How to identify gupta nidhi? || treasure hunt   Hidden Treasures Mysterious (Elusive) Secrets (Mystery) Revealed In Telugu   గుప్తనిధులు ఉన్నాయని తెలిపే సంకేతం ఏంటో తెలుసా | Gupta Nidhi Signs నిధుల రహస్యాలు | nidhulu rahasyalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

ప్రాచీన తాంత్రిక గ్రంథాలలో వివరించిన
 నిధుల రహస్యాలు

    నిధి అనగానే చాలమంది బంగారం , వజ్రాలు అని మాత్రమే అనుకుంటారు. అంతకంటే విలువయిన సంపద అనగా వైద్యానికి , మంత్రశాస్త్రానికి మరియు తంత్రశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు రాసి ఉన్న తాళపత్ర గ్రంథాలు, రాగిరేకులు పైన చెక్కినటువంటి ఎంతో విలువైన విషయాలు కొన్నికొన్ని రహస్య ప్రదేశాలలో ఈ భూగర్భంలో దాచబడి ఉన్నాయి. అవి వెలికి తీసి అందులో ఉన్న విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు . ధనం ను కూడా భూగర్భం నందు దాచిన దానిని కూడా నిధి అంటారు.

     నిధులు అనేవి ముఖ్యంగా మూడు రకాలుగా దాచబడి ఉంటాయి. అందులో మొదటి దాని గురించి చెప్పాలి అంటే జనం దాచుకున్న సోమ్ము . ప్రాచీన కాలంలో ఇప్పటిలా బ్యాంకులు ఉండేవి కావు. ఆ సమయంలో జనం ఇళ్లల్లో , పొలాల్లో తమకు తెలిసిన ప్రదేశాలలో తమ దగ్గర ఉన్న బంగారాన్ని కుండలలో పెట్టి దాచేవారు . అదే సమయంలొ అంటువ్యాధులు చాలా తీవ్రంగా ఉండేవి . మొత్తం వూరిలో శవాన్ని తీయుటకు మనుషుల కూడా లేకుండా మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలా మరణించుటకు కారణం అయ్యే వ్యాధి పేరు "కలరా" అవి అలా ఉండిపోయి అప్పుడప్పుడు బయటపడుతుంటాయి.

     ఇక మనం రెండోవరకం నిధుల గురించి తెలుసుకుందాం . ఈ నిధులు గజదొంగలు వూర్లపైన పడి దోచుకొని కొండ గుహలలో దాచి ఉంచే నిధి . ఈ దాచి ఉంచిన స్థలం వారు మధ్యలో మరణిస్తే వారితోనే అంతం అయిపోతుంది. 

     మూడో రకం నిధుల గురించి చెప్పలంటే వీటిని రాజ నిధులు అంటారు. ఇవి పూర్తి ఉద్దేశ
పూర్వకంగా అత్యంత రహస్య ప్రదేశాలలో మంత్ర,యంత్ర పూజా సమేతంగా నిక్షిప్తం చేస్తారు . ఈ పూజకొరకు చాలా శక్తిమంతం గా ఉండే అస్ఖలిత బ్రహ్మచారులు ను ఉపయోగిస్తారు . ఎక్కువుగా పక్క రాజ్యాల దండయాత్రల సమయంలో ముఖ్యంగా మనదేశంలో బ్రిటిష్ వారి నుంచి తమ రాజ్య ఖజానా కాపాడుకొనుట కొరకు రాజులు ఈ పద్దతి పాటిస్తారు. ఈ పద్దతిలో రాజు ఎక్కడో ఒకచోట ఈ నిధి గురించిన రహస్యాన్ని పేర్కొంటాడు . అటువంటి కొన్ని మ్యాప్స్ నేను పరిశీలించాను .

    ఈ శక్తిమంతం అయిన మంత్రపూర్వకంగా దాచి ఉంచిన నిధులను మాంత్రిక , తాంత్రిక వేత్తలు 4 రకాలుగా వర్గీకరించారు వీటి గురించి శ్రీకంఠ శంభునాథ సిద్దుడు రచించిన "నిధిప్రదీపం" అను గ్రంథం నందు చాలా వివరంగా తెలియజేశాడు . ఈ బుక్ సంస్కృతంలో 1930 లో ముద్రించబడినది.

శివుడు ఉపదేశించిన ప్రకారం ఈ నిధులు అనేవి 4 రకాలు . అవి
* కచ్చప .
* మకర .
* శంఖ .
* పద్మ .
    వీటిలో కచ్చప , మకర నిధులు మాత్రమే స్థిరంగా , అచంచలంగా ఒకేచోట ఉండును. వీటిని ప్రయత్నముచేత , శివానుగ్రహము చేత మాత్రమే పొందగలరు .

    మిగిలిన శంఖ, పద్మ నిధులు అనేవి మానవుని శబ్దం వినపడిన వెంటనే చంచలమై వేరొక స్థానమునకు వెళ్లిపోవును .వీటిని సాధించుట అసంభవం . శివ, విష్ణు , అమ్మవారి మంత్రముల సిద్ధి పొందిన వారికి మాత్రమే అవి లభ్యం అగును.

నిధులు ఉన్న ప్రదేశాలను గుర్తించుటకు కొన్ని గుర్తులు -

* ఏ ప్రదేశం నందు భూమి నుంచి తామర పువ్వుల వాసన వచ్చుచుండునో ఆ స్థలం నందు నిధి ఉండును అని తెలుసుకొనవలెను .
* డేగలు , కాకులు , కొంగలు ఏ ప్రదేశం నందు ఎక్కువ గా సంచరించుచుండునో ఆ స్థలం యందు నిధి ఉండును.
* కాకులు విశేష ప్రీతితో సంభోగం చేయుచుండునో అక్కడ నిధి ఉండును.
* ఒక ప్రదేశం నందు అనేక వృక్షాలు ఉన్నను ఒకే చెట్టు పైన పక్షులు అన్నియు కలిసి నివసించుచుండిన ఆ స్థలం నందు నిధి ఉండునని తెలుసుకొనవలెను .
* పురాతన దేవాలయాల యందు , పాడైపోయిన చెరువుల యందు , పాడిపడిన గ్రామాల యందు నిధి ఉండును.
* ప్రతినిత్యం పశువులు మేస్తున్ననూ తెల్లవారే సరికి మిగిలిన ప్రదేశం కంటే నిధి ఉన్న ప్రదెశం నందు గడ్డి తొందరగా పెరుగును .
* ఆకురాలు సమయంలో మిగిలిన చెట్ల ఆకులు ఎండిపోయినను ఏ చెట్టు ఆకులు కోల్పోకుండా పచ్చగా పుష్పాలతో వికసించి ఉండునో ఆ చెట్టు క్రింద తప్పక నిధి ఉండును.
పైన చెప్పిన విధముగా చాలా పద్ధతులు ఉన్నాయి . స్థలాభావం వల్లన వివరించలేకున్నా .

భూగర్బంలో ఉన్న నిధిని కనుగొనుటకు పురాతన పద్దతి -
    ఒక కొత్త కుండ నిండగా గోమూత్రం తీసుకుని నిధి ఉన్నది అనుకున్న ప్రదేశం నందు గోమూత్రంతో నింపి ఉన్న కుండను పాతిపెట్టి ఉంచవలెను . 7 రాత్రులు గడిచిన తరువాత ఆ కుండ పాతిపెట్టబడిన స్థలం నందు జాగ్రత్తగా తవ్విచూడగా ఆ కుండ యందలి గోమూత్రం హరించిపోయి ఆ కుండ శిదిలిం అయ్యి ఉన్నచో ఆస్థానమున నిధి ఉన్నదని గుర్తించవలెను.
రెండో పద్దతిలో మీకు వీడియో చూపిస్తాను. తప్పక చూడండి.

గమనిక -
   ఈ నిధుల వేటలో పడి చాలా మంది కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు . దయచేసి అత్యాశకి పోకండి .మీకు దక్కాలని రాసి ఉంటే ఆ సర్వేశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు .-కాళహస్తి వెంకటేశ్వరరావు
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment