తిరుమలలో అపచారం | TIRUMALA TIRUPATI | TTD | Tirumala Tirupathi Devastanams | Ebooks Tirumala | Saptagiri | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti


తిరుమలలో అపచారం!

రింగ్‌రోడ్డుపై పోలీసు విశ్రాంతి భవనం ముందు మాంసం
తిరుమల, జూలై 1: తిరుమల పుణ్యక్షేత్రంలో అపచారం చోటు చేసుకుంది. జీఎన్‌సీ టోల్‌గేట్‌ నుంచి వెళ్లే రింగ్‌రోడ్డుపై కోడిమాంసం చెల్లాచెదురుగా పడి ఉంది. అందులోనూ గరుడ పోలీసు విశ్రాంతి భవనం ముందే మాంసం పడిఉండడం భక్తులను మరింత విస్మయపరిచింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శ్రీవేంకటేశ్వరస్వామి వెలసిన తిరుమల క్షేత్రంలో మద్యం, మాంసం, పొగాకు ఉత్పత్తుల విక్రయం, వాడకం నిషేధం. అయితే గుర్తుతెలియని వ్యక్తులు అలిపిరి తనిఖీలలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మాంసాన్ని తిరుమలకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఓ ప్లాస్టిక్‌ కవరు చిరిగి అందులో నుంచి మాంసం ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. శ్రీవారి దర్శనార్థం ఆ మార్గం ద్వారా వాహనాల్లో వెళ్లిన భక్తులు రోడ్డుపై మాంసాన్ని చూసి ఆశ్చర్యపోయారు. స్థానికంగా నివాసముండే వారు ఈ మాంసాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని గుర్తించిన మీడియా ప్రతినిఽధులు.... పోలీసులకు సమాచారమివ్వటంతో ఆ మాంసాన్ని రోడ్డుపై నుంచి తొలగించారు. మాంసాన్ని ఎవరు తీసుకొచ్చారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. అలిపిరిలో భద్రతా తనిఖీలు నిర్లక్ష్యంగా ఉండటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు భక్తులు వాపోయారు
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment