సుధామూర్తి చెప్పిన హనుమంతప్ప కథ!  పూటగడవని పేదరికం  నిజాయితీ మాత్రం సుసంపన్నం | Sudhamurthy | Infosys | Karnaktaka | Bangalore | Ballery | | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti

సుధామూర్తి చెప్పిన హనుమంతప్ప కథ! 
పూటగడవని పేదరికం 
నిజాయితీ మాత్రం సుసంపన్నం! 

దిల్లీ: అతి నిరుపేద బాలుడి చదువుకోసం ఆర్ధికసాయం చేసే క్రమంలో ‘ఇన్ఫోసిస్‌’ వ్యవస్థాపకుడి భార్య సుధామూర్తికి ఎదురైన ఓ అరుదైన అనుభవమిది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబానికి చెందిన ఆ కుర్రాడి నిలువెత్తు నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఓ ఘటనను....స్వీయ అనుభవాన్ని సుధామూర్తి తన తాజా పుస్తకం ‘హియర్‌...దేర్‌...అండ్‌ ఎవ్విరివేర్‌’లో కళ్లకు కట్టారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని రామపురకు చెందిన కుర్రాడు హనుమంతప్ప తండ్రి దినసరి కూలీ. రోజుకు తండ్రికి వచ్చే నలభైరూపాయలతోనే ఆ కుటుంబం నడవాలి. అయిదుగురు సంతానం...భార్యాభర్తలు ఆ డబ్బుతోనే పొట్ట నింపుకోవాలి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనే హనుమంతప్ప పదోతరగతి బోర్డు పరీక్షల్లో ఎనిమిదో ర్యాంకు సాధించాడు. పోషణలేని శరీరంతో పీలగా...పేలవంగా ఉన్న హనుమంతప్ప ఫొటోను వార్తాపత్రికల్లో చూసిన సుధామూర్తి అతడి పై చదువులకు సాయం చేయాలని సంకల్పించారు. బెంగళూరులోని తన కార్యాలయానికి పిలిపించారు. ఎక్కడ చదువుకోవాలనుకున్నా ఖర్చంతా తానే భరిస్తానని హనుమంతప్పకు చెప్పారు. కాగా అతడు తన ఊరికి పక్కనే ఉన్న బళ్లారిలోని కళాశాలను ఎంచుకున్నాడు. ప్రపంచంలోని ఏ కాలేజీకైనా సరే వెళ్లదలచుకుంటే డబ్బు కడతానన్న సుధామూర్తి పట్టుదల ఆ కుర్రాడి నిజాయితీ, దీక్ష ముందు పనిచేయలేదు. కేవలం తనకు రూ.300 మాత్రమే చాలనీ... ఓ స్నేహితుడితో కలిసి ఒక గదిలో ఉండి చదువుకుంటాననీ చెప్పాడు. దాంతో, ఆరునెలలకు సరిపడా రూ.1800లను ఆమె పంపారు. కొన్నాళ్ల తర్వాత ఆమెకు హనుమంతప్ప ఓ లేఖ రాశాడు. కవరులో రూ.300ల నోట్లు ఉన్నాయి. తమకు నెలరోజుల పాటు సెలవులనీ...తదుపరి నెలలో సమ్మె ఉన్నందున తాను బళ్లారిలో లేననీ...సొంతూరికి వెళ్లడంతో డబ్బు మిగిలినందున పంపేస్తున్నానన్నది లేఖ సారాంశం. ఈ పరిణామం సుధామూర్తిని అవాక్కు చేసింది. ఆ నిరుపేద కుర్రాడి నిజాయితీకి ఆమె గుండె చిత్రంగా స్పందించింది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment