ప్రపంచ హెపటైటిస్‌ దినం | World Hepatitis Day | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu | BhakthiBooks | MohanBooks | World Hepatitis | Hepatitis Day | Liver | Liver Damage | World Liver Day | Liver Infections | Liver Treatment Hepatitis A | Hepatitis B | Hepatitis C | Hepatitis Vaccine |


నిర్లక్ష్యం చేస్తే కాలేయం ఖరాబే!
చాపకింద నీరులా విస్తరిస్తున్న హెపటైటిస్‌
అప్రమత్తతతోనే వైరస్‌కు దూరం
నేడు ప్రపంచ హెపటైటిస్‌ దినం


నిశ్శబ్దంగా కాలేయాన్ని(లివర్‌)ను దెబ్బతీసే హెపటైటిస్‌ వైరస్‌ నగరంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. కాలేయ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వారిలో 30 శాతం మంది హెపటైటిస్‌ రోగులే. ఉస్మానియా ఆసుపత్రిలోని గాస్ట్రోఎంటరాలజీ విభాగానికి వచ్చే ఔట్‌ పేషెంట్లలో 10 శాతం మంది హెపటైటిస్‌ వైరస్‌తో బాధపడుతున్నారు. జులై 28న ప్రపంచ హెపటైటిస్‌ దినం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం...
మానవ శరీరంలోని కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపే శక్తి దీని సొంతం. హెపటైటిస్‌ వైరస్‌ల కారణంగా లివర్‌కు ముప్పు వాటిల్లుతోంది. అయితే అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల దీని బారిన పడకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. హెపటైటిస్‌లో ఎ, బి, సి, ఈ వైరస్‌లు ఉంటాయి. ఇందులో ఎ, ఈ వైరస్‌ల వల్ల పెద్దగా ప్రమాదం లేదు. కలుషిత జలం, ఆహారం తీసుకుంటే హెపటైటిస్‌ ఎ, ఈ వచ్చే అవకాశం ఉంది. సాధారణ పచ్చకామెర్లు ఈకోవలోకి చెందినవే. వైద్యుల సూచనలతో మందులు, తగినంత విశ్రాంతి తీసుకుంటే ఎ, ఈ వైరస్‌లు తగ్గిపోతాయి. హెపటైటిస్‌ వైరస్‌ల్లో ప్రమాకరమైనవి బి, సి లే.

ఇలా చేస్తున్నారా?: ఇప్పటికే శరీరంలోని హెపటైటిస్‌- బి వైరస్‌ ఉన్న వ్యక్తుల రక్తం, శారీరక స్రావాల ద్వారా ఇతరులకు ఈ వైరస్‌లు సోకే ప్రమాదం ఉంది. అరక్షిత శృంగారం, కలుషిత ఇంజక్షన్‌, ఇతరులు వాడిన రేజర్లు, బ్లేడ్లు, టూత్‌బ్రెష్‌లు, నెయిల్‌ క్లిప్పర్లు వంటి ద్వారా ఇతరులకు ఈ వైరస్‌ సక్రమిస్తుంది. హెపటైటిస్‌-సి ప్రధానంగా రక్తం ద్వారా ఇతరుల శరీరంలోకి వ్యాప్తి చెందుతుంది. రక్తం ఎక్కించేటప్పుడు గుర్తింపు ఉన్న బ్లడ్‌ బ్యాంకు నుంచి తీసుకోవాలి. డెంటిస్టుల వద్దకు వెళ్లినప్పుడు, ఆక్యుపంక్చర్‌ చికిత్స తీసుకున్నప్పుడు ఇతరుల వాడిన పరికరాలు, సూదులు మళ్లీ వాడకుండా చూసుకోవాలి. టాటూలు వేసేందుకు వాడే సూదుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బి వైరస్‌.. హెచ్‌ఐవీ కంటే 50-100 రెట్లు ఇన్‌ఫెక్షన్‌ కారకం. కొందరిలో ఒంట్లో ఈ వైరస్‌ ఉన్న జీవితాంతం ఎలాంటి లక్షణాలు బయట పడవు. కొందరిలో మాత్రం లివర్‌ కేన్సర్‌కు కారణమవుతుంది. సి వైరస్‌ సోకితే 70-80 శాతం మందిలో ఒంట్లో ఉండిపోయి దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా మారే అవకాశం ఉంది. బి మాదిరిగా వేగంగా ముదరదు.

ఈ లక్షణాలుంటే..: హెపటైటిస్‌ సోకితే రోజులు, నెలల్లోనే లక్షణాలు బయటపడతాయి. ఆకలి తగ్గి తరచూ వాంతులు, జ్వరం వస్తుంది. కళ్లు, మూత్రం, చెమట, కాలి, వేలి గోళ్లు పసుపు రంగులోకి మారతాయి.

వైరస్‌కు వ్యాక్సిన్‌
డాక్టర్‌ భవానిరాజు, గాస్ట్రోఎంటరాలజిస్టు, కేర్‌
హెపటైటిస్‌ బి వైరస్‌కు ప్రస్తుతం వ్యాక్సిన్‌ ఉంది. పుట్టిన పిల్లలకు ఈ టీకా తప్పనిసరి. తల్లికి హెపటైటిస్‌-బి వైరస్‌ ఉంటే పుట్టే బిడ్డకు సోకే ప్రమాదం ఉంది. హైపటైటిస్‌- బి, సి ఉన్నవాళ్లు ఇతరులకు రక్తదానం చేయరాదు. వారి కుటుంబ సభ్యులంతా వ్యాక్సిన్‌ తీసుకోవాలి. తరచూ పరీక్షలు చేసుకుని చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే రెండోదశలో కాలేయం బాగా గట్టిపడుతుంది. సామర్థ్యం తగ్గి రక్తంతో కూడిన వాంతులవుతాయి. క్రమంగా లివర్‌ కోమా, లివర్‌ కేన్సర్‌కు దారి తీస్తుంది. ఈ పరిస్థితిలో కాలేయ మార్పిడి ఖర్చు సామాన్యులు భరించలేరు. సి వైరస్‌కు టీకా లేదు.
50 శాతం పైనే వారే
డాక్టర్‌ మధుసూదన్‌, హెచ్‌వోడీ,
ఉస్మానియా గాస్ట్రోఎంటరాలజీ విభాగం
గతంలో పోల్చితే ఉస్మానియాకు వచ్చే హెపటైటిస్‌ రోగుల సంఖ్య పెరుగుతోంది. బాధితుల్లో 35-40 ఏళ్ల వారు 50 శాతం మంది వరకు ఉంటున్నారు. ప్రస్తుతం 100 మంది కాలేయ మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు. వ్యాధి ముదిరిన తర్వాత చాలామంది వైద్యులను సంప్రదిస్తున్నారు. ఫలితంగా లివర్‌ పాడయ్యే దశకు చేరుకుంటున్నారు. ఈ సమయంలో లివర్‌ను మార్చాలంటే చాలా క్లిష్టమైన పని. లక్షణాలు కన్పించిన వెంటనే చికిత్స తీసుకుంటే ఈ వైరస్‌ల నుంచి బయటపడవచ్చు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment