వారాహి తంత్రం | Varahi Tantram | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

వారాహి తంత్రం 
Varahi Tantram 
Rs 200/-


రాత్రివేళల్లో పూజలందుకునే 
వారాహి దేవత

మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహినీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది. దుష్టశిక్షణ కోసమూ, భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరైన వారాహి విశేషాలు...

వరాహుని స్త్రీతత్వం
పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది.

రూపం
వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీరఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో... శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది.

ఆరాధన
తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజించడం కద్దు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి (ఒడిశా), వారణాసి, మైలాపుర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ.

సైన్యాధ్యక్షురాలు
లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ... తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం.

++++++++++++++++++++++++++++++++++++++++

వారాహి

పులిని వాహనంగా కలిగి 
వరాహ (పంది) ముఖం, 
పది చేతులతో వారాహి దేవి. 
సంస్కృత అనువాదం Vārāhī 
అనుబంధం మాతృకలు 
మంత్రం ఓం హ్రీం వారాహీ హరి ఓం 
ఆయుధములు త్రిశూలం, ఖడ్గం 
భర్త / భార్య వరాహ స్వామి 
Mount గేదె, సింహం, పులి, గుర్రం 
వారాహి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకామెగా, దశమహావిద్యలలో ఒకామెగా కొలుస్తారు. ఈమె వరాహ(పంది) ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహ స్వామి అర్ధాంగి. నేపాల్ లో ఈమెను బారాహి అంటారు.
వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మిక ఉంది.

హిందూ మత నమ్మకాలు 

మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యంలో శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ(పంది) రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది. 

రక్తబీజుడిని చంపడం కోసం దుర్గా దేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది. ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు. వారాహి (కింది వరుసలో కుడివైపు) ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతులలో ఖడ్గం, డాలు, అంకుశం(ములుగర్ర) ఆయుధాలుగా కలిగి ఉంది. 

దేవీ మాహాత్మ్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షశుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే, ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడ్ని సంహరిస్తుంది. వామన పురాణాం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. 

మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి, వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలపబడి ఉంది. 

దేవీ భాగవత పురాణం ప్రకారం వారాహిని, ఇతర మాతృకలతో పాటుగా, అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది. రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. 

వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది. ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత. 

మత్స్యపురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడి లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు. 

అమెరికాలోని పొంటియాక్ లో గల పరాశక్తి ఆలయంలో దేవీ వారాహీ అంబిక 

దేవీ పురాణం వారాహీ దేవిని విచిత్రంగా వరాహా స్వామికి తల్లిగా (వరాహజననిగా) వర్ణించింది.


+++++++++++++++++++++++++++++++ 

SRI VARAHI DEVI STOTRAM 
శ్రీ వారాహీ దేవీ స్తోత్రమ్ 

అస్యశ్రీ కిరాతవారాహీ స్తోత్రమంత్రస్య కిరాత వారాహి ఋషిః 
అనుష్టుప్ ఛందః, శత్రునివారిణీ వారాహీ దేవతా, 
తదనుగ్రహేణ సర్వోపద్రవ శాంత్యర్థే జపే వినియోగః 

ధ్యానమ్ 

ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరాం 
క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే II 1 II 
స్వాపహీనాం మదాలస్యామప్రమత్తామతామసీం 
దంష్ట్రాకరాళవచనాం వికతాస్యాం మహారవామ్ II 2 II 
ఊర్ధ్వకేశీముగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనాం 
లోచనాగ్ని స్ఫులింగాద్యైర్భస్మీ కృత్వా జగత్త్రయమ్ II 3 II 
జగత్త్రయం మోదయంతీమట్టహాసైర్ముహుర్ముహుః 
ఖడ్గం చ ముసలం చైవ పాశం శోణితపాత్రకమ్ II 4 II 
దధతీం పంచశాఖైః స్వైః స్వర్ణాభరణభూషితాం 
గుంజామాలాం శంఖమాలాం నానారత్నవిభూషితామ్ II 5 II 
వైరిపత్నికంఠసూత్రచ్ఛేదన క్షురరూపిణీం 
క్రోధోద్ధతాం ప్రజాహంతృ క్షురికేవస్థితాం సదా II 6 II 
జితరంభోరుయుగళాం రిపుసంహాతాండవీం 
రుద్రశక్తిం పరాం వ్యక్తామీశ్వరీం పరదేవతామ్ II 7 II 
విభజ్య కంఠదంష్ట్రాభ్యాం పిబంతీమసృజం రిపోః 
గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః II 8 II 
కపోతాయాశ్చ వారాహీ పతత్యశనయా రిపౌ 
సర్వ శత్రుం చ శుష్యంతీ కంపంతీ సర్వవ్యాధయః II 9 II 
విధి విష్ణుశివేంద్రాద్యా మృత్యుభీతిపరాయణాః 
ఏవం జగత్త్రయక్షోభకారక క్రోధసంయుతామ్ II 10 II 
సాధకానాం పురః స్థిత్వా ప్రవదంతీం ముహూర్ముహుః
ప్రచరంతీం భక్షయామి తపస్సాధకతే రిపూన్. II 11 II 
తేஉపి యానో బ్రహ్మజిహ్వా శత్రుమారణతత్పరాం 
త్వగసృఙ్మాంసమేదోస్థిమజ్జాశుక్లాని సర్వదా II 12 II 
భక్షయంతీం భక్తశత్రో రచిరాత్ప్రాణహారిణీం 
ఏవం విధాం మహాదేవీం యచేహం శత్రుపీడనమ్ II 13 II 
శత్రునాశనరూపాణి కర్మాణి కురుపంచమి 
సర్వశత్రువినాశార్థం త్వామహం శరణం గతః II 14 II 
తస్మాదవశ్యం శత్రూణాం వారాహి కురు నాశనం 
పాతుమిఛామి వారాహి దేవి త్వం రిపుకర్మతః II 15 II 
మారయాశు మహాదేవి తత్కథాం తేన కర్మణా 
ఆదపశ్శత్రుభూతాయా గ్రహోత్థా రాజకాశ్చ యాః II 16 II 
నానావిధాశ్చ వారాహి స్తంభయాశు నిరంతరం 
శత్రుగ్రామగృహాందేశాన్రాష్ట్రాన్యపి చ సర్వదా II 17 II 
ఉచ్చాటయాశు వారాహి వృకవత్ప్రమథాశు తాన్ 
అముకాముకసంజ్ఞాంశ్చ శత్రూణాం చ పరస్పరమ్ II 18 II 
విద్వేషయ మహాదేవి కుర్వంతం మే ప్రయోజనం 
యథా వశ్యంతి రిపవస్తథా విద్వేషణం కురు. II 19 II 
యస్మిన్ కాలే రిపుస్తంభం భక్షణాయ సమర్పితం 
ఇదానీమేవ వారాహి భుజ్వేక్షదం కాలమృత్యువత్ II 20 II 
మాం దృష్ట్వా యే జనా నిత్యం విద్వేషంతి హసంతి చ 
దూషయంతి చ నిందంతి వారాహ్యేతాన్ ప్రమారయ II 21 II 
హంతు తే ముసలః శత్రూన్ ఆశనేః పతినాదివ 
శత్రుదేహాన్ హలం తీక్ణం కరోతు శకలీకృతాన్ II 22 II 
హంతు గాత్రాణి శత్రూణాం దంష్ట్రా వారాహి తే శుభే 
సింహదంష్ట్రెః పాదనఖైర్హత్వా శత్రూన్ సుదుస్సహాన్ II 23 II 
పాదైర్నిపీడ్య శత్రూణాం గాత్రాణి మహిషో యథా 
తాంస్తాడయంతి శృంగాభ్యాం రిపుం నాశయ మేధునా II 24 II 
కిముక్తైర్బహుభిర్వాక్యై రచిరాచ్ఛత్రునాశనం 
కురు వశ్యం కురుకురు వారాహి భక్తవత్సలే. II 25 II 
ఏతత్కిరాతవారాహ్యం స్తోత్రమాపన్నివారణం 
మారకం సర్వశత్రూణాం సర్వాభీష్టఫలప్రదమ్ II 26 II 
త్రిసంధ్యం పఠతే యస్తు స్తోత్రోక్తఫలమశ్నుతే 
ముసలేనాథ శత్రూంశ్చ మారయంతి స్మరంతి యే II 27 II 
taaతార్‍క్ష్యారూఢాం సువర్ణాభాం జపత్తేషాం న సంశయ 
అచిరాద్దుస్తరం సాధ్యం హస్తేనాకృప్య దీయతే II 28 II 
ఏవం ధ్యాయేజ్జపేద్దేవీమాకర్షణఫలం లభేత్ 
అశ్వారూఢాం రక్తవర్ణాం రక్తవస్త్రాద్యలంకృతామ్ II 29 II 
ఏవం ధ్యాయేజ్జపేద్దేవీం జనవశ్యమాప్నుయాత్
దష్ట్రాధృతభుజాం నిత్యం ప్రాణవాయుం ప్రయచ్ఛతి II 30 
దుర్వాస్యాం సంస్మరేద్దేవీం భూలాభం యాతి బుద్ధిమాన్
సకలేష్టార్థదా దేవీ సాధక స్తత్ర దుర్లభః II 31 II

ఇతి శ్రీ వారాహీ స్తోత్రమ్ సమాప్తం 

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment