వర్షంలో బండి నడుపుతున్నారా! | Run the car in the rain! | Scooter skid | Bike Skid | Car Skid | Skid Conditions | Wet Weather | Rainy Season | Manholes | Mud | Bike Tyre | Tyre Grip | Head Light | Traffic Jam | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti | Telugu Books | Telugu Book

వర్షంలో బండి నడుపుతున్నారా!

వర్షాకాలంలో తడిసిన రోడ్లపై వాహనాలు నడపడం కత్తిమీద సామే. మ్యాన్‌హోల్స్‌, బురద లాంటివి సౌకర్యవంతమైన ప్రయాణానికి అడ్డంకిగా మారతాయి. అలాంటప్పుడు అవగాహనరాహిత్యంతో వాహనాలు నడిపితే ప్రమాదాలు కొనితెచ్చుకోవడమే అవుతుంది.

వర్షాకాలం ఏదైనా యాత్రకు వెళ్లాలనుకుంటే ముందుగానే బైక్‌ టైర్లకు ఉండే గ్రిప్‌, హెడ్‌ లైట్‌లను పరీక్షించండి.

ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే సాధ్యమైనంత ముందుగానే బయలుదేరండి. ఎందుకంటే వర్షం వల్ల ట్రాఫిక్‌జామ్‌ కావచ్చు. కాబట్టి మీరు మీ గమ్యాన్ని అనుకున్న సమయంలో చేరుకోలేరు.
వర్షం పడేటప్పుడు వాహనాన్ని మెల్లగా నడపండి. వేగంగా నడపడం వల్ల టైర్లకు, రోడ్డుపై గ్రిప్‌ పోయి వాహనాలు అదుపుతప్పే అవకాశం ఉంది.

వాహనానికి వాహనానికి మధ్య దూరం ఎక్కువగా ఉండేలా డ్రైవ్‌ చేయండి. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు ఒక్కసారి బ్రేక్‌ వేయగానే వాహనం ఆగదు. దగ్గరగా వెళ్లే ఢీకొట్టుకునే ప్రమాదం ఉంది
.
గాలి బలంగా వీస్తున్నప్పుడు వాహనాన్ని రోడ్డుకు పూర్తి పక్కగా నిలపండి. అలాంటి సమయాల్లో డ్రైవ్‌ చేయకపోవడమే మంచిది.

వరద వస్తున్నప్పుడు డ్రైవ్‌ చేయకండి. కొంచెం ప్రవాహమైనా నడుస్తున్న వాహనాన్ని నెట్టుకుపోగలదు.

వర్షం పడుతున్న సమయంలో కరెంటు తీగలు తెగి పడి ఉంటే వాహనంపై నుంచి దిగకండి. ఎలా కూర్చున్నారో అలాగే ఉండండి. దిగడానికి ప్రయత్నిస్తే ఒకేసారి రెండు కాళ్లు నేలను తాకేలా దుంకండి. ఒక కాలు నేలపై మరో కాలు వాహనంలో ఉంటే ఎర్త్‌ అయే ప్రమాదం ఉంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment