వేద సూక్తములు | Veda Suktamulu |
వేద సూక్తములు 
Veda Suktamulu 
Rs 108/-

ఆర్షధర్మాల్లో అభ్యుదయ భావాలు
నిరంతర పరిణామశీలమైన ఈ సృష్టిలో అభ్యుదయభావన అనంతంగా ఉంది. మొదటి నుంచీ మానవుడు తానున్న స్థితి నుంచి ఉన్నత స్థితిని పొందడానికి, అభ్యుదయాన్ని అందుకోవడానికి తీరని ఆరాటంతో ఆరని పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆ అభ్యుదయ భావకుసుమాల వికాసానికి అడ్డు తగిలే ప్రతీపశక్తుల ప్రతాపాన్ని యథాశక్తిగా ఎదిరిస్తూనే ఉన్నాడు. పక్షపాతం లేకుండా పరిశీలించగలిగితే.. రుషుల పంథాలో, ప్రాచ్యుల భావనాలోకంలో ఈ అభ్యుదయ భావన నిరంతర స్రవంతిగా ప్రవహిస్తూనే ఉందని తెలుస్తుంది. ఆదికావ్యమైన రామాయణంలో మానవ ప్రయత్నానికి ఇచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనం ఈ పద్యం..\
దైవం పురుషకారేణ
య స్సమర్థః ప్రభాదితుం
న దైవేన విపన్నార్థః
పురుషస్సో వసీదతి
దృఢతరమైన ప్రయత్నం చేత ఎవరు అదృష్టాన్ని దెబ్బతీయగలుగుతారో వారు ఎన్నడూ విపన్నులు కారని తెలిపే శ్లోకమిది. ఆర్షధర్మంలో పురుషప్రయత్నానికి ఉండే ప్రాధాన్యాన్ని అద్దం పట్టి చూపిస్తోంది. అలాగే, కకులాల సంకుల సమరంతో పాపపంకిలమైపోయిన సమాజానికి కులాల నిష్ప్రయోజకత్వాన్ని ఆర్షధర్మం ఎంత సూటిగా తెలియజేస్తోందో చూడండి..
కిం కులేన విశాలేన
శీలమేవాత్ర కారణం
కృమయః కిం న జాయంతే
కుసుమేషు సుగంధిషు
సుగంధ బంధురాలైన సుమసముదాయం నుంచి దుర్గంధకారకాలైన పురుగులు పుట్టడం లేదా? కులం ప్రధానమా.. గుణం ప్రధానంగానీ! అని ఈ శ్లోకం ఎలుగెత్తి చాటుతుంటే ప్రాచీన సంస్కృతి అంతా కులమతాలతో పాచిపట్టిందేనని మనం గొంతు చించుకోవడం ఎందుకు?
- గరికిపాటి నరసింహారావు
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment