టు చేయాలి. ఇలా చేసుకున్న వాటన్నింటినీ కాగుతోన్న నూనెలో వేసి వేయించి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకోవాలి.
దద్ద్యోదనం
కావల్సినవి: మెత్తగా వండిన అన్నం- ముప్పావు కప్పు, పెరుగు - కప్పు, పాలు- రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం తరుగు- రెండు చెంచాలు, పచ్చిమిర్చి- ఐదు, కరివేపాకు- రెండు రెబ్బలు, జీలకర్ర- అరచెంచా, సెనగపప్పు- రెండు చెంచాలు, మినప్పప్పు- రెండు చెంచాలు, ఆవాలు- చెంచా, ఎండుమిర్చి- రెండు, మిరియాలు- కొన్ని, ఉప్పు- తగినంత, నెయ్యి - రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు.
తయారీ: అన్నంలో పెరుగు, తగినంత ఉప్పూ, పాలు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి పొయ్యిమీద పెట్టుకోవాలి. అది కరిగాక ఎండుమిర్చి, మినప్పప్పు, సెనగపప్పు, జీలకర్రా, ఆవాలు, మిరియాలూ, కరివేపాకు వేయాలి. అవన్నీ వేగాక అల్లం తరుగు, పచ్చిమిర్చి వేయించి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి ఈ తాలింపునూ, కొత్తిమీర తరుగునూ అన్నంలో వేసి బాగా కలిపితే సరిపోతుంది.
కదంబం
కావల్సినవి: బియ్యం- కప్పు, కందిపప్పు- కప్పు, చింతపండు గుజ్జు- చెంచా, బంగాళాదుంప, చిలగడదుంప, చేమదుంప, గుమ్మడికాయ, ములక్కాడ ముక్కలు - అన్నీ కలిపి మూడు కప్పులు, సాంబారు పొడి- చెంచా, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు- రెండు రెబ్బలు, కొత్తిమీర - కొద్దిగా, నువ్వుల నూనె- కొద్దిగా.
తయారీ: బియ్యం, కందిపప్పును విడివిడిగా ఉడికించి తీసుకోవాలి. మరో గిన్నెలో కూరగాయ ముక్కలు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాణలినిపొయ్యిమీద పెట్టి కాసిని నీళ్లు పోయాలి. అందులో చింతపండుగుజ్జు, సాంబారు పొడి, కరివేపాకూ, ఉప్పూ, కూరగాయముక్కలు వేయాలి. అవి కాసేపు ఉడికాక ఉడికించి పెట్టుకున్న పప్పూ, అన్నం వేసి సన్నని మంటపై ఉంచాలి. ఈ అన్నం దగ్గరకు అయ్యాక కొత్తిమీర, నువ్వులనూనె వేసి దింపేయాలి.
గూడాన్నం
కావల్సినవి: బియ్యం - అరకప్పు, బెల్లం తరుగు - కప్పు, జీడిపప్పు- ఐదారు, ఎండు ద్రాక్ష- మూడు చెంచాలు, యాలకుల పొడి- పావుచెంచా, నెయ్యి- పావు కప్పు.
తయారీ: ముందుగా బియ్యం కడిగి అన్నంలా వండి పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో పావుకప్పు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి. అవి వేడయ్యాక బెల్లం తరుగు వేయాలి. బెల్లం కరిగి లేత పాకంలా అవుతున్నప్పుడు అందులో అన్నం వేసి మంట తగ్గించేయాలి. కాసేపటికి అన్నం దగ్గరకు అవుతుంది. అప్పుడు యాలకులపొడీ, నేతిలో వేయించిన జీడిపప్పూ, ఎండుద్రాక్ష పలుకుల్ని అన్నంలో వేసి కలపాలి. రెండు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.
నువ్వుల అన్నం
కావల్సినవి: అన్నం- రెండు కప్పులు, నవ్వులు- నాలుగు చెంచాలు, ఎండుమిర్చి- ఐదు, ఇంగువ- చిటికెడు, సెనగపప్పు- చెంచా, నువ్వుల నూనె- ఐదు చెంచాలు, ఉప్పు- తగినంత
తయారీ: ముందుగా బాణలిని పొయ్యి మీద పెట్టి నూనె లేకుండా నువ్వుల్ని వేయించి తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో మరో చెంచా నూనె వేడిచేసి ఎండుమిర్చీ, సెనగపప్పూ, ఇంగువ వేయించి దింపేయాలి. ఈ తాలింపులో తగినంత ఉప్పూ, వేయించిన నువ్వులూ కలిపి మరీ మెత్తగా కాకుండా పొడిలా చేసుకుని తీసుకోవాలి. బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి అన్నం, చేసుకున్న నువ్వులపొడీ వేసుకుని రెండింటినీ బాగా కలిపితే చాలు.
పులిహోర
కావల్సినవి: అన్నం- కప్పు, నూనె- నాలుగు చెంచాలు, ఆవాలు- అరచెంచా, ఎండుమిర్చి- ఒకటి, జీలకర్ర- అరచెంచా, కరివేపాకు- నాలుగు రెబ్బలు, సెనగపప్పు- అరచెంచా, పల్లీలు- గుప్పెడు, మినప్పుప్పు- అరచెంచా, ఉప్పు- తగినంత, ఇంగువ- చిటికెడు, చింతపండు గుజ్జు- నాలుగు చెంచాలు, పచ్చిమిర్చి- మూడు, పసుపు- కొద్దిగా, బెల్లం- చిన్నముక్క.
తయారీ: ముందుగా బాణలిలో నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి. అది వేడయ్యాక సెనగపప్పు, ఆవాలూ, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలూ, జీలకర్ర, కరివేపాకు వేయాలి. రెండునిమిషాలాగి పల్లీలు చేర్చాలి. ఇవన్నీ వేగాక పసుపు, ఇంగువ, చింతపండు గుజ్జు, బెల్లం, తగినంత ఉప్పు వేయాలి. కాసేపటికి అన్నీ వేగి నూనె పైకి తేలుతుంది. అప్పుడు దింపేయాలి. ఈ తాలింపు కొద్దిగా చల్లారాక అన్నంలో వేసి బాగా కలిపితే పులిహోర సిద్ధమయినట్టే.
పాయసాన్నం
కావల్సినవి: బియ్యం- అరకప్పు, చక్కెర - ముప్పావుకప్పు, నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు, పాలు- రెండుకప్పులు, జీడిపప్పు- మూడు చెంచాలు.
తయారీ: కుక్కర్‌లో కడిగిన బియ్యం, ఒకటిన్నర కప్పు పాలు, కాస్త నెయ్యి వేసి పొయ్యిమీద పెట్టాలి. మూడు కూతలు వచ్చాక దింపేయాలి. ఈ అన్నాన్ని మళ్లీ పొయ్యిమీద పెట్టి మిగిలిన పాలూ, చక్కెర వేయాలి. చక్కెర కరిగి కాస్త పల్చగా అయ్యేవరకూ మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. ఇంతలో ఓ బాణలిలో మిగిలిన నెయ్యి తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక జీడిపప్పు వేయించి పొయ్యి కట్టేయాలి. పాలు కాస్త ఆవిరవుతున్నప్పుడు జీడిపప్పూ, నెయ్యిని అందులో వేసి దింపేయాలి.
శాకాన్నం
కావల్సినవి: అన్నం - కప్పు, క్యారెట్, బీన్స్ ముక్కలు - రెండూ కలిపి పావుకప్పు, పచ్చిబఠాణీ - రెండు చెంచాలు, క్యాప్సికం, వంకాయ, బంగాళాదుంప - ఒక్కోటి చొప్పున, బెండకాయలు - రెండు, చిక్కుడుకాయలు - రెండు, జాజికాయపొడి - అరచెంచా, జాపత్రి పొడి - పావుచెంచా, యాలకులు - మూడు, లవంగాలు - నాలుగు, దాల్చిన చెక్క - చిన్న ముక్క, నెయ్యి - పావుకప్పు, ఉప్పు - తగినంత, కరివేపాకు రెబ్బలు - రెండు.
తయారీ: కూరగాయ ముక్కలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని అవి మునిగేలా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. అవి మరీ మెత్తగా కాకుండా ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద గిన్నెపెట్టి నెయ్యి కరిగించాలి. అందులో జాజికాయపొడి, జాపత్రిపొడి, యాలకులూ, లవంగాలూ, దాల్చినచెక్కపొడీ వేసి వేయించుకోవాలి. నిమిషమయ్యాక కూరగాయముక్కలన్నింటినీ వేసేయాలి. అవి వేగాక కరివేపాకు, అన్నం, తగినంత ఉప్పు వేసి బాగా వేయించుకుని తీసుకుంటే చాలు.
కట్టె పొంగలి 
కావల్సినవి: బియ్యం- అరకప్పు, పెసరపప్పు- పావు కప్పు, నీళ్లు- రెండు కప్పులు, ఉప్పు- తగినంత.
తాలింపు కోసం: నెయ్యి- మూడు చెంచాలు, జీలకర్ర- చెంచా, మిరియాలు- చెంచా, అల్లం - చిన్న ముక్క, కరివేపాకు- నాలుగు రెబ్బలు, జీడిపప్పులు- పది.
తయారీ: బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్‌లో తీసుకుని నీళ్లు పోయాలి. మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక జీడిపప్పు వేయించాలి. అవి కాస్త ఎర్రగా వేగాక జీలకర్రా, మిరియాలపొడీ, కరివేపాకూ, అల్లం తరుగు వేయాలి. అవి కూడా వేగాక బాణలి దించేయాలి. ఈ తాలింపూ, సరిపడా ఉప్పు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసి కలపాలి. ఈ పొంగలిని మరోసారి పొయ్యిమీద పెట్టి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి---శ్రీమతి విష్ణుభొట్ల పద్మావతి
- శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం సహకారంతో, ఇంద్రకీలాద్రి, విజయవాడ
---------------------------
---------------------------
వస్త్రం సమర్పయామి

అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గమ్మకు పట్టుచీరలంటే మక్కువ అని అర్చకులు చెబుతారు. ఆ జగజ్జననికి వంద రూపాయల నుంచి వేలరూపాయల వరకు ఖరీదు చేసే చీరలను భక్తులు సభక్తికంగా సమర్పించుకుంటారు. దుర్గమ్మను అలంకరించేందుకు భక్తులు పట్టుచీరలతో పాటు శక్తి కొలదీ నూలు, సిల్క్‌చీరలను కూడా సమర్పిస్తుంటారు. దుర్గమ్మకు అలంకరించే చీరలను ప్రత్యేకంగా ఎక్కడా నేత నేయించరు. భక్తులు సమర్పించిన వస్త్రాలలో పెద్ద అంచు ఉన్న చీరలను అమ్మవారికి అలంకరించేందుకు ఉపయోగిస్తారు. భక్తులు తమకు నచ్చిన పట్టు చీరలను కొనుగోలు చేసి దేవస్థానం కౌంటర్‌లో అందచేస్తారు. కొంతమంది భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా పట్టుచీరలను నేత నేయించి కానుకలుగా అందచేస్తారు. అమ్మవారికి ఇచ్చే ప్రతి చీరను అంతరాలయంలో ఉత్సవమూర్తికి చూపుతారు. నిత్యం నాలుగు నుంచి ఐదు చీరలను అమ్మవారి మూలవిరాట్టుకు అలంకరిస్తారు. దసరా ఉత్సవాలలోనూ ఇదే తరహాలో అలంకరిస్తారు. ఇక ఉత్సవ మూర్తులు, అమ్మవారి ఆలయం చుట్టూ కొలువుదీరిన అష్టలక్ష్ములకు కూడా పట్టుచీరలను అలంకరిస్తారు.
ప్రభుత్వం నుంచి పట్టుచీర
దసరా ఉత్సవాలలో అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం, సరస్వతీదేవి అలంకారం రోజున ప్రభుత్వం తరపున రాష్ట్రముఖ్యమంత్రి పట్టుచీరను సమర్పిస్తారు. దసరా ఉత్సవాల ప్రారంభం రోజున పోలీసు శాఖ నుంచి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ అమ్మవారికి పట్టుచీరను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. దీనితోపాటు దుర్గ గుడి ఆలయ అధికారి ఈవో హోదాలో అమ్మవారికి పట్టుచీరను సమర్పించడం ఆనవాయితీ. సమర్పించే పట్టుచీరలను అమ్మవారికి అలంకరించిన అనంతరం దేవస్థానం వాటిని వస్త్ర ప్రసాదంగా భక్తులకు విక్రయిస్తుంది. వివాహం, గృహప్రవేశం, కంపెనీల ప్రారంభోత్సవం వంటి శుభకార్యాల సందర్భంగా భక్తులు అమ్మవారికి చీరలను సమర్పిస్తుంటారు. సాధారణ రోజులలో కొండపై ఆలయ ప్రాంగణంలో రెండు కౌంటర్లు, మహామండపం దిగువన ఒక కౌంటర్‌లో ఈ వస్త్రప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంటుంది. దసరా, భవానీ దీక్షల విరమణ సమయంలో కొండ దిగువన మహామండపం, కనకదుర్గ నగర్‌లలో వస్త్ర ప్రసాద కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. అమ్మవారి చీరల విక్రయాలు ఆలయ ఈవో పర్యవేక్షణలో జరుగుతుంది. భక్తులు అమ్మవారికి అలంకరించే నిమిత్తం సమర్పించిన చీరను... పుట్టినరోజు, పెళ్లిరోజు... ఇలా తమకు నచ్చిన తేదీలలో అమ్మవారికి అలంకరింపచేసుకునే అవకాశం ఉంటుంది.
అమ్మవారి వస్త్ర ప్రసాదం
దేవస్థానానికి వచ్చే ఆదాయంలో చీరల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు నాటికి రూ. 1.98 కోట్ల ఆదాయం వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా దేవస్థానమే చీరల విక్రయాలను నిర్వహిస్తోంది. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు సైతం అమ్మవారి చీరలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఆ వస్త్రాలను అమ్మవారి దివ్య ప్రసాదంగా భావిస్తారు.
దసరా ఉత్సవాలలో అమ్మవారికి అలంకరించే పట్టు చీరలు
శ్రీస్వర్ణకవచాలంకృత దుర్గాదేవి – బంగారు రంగు శ్రీబాలాత్రిపుర సుందరీదేవి – లేత గులాబీ రంగు శ్రీగాయత్రీదేవి – ముదురు నారింజ రంగు
శ్రీలలితా త్రిపుర సుందరీదేవి – అచ్చమైన బంగారు రంగు
శ్రీసరస్వతీదేవి (మూలానక్షత్రం) – తెలుపు రంగు
శ్రీఅన్నపూర్ణాదేవి – గంధపు రంగు
శ్రీమహాలక్ష్మీదేవి – నిండు గులాబీ రంగు
శ్రీదుర్గాదేవి– నిండు ఎరుపు రంగు
శ్రీమహిషాసురమర్దినీదేవి – గోధుమ, ఎరుపు రంగుల కలనేత జరీ పట్టు చీర
శ్రీరాజరాజేశ్వరీదేవి – పచ్చరంగు
– ఎస్.కె.సుభానీ (ఇంద్రకీలాద్రి), విజయవాడ
------------------------------
------------------------------
అమ్మవారి ఆరగింపు

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెల్లవారుజామున బాలభోగ నివేదనతో పాటు మధ్యాహ్నం మహానివేదన సమర్పిస్తారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు వంటశాల నుంచి నివేదనలను ఆలయానికి తీసుకువచ్చి దుర్గా మల్లేశ్వరస్వామివార్లతో పాటు ఉపాలయాలలోని దేవతామూర్తులకు సమర్పిస్తారు. ఈ ప్రసాదాలను మహా మండపం ఆరో అంతస్తులో ఉన్న వంటశాలలో తయారుచేస్తారు. అమ్మవారికి నివేదనను సకాలంలో సమర్పించేందుకు వీలుగా ఉప ప్రధాన అర్చకులు కోటప్రసాద్, అర్చకులు రంగావఝల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షకులుగా ఉంటారు. తొలిపూజ – నివేదన లోక కళ్యాణార్థమే తెల్లవారుజామున 2–30 గంటలకు అమ్మవారి ఆలయం తెరిచిన తరువాత తొలిపూజను లోకకళ్యాణార్థం చేస్తారు. అర్చనానంతరం అమ్మవారికి బాలభోగంగా దద్ధ్యోదనాన్ని ఉదయం ఆరు గంటలకు నివేదన చేస్తారు. ఉదయం 8–30 గంటలకు కట్టె పొంగలి, బూందీ లడ్డూ, ఉదయం 10–30 గంటలకు పులిహోర, సాయంత్రం 4–30 గంటలకు సెనగలు, పాలు సమర్పిస్తారు. ఉదయం 11–40 గంటలకు అన్ని దర్శనాలను నిలిపివేసిన, ఆలయాన్ని శుభ్రం చేసి, మహానివేదనగా అన్నం, రెండు కూరలు, పప్పు, సాంబారు, పాయసం, గారెలను అమ్మవారికి నివేదిస్తారు. అమ్మవారికి సమర్పించిన చిత్రాన్నాన్ని ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. తాజాగా ఈ సంవత్సరం దసరా ఉత్సవాల నుంచి అమ్మవారికి అప్పాలను నివేదించి, భక్తులకు ఉచితంగా అందచేయనున్నారు.
దసరా ఉత్సవాలలో ప్రత్యేకం...
సాధారణ రోజులలో మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన సమర్పిస్తుండగా, దసరా ఉత్సవాల సమయంలో మాత్రం సాయంత్రం 6–30 గంటలకు మహా నివేదన సమర్పిస్తారు. ఉదయం ఏడు గంటలకు వడలు, పది గంటలకు అమ్మవారికి రాజభోగాలుగా చక్కెర పొంగలి, పులిహోర, పాయసం, రవ్వకేసరి, పరమాన్నం, బూందీ లడ్డూ, గారెలను సమర్పిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు పంచభోగాలను నివేదిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు అన్ని దర్శనాలను నిలిపివేసిన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసి మహానివేదన సమర్పిస్తారు. అనంతరం పంచహారతులు, చతుర్వేద స్వస్తి జరుగుతుంది. దసరా ఉత్సవాలలో మహానివేదనతో పాటు మరికొన్ని వంటకాలను అమ్మవారికి నివేదనగా సమర్పిస్తున్నామని ఆలయ అర్చకులు చెబుతున్నారు.
దసరా ఉత్సవాలు – అలంకారాలు – నివేదనలు
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి– స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి (మైసూర్‌పాక్, పులిహోర)
ఆశ్వయుజ శుద్ధ విదియ – బాలాత్రిపుర సుందరీదేవి (లడ్డూ, పెసర వడ)
ఆశ్వయుజ శుద్ధ తదియ– గాయత్రీదేవి (సున్నుండలు, అరటికాయ బజ్జీ)
ఆశ్వయుజ శుద్ధ చవితి – లలితాత్రిపుర సుందరీదేవి (కొబ్బరి లవుజు, మినప వడ)
ఆశ్వయుజ శుద్ధ పంచమి – సరస్వతీదేవి (జాంగ్రీ, ఆవడ)
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి – అన్నపూర్ణాదేవి (గోధుమ హల్వా, సెనగ వడ)
ఆశ్వయుజ శుద్ధ సప్తమి – మహాలక్ష్మీదేవి (చక్కెర పొంగలి, బొబ్బర్ల గారె)
ఆశ్వయుజ శుద్ధ అష్టమి – దుర్గాదేవి (పాయసం, బూందీ)
ఆశ్వయుజశుద్ధ నవమి/దశమి – మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరీదేవి (అప్పాలు, పెసర పునుగులు)
– ఉప్పులూరు శ్యామ్ ప్రకాష్, విజయవాడ
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment