ఏ దేవునికి ఎన్ని ప్రదక్షిణాలు చెయాలి | E Devuniki Enni Pradakshanalu Chayali | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
ఏ దేవునికి ఎన్ని ప్రదక్షిణాలు చెయాలి ?
E Devuniki Enni Pradakshanalu Chayali ?
Adipudi Sairam
Rs.36/-
దేవాలయం

   దేవాలయం గురించి ప్రతివారికి తెలుసు. దేవాలయంలో ఉండేవాడు దేవుడు. దేవాలయాన్ని దేహంతో పోల్చారు ప్రాచీన ఋషులు. దేహమే దేవాలయం అన్నారు. ఆ మాటే శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ‘ఇదం శరీరం కౌనే్తయ క్షేత్ర మిత్యభిధీయతే’. ఈ శరీరం క్షేత్రమని చెప్పబడుతున్నది అని అంటూనే ‘‘క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత’’ సర్వశరీరములలో ఒక్కడనే అయిన నేను క్షేత్రజ్ఞుడను అని అన్నాడు.

   మానవ హృదయాన్ని దేవాలయంగా, సత్యాలయంగా, ధర్మాలయంగా రూపొందించడానికి దేవాలయం పరమసాధనం. ఆలయాలు ఆధ్యాత్మిక శాస్త్భ్య్రాస కేంద్రాలు. సత్య విజ్ఞాన సాధనాలయాలు. జీవిత రహస్య పరిశోధనాశాలలు. మానసిక రోగ వైద్యశాలలు. మానవాత్మను జాగృతంచేసే మాతృ నిలయాలు. సహస్రాబ్దాలనాడు భారతీయ ఆధ్యాత్మికతను అధ్యయనం చేయడానికి, విజ్ఞాన శాస్త్రాన్ని ఆకళింపు చేసుకోడానికీ ప్రాచ్య, పాశ్చాత్య దేశాల నుండి ఎందరెందరో ఈ దేవాలయాలకు వచ్చేవారు. ఇపుడు కూడా మానసికాందోళన పడేవారు ఈ దేవాలయాలకు వెళ్లితే ప్రశాంత చిత్తులు అవుతారు. ఈ ఆలయాలే మనుషులకు విశ్వవిద్యాలయాలుఅంటుంది చరిత్ర.

    భారతీయ సంస్కృతిని పరిఢవిల్ల చేసినవి దేవాలయాలే. అంతేకాదు అనేక మంది మహానుభావులు ఉదాహరణకు శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ కంచర్లగోపన్న(రామదాసు), కులశేఖర ఆళ్వార్లు ఇలా ఏ దివ్యపురుషుడి జీవిత చరిత్ర చదివినా వారి నడయాడిన వారు సంచరించిన వారు దర్శించిన దేవాలయాలు మనకు కళ్లముందు కదలాడుతాయ. ఈ దేవాలయాలనుంచే వేదాలు వెలుగులు ప్రసరించాయి. వేద వాఙ్మయం వెల్లివిరిసింది. అతి గహనములైన జీవిత సత్యాలను ప్రపంచానికందించిన ప్రాంగణాలే ఈ దేవాలయాలు.

   సాధారణ మనిషికి దైవం పై నమ్మకాన్ని పెంచడానికి ఈ దేవాలయాలే పరమోన్నత స్థానాలు. దైవాన్ని సగుణ రూపంలో కాని, నిర్గుణ రూపంలో కాని చూడవచ్చునని ఉపనిషత్తులు వక్కాణిస్తున్నాయి. సగుణ రూపంలో దేవాలయాలలో దర్శనమిస్తున్నాడు. రూప సాధనాలంబనాలు మనస్సు పరమాత్మను అవగాహన చేసుకోడానికిదేవాలయాలు మంచి మార్గాలు. . ‘‘మనస్సుతో కూడిన విధానమంతా విగ్రహారాధనమే. మనోలయానంతరమే ప్రతీకాలంబనం పోతుంది’’ అంటారు త్రైలింగస్వామివారు. అంటే పరమాత్మను చేరుకోవడమే! విశ్వమంతా నిండి ఉండిన పరమాత్మను విగ్రహ రూపంలో దర్శిస్తున్నాడు మానవుడు. ఆలయం పండిత పామర ప్రయోజనకరం. మేధను మెరుగుపరచుకునే దొకరైతే, హృదయాలను సంస్మరించుకునేదొకరు. ఆ విధంగా గుడికీ, గుండెకు సంబంధం ఉంది. మనస్సునూ, హృదయాన్నీ సమన్వయ పరిచి ఆత్మవికాసం పొందడమే ఆలయ సేవలోని ఆంతర్యం. ‘‘దేహం-దేవాలయం’’, ‘‘జీవుడు-దేవుడు’’ అను ఉపనిషద్వచనాలకు గల అర్థాన్ని తెలుసుకుని అలా వర్తించడమే జీవిత పరమార్థం.అధో దృష్టిని నిర్మూలించి ఊర్ధ్వదృష్టిని ప్రసాదించడమే గోపుర నిర్మాణంలోని సందేశం. ఈ నిర్మాణంలో శ్రామిక పోషణ ఉన్నది. కళాపోషణ ఉన్నది. అన్నిటికీ మించి మానవుణ్ణి మాధవుని చెంతకు చేర్పించగల ధార్మికసేవ మిళితమై ఉన్నది.
అందుకే ప్రతివారు దేవాలయాన్ని దర్శించాలి. అందులోని రహస్యార్థాలను తెలుసుకోవాలి. *

---------------

     దేవాలయానికి చాలామంది వెళ్తుంటారు కానీ… కొందరే ఆ నియామాలు పాటిస్తుంటారు. అయితే అలా పాటించని వారిలో చాలామందికి ఆ నియమాలు తెలియకపోవడమే ప్రధాన కారణం. ఇందుకోసం కోవెలలో ప్రధానంగా పాటించవలసిన కొన్ని నియమాలను ఇప్పుడు చూద్దాం!

* దీపారాధన చేసేటప్పుడు కళ్లు మూసుకుని చేయకూడదు. ఆ దీపం నుండి వచ్చే కాంతిలో దేవుడిని కన్నుల తీరుగా చూడాలి.

* ధ్వజస్తంభం నుంచి కోవెల ప్రాకారం ప్రారంభమవుతుంది కాబట్టీ ముందుగా ధ్వజ స్తంభానికి నమస్కరించి తర్వాత కోవెలలోకి వెళ్లాలి.

* చండికేశ్వరుని ఆలయంలో మీ మీ దుస్తులకు ఉన్న దారపు పోగులను లాగడం, చేతులతో శబ్ధం చేయడం వంటివి చేయకూడదు.

* సదాశివ ధ్యానంలో చండికేశ్వరుడు ఉండటం వల్ల కుడిచేయి చూపుడు వేలు, మధ్య వేలు చాపి, మిగిలిన వేళ్లు మడిచి ఎడమచేతితో శబ్ధం రాకుండా తట్టాలి! దీనిని పూజతాళ ముద్ర అని అంటారు.

* వేకువ జామున విష్ణువుని, రాత్రి సమయంలో శివుని ధ్యానించడం మంచిది.

* శివున్ని వెలగ నూనే తో ఆరాధించడం శ్రేయస్కరం.

* కోవెలలోని కొలనులో కాల్లూ చేతులూ కడుగుకుని కోవెల లోకి వెళ్లడం ఎంత ముఖ్యమో… కోవెల నుండి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు కాల్లూ చేతులూ కడగకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. అలా చేయకపోతే దైవానుగ్రహం దక్కదు!

* దేవాలయంలో దేవుడికి మాత్రమే నమస్కరించాలి, ఆ ప్రాంగణంలో ఉన్నంత సేపూ ఎంత ముఖ్యులు, పెద్దలూ వచ్చినా కోవెలలో నమస్కరించకూడదు.

* కోవెలలో పురుషులు సాష్టాంగ నమస్కారము, స్త్రీలు పంచాంగ నమస్కారం చేయాలి. పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.

* కోవెలకు వెళ్లేటప్పుడు దగ్గర విభూది, కుంకుమ తప్పక ఉండాలి. వైష్ణవులు నామము తప్పక ధరించాలి. విభూది మొత్తము పూసి దాని కింద కుంకుమ దరిచాలి. విభూతిపైన కుంక్మ పెట్టకూడదు.

*తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా,ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.
*ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను(దీపారాధన) వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి.
*శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం .ఇవి చేస్తే మంచి జరుగుతుంది.
*ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.
*దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.
*దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.
*దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం ,స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.
*యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు.
*లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.
*శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.
*ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.
*తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.

*తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహమునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయానమందు స్పర్శ దోషం లేదు.
*ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి.
*శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి.
*విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.

*నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము (మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికి ప్రీతికరము.

*జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.

*స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.

*ప్రదక్షిణాలు: వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి
ఇటువంతి కొన్ని నియమాలు పాటించడం వలన మీరు చేసే పూజలకు, మొక్కే మొక్కుబడులకు ప్రతిఫలం దక్కుతుంది


----------------

Rules for Pray God

----------:దేవాలయంను దర్శించుకునే పధ్ధతి:--------

దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.

1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి.

2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు. ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి తండ్రులు ప్రొత్సహించరాదు .)

3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. గీతలో పరమాత్ముడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను అన్నాడు.

4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.

6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి.

7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.

8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.

9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని అకాల మృత్యు హరణం అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీస్కోవాలి.

10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.

11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.

12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.

13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.

14) అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు

15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.

16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.

17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.

18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.

19) ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.

20) నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.

21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.

22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.

23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.

24) ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.

25) ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.

26) బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.

27) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.

28) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.

29) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.

30) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.

31) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.

32) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.

33) గోపుర దర్శనం తప్పక చేయాలి.

34) ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.

35) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.

36) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.

తప్పులు ఉంటే చెప్పండి సరిదిద్దుతాను.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment