Obesity | ఒబెసిటి | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

Obesity 
ఒబెసిటి
 లావు బరువు తగ్గడం ఎలా ?
Rs 108/-

సులభంగా అధిక బరువు తగ్గేందుకు చిట్కాలు

     ప్రస్తుతకాలంలో చాలా మంది అధిక బరువు సమస్య తో భాదపడుతున్నారు. మనం ఆరోగ్యం గా ఉండాలంటే బరువు ని నియంత్రణ లో ఉంచుకోవడం తప్పనిసరి. బరువుని తగ్గించుకోవటం అనేది చాలా కష్టం తో కూడుకున్న పని. పూర్వం రోజుల్లో శారీరిక శ్రమ ఎక్కువగా ఉండటం వలన వాళ్ళు వ్రుదాప్యం లో కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మనం పని త్వరగా అవ్వటానికి ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం వలన శారీరిక శ్రమ తక్కువనే చెప్పాలి.

   శారీరిక శ్రమ లేకపోతే బరువు పెరగడం జరుగుతుంది. మనం ఆహారం తినటం మానివేసినప్పటికి కొన్ని సార్లు బరువు తగ్గదు. దానికి కారణం మనం తీసుకునే ఆహార పదార్థాలు కావొచ్చు, శ్రమ తగ్గడం కావొచ్చు, ఆరోగ్య సమస్యలు కూడా కావొచ్చు. మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఈ క్రింద తెలిపిన సూచనలను పాటిస్తే కేవలం 15 రోజుల్లో మీ శరీర బరువు తగ్గించుకోవచ్చు.
అధిక బరువుతో బాధపడే వారు పాటించవలసిన చిట్కాలు మరియు ఆహార అలవాట్లు:

    ఎక్కువ మంచి నీరు తాగండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా బరువు తగ్గించటం లో ఇది ఎంతగానో సహాయపడుతుంది.
రోజూ తప్పనిసరిగా 40 నిముషాల పాటు వ్యాయామం చేయాలి. మీరు చేసే వ్యాయామాన్ని బట్టి ఎన్ని క్యాలరీలు ఖర్చవుతాయో చూసుకుని, మీరు తీసుకునే ఆహారం తో వచ్చే క్యాలరీలు దాన్ని మించకుండా చూసుకోండి.
పండ్లు, పచ్చి కూరగాయలు తినడం వల్ల కూడా అధిక బరువు తగ్గటానికి సహాయపడతాయి. బాదం, ముడి ధాన్యాలు, గ్రేప్ ఫ్రూట్ వంటివి బరువు తగ్గిస్తాయి.
మనం తినే ఆహారంలో ఉప్పు, చక్కెర వాడకం తగ్గించుకోవాలి.
“గ్రీన్ టీ” బరువు తగ్గించుకోవటం లో ఎంతో తోడ్పడుతుంది.
ప్రొటీన్లు, పీచు అధికముగా ఉన్న పదార్దాలు తీసుకోవదం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.
ఆహారం తినే అరగంట ముందు నీరు తీసుకుంటే మంచిది.
ఆహారాన్ని ఎక్కువ సేపు నమిలి మింగండి.
రోజు కి 8 గంటల నిద్ర తప్పనిసరి.
ధూమపానం, మద్యపానం అలవాట్లను మానివేయాలి.
ఎక్కువగా తాజా పండ్లను, కూరగాయలను తీసుకుంటే మంచిది. రెఫ్రిజరేటర్ లో నిల్వ ఉంచుకుని తినకూడదు.
టీ, కాఫీ, చల్లటి పానీయాలను(కూల్ డ్రింక్స్) మానేయాలి.
















ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment