Swara Chintamani, Swara Chintamani, Swara Sastram, Vocal Theory, Pucha Srinivasa Rao, Tenmantam Srirangacharyulu, Mohan Publications, స్వర చింతామణి | స్వర శాస్త్రం | Swara chintamani | Swara sastram | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

స్వర చింతామణి | స్వర శాస్త్రం 
Swara chintamani | Swara sastram
-Tenmatam Srirangacharyulu and Pucha Srinivasa Rao
Rs 200/-
   స్వరమునందు వేద శాస్త్రములు, గాంధర్వ విద్య, చతుర్దశ లోకములను ఉండును. స్వరము ఆత్మను తెలియజేయును.

    మొదటి అధ్యాయమున ప్రశంసనము, రెండవ అధ్యాయమున పిండోత్పత్తి, మూడవ అధ్యాయమున స్వరోత్పత్తియు చెప్పబడును. నాల్గవ అధ్యాయమున కాల ప్రమాణము, అయిదవ అధ్యాయమున నాడీ సంధి, అజపాలక్షణము చెప్పబడును. ఆరవ అధ్యాయమున స్వర కర్మము, ఏడవ అధ్యాయమున ఆకస్మిక స్వరజానంబును చెప్పబడును. వార స్వరము పక్షస్వరము అయన స్వరము సంవత్సర స్వరము వీని జ్ఞానము ఎనిమిది తొమ్మిది అధ్యాయముల యందు చెప్పబడును. పదియమ అధ్యాయమున మూల స్వర విజ్ఞానమును చెప్పబడును. పండ్రెండవ అధ్యాయమున ధాతుమూల జీవచింత, పదమూడవ అధ్యాయమున జలక్రీడ అభ్యంగ స్నానము వీని క్రమము చెప్పబడును. పదునాలుగవ అధ్యాయమున భోజనము నిర్విషీకరణము, పదునైదవ అధ్యాయమున తాంబూలము, పదునాఱవ అధ్యాయమున సంభోగము వీని క్రమము చెప్పబడును. పదునేడవ అధ్యాయమున గర్భజ్ఞానము, పదునెనిమిదవ అధ్యాయమున జీవనాడి, పందొమ్మిదవ అధ్యాయమున యుద్ధ ద్యూత ప్రసంగము చెప్పబడును. ఇరువదియవ అధ్యాయమున వవలక్షణము, సస్యోత్పత్తి విజ్ఞానంబును చెప్పబడును. ఇరువది యొకటవ అధ్యాయమున క్రయము, విక్రయము, ఇరువది రెండవ అధ్యాయమున జలాఖేటము వనాఖేటము వీని క్రమము చెప్పబడును. ఇరువది మూడవ అధ్యాయమున పౌష యోగము, సూర్యచంద్రాతిచారములు, కాలజ్ఞానము, ఇరువది నాల్గవ అధ్యాయమున స్వప్నఫలంబును చెప్పబడును. ఇరువదియైదవ అధ్యాయమున శకున ఫలము, శారీరము, వశ్యమూలికలు, స్త్రీ సాముద్రిక లక్షణములను చెప్పబడును. ఈ క్రమమున ఇరువది యైదు అధ్యాయములు గలదిగా ఈ స్వర చింతామణి చెప్పబడెను. ఈ శాస్త్రము ఎవడు తెలుసుకొనుచున్నాడో వాడే యోగియని బుధులు చెప్పెదరు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment