కొండవీడు కోట | Kondaveedu Fort | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

హిమాలయాలు కాదు, తిరుమల కాదు... 
ఈ ఘాట్ రోడ్ మన గుంటూరులో...

    కొండవీడు కోటకు ఎంత చారిత్రక నేపధ్యం ఉందో అందరికీ తెలిసిందే. మన ప్రాచీన చరిత్ర, సంపదలకు నిలువెత్తు సాక్ష్యం ఈ కొండవీడు కోట. 1700 అడుగుల ఈ కొండ శత్రు దుర్భేద్యంగా ప్రసిద్ధి చెందింది. కొండవీడును శతృ దుర్బేధ్యమైన రాజ్యంగా తీర్చిదిద్దడమేగాకుండా, ప్రజాకాంక్ష పాలనను కొనసాగించిన ఘనత రెడ్డిరాజులది. వారు కొండవీడుకోటను రాజధానిగా చేసుకుని క్రీ.శ. 1325 నుంచి 1420 వరకు పరిపాలించారు. 

     ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోటను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. 2007లో ఘాట్‌రోడ్‌ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాని ఎవరూ పట్టించుకోలేదు, అవి కాగితాలకే మిగిలిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత 2015లో ఘాట్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభయ్యాయి. ఇప్పుడు పనులు దాదాపుగా అయిపోయాయి.

కొండవీడు కోట | Kondaveedu Fort | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


కొండవీడు కోట | Kondaveedu Fort | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


కొండవీడు కోట | Kondaveedu Fort | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu





కొండవీడు కోట | Kondaveedu Fort |కొండవీడు కోట | Kondaveedu Fort | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

కొండవీడు కోట | Kondaveedu Fort | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


     గుంటూరు నగర గొప్ప చారిత్ర లో భాగం ఈ కొండవీడు ఫోర్ట్. నగరనికి 12 మైళ్ళ దూరం లోని శివార్లలో ఉన్న ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గాలు ఉన్నాయి. 14 వ శతాబ్దం లో రెడ్డి రాజుల పాలనలో ఈ చారిత్రిక కట్టడాన్ని నిర్మించారు. ఈ ఫోర్ట్ లో 21 నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలు చాలా శాతం శిధిలం అయినప్పటికీ ఈ కోట రహస్యాల గురించి చెప్పకనే చెపుతాయి. ఈ ఫోర్ట్ ని కట్టిన సుందర ప్రదేశ అందాలను చూసి ఆనందించటానికి చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. అంతే కాక ఈ ప్రదేశం ట్రెక్కింగ్ ఇంకా హైకింగ్ కి అనువుగా ఉంటుంది. గోపినాథ టెంపుల్ మరియు కత్తులబావి టెంపుల్ ఈ ఫోర్ట్ కి చాల ఈ దగ్గర గా ఉన్న దేవాలయాలు. 

    ఈ దేవాలయాలు ఇతర అనేక దేవాలయాల దారిలో ఉన్నాయి. ఈ కోటకు చేరే దారి ముఖద్వారం , ఈ కోటని నిర్మించిన కొండ దిగువ భాగాన ఉంటుంది. ఈ దారితోబాటు , ఈ కోట నివాస సౌధాలు ఇంకా ఇక్కడి పెద్ద హాలు కుడా ఈ ప్రదేశ చరిత్రకి సాక్షాలు గా అనిపిస్తాయి. మనం ఈ రోజు కత్తులబావిగా చీకటికోనేరుగా, గోపీనాథ్ ఆలయంగా మరియు శివాలయంగా చెప్పుకునే ఆ దేవాలయం యొక్క శిల్ప సౌందర్యం గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం. 

     1. ఎక్కడ వుంది? ఇది ప్రపంచ పర్యాతకకేంద్రంగా మారబోతున్న కొండవీడు ఫోర్ట్ లో వుంది. ఇది గుంటూరుకు 24 కి.మీ ల దూరంలో వుంది. ఫిరంగి పురం నుండి ఖచ్చితంగా 5 కి.మీ ల దూరంలో వుంటుంది. 

2. ఈ గుడికి చాలా పేర్లు వున్నాయి గోపీనాథ్ ఆలయం అనీ, కత్తులబావి అనీ మరియు చీకటికోనేరు అనీ మరియు శివాలయం అనీ స్థానికులు పిలుస్తారు. 

3. నిర్మాణం ఇది ఎప్పుడు నిర్మాణం జరిగిందో చరిత్రలో లిఖితపూర్వక ఆధారాలు లేనప్పటికీ ఇది 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల నిర్మాణంలో జరిగిందని కొంత మంది 16 వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య సమయంలో నిర్మాణం జరిగింది అని కొంతమంది చెప్పుకుంటారు. 

4. శిల్పకళ ఈ గుడి పై శిల్పకళ చాలా అద్భుతంగా వుంటుంది. ఈ దేవాలయం గోడలపై కొన్ని దేవతల శిల్పాలు వుంటాయి. ఆనాటి శిల్పులు ఆ శిల్పాలను ఎంతో శ్రద్ధతో చెక్కినట్లు మనకి కనిపిస్తాయి. 

5. ఈ దేవాలయానికి కత్తులబావి అని ఎందుకు పేరు వచ్చిందంటే రెడ్డిరాజులు కత్తుల బావి ద్వారా కుట్రతో చంపబడ్డారు అని స్థానికులు చెప్పుకుంటారు. 

6. ఆశ్చర్యపరిచే దేవాలయ నిర్మాణం ఈ దేవాలయ నిర్మాణం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ దేవాలయం చూడటానికి చాలా మంది టూరిస్టులు వస్తున్నారు. 

7. పురాతన గొప్ప శిల్పసంపద పురాతన గొప్ప శిల్పసంపదలో మన ఇండియాలో చాలా గుడులు వున్నాయి.అందులో ఈ గోపీనాథ్ ఆలయానికి ప్రత్యేక స్థానం వుంది అనటంలో ఆశ్చర్యమేమీలేదు.

 8. రెడ్డి రాజులు రెడ్డి రాజులకాలంలో కుమార గిరి పాలనలోని గొప్ప రాజ నర్తకి లకుమాభాయి ఈ దేవాలయంలో నాట్యం చేసినట్లు చెప్పుకుంటారు. 

9. శిలా శాసనాల ఆధారాలు ఆనాటి శిలా శాసనాల ఆధారాలు మనకి ఈ దేవాలయంలో కనిపిస్తాయి. 

10. పర్యాటకుల ఆకర్షణ ఈ దేవాలయం చూసినవాళ్ళు అక్కడ నుంచి రానంతగా పర్యాటకులను ఈ దేవాలయం ఆకర్షిస్తుంది.

 11. దేవాలయ సంరక్షణ ఈ దేవాలయాన్ని సంరక్షించి మరమ్మత్తులు చేయటం ద్వారా మన చరిత్రను కాపాడుకున్నవాళ్ళం అవుతాము.

 12. రమణీయ వాతావరణం ఈ దేవాలయం ఎదురుగా కొండలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది.ఇక్కడ వాతావరణం ఆహ్లాదంగా మరియు దగ్గరలో కొండవీడు బురుజును చూట్టానికి చాలా రమణీయంగా వుంటాయి. 

13. యాగశాల ఈ దేవాలయం ఎదురు ఒక దీపపు స్థంభం వుంది మరియు గుడి ఎదురు ఒక యాగశాల వుంది.ఇక్కడ యాగాలు చేసారు అనటానికి ఇక్కడ కనపడేదే సాక్ష్యం. 

14. దుండగులు కొందరు దుండగుల కారణంగా ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. 

15.భావితరాల వారు మన భావితరాల వారికి ఈ శిల్ప సంపద గొప్పతనాన్ని తెలియజేసిన వాళ్ళమవుతాము. 

16. ఇక్కడికి దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు కోటప్ప కొండ గుంటూరు నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, నైరుతి దిక్కున ఉన్నది కోటప్పకొండ. నరసరావుపెట కి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశానికి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు.ఈ గ్రామము మొదట కొండకావూరు అని పిలవబడేది , తర్వాత కోటప్పకొండ గా మారింది. కోటప్పకొండ కి త్రికూట పర్వతం అనే మరో పేరుకూడా ఉన్నది. దీనికి కారణం ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న మూడు శిఖరాలు. 

17. ప్రకాశం బారేజ్ గుంటూరు, విజయవాడ అలాగే పరిసర ప్రాంతాల రైతుల పొలాలకి ప్రధాన నీటి పారుదల వనరు గా ఈ ప్రకాశం బారేజ్ ని పేర్కొనవచ్చు. నిజానికి, ఈ బారేజ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక వ్యవ్యస్త ఎక్కువగా వ్యవసాయం మీద ఆధార పది ఉండడం వల్ల ఈ బారేజ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రుణపడి ఉంది. ఈ బారేజ్ నిర్మాణం వల్ల ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏర్పడిన అందమైన సరస్సులు ఎంతో మంది పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తున్నాయి. 

18. ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ గుంటూరు నగర శివారు కి నాలుగు కిలోమీటర్ల దూరంలో దక్షిణ ప్రాంతంలో ఈ ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ ఉంది. వాటర్ ట్యాంక్ ల కి ప్రసిద్ద మయిన ఈ ప్రాంతం ఎన్నో పెద్ద సంఖ్యలో వలస పక్షులని ఆకర్షిస్తోంది. అద్భుతమైన, అరుదైన అంతర్జాతీయ జాతులకి ఈ ప్రాంతం స్థావరం. 

19. ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ స్పాట్ బిలేడ్ పెలికాన్స్ అలాగే పెయింటెడ్ స్తార్క్స్ వంటివి ఇక్కడ కనిపిస్తాయి. ఇంతకు పూర్వం ఈ ప్రాంతానికి దాదాపు 12000 పక్షులు సందర్శించేవి. ఇప్పుడు వాటి సంఖ్యా 7000 లకి పడిపోయింది. గ్లోబల్ వార్మింగ్ వంటి కొన్ని కారణాల వల్ల ఈ సంఖ్య తగ్గిపోయిందని భావించవచ్చు. 

20. ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ అయినా, ప్రతి సంవత్సరానికి ఇక్కడికి విచ్చేసే పర్యాటకుల సంఖ్య్హ మాత్రం తగ్గలేదు. పక్షి ప్రేమికులు ఈ ప్రాంతంలో కనిపించే అరుదైన పక్షుల కోసం వస్తారు. మార్చ్ నుండి ఏప్రిల్ వరకు ఉప్పలపాడు నేచర్ కన్సర్వేషన్ పార్క్ ని సందర్శించేందుకు అనువైన సమయం. ఎందుకంటే, ఈ సమయంలోనే అరుదైన వలస పక్షులు కనువిందు చేస్తాయి. 

21. మంగళగిరి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న గుంటూరు జిల్లాలో ఉన్న ఈ మంగళగిరి ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం గుంటూరు నగరం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం గుంటూరు అలాగే విజయవాడ ప్రాంతాల కి ఒక ప్రధాన పర్యాటక మజిలీ. 'మంగళగిరి' అంటే అర్ధం పవిత్రమైన కొండ. నూలు వస్త్రాలకి అలాగే ఎన్నో ఆలయాలకి ఈ మంగళగిరి ప్రాంతం ప్రసిద్ది.

 22. మంగళగిరి ప్రఖ్యాతమైన లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఈ గ్రామం లో నే ఉంది. ఏంతో మంది భక్తులు స్వామీ వారి దర్శనార్ధం ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. ఒక కొండపైన ఈ ఆలయాన్ని నిర్మించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కొండ ఒక అగ్ని పర్వతం గా ఉండేది. సముద్ర మట్టం నుండి 30 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. స్వామి వారికీ పానకాన్ని నైవేద్యంగా అర్పిస్తారు. 

23. ఎలా చేరాలి? హైదరాబాద్ నుండి కొండవీడు ఫోర్ట్ కి నల్గొండ మీదుగా నైతే 5 గంటల 28నిలు పడుతుంది. 

24. విజయవాడ మీదుగా సూర్యాపేట, విజయవాడ మీదుగానైతే 6 గంల 16ని లు పడుతుంది. మీరు మధ్యలో విజయవాడలో దిగి కనకదుర్గమ్మను కూడా దర్శించుకోవచ్చును.  MORE.....





ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment