తల్లిపాల వారోత్సవాలు | Mother milk week Celebration | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu | Breastfeeding Week | World Breastfeeding Week | Mothers Milk | World Alliance for Breastfeeding Action | BhakthiBooks | Mohanbooks | Bhakthi Pustakalu | BhakthiPustakalu | BhaktiPustakalu | BhaktiPustakalu | Bhakti | Bhakthi | Mother |


తల్లిపాల వారోత్సవాలు

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగష్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలుగా వాబా (వరల్డ్ అలైన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్షన్ ) సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యు.హెచ్.ఓ (WHO), యునిసెఫ్ (UNICEF) మరియు బి.పి.ఎన్.ఐ (BPNI) వంటి అంతర్జాతీయ, జాతీయ సంస్థల అనుబంధంగా జరుపబడుచున్నది.

తల్లి పాల సంస్కృతిని ప్రోత్సహించి, సహకరించి, రక్షించుకోవడానికి ప్రతి సంవత్సరం ఒక క్రొత్త సందేశముతో ఈ వారోత్సవాలు జరుగుచున్నవి.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల విశిష్టత గురించి తెలుసు కుందాం!

1. తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి.

2. శిశువు పుట్టిన వెంటనే గంటలోపే తల్లిరొమ్ము అందించి ముర్రుపాలు (కొలస్ట్రం-ఈుుషసషప) తప్పని సరిగా పట్టాలి. వ్యాధుల నుండి రక్షించే శిశువుకు కావలసిన ఖనిజాలు, మాంసకృత్తులు, విటమిన్‌ -ఏ సమృద్ధిగా ఉంటాయి. వ్యాధుల నుండి రక్షించే యాంటీబాడీలు ఉంటాయి. బిడ్డపేగుల నుండి విసర్జకాలను తొలగించడానికి, అలర్జీలు రాకుండా నిరోధించడానికి ముర్రుపాలు తోడ్పడతాయి. ఒక్కమాటలో చెప్పా లంటే ముర్రుపాలలో శిశువుకు కావలసిన అన్ని పోషకవిలువలు బిడ్డ శరీరానికి అందుతాయి.

3. బిడ్డకు మొదట వ్యాధి నిరోధక టీకాగా పనిచేస్తుంది.

4. శిశువులకు ప్రకృతి ప్రసాదించిన సహజ అత్యుత్తమమైన పౌష్టికాహారం.

5. బిడ్డ సులువుగా జీర్ణమౌతాయి.

6. ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటాయి.

7. తల్లిపాలవలన మలవిసర్జన సులభంగా జరుగుతుంది.

8. శిశువులకు దృష్టిలోపం రాకుండా నివారించడానికి దోహదపడతాయి.

9. తల్లికీ, బిడ్డకు చక్కని అనుబంధం ఏర్పడుతుంది.

10. వ్యాధుల బారి నుండి తల్లిపాలు రక్షిస్తుంది.

11. బిడ్డకు ప్రృతివరం కొనవలసిన అవసరంలేదు.

12. తల్లిపాలు సురక్షితమైనవి రోజులో 24 గంటలూ తల్లిపాలు లభిస్తాయి.

13. తల్లిపాలలో శిశువులకు కావలసిన అన్ని పోషక పదార్థాలన్నీ పూర్తి మోతాదులో ఉంటాయి.

14. శిశువునకు కావలసిన ఉష్ణోగ్రతలో ఉంటాయి.

15. బిడ్డ కోరుకున్న ప్రతిసారి పగలైనా, రాత్రైనా తల్లిపాలు పట్టాలి. బిడ్డ ఎంతసేపు పాలు త్రాగుతుంటే

అంతసేపు తాగిస్తుండాలి.

16. తల్లిపాలు తాగే పిల్లలు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశం (సడన్‌ ఇన్‌ ఫాంట్‌ డెత్‌ సిండ్రోం) తక్కువని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.

17. తల్లిపాల వలన పోషకాహార లోపాలు తగ్గి 13 శాతం శిశుమరణాలరేటు తగ్గించవచ్చు. (మనదేశం, రాష్ట్రంలోనే శిశుమరణాలు అధికం)

18. శిశువులు అనారోగ్యంగా ఉన్నా తల్లిపాలు పట్టాలి.

19.మండువేసవిలోనైనా (నాలుక పిడచకట్టుకుపోయే వేసవిలోనైనా) శిశువుకు ఎలాంటి నీరు పట్టనవసరం లేదు. ఎందుకంటే తల్లిపాలలో 90 శాతం నీరు ఉంటుంది. తల్లిపాలు త్రాగే శిశువులకు తల్లి పాల నుండి తగినంత నీరు లభిస్తుంది.

20. శస్త్రచికిత్స ద్వారా (సిజేరియన్‌) పుట్టిన పిల్లలకు కూడా వెంటనే తల్లిపాలు పరిశుభ్రమైన గిన్నెలో ప పిండది చెంచాతో లేదా ఉగ్గుగిన్నెతో పట్టించాలి.

21. శిశువుకు తల్లిపాలు ఇచ్చే టప్పుడు సరైన రీతిలో ఇవ్వాలి.

22. ఉద్యోగినులైతే శిశువుకి కనీసం నాలుగు గంటకొకసారి పాలివ్వాలి.

23. బిడ్డల్ని వదిలి కూలి పనికి వెళ్లే తల్లులు తమ పాలను ఒక పరిశుభ్రమైన గ్లాసులో పిండి 8 గంటలలోగా ఆపాలను శిశువులకు చెంచాతోగానీ లేదా ఉగ్గుగిన్నెతోకాని పట్టవచ్చును.

24. తల్లిబిడ్డకు పాలివ్వడం వలన మొదటి 6నెలలలోపు అండం విడుదల కానందున గర్భం దాల్చే అవకాశం లేదు. తల్లికి సహజ కుటుంబ నియంత్రణ పద్ధతిగా ఉపయోగపడుతుంది. ఈ పద్థతినే ''లాక్టేషనల్‌ ఎమోనోరియా లేదా లామ్‌' అని అంటారు.

25. పిల్లలకు పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడరాదు.

26. ఒక తల్లి మరో బిడ్డకు అత్యవసరమైన సమయాలలో పాలు పట్టించవచ్చును.

27. దీర్ఘకాల వ్యాధులు ఉన్న తల్లులు వైద్యులు సలహామేరకు శిశువులకు పాలివ్వాలి.

28. హెచ్‌.ఐ.వి. ఇన్‌ఫెక్షన్‌ ఉన్న తల్లులు పోతపాలు సురక్షితంగా ఇవ్వలేనప్పుడు కేవలం తమ పాలను 6నెలల వరకు శిశువులకు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం. ఎట్టి పరిస్థితులోనూ కలగలుపు (మిక్స్‌డ్‌) ఫీడింగు ఇవ్వకూడదు. ఏదో ఒక్కపాలుమాత్రమే ఇవ్వాలి.

29. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు ప్రకారం శిశువుల గరిష్ఠ పెరుగుదలను మానసికాభివృద్దిని ఆరోగ్యాన్ని సాధించాలంటే వారికి మొదట 6 నెలలపాటు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి.

30. కేవలం తల్లిపాలను మాత్రమే తాగించడం శిశువు జీవితానికి శుభారంభం పలుకుతుంది. అవి వారిని చురుగ్గా చేసి; మేథా ప్రతిభను పెంచుతుంది.

31. ఆరునెలల తర్వాత ఎదుగుతున్న శిశువు, పెరుగుతున్న అవసరాలు తీర్చడం కోసం శిశువులకు ఇష్టపూర్వ కమైన ఇంట్లోనే లభ్యమయ్యే పౌష్ఠిక విలువలున్న ద్రవ /ఘణ అనుబంధ ఆహారాన్ని ఇస్తూ... రెండు సంవత్స రాల వరకు తల్లిపాల పోషణను కొనసాగించాలి. అనుబంధ ఆహారాన్ని తయారు చేయడంలోనూ, తినిపించడం లోనూ పరిశుభ్రతను పాటించాలి.

ఉభయులకు లాభదాయకమే : తల్లిపాలవల్ల శిశువుకే కాదు...తల్లికి కూడా అనేక లాభాలు ఉన్నాయి. కొన్ని రకాల (ఉదాహరణకు : రొమ్ము గర్భసంచి, అండాశయం మొదలగు క్యాన్సర్లు) క్యాన్సర్లు తక్కువగా వస్తాయని, అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రసవ సమయంలో స్థిరత్వం కోల్పోయిన గర్భసంచి పూర్వ స్థితికి వచ్చి అధిక రక్తస్రావం తగ్గడం, శిశువుకు తల్లిపాలతోనే పెంచినట్లయితే హార్మోన్లు ప్రభావంతో 6 నెలల వరకు అండం విడుదల కానందువలన గర్భధారణ జరుగదు కాబట్టి తల్లికి ఇది తాత్కాలిక కుటుంబ నియంత్రణగా ఉపయోగపడుతుంది. (ఈ పద్థతినే ''లాక్టేషనల్‌ ఎమోనోరియా లేదా లామ్‌'' అని అంటారని వరుసక్రమం 24లో ముందే చదువుకున్నాము)

తల్లిపాల సంస్కృతి ఒక సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించి తల్లిపాల సంస్కృతిని పెంపొందించుకోవాలి.

Post
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment