అష్టలక్ష్మీ స్తోత్రం కనకధారస్తోత్రం | Ashta Lakshmi Stotram Kanakadhara Stotram | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhakti pustakalu అష్టలక్ష్మీ స్తోత్రం కనకధారస్తోత్రం | Ashta Lakshmi Stotram Kanakadhara Stotram | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhakti pustakalu  శ్రావణ శుక్రవారం వినాల్సిన పాటలు, Kanakadhara Stotram Telugu Lyrics, raghava reddy bhakthi, raghava reddy devotional, raghava reddy, raghava reddy channel, raghva reddy videos, the divine, bhakti, bhakthi tv, bhakthi songs, bhakthi audio, all stotras, stotras with lyrics, bhakthi lyrics, music lyrics, bhakti lyrics, sthothras with lyrics, devotional channel, bhakthi music, devotional lyrics, Raghava Reddy, శ్రావణ శుక్రవారం kanakadhara

అష్టలక్ష్మీ స్తోత్రం 
కనకధారస్తోత్రం 
 Ashta Lakshmi Stotram 
Kanakadhara Stotram
Rs 12/-
అష్టలక్ష్మీ స్తోత్రం కనకధారస్తోత్రం | Ashta Lakshmi Stotram Kanakadhara Stotram | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

సద్గుణదాయక స్తోత్రం

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్‌!
గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః
ఈ స్తోత్రంతో ఎవరైతే ప్రతిరోజూ అమ్మ వారిని ప్రార్థిస్తారో వారికి ఎటువంటి ఫలితం కలుగుతుందంటే, వారు గుణాధికులవుతారు. ఈ స్తోత్రం పఠిస్తే డబ్బులు వస్తాయని చెప్పడం లేదు. సద్గుణాలు వృద్ధి చెందుతాయి. గొప్ప భోగభాగ్యాలు సమకూరుతాయి. ధనవంతులు కావడం మాత్రమే కాదు. పండితులు సైతం కీర్తించేటువంటి ఆశయాలతో అభ్యుదయకరమైన జీవితాన్ని గడుపుతారు.

శ్లో! సువర్ణ స్తోత్రం స్తవం యచ్ఛం శంకరాచార్య నిర్మితమ్‌
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్‌!
ఇది సువర్ణధారా స్తోత్రం. బంగారు ఉసిరికాయల వర్షం కురవడం వల్ల దీన్ని ‘సువర్ణధారా స్తోత్రం’ అంటారు. భగవత్పాదులు శంకరాచార్యులు దీన్ని రచించారు. మూడు సంధ్యలలో ఎవరైతే దీన్ని పఠనం చేస్తారో, పారాయణం చేస్తారో వారు కుబేరునితో సమానమైన వైభవాన్ని పొందుతారు. మూడు లోకాలకూ తల్లి అయినటువంటి ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉండునుగాక!
డా. గరికిపాటి నరసింహారావు

----------------------------------
శుభాలనిచ్చే కనకధార!

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని!
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా!!

లక్ష్మీదేవి ముగ్ధురాలై చూస్తోంది. ఆ చూపుల మాల ముగ్థంగా, పరమమనోహరంగా ఉంది. విష్ణుమూర్తి ముఖం మీద ఆ చూపులను మాటిమాటికి ప్రసరింపజేస్తోంది. ఆ చూపులు ఎలా ఉన్నాయంటే.... ప్రేమ కనిపిస్తోంది, సిగ్గు కనిపిస్తోంది. విష్ణుమూర్తిని చూసే చూపులో ప్రేమ ఉంది. విష్ణుమూర్తి తన వైపు చూడగానే తన చూపును వెనక్కి లాక్కుంది. అందులో సిగ్గుంది. మహోత్పలం అంటే పద్మం. పద్మం మీద వాలిన తుమ్మెదల గుంపులాగా నీ చూపులు ఆయన మీద ప్రసరించాయమ్మా! సముద్రం నుంచి జన్మించిన ఆ లక్ష్మీదేవి చూపుల మాల నాకు శుభములను ఇచ్చుగాక!

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్ష
ఆనందహేతురధికం మురవిద్విషో పి!
ఈషన్ని షీదత మయి క్షణమీక్షణార్థ
మిందీవరోదరసహోదరమిందిరాయాః!!

సమస్త దేవతలకు అధ్యక్ష పదవి అంటే దేవేంద్ర పదవి. త్రిలోకాధిపతి ఆయన. ఒకవేళ మనస్సులో కోరిక ఏదైనా బలంగా పీడిస్తూ ఉంటే మనుషులను అడగొద్దు. ఆ దేవుణ్ణి అడగాలి. ‘ఆ ఒక్కటీ తీర్చవయ్యా! నీ సేవ చేసుకుంటాను’ అని అడగాలి. అలాంటి పదవులను ఇచ్చే శక్తి లక్ష్మీదేవికి ఉంది. అలాంటి లక్ష్మీదేవి మహావిష్ణువుకు ఏమిచ్చింది? అంటే ఆనందాన్నిచ్చింది. లక్ష్మీదేవి కొస చూపులో సగం కూడా ఎలా ఉందట అంటే నీలరంగులో మెరిసే కలువ పూవులా ఉంది. ఆ కలువ మధ్యలో ఉండే ఉదర భాగాని(పీఠం)కి తోబుట్టువులా ఉంది. లక్ష్మీదేవి కళ్లలో అంత కాంతి ఉంది. ఆ చల్లని చూపు నామీద ప్రసరించు తల్లీ -డా. గరికిపాటి నరసింహారావు

-----------

అదే లక్ష్మీ కటాక్షం!

    ఆర్యావర్తము నందు వేదనిధియైు అద్వైత వేదాంతియైు / భార్యాపుత్రులటంచు బంధములను నొప్పన్‌బోక చిద్రూప సౌం/ దర్యంబంతయు పంచి పెట్టిన శివానందాబ్ధియగా శంకరా/ చార్యస్వామికి వందనం బెడుదు వాచా కర్మణా చేతసా!

   తాను చిద్రూప సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేసుకుని, అస్వాదించి, అనుభూతి చెంది తన రచనల ద్వారా మనకు పంచిపెట్టిన మహానుభావుడు జగద్గురువు శంకరాచార్య.

అంగంహరేః పులక భూషణ మాశ్రయన్తీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్‌!
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః!!

    తమాలమ్‌ అంటే చీకటి చెట్టు. ఆ చెట్టు మొగ్గలపై తుమ్మెద వాలగానే అది పులకించి వికసిస్తుంది కదా! అలాగే లక్ష్మీదేవి చూపులనే తుమ్మెదలు వాలగానే విష్ణుమూర్తి శరీరంలోని ప్రతి రోమ రంధ్రం తమాల వృక్షపు మొగ్గ అయి పులకించింది. ఆ కంటి కొసల చూపు ఎవరి మీద పడుతుందో వారికి సకల దేవతా విభూతి కలుగుతుంది. లక్ష్మీకటాక్షం అంటే అది. అలాంటి చల్లటి చూపు నా మీద కూడా ప్రసరించమమ్మా! విష్ణుమూర్తి కేసి చూస్తే వేరు. మనకేసి చూస్తే అది దయ. ఒకే స్త్రీ కొడుకుతో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. భర్తతో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. తండ్రితో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. అలా ఆ తల్లి లక్ష్మీదేవి చల్లని చూపును మన మీద ప్రసరింప చేయమని వేడుకుందాం.-డా. గరికిపాటి నరసింహారావు



వరలక్ష్మీ అవతారాలు

వరలక్ష్మీ ఆరాధన ఫలిస్తేనే మనం కోరుకున్న వరాలు దక్కుతాయి. తన కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిలాల్లని వనితలు కోరుకోవడం అత్యాశేమీ కాదు. ఇంటి ఇల్లాలు వరలక్ష్మీమాతను నిష్టతో పూజిస్తే వరాలు దక్కి అన్ని అవసరాలూ తీరుతాయి. వరలక్ష్మి అవతారాలు అనేకం.

ఆమెను ‘అష్టలక్ష్మీ స్వరూపం’గా ఆరాధిస్తే అన్ని వరాలూ దక్కుతాయి. ధన, ధాన్య, ధైర్య, సిద్ధి, శౌర్య, విద్య, సంతానం, ఆరోగ్యం వంటి వరాలు లక్ష్మీకృప వల్లనే మనకు సంప్రాప్తిస్తాయి. ఇవన్నీ పొందాలంటే ఒక్క వరలక్ష్మీ మాతకు అర్చన చేస్తే సరిపోతుంది. అందుకే లక్ష్మీతత్వాన్ని అనునిత్యం మననం చేసుకుంటే వరాలు సిద్ధించి, జీవితాన్ని సుఖమయం చేసుకోవడం, జన్మకు సార్థకత సాధించడం వీలవుతుంది.

పురాణ ప్రాశస్త్యం..

వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి మన పురాణాల్లో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. జగన్మాత అయిన పార్వతీదేవి ఓ సందర్భంలో తన భర్త సాంబశివుడిని ప్రశ్నిస్తూ, ‘స్త్రీలు సర్వ సుఖాలు పొంది, పుత్రపౌత్రాభివృద్ధి సాధించాలంటే ఎలాంటి వ్రతం ఆచరించాలో చెప్పాల’ని కోరుతుంది. అందుకు పరమేశ్వరుడు- ‘వనితలకు సకల శుభాలు దక్కాలంటే ‘వరలక్ష్మీ వ్రతం’ పేరిట శ్రావణ శుక్రవారం రోజున నోము నోచాలం’టూ సమాధానమిచ్చాడు.

ఈ వ్రతానికి సంబంధించి ఓ కథ బహుళ ప్రచారంలో ఉంది. పూర్వం మగధ రాజ్యంలోని కుండినము అనే గ్రామంలో చారుమతి అనే బ్రాహ్మణ యువతి ఉండేది. భర్త, కుటుంబం మేలు కోసం ఆమె నిత్యం ఎంతో తపన చెందేది. రోజూ ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే భర్త పాదాలకు నమస్కరించి, అత్తమామలను సేవిస్తూ, మితంగా మాట్లాడుతూ భగవంతుడి స్మరణతో ఆమె కాలం గడిపేది.

ఓ రోజు చారుమతి కలలో- లక్ష్మీమాత ప్ర త్యక్షమై, అనుకున్న ఆశలన్నీ ఫలించాలంటే వరలక్ష్మీదేవిని ఆరాధించమని చెబుతుంది. లక్ష్మీదేవి చెప్పినట్లే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు- శుక్రవారం రోజున ఉపవాసం ఉండి వరలక్ష్మిని పూజించిన చారుమతి మంచి ఫలితాలను పొందుతుంది.

చారుమతి తన కలలో లక్ష్మీదేవి కనిపించగా చెప్పిన విషయాలను మిగతా మహిళలందరికీ వివరించి వారిచేత కూడా వ్రతాన్ని ఆచరింపజేస్తుంది. ఈ వ్రతం చేసిన వారందరూ చారుమతిని వేనోళ్ల కొనియాడతారు. మహాశివుడు పార్వతికి ఉపదేశించిన ఈ కథను ఆ తర్వాత సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పడంతో విశేష ప్రాచుర్యం పొందింది.

వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి ఇలాంటిదే మరో కథ పురాణాల్లో మనకు కనిపిస్తుంది. స్వర్గలోకంలో పార్వతీ పరమేశ్వరులు ఓ రోజు కాలక్షేపం కోసం సరదాగా చదరంగం ఆడుతుంటారు. ప్రతి ఆటలోనూ పార్వతి విజయం సాధిస్తుంటుంది. తాను గెలిచి తీరుతానంటూ సాంబశివుడు ఆమెలో ఆతృత రేకెత్తిసుంటాడు.

ఈ దశలో ‘చిత్రనేమి’ అనే వ్యక్తిని ఆటలో పెద్దమనిషిగా ఉండమని పార్వతి కోరుతుంది. చిత్రనేమి నిజానికి శివుడి సృష్టే. అందుకే అతడు చదరంగం ఆటలో శివుడి పక్షాన నిలబడతాడు. అతడి వైఖరి పార్వతికి ఎంత మాత్రం నచ్చదు.

పక్షపాతం లేకుండా బాధ్యతలను నిర్వహించడంలో విఫలుడై తనకు మానసిక క్షోభ పెట్టాడన్న ఆగ్రహంతో చిత్రనేమిని పార్వతి శపిస్తుంది. ఫలితంగా అతడు భయంకరమైన వ్యాధికి లోనవుతాడు. తనకు శాపవిముక్తి కలిగించాలని అతడు పార్వతిని పరిపరి విధాలా వేడుకుంటాడు.

చివరకు ఆమె కరుణించి, వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తే వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతుంది. ఆ విధంగానే అతడు వరలక్ష్మిని ఆరాధించి శాపవిముక్తడవుతాడు.

ఆదిలక్ష్మి
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదమతే |
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరి పాలయమామ్ (1)

ధాన్యలక్ష్మి
ఆయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయమామ్ (2)

ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరి పాలయమామ్ (3)

గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వ ఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగ పదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయమామ్ (4)

సంతానలక్ష్మి
అయిగజ వాహిని మోహిని చక్రణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే
గుణగణ వారిధి లోక హితైషిణి, సప్తస్వర భూషిత గాన నుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుగే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయమామ్ (5)

విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞాన వికాసని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకర దేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయమామ్ (6)

విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారత భార్గవి, శోక వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణ విభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హాస్యయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ పరిపాలయమామ్ (7)

ధనలక్ష్మి
ధిమి ధిమి ధింధిమి ధింధిమి, దుంధుభి నాద పూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, 
శంఖ నినాద సువాద్యమతే |
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయమామ్ (8)

ఫలశృతి

శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని

శ్లో|| శంఖ చక్రగదాయక్తే విశ్వరూపిణితే జయః |
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్ ||

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment