శ్రీ స్వర్ణాకర్షణ భైరవ తంత్రం | శ్రీ శరభసాళువ తంత్రం | Sri Swarnakarshana Bhairava Tantram |  Sri Sarabhasaluva Tantram | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu Keywords for Sri Swarnakarshana Bhairava Tantram Sri Sarabhasaluva Tantram: SriSwarnakarshanaBhairavaTantram, Sri Swarnakarshana Bhairava Tantram, Sri Sarabhasaluva Tantram, Swami Madhusudana Saraswati, Mantralu, Tantralu, Sri nikhila Tantralu, Hindu, Non Fiction, Mohan publications



శ్రీ స్వర్ణాకర్షణ భైరవ తంత్రం 
- శ్రీ శరభసాళువ తంత్రం
Sri Swarnakarshana Bhairava Tantram 
Sri Sarabhasaluva Tantram
-Swami Madhusudana Saraswati
Pages: 384

ఉగ్రదీప్తి... శరభమూర్తి




ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం చాలా ప్రసిద్ధమైనది.ఇక్కడ స్వామి అమ్మవార్లు ప్రత్యేక దేవస్థానాలలో కొలువు తీరి ఉన్నారు. మల్లేశ్వరస్వామిదేవాలయం విమానగోపురం ప్రాచీన తెలుగు శిల్పకళకు తార్కాణంగా నిలుస్తుంది. ఈ ఆలయ విమానం పడమటి వైపు అద్భుతమైన శిల్పం దర్శనమిస్తుంది. రెండు సింహపు శరీరాలు కంఠం వరకు విడివిడిగా అక్కడి నుండి కలిసి మధ్యలో నడుము నుండి మానవశరీరంతో ఉగ్రమైన సింహముఖంతో, రెండు రెక్కలతో రెండు వైపులా కూర్చున్న రాక్షసులతో మెడలో కపాల(పుర్రె) మాలతో ఆరు చేతులలో ఒక శిల్పం కనిపిస్తుంది.

అది ఏ దేవుడి శిల్పం? అక్కడ ఎందుకు ఉంది? అనే ప్రశ్న భక్తుల మనసులో మెదులుతుంది. అది మరెవరి శిల్పమో కాదు. సాక్షాత్తూ శివరూపమే. శివుడు ధరించిన అనేక లీలా రూపాలలో ఇరవై ఐదు ప్రముఖమైనవి కాగా వాటిలో శరభమూర్తి రూపం ఒకటి. ఈ రూపం దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామి అవతారసమాప్తి కోసం వీరభద్రుడు ధరించింది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రతను తగ్గించక ప్రజలు భయపడుతుండటంతో శివుడు వీరభద్రుని పంపి ఉగ్రత్వాన్ని తగ్గించుకోమని చెబుతాడు.

అయినా వినక శివనింద చేస్తాడు. అప్పుడు వీరభద్రస్వామి శరభావతారం ధరిస్తాడు. సూర్య చంద్ర అగ్నులే అయన కళ్లు. ఆయన నాలుక బడబానలం. కడుపు కాలాగ్ని. గోళ్లు ఇంద్రుని వజ్రాయుధం కంటే బలమైనవి. ఆయన రెండు రెక్కలలో కాళీ–దుర్గా అనే దేవతలు, ఆయన రెండు తొడలలో కాలుడు–మృత్యువులుంటారు. హృదయంలో భైరవుడుంటాడు. చండమారుతవేగంతో శత్రువులను చీల్చి చెండాడుతాడు. ఆరు చేతులతో కత్తి–డాలును, అంకుశం–హరిణాన్ని, పాశం–రక్తపాత్రను పట్టుకుని ఉంటాడు.

శత్రుబాధలున్నవారు ఈయనను ప్రతిష్టించి పూజిస్తే ఆ బాధలు పోతాయి. యుద్ధంలో గెలుపు, ఋణ విముక్తి, అనారోగ్యం నుండి ఉపశమనం, సకలశుభాలు కలుగుతాయని శైవాగమాలు చెబుతున్నాయి. శర అంటే ఆత్మ. భ అంటే ప్రకాశం. ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాడు గనుక ఆయన శరభమూర్తి. ఈయనను శివాలయంలో విమానగోపురంపై గానీ, కోష్ఠ దేవతగా గాని ప్రతిష్టించి పూజించాలని ఆగమ శిల్పశాస్త్రాలు చెప్పాయి. మారీచం, మశూచి, రాచపుండు, క్షయవంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడే దేవత కనుక లోకక్షేమం కోసం ఈ శిల్పాన్ని అక్కడ ప్రతిష్టించి పూజిస్తున్నారు. ఈయనకే అష్టపాదమూర్తి, సింహఘ్నమూర్తి, శరభేశమూర్తి, శరభసాలువ పక్షిరాజం అనే పేర్లు కూడా ఉన్నాయి.   – డాక్టర్‌ ఛాయా కామాక్షీదేవి





   మన అందరికోసం శ్రీ నిఖిలగురుదేవుల ఆశీస్సులతో శ్రీస్వామి మధుసూదన సరస్వతిగారు ఎన్నో పుస్తకాలు రచనచేసి మనకి అందించారు. పూజ్య గురుదేవుల వలన మనకి తెలియని ఎంతోమంది దేవతలు కోసం మనకి తెలియజేసి వారి పూజావిధానం మంత్ర, తంత్ర, యంత్ర, విధానాలను మనకు తెలియచేసారు. ఆయన రాసిన ప్రతి పుస్తకము ఒక అద్భుతము అని మనకి అందరికి తెలిసిన విషయమే.

   అలాగే ఈ పుస్తకము “శ్రీ స్వర్ణాకర్షణ, శరభసాళువ తంత్రం” ను కూడా ఆయనే రచించారు. పుస్తకం మొత్తం పూర్తి చేసారు. కాని మనం ఎంతో ఇష్టంగా ఆనందంగా చదివే ముందుమాట కొద్దిగా పూర్తిచేసారు. కొన్ని విషయాలు ఆయన చెప్పి, మాకు వివరించిన చరిత్ర, ఆధ్యాత్మిక విషయాలను సేకరించి మాకు తెలిసిన విషయాన్ని చదివిన విషయాలను మేము ఈ పుస్తకములో ముద్రణ చేసినాము.

-------------------


శ్రీ శరభేశ్వరుడు

విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ ధరించిన ఎన్నో అవతారాలలో ఒకటి శ్రీశరభేశ్వరుడు. బహుశాః శ్రీ శరభేశ్వరుని పురాణం చాలామందికి కొద్దిగానైనా తెలిసే వుంటుంది. అయినా కూడా సిద్ధుల గ్రంథాలలో పేర్కొనబడిన శ్రీశరభేశ్వర అవాతార మహిమలు, ఆ స్వామిని కొలిచే విధివిధానాలు, ఆ స్వామిని ఆరాధించినందువలన కలిగే మేళ్ళు ఈ కలియుగంలోని మానవులందరూ గ్రహించాలి కదా! ఆ ఉద్దేశ్యంతోనే పరమేశ్వరుని అనుగ్రహంవలననూ, తమ గురుదేవులయిన శివగురుమంగళ గంధర్వ శ్రీ లశ్రీ ఇడియాప్ప సిద్ధ ఈశుల కరుణవలననూ మా సద్గురువు అయిన గురు మంగళ గంధర్వ శ్రీ కైలాస పొదియ ముని పరంపరలో 1001వ గురు మహా సన్నిధానం శక్తి శ్రీ అంకాళ పరమేశ్వరి భక్తులైన శ్రీలశ్రీ వేంకటరామన్‌ దీనిని రచించారు. 
శ్రీ శరభేశ్వర అవతార ప్రాముఖ్యత ఏమిటి? 

చాలామందికి శ్రీ శరభేశ్వరులెవరు? ఆయన మహిమలేంటి? ఆయనను ఆరాధించడం వలన కలిగే మేళ్ళు ఏమిటి? లాంటివి పూర్తిగా తెలియవు. కానీ చాలామంది శరభేశ్వరులంటే పరమాత్ముని ఉగ్రస్వరూపాలలో ఒకటి అని భయపడుతుంటారు. కానీ వాస్తవానికి శ్రీ శరభేశ్వరులు కరుణామూర్తికి ప్రతీక. 

సకలభువనాలనూ సంరక్షించేవారు, నృసింహావతారం. కోపాన్ని తగ్గించి, ప్రశాంతతను నెలకొల్పడానికి అవతరించిన శాంతమూర్తి. 

శ్రీ నృసింహావతారం అహంకార స్వరూపుడైన హిరణ్యకశిపుడిని సంహరించి, అతని ఉదరంలోని ప్రేవులను పెకలించి, కోపానికి ప్రతీకగా ఉన్నవారు. 

అహంకార నాశనం


'నేను' అనే అహంకారంతో, 'నేనే దేవుడు' అనే తన కోపంతో దుష్టశక్తిగా, అధర్మశక్తిగా విజృంభించిన హిరణ్యకశిపుని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టాలని ఉగ్రరూపంతో అతివేగంగా మహావిష్ణువు నృసింహావతారం దాల్చాడు. హిరణ్యకశిపుడు కోరిన వరానికి అనుగుణంగా నరునిగానో, దైవంగానో, ప్రాణిగానో కాక, అన్నీ కలసిన రూపమై, పగలు, రాత్రి అని కాకుండా సంధ్యాసమయంలో, అంతవరకూ ఉపయోగించబడని ఆయుధమైన గోళ్లతో, భూమిపైకాక, ఆకాశంలోనూ కాక, నృసింహుని తొడలపై పడుకోబెట్టుకుని, ఇంటా బయటా అని కాక గడపలో హిరణ్యకశిపుని ఉదరాన్ని చీల్చి అతని రక్తాన్ని స్వీకరించాడు. అతని ప్రేవులను హారంగా మెడలో ధరించాడు. అతని రక్తం, కణాలు లాంటి వాటిని ఈ భూమి భరించలేదు, అంతటా అతని దుష్టగుణాలు, భావనలూ వ్యాపించుతాయి కాబట్టి అతని అణువణువునూ తనలో ఐక్యం చేసుకున్నాడు. సంధ్యాసమయంలో నృసింహావతారం ఆవిర్భవించి హిరణ్యకశివుని అహంకారాన్ని నశింపచేసింది. 

భగవంతుడు ప్రతి అణువులో, ప్రతిబిందువులో, సర్వత్రా వ్యాపించి ఉంటాడు అనే దానిని నిరూపించాడు. హిరణ్యకశిపుని సంహరించడంతో బాటు తాను దుష్టశిక్షణా, శిష్టరక్షణ చేయడానికే అవతరించానని నిరూపించాడు. క్రూరుడైన హిరణ్యకశిపుని శిక్షించాలని ఉగ్రరూపంతో వచ్చిన నృసింహస్వామి, ఆ దుష్టుని అణువణువునూ తనలో ఐక్యం చేసుకున్న కారణంగా మరింత ఉగ్రత్వాన్ని సంతరించుకున్నాడు. 



వండేవారిలోని స్వభావం- తినేవారిలో ప్రతిఫలిస్తుంది 
ఒక వంటవాడు ఆహారాన్ని తయారుచేసేప్పుడు తనలో ఏ ఏ గుణాలనూ, ఆలోచనలనూ కలిగివుంటాడో అవి అతను తయారుచేసిన ఆహారపదార్ధాలలో ప్రతిఫలిస్తాయి. దీని ఫలితంగా ఆ భావనలు ఆ ఆహారాన్ని స్వీకరించేవారిలోనూ చోటుచేసుకుంటాయి. అందువలననే వండేవారి ఆలోచనల ప్రకంపనలు తినేవారిలోనూ ప్రతిఫలిస్తాయంటారు. అందువలననే తల్లి, తండ్రి, భార్య, కుమార్తె లాంటి ఆత్మీయులు సద్భావనలతో వండినప్పుడు తింటే మనలో ఎలాంటి మానసిక వికారాలూ తలెత్తవు. 

ఇతరులు వండుతుప్నప్పుడు వారిలో కోపతాపాలు, దుఃఖం, విచారం, స్వార్థం లాంటి వ్యతిరేకభావనలు ఉన్నాయనుకోండి. అన్నీ దురుద్దేశాల ప్రభావమూ మనం తినే ఆహారపదార్ధాలపై వుంటుంది. అలాంటి ఆహారం స్వీకరించి మనం ఏవైనా పనులు చేస్తే వాటిపై ఆ దుష్ప్రభావం ఉంటుంది. మనం పైకి చెప్పవచ్చు 'ఈ పని ఇలా జరిగింది. ఆ పని సరిగ్గా జరగలేదు' అని. అందుకు కారణం పరోక్షంగా జనం అలాంటి ఆహారం స్వీరించినందువలన కూడా ఉండవచ్చు! 
ఇందువలననే మన పూర్వీకులు ఎక్కడికి వెళ్ళినా మంచి నీరు సైతం ఇంటినుంచే తీసుకువెళ్ళేవారు. తాము తెచ్చిన ఆహారాన్ని అశ్వత్థవృక్షం, వేపవృక్షం, జమ్మివృక్షం వాటి క్రింద కూర్చుని భుజించి తమ కార్యార్థం వెళ్ళేవారు. వారు వెలుపల ఎక్కడా భోంచేయరు. కొందరు అనుష్ఠాన పరులైతే ఆహారపదార్థాలను తమ వెంట తీసుకువెళ్ళి స్వయంపాకం చేసుకునేవారు. కానీ ప్రస్తుతకాలంలో వెళ్ళేదారిలో ఎన్నో రకాల హోటళ్ళు, సిద్ధాహారశాలలూ వుంటున్నాయి. అక్కడ ఎవరు ఎలాంటి మనోభావంతో ఎంత శుచిగా, ఆరోగ్యకరంగా వండుతారో తెలీదు. వారు ఆహారపదార్ధాలను వండేప్పుడు కోపంతోగానీ, విసుగుతోగానీ, తిట్టుకుంటూగానీ, యజమాని సరిగ్గా జీతాలివ్వడం లేదని అతడిని నిందిస్తూ, ఇలా రకరకాల మనోభావాలతో వండవచ్చు! వండేపదార్థాలు ఎంత రుచికరంగా వున్నా, వంటవారి / వడ్డించేవారి ఆలోచనల ప్రభావం ఆహారాన్ని స్వీకరించేవారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్నది వాస్తవం. 

శ్రీ నృసింహస్వామి ఉగ్రరూపం


మనం స్వీకరించే ఆహారప్రభావం ఎలాగైతే మనపై వుంటుందో అలాగే దుష్టుడైన హిరణ్యకశిపుని ఉదరాన్ని చీల్చి దానిలోని రక్తాన్ని స్వీకరించినందువలన నృసింహస్వామి ఉగ్రత్వం పలురెట్లు పెరిగింది. కానీ దానిని అలాగే భూమిపై పడవేస్తే మరెందరో హిరణ్యకశిపులు ఈ భూమిపై జన్మించే అవకాశం వుంది. అందువలన నృసింహస్వామి కోపం ఎల్లలు మీరింది. బ్రహ్మాండం చలించింది. ప్రళయమే సంభవిస్తుందా అనిపించింది. ఇందువలననే ఈ నృసింహుని ఉగ్రనరసింహుడు అన్నారు. 
సహవాసదోషం అంటారు. హిరణ్యకశిపునితో కొద్ది క్షణాలు గడిపి, అతని శరీర స్పర్శ పడినందువలన నృసింహస్వామి ఉగ్రత్వం పెరిగింది. ఈ కోపం అక్కడితో ఆగిపోలేదు. పరిసరాలలోని ప్రకృతిని, ప్రాణాలనూ కొంతమేరకు నాశనం చేసింది. ఎన్నో ఏళ్ళపాటు పెరిగి వృద్ధి చెందిన మహావృక్షాలు, పర్వతాలు, ప్రకృతి ధ్వంసమైంది. కొన్ని లోకాలలో ఈ ఉగ్రద్వానలం వ్యాపించింది. నృసింహస్వామి పాద స్పర్శ పడిన కొన్ని లోకాలలో అగ్నికీలలు వ్యాపించి అక్కడ ఎంతో నష్టం వాటిల్లింది. 

ఆ అగ్ని జ్వాలల విజృంభణాన్ని దేవతలు కూడా నియంత్రించలేకపోయారు. నృసింహస్వామి కోపజ్వాలలు ఎటుగా ఎవరివైపు దూసుకుపోతాయో ఎవరూ ఊహించలేక తల్లడిల్లిపోయారు. 
మహాలక్ష్మి కూడా మహావిష్ణువు అవతారమైన ఆ నృసింహస్వామిని జాడను కనుక్కోలేకపోయింది. అందువలన సకల లోకాలలోని దేవతలు, లక్ష్మీదేవితో సహా పరమేశ్వరుని సన్నిధికి వెళ్ళి 'నృసింహుని ఉగ్రరూపం భరించలేని స్థాయికి చేరుకుంది. ఎలాగైనా ఆయన కోపాన్ని తగ్గించి, ప్రశాంతతను నెలకొల్పాలి' అని మొరపెట్టుకున్నారు. అందువలన నృసింహ అవతారం ఆవిర్భవించిన సంధ్యాసమయంలో, ప్రదోషవేళలో పరమేశ్వరుడు శరభేశ్వరుడుగా అవతరించాడు. 

శ్రీ శరభేశ్వరుని మహిమ 

పరమాత్మగా, ఆదిదేవుడుగా అవతరించినవాడు ఆ శివుడే. సకలజీవరాశులూ మనతో కలిసి జీవించడానికీ, పంచభూతాలూ సమస్థితిలో ఉండడానికీ, సకలలోకాలలో ప్రశాంతత నెలకొనడానికీ కారణభూతుడు ఆయనే! శివంలోని ఓంకార విరాట్‌ స్వరూపమే శ్రీ శరభేశ్వర అవతారం. 

జీవితంలో ప్రతి ఒక్కరూ అనుభవించవలసిన కీర్తి ప్రతిష్ఠలు, సిరిసంపదలు, సంపూర్ణ ఆరోగ్యం, శారీరక దృఢత్వం లాంటి వాటిని కటాక్షించే అవతారం శ్రీ శరభేశ్వరుడు. పంచభూతాలకూ, నవగ్రహాలకూ, దేవాధిదేవతలకూ మంత్ర, తంత్ర, యంత్ర, యోగ, సిద్ధమూలాలకూ ఆదిదైవం శ్రీ శరభేశ్వరుడు. సిద్ధికీ, బుద్ధికీ మూలమైన శివునిలో భక్తికీ, బలానికీ కారణభూతమైన పరాశక్తియే శ్రీ శరభేశ్వరుడు అని కూడా మనం విశ్లేషించుకోవచ్చు. 

శ్రీ శరభేశ్వర ఆరాధనక్రమం 

సంకటాలు అధికమైనప్పుడూ, ప్రతిభ కనబరచవలసిన విషయాలలో ఫలితం లభించిక, కాలం వృథా అవుతున్నప్పుడూ, నిజాయితీకి, కృషికీ, సామర్థ్యానికీ తగిన ప్రతిఫలం లభించనప్పుడూ, తెలివితేటలు వుండి కూడా ఎవరినీ నమ్మలేని స్థితిలో మానసిక దృఢత్వం తగ్గినప్పుడూ, ఓటమిని ఎదుక్కొనే ధైర్యం లేనప్పుడూ, విజయమార్గంలో ముందంజ వేయడానికి అందరికీ సహకరించే దైవం శ్రీ శరభేశ్వరుడు. 
ఇంతేకాదు, అన్యోన్యతగల దాంపత్యజీవనంలో, సత్సంతానాన్ని దేశసేవకోసం పురికొల్పడానికి, వ్యాధిరహిత జీవనం గడపడానికి, మనపై ఇతరులు ప్రయోగించిన మంత్ర, తంత్ర, చేతబడులు నిర్వీర్యం కావడానికీ మనం ఆ శరభేశ్వరుని శరణు వేడాలి. 

అగ్నిని చల్లబరచిన అగ్ని


ఎన్నిమార్లు చదివినా, విన్నా, రాసినా, చెప్పినా, వంటబట్టకపోతే శ్రీ నృసింహపురాణం మన మనసులో దైవప్రేరణను కలిగించి, దుష్టశక్తులను గెలవడానికి కావలసిన దైవశక్తిని పెంపొందిస్తుంది. కాబట్టి మనం దాని మహిమ గురించి మళ్లీ మళ్లీ తెలుసుకుందామా! మహాక్రూరుడుగా వుండి స్త్రీలనూ, భగవద్భక్తులనూ హింసించిన హిరణ్యకశిపుని అంతమొందించడానికే శ్రీ నృసింహస్వామి ఉగ్రావతారం దాల్చి అతడిని సంహరించాడు. హిరణ్యకశిపుని శరీరంలో నుండి ఏ చిన్నమాంసఖండమో, ఎముకనో, రక్తమో ఈ భూమిపై పడితే అందులో నుండి కోటాను కోట్ల రాక్షసులు ఉద్భవిస్తారోనని, ఇవన్నీ నేలపై పడకుండా సంపూర్ణంగా భస్మం చేసి తన శరీరంలోనికి లీనం చేసుకున్నారు శ్రీ నృసింహస్వామి. 

కోట్లాది పాపకార్యాలను, దుష్కర్మలనూ చేసినందువలన హిరణ్యకశిపుని శరీరం పూర్తిగా పాపభూయిష్ఠమై, పాపరాశిగా రూపొందింది. ఇలాంటి పాపశరీరాన్ని సంహరించినందువలన శ్రీ నృసింహుని ఉగ్రస్వరూపం అపరిమితంగా పెరిగిపోయింది. వాస్తవంగా చూస్తే ఇవన్నీ భగవానుని లీలలే! శ్రీ నృసింహుని ఉగ్రత్వాన్ని శాంతింపచేయడానికి శ్రీ శరభేశ్వరుడు అవతరించినప్పుడు ముందుగా అతని గొంతుభాగాన్ని చిన్నగా స్పృశించాడు. కానీ కొందరు దీనిని శ్రీనృసింహుని కంఠాన్ని పట్టుకున్నట్లు పొరబాటుగా భావించారు. 

శ్రీ శరభేశ్వరుడు శ్రీ నృసింహుని గొంతును చిన్నగా స్పృశించినప్పుడు.....
రెండు అవతారమూర్తుల స్పర్శవలన, అవతార మూర్తుల సంగమం వలన అక్కడ ఏర్పడిన మహాతేజస్సును చూసి దేవాధిదేవతలు, మహర్షులు, యోగులు, సిద్ధపురుషులు పరమానందభరితులైనారు. మరెక్కడా చూడడానికి సాధ్యంకానిది ఈ తేజస్సు. అవతారమూర్తుల సంగమ స్పర్శ అంటే ఆ తేజస్సును సాధారణమైన మాటలలో వివరించడానికి సాధ్యమవుతుందా మరి! 

రెండు అవతారాలు అగ్ని స్వరూపాలై జ్వలించిడమే కాక రెండూ ఉగ్ర అవతారాల స్పర్శ కారణంగా ఏర్పడిన అగ్నిప్రకాశం వలన అక్కడ గుమిగూడి వున్న వారందరికీ బడబాగ్ని లాంటి జఠరాగ్ని మేల్కొన్నది. ఈ జఠరాగ్నిని ఎలా నివారించడం సాధ్యం? ఇందుకోసమే అక్కడ సకల జీవరాశులకూ అన్నప్రసాదాన్ని అందించే శ్రీ అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమైంది, తన పవిత్రహస్తాలు పట్టుకున్న అన్న ప్రసాదగరిటతో! 

అందరికీ అన్నప్రసాదాన్ని అందించే శ్రీ అన్నపూర్ణాదేవి ఆమె! 

బడబాగ్ని లాంటి జఠరాగ్నితో తపించిపోయే వారందరికీ ఏమిచ్చి వారి ఆకలిని ఉపశమింపచేయడం సాధ్యం అని శ్రీ అన్నపూర్ణాదేవి కొద్ది సేపు ఆలోచించి, ఉత్తమమార్గాన్ని సూచించవలసిందిగా భగవంతున్ని ప్రార్థించగా, అప్పుడు శ్రీ శరభేశ్వరుడు, శ్రీ నృసింహుని కంఠభాగంలోని గుంతను కొద్దిగా స్పృశించి నిమరగా దైవమూర్తుల సంగమతేజస్సు వలన అక్కడ జ్యోతి బిందువులుగా ఆవిర్భవించాయి! 
వాటినన్నిటినీ తన గరిటలో నింపుకున్న శ్రీ అన్నపూర్ణాదేవి వాటినలాగే శ్రీ శరభేశ్వరమూర్తికి సమర్పించింది. అందుకు కారణం ఆ జ్యోతిబిందువులలో ఏ ఒక్క దానిలోని అణుస్వరూపాన్నైనా భరించగలిగే శక్తి వారికి లేదు. ఆ విధంగా శ్రీ అన్నపూర్ణాదేవి శ్రీ శరభేశ్వరునికి సమర్పించిన నైవేద్యమే 'సుయం' అనబడే తీపి పదార్థంగా రూపొందింది. 
ప్రదోషసమయంలో ముఖ్యంగా ఆదివారంనాడు రాహుకాలంలో శ్రీ శరభేశ్వరుని వెన్న, గంధంతో తయారైన చిన్న గోళాలను అర్చించి, ఈ 'సుయం' అనబడే తీపిపదార్ధాన్ని నైవేద్యంగా సమర్పించి, దానిని పేదవారికి దానంగా ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు అపారం. 

నైవేద్య ఫలితాలు : 

భర్తలో మార్పుకోసం 
తన ప్రియమైన భార్యయొక్క ప్రేమను, అభిమానాన్నీ గ్రహించక మూర్ఖంగా, మొండిగా ప్రవర్తించే భర్తను సన్మార్గానికి మరల్చడానికి భార్యలు ఈ సుయం అనబడే తీపిపదార్ధాన్ని ఆదివారంనాడు ప్రదోషసమయంలో శ్రీ శరభేశ్వరునికి నైవేధ్యంచేసి పేదలకు అన్నదానంగా సమర్పిస్తుంటే భర్త సత్ప్రవర్తనతో, సన్మార్గంలోకి మారి ఆ దంపతుల సంసారజీవితం అన్యోన్యంగా ఉంటుంది. 
పోగొట్టుకున్న సంపదలు తిరిగిపొందడానికి 
పగలు, శత్రుత్వం, క్రోధం కారణంగా బంధువులు, మిత్రుల వద్ద భూమి, ఇల్లు లాంటి భారీ ఆస్తులను పోగొట్టుకున్నవారు వాటిని న్యాయంగా, ధార్మిక విధానంలో మరలా పొందడానికి ఇలాంటి సుయం ప్రసాద నైవేద్యం, శ్రీ శరభేశ్వరమూర్తి ఆరాధన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

క్రమశిక్షణతో జీవించడానికి : 

ఎన్నో కుటుంబాలలో తల్లిగానీ, తండ్రిగానీ క్రమశిక్షణలేక జీవితాన్ని గడపడం వలన వారి సంతానం ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. తల్లిదండ్రులలోగానీ, వారి సంతానంలో కానీ మరలా క్రమశిక్షణతో కూడిన జీవన విధానం రావాలంటే ఇలాంటి శ్రీ శరభేశ్వరస్వామి ఆరాధన సహాయకారిగా వుంటుంది. 
శ్రీ శరభేశ్వరుని ఆరాధించే క్రమం: 
ఒక్కొక్క దైవాన్నీ ఆరాధించి వారి అనుగ్రహం పొందడానికి రకరకాలైన ఆరాధన క్రమాలున్నాయి. 
శివలింగం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తైలాభిషేకం, అర్చన చేసి, ధూపదీపాలు వెలిగించడం తప్పనిసరి. 
మహావిష్ణువు అనుగ్రహం పొందాలంటే పుష్పాలు, ఆభరణాలు, వస్త్రాలంకారం, తిరుమంజనం, ధూపం, దీపం వెలిగించి సంస్కృతశ్లోకాల బృందపారాయణం అనుసరించాలి. 
కుమారస్వామి అనుగ్రహానికి అభిషేకం, కావడి, పాదయాత్రవ్రతం శూలధారణ లాంటి నియమాలు అనుసరించాలి. 
వినాయకుని కటాక్షం కోరేవారు హోమం, అన్నప్రసాదం / అన్నదానం, గరికపూజ, గంధం, పంచామృతం ఉపయోగించి పూజలు చేయడంలాంటి పలురకాల ఆరాధనా క్రమాలు అనుసరించాలి. 

శ్రీ శరభేశ్వరుడు శిలారూపంలో వుంటే పూర్తిగా గంధం పూయాలి. స్తంభంలో శిలారూపంలో వుంటే కొబ్బరినూనె పూసి ఆరాధించాలి. శ్రీ నృసింహుడు, శ్రీ శరభేశ్వరుడు ఎదురెదురుగా వుంటే ముందుగా శ్రీ నృసింహునికి నవ్వులనూనె కలిసిన గుంటగలగరాకు, పొన్నగంటాకు లాంటి ఆకుల తైలం పూసి, ఆ తరువాత శ్రీ శరభేశ్వరునికి కొబ్బరినూనె పూయాలి. మానవుల శరీర, మానసిక ఎదుగుదల, మానసిక పరిపక్వత, భక్తి, శరణాగతి స్థితిగతులకనుగుణంగా, వారు చేసిన పాప, పుణ్య కర్మలకు తగినట్లుగా భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అలాంటి అవతారాలలో ఒకటి శ్రీ శరభేశ్వర అవతారం. 

కాబట్టి గంగా, కావేరీ లాంటి పుణ్యనదులలో, తీర్థాలలో తులసి, బిల్వం లాంటివి పెట్టి వాటినే శ్రీ శరభేశ్వరుని అభిషేకానికి ఉపయోగించవచ్చు. 
అగ్నితత్త్వం నిండినదిగానూ, ఉగ్రమూర్తిగానూ శ్రీ నృసింహుడు, శ్రీ శరభేశ్వరుడు, శ్రీ కాళి, శ్రీ వీరభద్రమూర్తులు వెలసినందువలన ఈ దైవీక అగ్నిశక్తిని మనకు తగిన అనుగ్రహశక్తిలా మార్చుకునే రీతిలో మరికొన్ని సులభ విధానాలను చేపట్టాలి. కాబట్టి శ్రీ శరభేశ్వరుని మూర్తికి తగినట్లు శైవ, వైష్ణవ భగవత్తత్వాలకు తగినట్లు శీతలదేహ కాంతినిచ్చి అగ్నిమయమైన దైవీకశక్తిని శాంతమయంగా పొందే రీతిలో బిల్వం, తులసి కలసిన తీర్థం ఈ పూజలో ఉపయోగించబడుతున్నది. 

గంధం, పసుపు, వెన్నను ఉండగా చేసి శ్రీ శరభేశ్వరునికి అష్టోత్తరాలను చదివి అర్చన చేయాలి. వెన్నలాంటి స్వచ్ఛతతో మన మనస్సు ఉండాలి. ఆవుపాలతో తయారైన వెన్న అయితే మరింత శ్రేష్ఠం. 

పూజలన్నిటికీ పసుపు, గంధం లాంటి వాటిని మంత్రాలతో జపించి, మనమే పూజచేయడం ఉత్తమం అని సిద్ధులు పేర్కొంటారు. ఎలాంటి పరిస్థితులలోనైనా మానసికదృఢత్వం కోల్పోకుండా, ఎలాంటి సందర్భాన్నైనా తట్టుకోగల మానసిక స్థైర్యాన్నిచ్చే శ్రీ శరభేశ్వరుని 15 రోజులకొకసారైనా ఆరాధిస్తేనే దైవసంబంధమైన మానసిక శక్తి లభిస్తుంది. లేకుంటే దుఃఖంతో, వేదనతో బాధపడవలసివస్తుంది. కాబట్టి ఇంట్లోనే శ్రీ శరభేశ్వర పటాన్ని పెట్టి ప్రతి ఆదివారమూ శ్రీ శరభేశ్వరుని పూజను క్రమం తప్పక ఆచరించాలి. ఇలా అనుసరించడంలో ఎలాంటి దోషమూ లేదు. పైగా సత్ఫలితాలే కలుగుతాయి. 

శ్రీ శరభేశ్వరుని ఆరాధించే సమయం


శ్రీ శరభేశ్వరుని ఆదివారం, మంగళవారం, గురువారం మొదలైన రోజులలో ఆరాధించడం శ్రేష్ఠం. ఈ రోజులలో కూడా ఆదివారం సాయంత్రం, మంగళవారం రాహుకాలం, గురువారం రాహుకాలం శ్రీ శరభేశ్వరుని పూజకు శ్రేష్ఠం. ఈ మూడురోజులు సాయంసంధ్యలో 5 నుండి 6 గంటలలోపు ఆ స్వామిని ఆరాధించడం ఉత్తమం. స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, తమ తమ కుటుంబ ఆనవాయితీ ప్రకారం భస్మధారణ, గంధం, కుంకుమ, గోపీచందనం లాంటివి నుదుట ధరించి శరభేశ్వరుని పూజించాలి. 

శ్రీ శరభేశ్వరుని ఉనికి రహస్యం 

ఎన్నో ప్రదేశాలలో, స్తంభాలలో శ్రీ శరభేశ్వరమూర్తిని పూర్తిగా ఆవాహనం చేసి సిద్ధపురుషులు సంధ్యాసమయాలలో తపస్సుచేసి, తమశక్తిని ఆ స్తంభాలలోని మూర్తికి ధారపోస్తారు. 
ఈ సిద్ధపురుషులు తమ తపశ్శక్తిని పవిత్రీకరించి ఆ స్తంభాలలో నిక్షిప్తం చేసిన తరువాతనే, శ్రీ శరభేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తాడు. ఆదివారం సాయంత్ర సమయాలలో అద్భుతమైన శక్తి కలిగిన శిఖండి సిద్ధులు ఆ స్తంభాలలో శక్తిని, శుద్ధిని పొందడానికి అద్భుతమైన యోగస్థితులను సాధనచేసి, దివ్యయోగసిద్ధిని పొంది ఆ స్తంభాన్ని శుద్ధీకరిస్తారు. ఈ శిఖండి సిద్ధపురుషుల గురించి అనేక వివరాలున్నాయి. 

కాలకంఠుడు అవతరించిన కాలం 

కాలాన్ని, సమయాన్ని ఏర్పరచిన భగవంతుడు శుభసమయం, అమృతఘడియలు, బిందు సమయం, ప్రదోష సమయం లాంటి అనేక రకాల దివ్యమైన తరుణాలను సృష్టించాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో శుభతరుణాల గురించిన రహస్యాలున్నాయి. వీటిని భగవన్నిర్ణయాలుగా రహస్యంగా రూపొందించారు. అందుకు కారణం దీని గురించి తెలియనివారు తమ స్వార్థంతో, స్వలాభం కోసం, సిరిసంపదలు, సౌఖ్యాలు పొందడానికోసం దుర్వినియోగ పరచుకుంటారేమోనన్న సందేహం. ఇందువలననే సమయం, తిథి, రోజు, నక్షత్రం, అమృత, సిద్ధ, మరణ, బాలారిష్ట యోగాలు, లగ్నం, తారాబలం, చంద్రబలం లాంటి వాటిని గణించి శుభసమయాన్ని మాత్రం గుర్తించడానికి ఎందరో జ్యోతిష్కులు తర్జనభర్జనలు పడుతుంటారు. చివరిగా వారే శుభముహూర్తాన్ని నిర్ణయిస్తారు. 

ప్రదోషసమయం 

ప్రదోషసమయంలోనే శ్రీ నృసింహుడు, శ్రీ శరభేశ్వరుడు అవతారం దాల్చారు కాబట్టి, ఆ సమయంలో ఆరాధనకు విశేషప్రాముఖ్యత ఉంది. 
ప్రదోషసమయాలలో కూడా పక్ష ప్రదోషం, నిత్యప్రదోషం అంటూ ఎన్నో రకాలున్నాయి. పక్ష ప్రదోషసమయమన్నది త్రయోదశినాడు సాయంత్రం 4.30 గం||నుండి 6.00 గం|| వరకూ ఉంటుంది. ఇలాగే నిత్యప్రదోషమైన దినసరి ప్రదోషంలో ప్రతిరోజూ సాయంత్రం పూట నిత్యప్రదోషం విశేషంగా ఆచరించబడుతుంది. దీనిని ఇంకా ఆచరిస్తున్న వారెందరో ఉన్నారు. దినసరి ప్రదోష సమయంలో పద్ధతిగా ఆరాధనా విధానం అనుసరిస్తే దానిని ఆచరించినవారికి త్వరలోనే పరమేశ్వరుని అనుగ్రహం ఉన్నతస్థాయిలో లభిస్తుంది. గురువు అనుగ్రహం, ప్రగాఢ విశ్వాసం వున్నవారికి సంపూర్ణ భగవదనుగ్రహం కలుగుతుంది. 

శ్రీ శరభేశ్వరుని అద్భుతమైన, వినోదమైన అవతారానికి ఎన్నో రకాల కథనాలున్నాయని పేర్కొంటారు. ప్రదోష సమయంలో శ్రీ నృసింహఅవతారాన్ని, శ్రీ శరభేశ్వర అవతారాన్ని ఆరాధించడం చాలా విశేషం! ముఖ్యంగా ఎందరో స్త్రీలు తమ భర్తల మూర్ఖత్వాన్ని, మద్యవ్యసనాన్ని, అనైతిక ప్రవర్తనను, మొండితనం, దుష్టస్వభావం లాంటి రాక్షస గుణాలవలన భీతిచెంది, విచారించి మనోవేదనతో జీవితాన్ని నరకప్రాయంగావించుకుంటున్నారు. దీనికి పరిహారంగా పాపకర్మలను తొలగించి, అసురగుణాలను పోగొట్టి సన్మార్గానికి తిప్పడానికి ప్రదోషసమయంలో శరభేశ్వరుని ఆరాధించాలి. 

ఆదివారంనాడు జ్ఞానం కలిగే సమయం 

ఆదివారం నాడు రాహుకాలం, నిత్యప్రదోష సమయం ఒకటిగా కలిసివస్తే దానికి అనేకరెట్లు సత్ఫలితాలు కలుగుతాయి. ఆదివారం సూర్యునికి విశేషదినం. సూర్యుడు, చంద్రుడు కలిసే సమయం పవిత్రమైన సంధ్యాసమయం. సూర్యునికి సంబంధించిన ప్రాతఃకాల పంచాంగాల సంప్రదాయ ప్రకారం ఆదివారం సూర్యాస్తమయ సమయంలో సోమవార ప్రారంభాన్ని గణిస్తారు. పైగా ఆ సమయంలో సూర్య చంద్రులు కలిసే సమయంలో (అంటే వారిద్దరూ ఒకే సమయంలో ఆకాశంలో కనిపించేప్పుడూ) శిఖండిసిద్ధుల ఆవిర్భావం జరిగింది. 
శిఖండి సిద్ధుల ప్రముఖ పీఠాధిపతి కవచ జలూషర్‌. ఆయన సూర్య, చంద్రగ్రహాల సంగమంలో కనిపించినవారు. ఆయన తన సాంప్రదాయంలో వచ్చిన వారైన- అమావాస్య సిద్ధులు- మరియు శిఖండి సిద్ధుల అంశాలు పొందినవారు. 
శ్రీ శరభేశ్వర మూర్తి ఆరాధానలో మనం చేపట్టవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు 

పాదయాత్ర పాపాలు తొలగిస్తుంది


శ్రీ శరభేశ్వరుని ఆరాధించే భక్తులు తమ ఇంటినుండి ఆలయానికి బయలుదేరేప్పుడు పాదరక్షలు ధరించక పాదాలతో వెళ్ళడం శ్రేష్ఠం. 
అయ్యప్ప దీక్షకు వెళ్ళేవారిలా ఇక్కడ కూడా పాదరక్షలు లేకుండా నడవాల్సిన అవసరం ఏమిటి? 

శ్రీ నృసింహుడు ఉగ్రరూపంతో నాట్యమాడుతూ అనేక లీలలు జరుపుతూ సకల లోకాలకూ వెళ్ళాడు. ఎందుకో తెలుసా? శ్రీ నృసింహ అవతార మహిమలు శ్రీ నృంహుడు దాల్చిన ఉగ్రరూపాన్ని చూడడానికి దైవకార్య కారణాలను సిద్ధపురుషులు స్పష్టంగా వివరించారు. 
హిరణ్యకశిపుని ఆగ్రహావేశాలతో అనేక లోకాలలో క్రోధ, ద్రోహ, విరోధ, శత్రుత్వం లాంటి విస్తృత భావనలే విస్తరించాయి. 
సంధ్యాసమయంలో అసూరీశక్తులు విజృంభిస్తాయి కాబట్టి మహర్షులు, సిద్ధులు ప్రపంచ శాంతికోసం ప్రశాంతంగా, ధ్యానాన్నో, పూజలనో చేపట్టడం సాధ్యం కాలేదు. సరైన సమయంలో, పరిపూర్ణంగా పూజలను చేయడం సాధ్యం కాక వారు తమ బాధ్యతలను నెరవేర్చలేనందువలన అనేక శాపాలకు గురైనారు. ఈ అసురాశక్తులను ఎదిరించాలంటే తమ తపశ్శక్తిని ధారపోయాల్సి వుంటుంది. అపార తపస్సంపన్నులకే ఈ పరిస్థితి అంటే ఇక సామాన్య ప్రజల గతేమిటి? అసురశక్తులను ఎదిరించగల పుణ్యఫలం లేక వారు మాయలో చిక్కుకుని దుష్టజీవనాన్ని నడపాల్సిన పరిస్థితికి లోనయ్యారు. 

ఒక కుళ్ళిపోయిన మామిడిపండు గోదాములో గల మంచి మామిడిపళ్లను ఎలా పాడుచేస్తుందో అలాగే హిరణ్యకశిపుడనే ఒక రాక్షసుని ప్రవర్తన వలన ప్రపంచమే అల్లకల్లోలమైంది. శ్రీ నృసింహ అవతారం ఆవిర్భవించడం హిరణ్యకశిపుని సంహరించడానికి మాత్రమే కాదు. ఈ అవతార ఆవిర్భావానికి ఎన్నో లక్షల కారణాలున్నాయి. సంస్కారవంతులై, స్వార్థరహితులై, సమాజానికి మేలు చేకూర్చే విధంగా మానవులు జీవించాలి అనే భావనతో ఆవిర్భవించిందే ఈ నృసింహావతారం. 

హిరణ్యకశిపుడు ప్రేరేపించిన దుష్టభావనలు, శక్తులు, గుణాలు- విషక్రిములలాగా విస్తరించాయి. హిరణ్యకశిపుని సంహారం పూర్తయింది. ఆకనీ ఆ రాక్షసుని ప్రభావం వలన లోకంలో కలిగిన హాని, వ్యాపించిన దుష్టశక్తులు, చెడు ఆలోచనలు వీటన్నిటినీ పూర్తిగా నశింపచేయాలంటే మహర్షులు తమ సంపూర్ణ తపశ్శక్తిని ధారపోయాల్సి ఉంటుంది. వీటన్నిటినీ సూక్ష్మంగా గమనించారు శ్రీ నృసింహస్వామి. ఎక్కడెక్కడ అసురశక్తులు వ్యాపించాయో, అక్కడ తన ఉగ్ర స్వరూపాన్ని అనేక రెట్లు పెంచి నాట్యం చేశారు. 

ఈ అగ్ని నాట్యం ఎందుకు ?


శ్రీ నృసింహుని నాట్యం వలన ఏర్పడిన అగ్నిజ్వాలలో ఎన్నో అసురశక్తులు భస్మమైనాయి. వేలాదిమంది మహర్షులు వేలకొలది ఏళ్ళు తపస్సు చేసి అందువలన ఏర్పడిన తపశ్శక్తితో మాత్రమే నశించే అసుర దుష్టశక్తిని తమ విశేషమైన పాదయాత్రలతో ఉగ్ర నాట్యంతో రెప్పపాటు క్షణంలోపల భస్మీపటలం చేశారు. 

ఒకవైపు ఇలాంటి పరిస్థితి. మరోవైపు శ్రీ నృసింహుని ఉగ్రత్వం నిండి, సకలలోకాలూ ఆయన ఉగ్రత్వాన్ని తట్టుకునేలా పూజలు, ధర్మకార్యాలు చేసినా ఆయన అగ్నిజ్వాలల ప్రభావాన్ని భరించలేక తల్లడిల్లిపోయాయి. అందుకు కారణం శ్రీ నృసింహుని పాదపద్మాలు పడినచోట అగ్నిప్రవాహంగా మారింది. 

శ్రీ శరభేశ్వరుడు ప్రత్యక్షమై తమ పాదాలతో అగ్ని, రౌద్ర, తాండవ శక్తులు నిండిన విశేషమైన 'చాలువేశనాట్యగతి' నృసింహుని పాదాలు ఎక్కడంతా పడ్డాయో వాటిపై తమ పాదాలను ముద్రించుకుని ఆ ఉగ్రశక్తిని తమలో నింపుకున్నారు. 
ఇలా హరిపాదాలు, హరుని పాదాలు కలిసిన ప్రదేశాలన్నిటిలోనూ శ్రీ శరభేశ్వరశక్తి ఆవిర్భవించింది. ఇందువలననే శ్రీ శరభేశ్వర మూర్తిని ఆరాధించడానికి పాదరక్షలు లేక కేవలం పాదాలతో నడవాలనే నియమం ఏర్పడింది. 

రాహుకాలంలో శ్రీ శరభేశ్వరుని పూజ 

రాహుకాలంలో చేయబడే కొన్ని విశేష పూజలకు ఎన్నో రెట్ల ఫలితం ఉంటుంది. మంగళవారం నాడు రాహుకాలంలో దుర్గాపూజను లక్షలాది మంది ప్రజలు ఈనాటికీ చేస్తున్నారు. అలాగే ఆదివారం సాయంత్రం ప్రదోషవేళలో, రాహుకాలం కూడా కలిస్తే శరభేశ్వరునికి విశేషపూజ నిర్వహించడం శ్రేష్ఠం. 

పూజాసమయంలో హోర ఆరాధానకు ప్రాముఖ్యత ఎక్కువ. సూర్యోదయం నుండి మరునాటి సూర్యోదయం వరకూ గల 24 గంటల సమయంలో ఏడు గ్రహాలకూ నిర్దిష్ట క్రమంలో ఆయా సమయాలలో ఆధిక్యం ఎక్కువ. 

ఇందువలననే సూర్య హోర, చంద్రహోర, బుధహోర అని సూచించబడ్డాయి. 
ఆదివారంనాడు వచ్చే నిత్య ప్రదోష సమయంలో 4.30 గంటల నుండి 5 గంటలవరకూ చంద్ర హోర, 5 గంటల నుండి 6 గంటల వరకూ శనిహోర వుంటాయి. కాబట్టి దీనికంటూ కొన్ని ప్రత్యేక సిద్ధ ఆరాధానలున్నాయి. 

చంద్రహోర పూజ 

ఆదివారానికి తగిన ప్రదోష సమయంలో చంద్రహోర, శనిహోర కలిసినట్లు మనం చూశాం కదా? కాబట్టి చంద్రహోరకు తగిన సమయమైన 4.30 నుండి 5.00 గంటలవరకూ స్వచ్ఛమైన ఆవుపాలతో అభిషేకం చేసి, వెన్న ఉండలతో అర్చిస్తే, చంద్రునికి ఇష్టమైన బియ్యంతో చందనం పూసి, దానిపై బియ్యాన్ని వుంచి అలంకరిస్తే, శ్రీమంతులు ముత్యాలతో అభిషేక, అలంకార అర్చనలు చేయడం, వెండి సరిగంచు వస్త్రాలు చుట్టి, ఆరాధించడం, చంద్రమౌళీశ్వర అర్చన, సంకీర్తనలు మొదలైన విధానాలలో శ్రీ శరభేశ్వరునికి పూజచేస్తారు. చంద్రునికిష్టమైన తెలుపురంగు ఆహారపదార్థాలను వండి (కొబ్బరన్నం, కట్టుపొంగలి, కేసరిలాంటి తెల్లరంగు నైవేద్యాలు) పేదలకు ప్రసాదంగా పంచిపెట్టాలి. 
ఇలా చేయడం వలన కుటుంబంలో కోడలు, అత్తగార్ల మధ్య మనస్పర్థలు తొలగి సామరస్యం ఏర్పడుతుంది. పైగా అనేక సమయాలలో స్వంత కుమారులు, కుమార్తెలు మధ్య కూడా అనేక రకాల అభిప్రాయభేధాలు వస్తూ వుంటాయి. అలాంటివాటిని తొలగించడానికి ఆదివారం నాడు రాహుకాలంలో చంద్రహోర సమయంలో శ్రీ శరభేశ్వరుని పూజ చక్కగా సహకరిస్తుంది. 
కొన్ని దుర్వ్యసనాల వలన మనసులో ప్రశాంతత తగ్గి, మానసిక వేదనకు లోనయ్యేవారెందరో వుంటారు. అలాంటి వారు ఈ పూజ చేస్తే వారిలో సత్ప్రవర్తన, ప్రశాంతత ఏర్పడుతుంది. కార్యాలయాలలో పై అధికారులకు భయపడి ప్రతి నిమిషమూ వేదనకు గురయ్యేవారు ఈ పూజ చేస్తే పై అధికారుల దుష్ప్రవర్తన తగ్గి కార్యాలయంలో శాంతి నెలకొంటుంది. 
ఆదివారం రాహుకాల శనిహోర పూజ 
శనిహోర పూజ సాయంత్రం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటలవరకూ! 
శనిహోర, రాహుకాలం కలిసిన ఆదివారం నాడు శ్రీ శరభేశ్వర పూజలో, శ్రీ శరభేశ్వరునికి నల్లని వస్త్రాలను ధరింపచేసి, నువ్వులుకలిసిన ఆహారాన్ని (నువ్వులఉండ, నువ్వులన్నం) వండి అన్నదానం చేయాలి. ఈ శనిహోర సమయంలో దివ్యాంగులకు సాయపడితే పలురెట్ల పూజా ఫలితం లభిస్తుంది. 

పైగా స్వామికి మినుములు, నువ్వులనూనె కలిపి చేసిన ఆహారపదార్ధాలను, రకరకాల పళ్ళనూ నివేదించి, ముదురునీలం రంగు లేదా నల్లని వస్త్రాలను ధరింపచేసి, చందనంలో పునుగుకలిపి అభిషేకం లేదా పూత వేయాలి. నాగలింగ పుష్పాలతో పూజచేస్తే శనిహోరకు చాలా విశేషం. 

శత్రుత్వం తొలగడానికి 

శనిహోర పూజ చేస్తూ వస్తుంటే, ఏళ్ళ తరబడి ఆస్తి / బంధుత్వం లాంటి విషయాలలో కోర్టులు, కేసులు అంటూ తిరగాల్సిన అవసరం లేకుండా చక్కని తీర్పు లభిస్తుంది. అందులోనూ బంధువుల వలనా, ఇరుగింటి, పొరుగింటి వారి వలన ఏర్పడే రకరకాల నిర్మాణ పనులలో గల సంకటాలు తొలగి పనులు సాఫీగా సాగడానికి ఈ పూజ ఎంతో ఉపకారి! 

సమస్యలు అధిగమించడానికి

పుకార్లు, అబద్ధాలాడడం వలనా ఎన్నో కుటుంబాలలో వివాహ సంబంధాలు చెడిపోతున్నాయి. అవి విడాకుల వరకూ వెళుతున్నాయి. ఈ స్థితికి చేరుకున్న వారు ఆదివారం రాహుకాలంలో శనిహోర కలిసిన సాయంత్రం 5 గంటలనుండి 6 గంటలవరకూ పైన చెప్పబడిన పూజలను చేస్తూ వుంటే, పై సమస్యల వలన ఏర్పడిన మనస్తాపాలు, శత్రుత్వం, మానసిక సమస్యలూ తొలగి సత్సంబంధాలు నెలకొంటాయి. ఆకాశారామన్న ఉత్తరాలు, అసత్యప్రచారాలు, పుకార్లవలన కొన్ని కార్యాలయాలలోని సిబ్బంది జీవితం బాధించబడుతుంది. ఇలాంటి వారు ఈ పూజలు చేస్తూ వుంటే ఆ సమస్యలు తొలగి మరలా సుఖజీవనం లభిస్తుంది. 
శరభేశ్వరుని అవతారానికి, ఆకృతికి తగినట్టుగా శైవ, వైష్ణవ సంప్రదాయాల ఏకత్వం వలన శీతల దేహకాంతి గలిగి, అగ్నిమయమైన దైవీక శక్తులను శాంతపరచడానికి బిల్వం, తులసి కలిసిన తీర్థం ఈ పూజలో వినియోగించబడుతున్నది. 
శరభశక్తి పుష్పాలు 
భగవానుని పవిత్రదేహాన్ని అలంకరించడానికి ఆయన అనుగ్రహంతో దివినుండి భువికి దిగివచ్చినవే పుష్పాలు. అయితే కేవలం కొన్ని రకాల పుష్పాలనే భగవంతుని వేదికను అలంకరించడానికీ, ఆయన కంఠంలో హారాలు వేయడానికీ, ఆయనను పూజించడానికీ ఉపయోగిస్తున్నాము. కొన్ని రకాల పుష్పాలు అడవిలోనే పూచి, అక్కడే గాలికి రాలి, భూమిలో కలిసిపోతున్నాయి. అయితే అడవిలో పూచే కొన్ని రకాల పుష్పాలకూ కొన్ని రకాల సువాసనలూ, మహిమలూ ఉంటాయి కదా! అన్నీ వ్యర్థమైనవి కావు కదా? 
శ్రీ శరభేశ్వరుని ప్రతిరోజూ కొన్ని రకాల పుష్పాలతో పూజిస్తే సకలకార్యాలూ సిద్ధిస్తాయి. 
ఆదివారం - తులసి, బిల్వం 
సోమవారం - పారిజాతం 
మంగళవారం - గోగుపూలు 
బుధవారం - తామరపూలు 
గురువారం - గోగుపూలు, చామంతి 
శుక్రవారం - మల్లెపూలు, తుమ్మిపూలు 
శనివారం - కదంబం (వాసనగలపూవులు మాత్రమే) 
(అడవిమల్లె, కనకాంబరం, డిసెంబర్‌ లాంటి పువ్వులను తప్పనిసరిగా వాడరాదు) 
ప్రదోషసమయం - గరిక, బిల్వం 

చందనంతో వందనం

అంగడిలో అక్ము చందనాన్ని కొనకుండా, ఇంట్లోనే సానపై గంధపు చెక్కను అరగదీసి వచ్చిన చందనాన్ని శ్రీ శరభేశ్వరుని పూజకు ఉపయోగించాలి. ఈ చందనాన్నే చిన్న ఉండలుగా చేసి వాటితో శరభేశ్వరుని ఆరాధించాలి. దేవాలయానికి గంధపు చెక్కను, సానరాయిని తీసుకుని వెళ్ళి గంగా, కావేరీలాంటి పవిత్ర జలాలనుపయోగించి భక్తులు అక్కడే గంధాన్ని అరగదీసి దానికి పన్నీరు కలుపుకోవాలి. అలా తీసిన గంధంతో మూడుగంటలలోపు స్వామిని ఆరాధిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుంది. 

సిద్ధులచే తయారుచేయబడే తేనె 

శ్రీ శరభేశ్వరునికి తేనెతో అభిషేకించడం చాలా శ్రేష్ఠం. 
కొల్లిమలై, పచ్చమలై లాంటి పర్వతప్రాంతాలలో సిద్ధులు, యోగులు, తేనెటీగల రూపంలో తిరుగుతుంటారు. వారు ఎవరూ సంచరించలేని హిమాలయ పర్వత ప్రాంతాలలో భగవంతుని కోసమే పూచే పూవులనుండి అపూర్వమైన తేనెను సేకరిస్తుంటారు. కాబట్టి ఇలాంటి స్వచ్ఛమైన, పవిత్రమైన కొండతేనెను ఆర్ద్రానక్షత్రంలో, ఆదివారం ప్రదోషసమయ రాహుకాలంలో శ్రీ శరభేశ్వరుని అభిషేకానికి ఉపయోగించడం సర్వశ్రేష్ఠం. 
శివతేనె 
ఎన్నడూ వెగటుపుట్టని పరమేశ్వరనామ జపాన్ని స్మరిస్తూ తేనెతో అభిషేకిం చేయాలి. 108 శంఖాలలో శ్రేష్ఠమైన, సువాసనాభరితమైన తేనెను తీసుకుని, ఒక్కొక్క శంఖాన్నీ శరభేశ్వరుని ముందుంచి శరభేశ్వర కవచాన్ని పఠించాలి. ఒక పెద్ద శంఖంలో 108 సార్లు తేనెను నింపి, ప్రతిసారీ శ్రీ శరభేశ్వర కవచాన్ని పఠించి, దానిని మరొక పెద్దపాత్రలో నింపాలి. ఉద్ధరిణలో ఇలా తేనెను సేకరించుకోవడం శ్రేష్ఠం. 
ఇలా సేకరించిన తేనెతో శ్రీ శరభేశ్వరమూర్తికి అభిషేకం చేయాలి. కొద్దిగా తేనెను ప్రసాదంగా స్వీకరించి, మిగిలివున్న తేనెను కలిపి ప్రసాదంగా ఉపయోగించవచ్చు. 

ప్రయోజనాలు 

శ్రీ శరభేశ్వరమూర్తికి అభిషేకం చేసిన తేనెను కనీసపక్షంగా ఒక మండలం (48 రోజులు) నిరంతరం సేవిస్తుంటే ఎన్నో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. 
1. ఉష్ణ సంబంధిక వ్యాధులు (మూలశంక, విరేచనాలు) తొలగిపోతాయి. 
2. గర్భకోశసమస్యలు, ఋతుసమస్యలూ తొలగిపోతాయి. 
3. నోటిపుండ్లు, గొంతులో గరగర వ్యాధులు నివారించబడతాయి. 
4. నత్తి, గొంతులో వివిధ రకాల సమస్యలతో మాట్లాడడానికి అవస్థలు పడే పిల్లలకూ ఉపశమనం కలుగుతుంది. అయితే వీరు క్రమం తప్పకుండా ఈ ప్రసాదాన్ని సేవిస్తూ ఉండాలి. 

వరాలిచ్చే వస్త్ర పూజ 

శ్రీ నృసింహుడు హిరణ్యకశిపుని సంహరించి అతని రక్తాన్ని త్రాగి, అతని ప్రేవులను హారాలుగా, ఎముకలను ఆభరణాలుగా ధరించాడు. దీని వలన ఆయన ఉగ్రస్వరూపం ఎన్నో రెట్లు ఇనుమడించింది. చివరాఖరికి శ్రీ శరభేశ్వరుడు శ్రీనృసింహునిలో లీనమైనాక, ఆయన ఉగ్రత్వం తగ్గింది. శ్రీనృసింహుడు ధరించిన ప్రేవుల హారాలు వస్త్రాలుగా మారాయి. శ్రీ నృసింహుని మొర ఆలకించిన శ్రీ శరభేశ్వర రూపం ప్రకటితమై ఆయన తెల్లని పట్టు వస్త్రాలను ధరించారు. కాబట్టి శ్రీ శరభేశ్వరమూర్తికి తెల్లని పట్టువస్త్రాలు సమర్పించి, ఆరాధిస్తే, ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చును. 

దైవం ధరించిన వస్త్రం


పౌర్ణమినాడు శ్వేతవస్త్రం ధరించిన శ్రీ శరభేశ్వరుని 108 గంధపు ఉండలు లేదా వెన్న ఉండలతో అలంకరించి, 108 మార్లు శ్రీ శరభేశ్వర కవచం పఠించడం శ్రేష్ఠం. దీని వలన పాండు రోగం నివారించబడుతుంది. 
రాహుకాలంలో తెల్లని పట్టువస్త్రం, నీలిరంగు వస్త్రాలతో అలంకరిస్తే పగటిసమయాలలో పసుపు రంగు పట్టువస్త్రాలను అలంకరించి గంధపు ఉండలతో అర్పించి పూజ చేయవచ్చును. ఇందువలన సకల చర్మవ్యాధులూ నశిస్తాయి.
యుగయుగాలలో శరభేశ్వరుడు 

శ్రీ శరభేశ్వరుని అవతారం, శ్రీ నృసింహుని ఉగ్రత్వాన్ని తగ్గించడానికి మాత్రం వచ్చినది కాదు. శ్రీ శరభేశ్వర అవతారం అంతకుముందే అవతరించినది. యుగాల విభజనకు ముందే, యుగధర్మానికి తగినట్లుగా అవతారాల శిష్టరక్షగా విధానాలు ఏర్పడతాయి. 
కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచినందువలన అక్కడ అధర్మం, ఈర్ష్యాసూయలు, హింసాప్రవృత్తి లేక లోకమంతటా ధర్మమే విలసిల్లింది. కాబట్టి అప్పుడు శ్రీ శరభేశ్వరమూర్తి అనుగ్రహమూర్తిగానే అక్కడ వెలశారు. 

త్రేతాయుగంలో చిన్నచిన్న పొరబాట్లు దొర్లినందువలన వాటిని సరిదిద్ది ధర్మపాలనను నెలకొల్పే శ్రీదండమూర్తిగా అవతరించారు. 

ద్వాపరయుగంలో పాపాలను పోగొటై శ్రీ భటగ్రమూర్తిగా విలసిల్లారు. కలియుగంలో తాను ధర్మపాలన చేసి శిష్టులను దుష్టుల బారినుండి కాపాడే ప్రబంధమూర్తిగా అనుగ్రహిస్తున్నారు. 

భయపడకు! భయవడకు!


శ్రీ శరభేశ్వరునికి శ్రీ కంభహరేశ్వరుడనే పేరూ వుంది. స్తంభంలో ప్రత్యక్షమైనాడు. భయాన్ని పోగొట్టాడు. 'భయపడకు, భయపడకు' అని అభయహస్తం చూపినవాడు. హింసనూ, ద్రోహచింతనను చూసి భయపడిన మంచివారికి ధైర్యాన్నిచ్చి, సన్మార్గానికి మరలే మానసిక స్థైర్యాన్నిచ్చాడు. కాబట్టి ఆయనను శ్రీకంభహరేశ్వరుడనే పేరిట ఆరాధించేవారున్నారు. 
కలియుగంలో దుష్టుల దుష్ప్రవర్తనాశక్తి పెరిగేలా అనిపిస్తుంది. కానీ ప్రగాఢవిశ్వాసం, భగవంతుని పట్ల శరణుజొచ్చేవారు చివరిగా కచ్చితంగా విజయం సాధిస్తారు. ''సహనశీలురు భూమిని పాలిస్తారు'' అన్నట్లుగా గురువు అనుగ్రహంతో అన్నిటినీ భరించి, సత్కార్యాలను నెరవేర్చేవారికి మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తారు శ్రీ శరభేశ్వరుడు. 

కలియుగంలో దుర్మార్గులు ఎన్నో హింసాకృత్యాలను చేస్తుంటారు. బంధువులు, సహోద్యోగులు, ఇరుగుపొరుగులు మనకు శత్రువులై చేతబడులు చేసి మన మానసిక సమస్యలకు కారణం అవుతుంటారు. 
కార్యాలయాల్లో, గృహాలలో, వ్యాపారాలలో, ఇతర ప్రదేశాలలో తమ దుష్టశక్తులచే, దురాలోచనలచే, చెడుమాటలచే, తమ దుర్భాషలతో, దుష్టచేతలతో ఇతరులను హింసిస్తుంటారు. అలాంటి వారు ఈ కలియుగంలో పెరిగిపోతూ వున్నారు. ఇందువలన మంచివారు భయంతో ఎన్నో అవస్థలు పడుతూ మానసిక వేదనతో కుములుతున్నారు. 
ఆస్తులు, ఆస్తుల పంపకం, పదోన్నతి లాంటి అనేక కారణాల వలన పగవారుగా మారేవారెందరో. అలాంటివారి నుండి మంచివారిని కాపాడి వారు శ్రీ శరభేశ్వరుని అనుగ్రహం పొందేలా చేయాలి. 

సుఖదుఃఖాలు మన పూర్వజన్మ ఫలితం వలననే వస్తుంటాయని తెలియక మనుష్యులు తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. 

మానసికస్థైర్యం తగ్గవచ్చునా? సమస్యలో, అనారోగ్యాలో వచ్చినప్పుడు ముందుగా బాధించబడేది వారి మనస్సే. మానసిక ఆందోళన కలుగగానే దైవంపై గల నమ్మకం గురువుపై గల విశ్వాసం కాస్త సన్నగిల్లుతాయి. కాబట్టి ప్రతి ఒక్క మనిషీ శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పనిసరి అని సిద్ధపురుషులు బోధించారు. 
పునాదులే కదిలిపోతే ఏంచేయాలి? 
సాధారణంగా ప్రకృతివైద్యం మనలో దైవం పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది. కాబట్టే ఆయుర్వేద, సిద్ధ వైద్యాలలో గల మూలికల శక్తి మనోస్థైర్యాన్ని పెంచుతుంది. ఆధునిక వైద్యంలోని రసాయనిక వస్తువుల వాడకం వలన శరీరం, మనసూ చాలా తీవ్రంగా బాధింపబడతాయి. 
మనసు బలహీనపడితే రోగనిరోధనశక్తి తగ్గి, మనోదౌర్బల్యానికి దారితీసి, అనేక విధాలైన దురాలోచనలు, దుష్టశక్తులూ శరీరంలోకి చొచ్చుకుపోయి మనోవేదనలను ఎక్కువచేస్తాయి. అప్పుడు భగవత్‌ చింతన కలుగదు. ఎన్ని మార్లు ప్రయత్నించినా మనసు ప్రార్థనచేయడానికి అంగీకరించదు. ఇలాంటి స్థితి నుండి మనలను బయటపడేయడానికి సాయపడేదే శ్రీ శరభేశ్వర ఆరాధన. 

మానసిక దృఢత్వానికి శ్రీ శరభేశ్వరుడు 

మనం కేవలం ఒక్కసారి పద్ధతిగా శరభేశ్వరుని ఆరాధిస్తే చాలు, అందువలన మనకు అపార మానసిక శక్తి చేకూరి, మనం అంతవరకూ చేసుకున్న పుణ్యం ఆధారంగా మనసు దృఢత్వాన్ని పొందుతుంది. మనం దీనికోసం వేలాది రూపాయలను ఖర్చుచేసి శరభేశ్వర ఆరాధన చేయనవసరంలేదు. సాధారణ ఆరాధనే చాలు. 
శ్రీ శరభేశ్వరుని పూజిస్తే కలిగే ఫలితం 
కొన్ని కుటుంబాలలో రాత్రిపూట పిల్లలు జడుసుకుని ఏడుస్తూ వుంటారు. పడకలు తడుపుతుంటారు. ఇలాంటి పిల్లల కోసం గంధాన్ని అరగదీసి ఇంట్లో శ్రీ శరభేశ్వర మూర్తికి ఆ గంధాన్ని ప్రతి రోజూ పూస్తుంటారు. దీని ఫలితంగా పిల్లలు రాత్రిపూట పక్క తడపడం, భయంతో కేకలు వేయడం, ఆ భయం కారణంగా జ్వరాలు రావడం వంటి సమస్యలు సులభంగా నివారించబడతాయి. 

దుఃస్వప్నాలు / భయాలు తొలగడానికి 

దుఃస్వప్నాల వలన కొందరు రాత్రిపూట లేని భయంతో కేకలు వేస్తుంటారు. దొంగలు, పాములు, భయంకరమైన అడవులు లాంటివి కలలోవస్తే కొందరు బిగ్గరగా కేకలువేస్తూ భయంతో లేచి కూర్చుంటారు. రాత్రి పడుకునేముందు శ్రీ శరభేశ్వరకవచం పఠించి, ఉదయమూ, మధ్యాహ్నమూ శ్రీ శరభేశ్వర అష్టోత్తరాన్ని చదివి, గంధం, శివానీ పసుపు, వెన్న ఉండలు లాంటి వాటితో అర్చిస్తూ వస్తే ఇలాంటి భయాలు, సమస్యలు రాకుండా సంకష్టాలు తొలగిపోతాయి. 
కలియుగానికే సంకేతమైనట్లుండే హింస, దుష్టకార్యాలు, పగ, దుర్మార్గం లాంటివి అధికమైనందువలన శత్రువుల దుష్టత్వాన్ని ఎదిరించి, ఎదురీత చేకొనవలసిన మన జీవితపయనం మందగతిని సాగుతుంది. ఆ జీవనం సన్మార్గంలో సాగడానికి కటాక్షాన్ని అనుగ్రహించే పెన్నిధిని మనకందించేదే శ్రీ శరభేశ్వర ఆరాధన. 
జన్మకర్మపరిపాకం తొలగడానికి 
ప్రదోషకాల శ్రీ శరభేశ్వరుడు, శ్రీ ప్రత్యంగిరా, శ్రీ నృసింహ ఆరాధనా విధానలు అధికభాగం ప్రాయశ్చిత్తాలకు పరిహారం ఎందుకంటే ప్రదోష సమయమే పాపాలను భస్మం చేసే దీర్ఘకాల అగ్నిశక్తిని కలిగివున్నది. 

జన్మకర్మలు తొలగాలంటే, ఆ ఫలితాలను మనం అనుభవించే తీరాలి. లేదా ఒక సద్గురువు ఆ వ్యక్తి పాప భారాన్ని తాను మోసి వారిని ఆ పాపాల నుండి విముక్తి చేయాలి. మూడవది ప్రదోషకాలపూజ, తీర్థకండి పూజలాంటి విశేషపూజలు చేసి, దానధర్మాలు గావించి, గురువు అనుగ్రహంతో వాటిని తొలగించుకోవాలి. 

కవచజలూషర్‌ 

కవచజలూషర్‌ సిద్ధులు యోగం, తపస్సులాంటివి చేస్తూ తిరుఅణ్ణామలైలో తమ శిష్యులైన శిఖండి సిద్ధులకు గురు కులవాసయోగం కల్పించారు. దీనినే 'శిఖండి' దర్శనమంటారు. 
కవచజలూషర్‌ కొన్ని యుగాలపాటు తపస్సుచేసి భగవంతుని కాలి అందెలుగానూ, కంకణాలుగానూ, కాలిగజ్జెలుగానూ, కుండలాలుగానూ, గాజులుగానూ, మెట్టెలుగానూ, కిరీటంగానూ, నాగాభరణంగానూ, వేశీ ఆభరణంగానూ, చేమంతి బిళ్ళగానూ, భగవంతుని పవిత్రదేహాన్ని స్పృశించే మహాభాగ్యాన్ని పొందారు. 
భగవంతుని అనేక విధాల బంగారు, వెండి, రత్న, వైఢూర్యకలశాలుగానూ మెరిసే 'ఆవాహన ప్రపంచ శక్తి' ని భగవంతుడు అతనికి ఇచ్చాడు. 

దేవాధిదేవుడు, మహర్షులు, యోగులు భూలోకంతోబాటు అనేక లోకాలలోనూ భగవంతుని దేవాలయాలు నిర్మించే సమయంలో, 'దేవప్రతిష్ఠ'కు కవచజలూషర్‌ సాయం అర్థించారు. 
శ్రీ శరభేశ్వరుడు ప్రత్యక్షమై అనుగ్రహించాల్సిన అద్భుతమైన స్తంభాలలో శ్రీ కవచజలూషలే అనేక రకాల పూజలు చేసి తనే అందులో భగవంతుని కాలి అందెలుగా, కాలిగజ్జెలుగానూ పలురూపాలలో ప్రత్యక్షమై 'ఆత్మశంకర' పూజను నెరవేర్చి 'ఆ స్తంభాన్ని' శ్రీ శరభేశ్వరులు ఆవహించడానికి దానిని పవిత్ర శక్తిగా వేద, మంత్ర, యంత్ర, తంత్ర పూజా విధానాలతో రూపొందించారు. 

శ్రీ శరభేశ్వర కవచ మహిమ


మానవులు చేసే పూజల కన్నా సిద్ధులు చేసే పూజలు అనేక రెట్లు శక్తిమంతమైనది. అలాంటి విధానాలలో శ్రీ కవచజలూషర్‌ తాను సిద్ధపరచిన శ్రీ శరభేశ్వర బీజాక్షరశక్తిని కలియుగంలోని మానవులకు ఉపయోగకరం కావాలని సులభమైన విధివిధానాన్ని స్తుతిగా శ్రీ శరభేశ్వర కవచశక్తిని అనుగ్రహించారు. ఈ కవచం అనేక రకాల సంకటాలను తొలగించగల అత్యద్భుత మంత్రశక్తి నిండినది! చదవడానికి కూడా సులభమైనది! 
ఎంతో అద్భుతమయమైన బీజాక్షరాలు కలిగినది! 
కార్యసిద్ధులు కలుగడానికి 

శ్రీ శరభేశ్వర ఆరాధన చాలా శక్తివంతమైనది. శ్రీ కవచజలూషర్‌ రచించిన శ్రీ శరభేశ్వర కవచాన్ని తరచుగా చదువుతుంటే అకారణంగా కలిగే భయాలు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు, భర్త మూర్ఖత్వం, అత్తమామల దౌర్జన్యం, భద్రతాలేమి హఠాన్మరణం, ప్రమాదాల కారణంగా కొందరు కుటుంబ స్త్రీలు సదా ఎప్పుడేం జరుగుతుందో అనే భయంతో జీవిస్తున్నారు. వీరు కవచజలేశ్వరుని శ్రీ శరభేశ్వర కవచాన్ని పఠించి, ఆదివారం రాహుకాలం, దినసరి ప్రదోషసమయం, అమావాస్య, పౌర్ణమి తరువాత వచ్చే ప్రదోష దినాలలో శ్రీ శరభేశ్వరునికి తాము తీసిన గంధాన్ని పెట్టి రావాలి. 

ఎన్నెన్ని మార్గాలు, అన్నీ నీ రూపమే శ్రీ శరభేశ్వరా! 

శ్రీ నృసింహుని ఉగ్రత్వాన్ని నివారించడానికి శ్రీ శరభేశ్వరులు ఎన్నో రకాల అవతారాలు దాల్చారు. ఒంటితల ఆకారం, రెండు తలల ఆకారం, వేయి తలలుగల శరభరూపం, రెండు చేతులుగల శరభరూపం, ఎనిమిది చేతులుగల శరభరూపం - ఇలా అనేక రూపాలు దాల్చారు. ఆయా ప్రదేశానికీ, స్థితికీ తగినట్లుగా తన ఆకారాలన్ని మార్చుకుని దైవలీలలను అందరూ గ్రహించేలా చేశారు. 

శ్రీ శరభేశ్వర దేవాలయాలు గల కొన్ని ప్రదేశాలు 

1. తమిళనాడు కుంభకోణానికి సమీపంలోని త్రిభువనం. 
2. చెన్నై శ్రీ వల్లీశ్వర దేవాలయం లాంటి ప్రదేశాలలో శ్రీ శరభేశ్వర మూర్తికి ప్రత్యేక సన్నిధిలున్నాయి. 
పైగా తిరుఅణ్ణామలైలోని అరుణాచలేశ్వర దేవస్థానంలో, మదురై శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల దేవాలయంలో, చిదంబరం శ్రీ నటరాజు దేవాలయంలో, అరంతాంగికి సమీపంలోని శ్రీ ఆవుడయార్‌ దేవాలయంలో, చెన్నైలోని మైలాపూరు శ్రీ కపాలీశ్వర దేవాలయంలో, మాడంబాక్కం శ్రీ ధేనుపురీశ్వరర్‌ దేవాలయంలో, తిరువాన్మయూర్‌ శ్రీ మరుంధీశ్వరర్‌ దేవాలయంలో, చెన్నైలోని ఎన్‌ఎస్‌సి బోస్‌ రోడ్‌ శ్రీ శివసుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో, చెన్నై పూందమల్లిలోని శ్రీ వైదీశ్వర దేవాలయంలో శ్రీ శరభేశ్వరుని విగ్రహాలున్నాయి. 

శ్రీ అసాధ్యసాధక శరభేశ్వరుడు


మనం అనుకుంటున్నట్లుగా శ్రీ శరభేశ్వర అవతారంలో ఆరాధిస్తున్నది ఒకే ఒక శ్రీ శరభేశ్వరుని మూర్తిని మాత్రమే కాదు. మనం ఎలా కుమారస్వామి, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు, పళనిదైవం, దండాయుధపాణి అని వివిధరూపాలలో కొలుస్తున్నామో అలాగే శ్రీ శరభేశ్వరమూర్తి కూడా ఎన్నో అవతారాలలో, వివిధరూపాలలో మనలను కటాక్షిస్తుంటాడు. అందుకు కారణం మనం శ్రీ నృసింహుని శాంతింపచేయడానికే శ్రీ శరభేశ్వరుడు అవతరించాడని అనుకుంటున్నాం. శ్రీ శరభేశ్వర అవతార మహిమలలో ఒకటి - శ్రీ నృసింహమూర్తి ఉగ్రత్వాన్ని శాంతింపచేయడం. ఇదేకాక దీనికి మరెన్నో కారణాలున్నాయి. 

అందుకు కారణం - కలియుగంలో పెచ్చుపెరుగుతున్నా హింసాకృత్యాలు, అనైతిక సంబంధాలు, దురాగతాలు, అసూయ, మద్యపానం, లాటరీలు లాంటి అనేక దుష్టత్వాలనుంచి మంచివారిని కాపాడడానికి శ్రీ శరభేశ్వరుడు విలసిల్లారు. కాబట్టి, కలియుగంలో అవతరించిన మూర్తిగా, ప్రత్యక్ష దైవంగా శ్రీ శరభేశ్వరుడు విలసిల్లాడని సిద్ధపురుషులు చెప్తారు. 

శ్రీ అసాధ్యసాతక శరభేశ్వరుడు
మదురై

శ్రీ నృసింహస్వామి ఉగ్రరూపాలలో కూడా అనేకరకాలున్నాయి. ఆయన హిరణ్యకశిపుని సంహరించి ఉగ్రతాండవం చేశారు అనే విషయం మాత్రమే మనకు తెలుసు. వాస్తవానికి శ్రీ ఉగ్రనరసింహుడు ఎన్నో రకాల అన్నీ రూపాలలో, అవేశ ఉగ్ర తాండవ స్థితులలో ఈ ప్రపంచాన్ని ప్రదక్షిణ చేసినప్పుడు, ఆయా రూపాలలో ఆయనను శాంతపరిచేందుకు శ్రీ శరభేశ్వరమూర్తి కూడా ఎన్నో అవతారాలను వివిధ రూపాలలో దాల్చారు. ఈ విధంగానే నేటికి కూడా ఎన్నో ఆలయాలలో వివిధ మూర్తులలో, స్తంభాలలో శ్రీ శరభేశ్వరమూర్తి అనుగ్రహిస్తున్నాడు. 
ప్రతి ఒక్క దేవాలయాన్నీ, ఒక్కొక్క స్తంభాన్నీ అవహించివున్న దేవాధిదేవుడు, దైవమూర్తులు, సిద్ధపురుషులూ, మహర్షులు, యంత్రాలలో, రూపాలలో గల మహిమలను గురించి మనకెన్నో వివరాలు లభిస్తున్నాయి. వీటన్నిటినీ పురాణాలుగా చెప్పుకుంటే అవే ప్రపంచమంతటా నిండిపోతాయి. పైగా అన్నింటినీ పురాణాలుగా రచిస్తే, మానవసమాజం వాటిని మరచిపోవడం లేదా అవి మాయమవడం జరుగుతుంది. ఇప్పటికే వేలాది పురాణాలు భారతదేశమంతటా నిండివుండగా వాటన్నిటినీ ప్రజలు చదవగలరా ఏం? కొన్ని మాత్రమే వారికి గుర్తుంటాయి. కొన్నింటిని వారు మరిచిపోతారు. భగవదారాధన నియమాలను, పూజా విధానాలనూ సద్గురువుల మూలంగా తెలుసుకోవడం ఉత్తమం! 

నృసింహుడు నెరవేర్చిన కార్యాలు 

శ్రీ నృసింహుని ఉగ్రతాండవ రూపాలలో ఒకటి 'పూర్వాగ్ని ఉగ్రతాండవం'. శ్రీ నృసింహుని అవతార మహిమలలో ఒకటిగా ప్రఖ్యాతిచెందినది ఆనందతాండవరూపం ఒకటి. శ్రీ నృసింహమూర్తి ప్రపంచంలో అనేక లోకాలలో స్థితులలో నర్తించి వచ్చినప్పుడు, రాక్షస సామ్రాజ్యాలుగా వెలసి, బాధతో కుమిలిన ఎన్నో కోట్ల ప్రజలకు మేలు చేకూరింది. అనేకలోకాలలో శ్రీ నృసింహమూర్తి పవిత్ర పాదాలు సోకిన చోట అక్కడ విస్తరించివున్న రాక్షసస్వభావాలు, దుష్టప్రవర్తనలు, దుష్టశక్తులూ భస్మమైనాయి. ''ఎవరు ఈ లోకాలలోని జీవులకు ముక్తినిస్తారు? ఎవరు మనకు ముక్తినిస్తారు'' అని కోట్లాది ప్రజలు కలతచెందుతూ ఉండగా శ్రీ నృసింహమూర్తి పవిత్రపాదాలు వారికి రక్షగా నిలిచాయి. ఈ లోకాలు మరలా సకల సౌభాగ్యాలతో విలసిల్లాయి. 

కానీ ఈ అగ్నితాండవంతోబాటు శ్రీ నృసింహుడు ఊరేగింపుగా వచ్చినప్పుడు వారు ఈ అగ్నిశక్తిని తట్టుకోలేక తల్లడిల్లిపోయారు.
వాస్తవానికి మనం జీవిస్తున్న భూలోకం ఒక్కటే అనుకోకండి! ఇలాంటి భూలోకాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇలా ప్రతి భూలోకంలోనూ కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలలోనూ నేటికీ జనజీవనం సాగుతూనే ఉన్నది. మనం నివసిస్తున్న ఈ భూలోకంలో ఇప్పుడు కలియుగం జరుగుతోంది. మన భూలోకానిని నాలుగువేలకోట్ల చతురానన మైళ్ళకు ఆవల మరొక భూలోకంలో ప్రస్తుతం కృతయుగం జరుగుతూ ఉన్నది. అంటే మన ఆయుర్దేవి అవతార మహిమ అక్కడ బ్రహ్మాండంగా జరుగుతున్నది. మరొక భూలోకంలో ప్రస్తుతం శ్రీరామావతారం జరుగుతూన్నది. వీటన్నిటినీ గురుముఖతః వింటూ వుంటే మనకు సిద్ధపురుషుల మహిమల గొప్పదనం తెలియవస్తుంది! 
అసాధ్యసాధకుడు వచ్చాడు! 

పూర్వాగ్ని ఉగ్రతాండవంలో శ్రీ నృసింహుడు భూలోకంలో ప్రదక్షిణగా వచ్చినప్పుడు ఆయన ఉగ్రప్రవాహాన్ని నిగ్రహించి, ఆయనను శాంతపరచడానికి శ్రీ శరభేశ్వరమూర్తి 'శ్రీ అసాధ్యసాధక విజయ శరభేశ్వరుడు'గా అవతరించి 'నిరంజనా నేత్రదృష్టి' అనే అద్భుతమైన నేత్ర దీక్షను దాల్చగానే, దాని అనుగ్రహం వలన శీతలజ్యోతి ప్రవాహంతో శ్రీ నృసింహుని ఉగ్రరూపం శమించి, ఆయన అగ్ని బింబ పవిత్రపాదాలు భూమిపై పడ్డాయి. కానీ నృసింహమూర్తి యొక్క వేడిని తట్టుకోవడానికి వీలుకానందువలన భూదేవి తల్లడిల్లింది. 

ఒకవైపు శ్రీ నృసింహుని పవిత్రపాదాలు తనపై పడ్డాయన్న ఆనందం పొందినా భూదేవి, అగ్నికణాల వేడిని తట్టుకోలేకపోయింది. భూలోకమే తల్లడిల్లిపోతోంది కదా! 
భూదేవి శ్రీ శరభేశ్వరుని శరణువేడగా, ఆయన తన అనుగ్రహపూర్వకమైన నిరంజనా నేత్రదృష్టి ద్వారా కాంతి ప్రవాహాన్ని ప్రసరింపచేయగా ఘీంకార, ఓంకార బీజాక్షరాలు ప్రత్యక్షమై, అవి శ్రీ నృసింహుని ఉగ్రతాండవ ఉగ్రశక్తిని నివారించాయి. అప్పుడు శ్రీ శరభేశ్వరుడు ధరించిన రూపమే శ్రీ అసాధ్య సాధక శరభేశ్వరమూర్తి. 

ఈ అసాధ్య సాధక శరభేశ్వరమూర్తే నిరంజనా జ్యోతి కాంతితో మదురై శ్రీ మీనాక్షి ఆలయంలోని స్తంభాలలో ఇంకా విలసిల్లుతున్నది. కనువిందు చేసే మూర్తి స్వరూపం అది. 
నేటికీ ఎన్నో దేవాలయాలలో ఎన్నో విగ్రహాలు నూతన ఆకృతిని పొంది, మానవులచే ప్రతిష్ఠింపబడి వెలసినా, ఏ దైవమూర్తి ఏ ప్రదేశంలో వెలసివుండాలన్నది భగవంతుని ఇచ్ఛగా, ఆయన ఆదేశంగా పాటించబడుతోంది. అందులోనూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో శ్రీ సెల్వగణపతిగానో, మాటతప్పని పరమాత్మగానో దైవరూపాలు వెలసి, అవి నూతన విగ్రహాలుగా అదే ప్రదేశంలో మరో రూపంలో ఉన్నాకూడా, ఎన్నో కోట్ల యుగాలకు ముందు ఆ ప్రదేశంలో అలాంటి దైవ రూపాలు విలసిల్లివున్నాయి. ఆ తరువాత భూమిలో మాయమై తగిన సమయంలో నూతన రూపంలో బయల్పడాలని దైవాజ్ఞగా మనం గ్రహించాలి. 

శ్రీ అసాధ్య సాధక శరభేశ్వరుని దర్శించే విధానమూ, ఫలితాలు ఎన్నో ఉన్నాయి. 

శ్రీ శరభ మహాశక్తి


శ్రీ శరభేశ్వరుని మహిమ, కటాక్షాల గురించి ఎందరో సిద్ధపురుషులు గ్రంధాలలో పొందుపరిచారు. కలియుగంలో యాంత్రికంగా జీవిస్తున్న మనం వైజ్ఞానిక పరికరాలను, పరిభ్రమించే పరికరాలనే కదా ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. విద్యుత్‌ పరికరాలన్నిటిలోనూ, విద్యుత్‌ పరికరాలు, మోటార్లు లాంటివి పనిచేయడం వలననే కదా నేటి మానవ జీవితం సుఖంగా సాగుతోంది. మనకు ఎంతో అవసరమైన నీటిని కూడా తొట్లలో పట్టి వుంచడానికి విద్యుత్తే ఆధారమవుతున్నాది కదా! ఇలా తిరుగుతున్న యంత్రాలు కలియుగ మానవజీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉండడానికి కారణం శ్రీ అసాధ్య సాధక శరభేశ్వరుని అనుగ్రహమే! 

పాలు, వెన్న, పిండి, దారం లాంటి పదార్ధాల కలయిక వలన ఏర్పడే దోషం కారణంగా కొంత హాని కలుగుతుంది. దానిని నివారించడానికి శ్రీ అసాధ్య సాధక శరభేశ్వరుడు పరిష్కారం చూపాడు. ఇలాంటి కర్మగారాలలో పనిచేసేవారికి ఏర్పడే బదిలీలు, కుటుంబసమస్యలకు సూక్తి పరహారం చూపించడంలో అసాధ్య సాధక శరభేశ్వర పూజావిధానం చాలా ముఖ్యమైనది.

శ్రీ అసాధ్య సాధక శరభేశ్వర మూర్తికి నడుము పై భాగానికి గంధమూ, నడుము క్రిందిభాగానికి వెన్న, ఇలా రెండు పదార్ధాలను పూసి ఆరాధించడం చాలా శ్రేష్ఠం. ఎందుకంటే ఈ నాగరిక, విజ్ఞానమయ ప్రపంచంలో వాలుగా తిరుగుట, ఎదురుతిరుగుట అని రెండు రకాలున్నాయి. ఈ యంత్ర సంబంధిత విభాగాలలో పనిచేసేవారు తమ ఉత్తమ జీవనం కోసం ఈ కలియుగంలో ఆరాధించదగిన మూర్తిగా విలసిల్లినది శ్రీ అసాధ్య సాధక శరభేశ్వరమూర్తి. 

నరాల బలహీనత నివారణకు 

నరాలు బలహీనపడడం సర్వసాధారణం. మన దేహంలో 72,000 నాడులు, నరాలు పనిచేస్తున్నాయి. కాబట్టి నరాల నిపుణవైద్యులు ముఖ్యంగా కొలవవలసింది శ్రీ అసాధ్య సాధక శరభేశ్వరమూర్తిని. పైగా నరాల సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మంగళవారం నాడు రాహుకాలంలో శ్రీ అసాధ్య సాధక మూర్తికి చుట్టలు చుట్టుకున్న ఆహారపదార్ధాలు (జంతికలు, జాంగ్రి, జిలేబి, మురుకులు) నివేదించి, పేదలకు ఆహారంగా అందిస్తూ వుంటే నరసంబంధిత వ్యాధులనుండి ఉపశమనం కలుగుతుంది. పైగా నరాల వైద్య నిపుణులు శ్రీ అసాధ్య సాధక శరభేశ్వరమూర్తిని ఆరాధిస్తూ, కఠినమైన శస్త్ర చికిత్సలను చేపడితే అవి సత్ఫలితాలనిస్తాయి. 


శ్రీ శరభేశ్వర మూర్తి తిరుపట్టూరు

జీవితంలో కఠినమైన సమస్యలు ఏర్పడుతుంటాయి. న్యాయవిభాగం, వాణిజ్యవిభాగం, economical strategy లాంటి న్యాయసంబంధిత సమస్యలు, ప్రేవుల సమస్య, ప్రేవులు కుంచించుకుపోవడం , మూత్రాశయం, స్ల్పీన్‌, లాంటి శరీర అంగాలలో ఏర్పడే సమస్యలకు శ్రీ అసాధ్య సాధక శరభేశ్వర ఆరాధన సత్ఫలితాన్నిస్తుంది. 

ఇలాంటి సంకటాలకు శ్రీ శరభేశ్వర ఆరాధన ఎలా సహాయపడుతుంది అంటారా? శ్రీ శరభేశ్వరమూర్తి అవతార ఆవిర్భావ సమయంలో శ్రీ నృసింహమూర్తిని తమ దేహంలో పట్టి వుంచి, ఉదరం, గుండెలాంటి భాగాలను తమ వ్రేతికొసలతో నాట్యం చేయించారట! కానీ దీనిని శ్రీ శరభమూర్తి శ్రీ నృసింహుని ప్రేవులను పెకలించారని పొరబాటుగా అర్థంచేసుకున్నారు. 
శ్రీ శరభేశ్వరమూర్తి శ్రీ నృసింహుని పవిత్రప్రేవులను పట్టుకుని ఆయన ఉగ్రతాండవానికి తగినట్లుగా తమ ఢమరుకంలో నుండి వెలువడిన నాదాలను తమ పవిత్రవ్రేళ్ళతో నృసింహమూర్తి దేహంలోని అనేక భాగాలలో చొప్పించిన కారణంగానే ప్రేవులు, స్ల్పీన్‌ లాంటి భాగాలలోని వ్యాధులు ఉపశమించేయట. ఇదే సిద్ధులు కనుగొన్న వాస్తవం. 
శ్రీ నృసింహుని తన పవిత్ర దేహంలో లీనం చేసుకున్న విధం వారి ప్రేవులు, ఉదరభాగాలలోని తాండవ నృత్య తాళాలను చొప్పించిన విధానం - లాంటి వాటి వలననే శ్రీ శరభేశ్వరుని ఆరాధనా ఫలితాలు నిర్ణయించబడుతున్నాయి. 

ఈ భూలోకంలో మానవులు, తాము చేసే పొరబాట్లు ఎవరికీ తెలియవని భావించకూడదు. సూర్యచంద్రులు, నక్షత్రాల సాక్షిగానే మీరు ఈ పనులను చేస్తున్నారన్న విషయాన్ని మరువకండి! మీ కుటుంబానికి, మిత్రులకు, బంధువులకూ, ఇరుగుపొరుగువారికి తెలియకుండా మీరు ఎన్నో విషయాలను దాచివుంచడం పనులు చేయడం జరిగి వుండవచ్చు. కానీ, అవన్నీ ఈ జన్మలోనే బహిర్గతమైతే ఈ బంధాలనుండి మీరు విడుదల పొందడం సాధ్యమని మరవకండి! 

సత్ప్రవర్తనే ముఖ్యం

కామాఖ్య అనే లోకం ఒకటుంది. ఇక్కడే అనైతిక శృంగార ప్రవర్తనకు, నేరాలకూ శిక్షలు విధించబడతాయి! జీవన రహస్యాలకు విశ్లేషణ ఇక్కడే తెలుస్తుంది. ఈ కామాఖ్య లోకానికి మార్గం శ్రీ నృసింహమూర్తి ఉగ్రతాండవం చేసినప్పుడు అక్కడ వున్న విశృంఖల శృంగారాగ్ని భావనలు, కృత్యాలన్నీ భస్మమైనాయి. 

శృంగారాగ్ని అనేది మనసులో ఏర్పడే అనైతిక శృంగార భావనలే! కామభావాలను అణచివేయడం అనేది ఏ యుగంలోనూ చాలా కఠినమైన విషయం. దీనిని యోగశక్తి ద్వారా మాత్రమే అదుపులో ఉంచడం సాధ్యం. దీనిని ధర్మబద్ధంగా అదుపులో ఉంచడానికే దాంపత్యం అనే గృహస్థాశ్రమ ధర్మాన్ని మన పూర్వీకులు ఏర్పరచారు. దీనిని ధర్మమార్గంలో దాంపత్య సుఖాన్ని అనుభవించడం కోసమూ, సత్సంతానం పొందడానికోసమూ, వంశాభివృద్ధి చేయడం కోసం, విశృంఖల కామాన్ని అణచడం కోసం సన్మార్గంలో నియమానుసారంగా ఉపయోగించుకోవాలని మన పూర్వీకులు కొన్ని సనాతన సంప్రదాయాలను ఏర్పరచారు. 
కాబట్టి, కామాగ్నిని, అనైతిక శృంగార విధానాలనూ, అదుపులో ఉంచకపోతే పాపాలు ఏర్పడుతాయి. వాటికి తగిన ప్రాయశ్చిత్తాలు చేసుకుని సన్మార్గంలో నడవడానికి ఈ కలియుగంలో మార్గం చూపినవారు శ్రీ అసాధ్య సాధక శరభేశ్వరమూర్తి. 
జూదం, మద్యపానం, అనైతిక శృంగారం లాంటి అనేక అధర్మకార్యాలు జరుగుతున్న ప్రదేశాలలో కలిపురుషుడు నివసిస్తాడు. ఈ కలియుగంలో మానవులను వీటి ప్రభావం నుండి రక్షించడానికి శ్రీ శరభేశ్వరుని శరణు కోరితే ఆయన అభయమిచ్చి మనలను సన్మార్గంలోకి మళ్ళించి అనుగ్రహిస్తాడు. మానవులను శ్రీ శరభేశ్వరుడు ఇలా అనుగ్రహించడానికి కారణాలేమిటి? 

దుష్ప్రభావాల నుండి రక్షించే శరభమూర్తి 

హిరణ్యకశిపుని సంహారం తరువాత క్రోధం తగ్గని శ్రీ నృసింహుని ఉగ్రత్వాన్ని ఉపశమింపచేయడానికి శ్రీ శరభేశ్వరుడు తన 'నిరంజన యోగనేత్రశక్తి'ని ప్రసరింపచేశాడు. అప్పుడు హిరణ్యకశిపుని దుర్గుణాలు, రక్కస స్వభావాలు పూర్తిగా భస్మమైనాయి. 
'నిరంజన నేత్ర దృష్టి' గల శ్రీ అసాధ్య సాధక శరభేశ్వర మూర్తిని కొలిస్తే మద్యపానం, జూదవ్యసనం, అనైతిక శృంగారేచ్ఛ లాంటి దుర్వ్యసనాల బారిన పడినవారు ధర్మవర్తనులౌతారు. మదురై శ్రీ అసాధ్య సాధక శరభేశ్వరమూర్తిని భక్తిశ్రద్ధలతో కొలిచి, తాము చేసిన పొరబాట్లకు చింతించి, కుమిలి, తగిన ప్రాయశ్చిత్తాన్ని కోరుకోవాలి! కానీ తాము చేసిన తప్పులకు మనస్ఫూర్తిగా చింతించి, మనోవైరాగ్యాన్ని పొందినప్పుడే స్వామి అనుగ్రహాన్ని పొందడానికి సాధ్యమవుతుంది. 
కానీ అలాంటి మానసిక పరిపక్వత అంత సులభంగా లభిస్తుందా? దానికి ఏవైనా మార్గాలున్నాయా? పై చెప్పబడిన దుష్ట వ్యసనాల బారిన పడినవారు మనోకారకుడైన శ్రీ చంద్ర భగవానునికి తగిన సోమవారం నాడు, విద్యాసూక్ష్మ కారకుడై విలసిల్లే బుధభగవానునికి తగిన బుధవారంనాడు, శనీశ్వరునికి తగిన శనివారంనాడు, బుద్ధి సూక్ష్మతను అనుగ్రహించే సూర్యభగవానునికి తగిన ఆదివారం నాడు, చంద్రహోర సమయంలో బుధ హోర సమయంలో సాధారణంగా శ్రీ అసాధ్య సాధక శరభేశ్వర మూర్తిని గంధం, వెన్న పూసి, తీపి పదార్ధాలను నైవేద్యంగా పెట్టి, వాటిని పేదవారికి దానంగా ఇవ్వాలి. దీనిద్వారా లభించే పుణ్యం, దానధర్మ, అన్నదాన పుణ్యశక్తి శ్రీ అసాధ్య సాధక శరభేశ్వరుని అనుగ్రహం పొందడానికి కారణమవుతుంది. 
కాబట్టి ఎలాంటి తప్పునూ సరిదిద్దుకునే ముందు, దానిని మరలా చేయకుండా ఉండాలనే మనోవైరాగ్య భావన పొందడానికి, ఆ దుష్ప్రవర్తన వైపు మరలే మనసును దారి మళ్ళించి సన్మార్గం వైపుకు తిప్పడానికి అధారమైన నీ ఆలోచన భావన భగవత్‌ శక్తిని పొందాలి. దీనికి సహకరించేది శ్రీ శరభేశ్వరునికి ప్రియమైన 'సుయం' అనే తీపి పదార్థ నైవేద్యమూ, అన్నదానమూ. 

ఆరాధనా క్రమం 

నిరంజన యోగనేత్ర శక్తిని పొందడం వలన శ్రీ శరభేశ్వర మూర్తిని దానిమ్మమొగ్గలతో అలంకరించి (గంధం లేదా వెన్నపూత) దానిలో దానిమ్మ పళ్లలోని గింజలను పొదిగి, దానిని కనులారా చూసి, కనీసం ఒక గంటసేపైనా కూర్చుని నిరంజన యోగ నేత్ర శక్తిని పొందేందుకు ధ్యానం చేయాలి. దీనివలన మనసులో ఒక ఉద్వేగం, ఆధ్యాత్మిక ఉత్సాహం, ఆత్మోన్నతికి మార్గాన్నీ పొందగలం. ఈ శరభమూర్తి యోగశక్తులు పొందినవారే శీతలయోగశక్తి నిండిన నైవేద్య ప్రసాదాలను ప్రేమగా ఆస్వాదించగలరు. (సీతాఫలం, కమలా, దానిమ్మలాంటి ఫలాలు) 
ఈ కలియుగంలోని మానవులలో ఎక్కువమంది దుష్పప్రవర్తనలతో, దుష్టభావనలతో, చెడువ్యసనాలతో, అసురలక్షణాలతో వుంటారు కాబట్టి వారిని సత్ప్రవర్తన వైపు మళ్ళించడానికే ఉగ్రశక్తులైన శ్రీ నృసింహ, శ్రీ శరభేశ్వర, శ్రీ కాళికాదేవి అవతారాలుగా వచ్చారు. 

రాక్షసులు, అసురులు అంటే పూర్వాకాలంలో, పురాణాలలో వున్న వికృతవేష ధారులే కదా అనుకోకండి! మనం మన మనసును పరిశీలించి చూసుకుంటే మనలోనూ ఎన్నో కొన్ని అసురభావనలు ఉంటాయి. కోపం, క్రోధం, వంచన, అబద్ధం, అనైతిక శృంగారభావనలు లాంటి సమాజానికి హానికరమైనవన్నీ అసురగుణాలే! ఎన్నో దుష్టభావనలతో మనుషులు జీవిస్తున్నారు. వీరందరిలోనూ అసురగుణాలు గూడుకట్టుకుని వున్నాయి. కాబట్టి కలియుగంలో కూడా దుష్టగుణాలున్న నరరూపరాక్షసులే వీరు! ఈ అసురగుణాలను, రాక్షసస్వభావాలను ధ్వంసంచేసుకుని సన్మార్గంలోకి పరివర్తన చెంది ప్రశాంత జీవనం గడపడమే మానవలక్ష్యం. ఇలా మనలో మార్పు రావడానికి శరభేశ్వర ఆరాధన సహకరిస్తుంది! 

భగవంతుడు శ్రీరామునిలా, శ్రీ కుమారస్వామిలా మానవ రూపంతో జన్మించకూడదా? ఎందుకు శ్రీ శరభేశ్వరునిగా అవతరించాలి అని మనకు సందేహం రావచ్చు! 

శరభమనే వింతప్రాణి 

శరభమనే పక్షిలా, మృగంలా పిలువబడే ఈ జీవి తనలో అనేక దైవీక శక్తులను కలిగివుంది! డైనోసరస్‌ అనబడే రాక్షసబల్లులు ఇప్పుడు అస్తత్వంలో లేవు, అవి కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఈ భూమినుండి అంతరించిపోయాయి అని శాస్త్రవేత్తలు అంటున్నారు కదా! కానీ సిద్ధుల గ్రంధాలలో ఈ ప్రాణి ఇంకా దట్టమైన కీకారణ్యాలలో ఉందని తెలియవస్తున్నది. ఇలాగే శరభపక్షి ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా మనదేశంలో కొందరికి, కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో, సమయాలలో కనబడుతున్నది అంటున్నారు. దీని దర్శనం శివుని దర్శించుకున్నంత ఫలితమిస్తుందట. కుంభకోణానికి సమీపంలోగల త్రిభువనం పవిత్రక్షేత్రంలో శరభదైవీకశక్తి కనబడుతున్నదట. 

ఎన్నో రకాల దుష్టశక్తులకు, పాపకార్యాలకు, చెడువ్యసనాలకు బానిసలైనవారు త్రిభువనంలోని శ్రీ శరభేశ్వరమూర్తికి ముడుపు కట్టుకుని తరచుగా ఈ ప్రదేశంలో ప్రదక్షిణలు చేస్తూ వుంటే, ఇక్కడి దేవాలయంలోని శరభశక్తి ఫలితంగా, ఈ పవిత్ర ప్రదేశంలో వారు పాదయాత్ర చేయగా వారికి ఒక విధమైన మానసిక శక్తి కలిగి వారు చెడుమార్గం నుండి బయటపడి సన్మార్గానికి మరలుతారు. 

ప్రారబ్ధకర్మల వలన కొన్ని కుటుంబాలలో భర్త, భార్య అనేక చెడుభావనల, చెడుగుణాల బారిన పడుతున్నారు. అందువలన అవస్థలు పడుతున్నవారు ఆర్ద్రా నక్షత్రమున్న ఆదివారం, సోమవారం, గురువారాలలో నిత్యప్రదోష సమయం, ఆదివారం రాహుకాలసమయంలో శ్రీ శరభేశ్వర ఆరాధనాక్రమాన్ని పద్ధతిగా ఆచరిస్తూ వుంటే వారు తమ సంకటాలనుండి బయటపడి సన్మార్గానికి మరలుతారు. ప్రగాఢవిశ్వాసం ఎప్పుడు సత్ఫలితాలనే ఇస్తుంది కదా! 
శరభపక్షికి అపారమైన వేదశక్తి ఉన్నది. ఆ పక్షి ఒక్కసారి రెక్కలు కదిలిస్తే ఆ గాలి ప్రపంచంలోని మూలమూలలకూ వ్యాపిస్తుంది. ఆ పక్షి కాలిగోళ్ళలో ఉన్న పదును కోటానుకోట్ల బ్రహ్మాస్త్రాల శక్తి వున్నది. శ్రీ నృసింహుడు హిరణ్యకశిపు ఉదరాన్ని చీల్చి, అతని చర్మాన్ని ధరించి, అతని ఎముకలను మాలగా ధరించినప్పుడు హిరణ్యకశిపునిలోనున్న అనేక అసురశక్తులు శరభ అగ్ని శక్తిలో భస్మమైపోయాయి! 

కాబట్టి శ్రీ శరభేశ్వర దర్శనమే అనేక అసురశక్తులను భస్మం చేయగలదు. ఆలయంలోని స్తంభాలు ఆలయాన్ని మోయగలిగాయి. ఇలాగే జీవితాన్ని పతనం చేయగల అసురశక్తులు, దుష్టగుణాలను తరిమికొట్టి చక్కని ధర్మ ప్రవర్తన అనబడే స్తంభాలను దృఢంగా నిలిచి ఉంచగలిగినప్పుడే భగవంతుడు ఈ మానవదేహమనే దేవాలయాన్ని సుస్థిరంగా ఉంచగలడు. 

శ్రీ కంఠనివృత్తి శరభేశ్వరుడు

దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడానికి మన సమాజంలో న్యాయాధీశులు, వకీళ్ళు, రక్షకభటులు తమ తమ విభాగాలలో నిజాయితీగా, సత్యప్రమాణంగా, ధర్మంగా వర్తిస్తుంటారు. అలా వారు తమ విధ్యుత్త్‌ ధర్మాన్ని చక్కగా నెరవేర్చడానికి వారిని శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరుడు అనుగ్రహిస్తుంటాడు. ధర్మదేవతలను కొలిచినవారే ఈ జన్మలో వకీళ్ళుగా, న్యాయాధీశులుగా రక్షకభటులుగా జన్మించి తమ కార్యాలను చక్కగా నిర్వర్తించుకుంటున్నారని మనం గ్రహించాలి. 

ఇలా పూర్వజన్మ వరాన్ని పొందినవారు ధర్మ సంబంధిత కార్యాలలో లంచం, అవినీతి, అధర్మం, nepotism లాంటివి ప్రవేశిస్తే ధర్మదేవత కోపించుకుని, మనలను శపిస్తుంది. ఆ శాపం మనలనూ, మన సంతానాన్ని బాధిస్తుంది. 

జ్యోతిష్యగణితం అభివృద్ధికి / వాక్శుద్ధిపొందడానికి 

సమాజాన్ని ఒక కట్టుబాటులో వుంచడం ఆనాటి పాలకుల కర్తవ్యంగా ఉండేది. కాబట్టి ఒకానొక సమయంలో రాజులను ఆశ్రయించినవారు శ్రీ కంఠనివృత్తి శరభేశ్వరుని పద్ధతి ప్రకారం ఆరాధిస్తూ వుంటే చక్కని ప్రవర్తనను అలవరచుకోవడంతో బాటు, వారికి వాక్శుద్ధి కలుగడంతో బాటు, త్రికాలాలలోనూ మంత్రసిద్ధి కలుగుతుంది అంటారు. కానీ వీటిని పాలించేవారు జ్యోతిష్యాన్ని, మంత్రాలనూ సమాజశ్రేయస్సుకు, సంక్షేమానికీ ఉపయోగించాలి. అతి పవిత్రమైన జ్యోతిష్య విద్య ద్వారా అపారధనాన్ని, పేరుప్రతిష్ఠలనూ సంపాయించడం కాక, ఆ విద్యను పవిత్రంగా భావించి సంరక్షించాలి. 

సాధారణంగా మనం నివసిస్తున్న ఇంటిని వదిలి వెళ్ళక, ఉన్న చోటే పలురకాల ప్రార్థనలు, పూజలు, ఆరాధనలూ చేస్తూ వస్తే జ్యోతిష్యగణితం చక్కని ఫలితాలనిస్తుంది. నెలంతా, లేదా తరచుగా శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వర ఆరాధన ముఖ్యంగా నవమినాడు శ్రీ శరభేశ్వరుని ఆరాధించి, ఆ రోజే గిరిప్రదక్షిణ చేసేయాలి. మరలా ఇంటికి తరువాతి నవమి తిథి వరకూ రాక పద్ధతి ప్రకారం వ్రత దీక్షలో వుంటే వాక్శుద్ధి పెరుగుతుంది. 

ఇందుకోసమే ఆ రోజుల్లో జ్యోతిష్కులు తమ ఊరొదిలి, నిర్దిష్ట సమయం వరకూ అందులోనూ శుక్లపక్షంలో బయటికి వెళ్ళరు. 
''ఉన్నచోటే, వెలిగే జ్యోతీ, 
చప్పున కాలం గడిచేను 
అద్దాల పేటికలాగా'' 
అని సిద్ధపురుషులు పాడి ఉన్నారు. 

సామాజిక సేవ 
సామాజిక విభాగంలో ఏదీ వట్టిపోదు. ఆ రోజులలో రాజకీయాలు కూడా రాజులచే ఒక సామాజిక సేవగా గుర్తించబడింది. ఇతర రంగాలలో కూడా కొందరు కేవలం 100, 200 లేదా 1000, 10000 మందికి సేవచేయడం సాధ్యం! 

కానీ తన దేహం, సంపదలు, జీవితం ద్వారా సమాజానికి స్వార్థరహితంగా, నిజాయితీగా సేవచేయగలం. ఎందరో మహానుభావులు అతి తక్కువకాలంలో సత్య, ధర్మ, న్యాయవర్తన ద్వారా రాజకీయ జీవనం గడుపుతూ కోటానుకోట్లమందికి సేవచేశారు. 
అందువలనే ఆ కాలంలో మహారాజులు భగవంతునితో ప్రత్యక్షంగా మాట్లాడే అదృష్టాన్ని పొంది ఉన్నారు. వారు తలచినపుడల్లా దైవదర్శనం లభించేది. అందువలన రాజ్యపాలన సాగించేవారు కూడా భక్తిశ్రద్ధలతో న్యాయవర్తనులై, ధర్మబద్ధంగా పరిపాలించేవారు. వారలా ఉండడానికి శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరుడు లాంటి భగవత్‌ స్వరూపాలను కొలుస్తూ వుండేవారు. 
నిజాయితీగా ఉండాలంటే 
భగవంతుడు ప్రతి వృత్తిలోనూ కొన్ని రహస్యాలు దాచివుంచుతాడు. రాజకీయరంగం, ఉపాధ్యాయవృత్తి, వైద్యవృత్తి లాంటి వాటిద్వారా వేలాదిమందికి అతి సులభమైన విధానంలో సామాజిక, భగవత్సేవలాంటివి చేయడం సాధ్యం. అదే సమయంలో సామాజిక జీవనం కోసం రాజకీయ రంగంలోనే అనేక సంకటాలను నింపివుంటాడు. బంగారం, సిరిసంపదలు, కీర్తిప్రతిష్ఠలు లాంటివి పొందడానికి ఎన్నో సామాజిక రంగాలలో ఆటంకాలను కలిగిస్తాడు. వీటి సాధనల విషయంలో కపటస్నేహం, క్రమశిక్షణా రాహిత్యం, స్వార్థం, పదవీ వ్యామోహం, లంచగొండితనం, అవినీతి కూడా ఎదురవుతుంటాయి. అయితే ఈ మార్గంలో నిజాయితీగా, ధర్మమార్గంలో, న్యాయవర్తన, ధార్మిక జీవనం నడపడానికి తగిన అవకాశాలనూ ఆ శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరుడు అనుగ్రహిస్తాడు. గిరిప్రదక్షిణ చేసే భక్తులకు శరీరం అలసిపోకుండా అద్భుతమైన శక్తినీ ప్రసాదిస్తాడు. 

బలం, క్షేమం కలిగించే గిరి ప్రదక్షిణ 

ఎన్నో విధాలైన నొప్పులకు నివారణగా, కష్టాలకు పరిష్కారంగా 'శాంతి పర్వత గుళికాశక్తులు' ఉపయోగపడుతున్నాయి. పైగా, ఎన్నో మంత్రాలు సిద్ధపరచడానికి గుళికలను పద్ధతిగా తయారుచేసి వాటిని సమాజశ్రేయస్సుకు, ఆధ్యాత్మికతకూ, ప్రజలకూ అందించాలనుకున్నవారు ఈ 'శాంతి పర్వత అంజనా గుళిక'లను ఉపయోగిస్తారు. వీటి ప్రయోజనాలను పొందడానికి ప్రతి సంవత్సరమూ (ముఖ్యంగా ప్రమాది సంవత్సరం) దీప కృత్తికా నక్షత్రం రోజున తిరుఅణ్ణామలైలో గిరిప్రదక్షిణ చేయాలి. 
కాబట్టి మన జీవితంలో పొందదగిన మంచి దైవశక్తిని 'తిరుఅణ్ణామలై జ్యోతి' వెలిగే పదిరోజులూ కృత్తికా నక్షత్ర ఉత్సవం రోజున గిరిప్రదక్షిణ చేసి జీవితంలో పొందదగిన అనుగ్రహశక్తిని పొందవచ్చు! ఇది మీ జీవితానికి సహాయకారిగా ఉండడంతో బాటు మీ వంశానికీ అతి మహిమగల దైవీక శక్తిగా విలసిల్లుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి! ఇదే మనకు శాశ్వతమైన ఆస్తి! భగవంతుని కానుక! 

ప్రత్యక్షదైవం శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరుడు 

కోట్లాది కోరికలను మనం కోరుతున్నందువలన కోష్టమూర్తి, మూలమూర్తి, నవగ్రహమూర్తి లాంటి అనేక విధాలలో పరమాత్మ అవతారం దాల్చి మనలను మన కర్మల నుండి విడిపించడానికి అనుగ్రహం చూపిస్తున్నాడు. 

ప్రతి దేవాలయ స్తంభంలోనే శిల్పంగా చెక్కబడినట్లు కన్పించినా, ఆయా ఆలయాలలో ఎన్నో రూపాలలో శ్రీ శరభేశ్వరమూర్తి స్వయంభువుగానో, మానవులచే ప్రతిష్ఠించబడినట్లుగానో కనిపిస్తుంటారు. ఆయన అవతరించడానికి అనేక కారణాలుంటాయి. 
ఉగ్రం, సింహం, ఆవేశం, వీరసౌందర్యం, శీర్షభేషం, గర్భభేదం, సౌందర్య సాహసం, మృత్యు ప్రయోగం, వాలై వందనం, యోగపూర్ణం లాంటి అగ్ని లావణ్య శక్తులను అవతార సమయంలో ప్రదర్శించినందువలన ఒక్కొక్క ఆలయ స్తంభంలోనూ ప్రత్యక్షమైన శ్రీ శరభేశ్వరమూర్తి యొక్క దైవాంశాలు సాటిలేని భంగిమలలో వెలసివున్నాయి. 
ప్రపంచంలోని దైవీకశక్తుల కేంద్రంగానూ, కోటానుకోటి సిద్ధుల శరణాగతి ఆలయంగానూ విలసిల్లుతున్న తిరుఅణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వరుని దేవాలయంలో అమ్మవారి వెలుపలి మండపంలోని నవగ్రహ మూర్తులకు ముందుగల ఆలయం స్తంభంలో కొలువైవున్న శ్రీ శరభేశ్వర భగవానుని ఆది అద్భుతభంగిమలో ప్రత్యక్షమైన శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరమూర్తిగా సిద్ధపురుషులచే ఘనంగా కీర్తించబడి, స్తుతించబడుతూ, కనువిందుచేస్తున్న అద్భుతమూర్తి! 

గండాలు తొలగిపోవడానికి

ప్రతి జీవీ తన జీవితంలో, జన్మలలో ఏర్పడుతున్న, ఎదుర్కొంటున్న పలురకాల గండాలకు తగిన శాపాలను నివృత్తి చేసి తగిన పరిష్కారాన్నిచ్చి అనుగ్రహిస్తున్న అద్భుతమైన అవతారం శ్రీ శరభేశ్వరమూర్తి. 

తిరుఅణ్ణామలైలో ప్రత్యక్షమై అనుగ్రహిస్తున్న మూర్తి అంటేనే దానికి తగిన విశేషదైవీక శక్తి, మహిమ ఉంటాయి కదా? హోరా గిరి ప్రదక్షిణ అధిపతిగానూ, శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరమూర్తి విలసిల్లుతున్నారు. 

గృహాలలోనూ, కార్యాలయాలలోనూ, వ్యాపారసంస్థలలోనూ బయటిప్రదేశాలలోనూ, జీవితంలోని పలు దశలలోనూ కొందరి కుట్రలద్వారా కష్టాలను అనుభవిస్తున్న వారెందరో! ఇంతే కాదు, విధి రాత ప్రకారం పలురకాల గండాలు - అగ్నిగండం, జలగండం, ప్రమాదాలు, నొప్పులు - లాంటి ఎన్నో రకాల గండాలను తమ జీవితంలో ఎదుర్కొనేవారు, వీటినుండి బయటపడి మరలా మంచి జీవనాన్ని పొందడానికి శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరమూర్తిని కొలుస్తూ వుంటారు. 
శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరునికి పద్ధతి ప్రకారం అభిషేకం, ఆరాధనలు నిర్దిష్ట హోరలో / సమయంలో చేస్తున్నప్పుడు లభించే పుణ్యం అనేక శాపాలను, దోషాలనూ, గండాలనూ నివృత్తి చేయడంతోబాటు ఐశ్వర్యాన్నీ, క్షేమాన్నీ, మానసిక ప్రశాంతతనూ ఇస్తుంది. 
శరభమూర్తి ఆరాధన ఇచ్చే దైవీక పుణ్యశక్తులలో ఒకటి శ్రీపుర శివగణ పుణ్యశక్తి. ఈ శక్తి దుష్టశక్తులను దహించే బాణాలలా మనకు కీడు తలపెట్టేవారి వద్దకు వెళ్ళి దుష్టశక్తులను దైవీక శక్తితో నశింపచేసి, పగను, శత్రుత్వాన్ని, క్రోధాన్నీ తొలగిస్తుంది. 

హోరా గిరిప్రదక్షిణ అధిపతి శ్రీ శరభేశ్వరా! 

శ్రీ శరభేశ్వరుడు ప్రదోషసమయంలో అవతరించారని మనకు తెలుసు! పైగా తిరుఅణ్ణామలైలోని శరభేశ్వర భగవాన్‌ హోరా గిరిప్రదక్షిణ అధిపతి అయిన కారణంగా ఈ పేరు వచ్చింది. ఏ రోజు నిర్దిష్ట హోరా సమయంలో ఈయనకు ప్రదక్షిణ చేసి మొక్కి, స్తుతించి, గిరి ప్రదక్షిణ ప్రారంభించేవారికి ఎన్నో సత్ఫలితాలు, అనుగ్రహాలు, కార్యసిద్ధులు, పుణ్యశక్తులూ లభిస్తాయని సిద్ధపురుషులు హోరా శాస్త్ర ఆరాధనా విధానంలో స్పష్టంగా తెలిపారు. నిర్దిష్ట హోరా సమయంలో శ్రీ శరభేశ్వరునికి పూజ చాలా ప్రీతిపాత్రం. 
శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వర మహాత్మ్యంలో ఈ శరభ ఆరాధనా విధానం ఎన్నో ప్రమాదాలనుంచి మనలను రక్షించడంతో బాటు మన పాప కర్మల నుండి మనం విముక్తి పొందడానికీ, ఒక రక్షా కవచంలా మనలను కాపాడుతుందన్నది గుర్తించదగిన విషయం. 
ప్రాయశ్చిత్తం ఒక్కసారే! 

ఇంతకాలమూ మద్యసేవనచేసి, ధూమపానంతోబాటు అవినీతికరమైన పనులు చేసినవారు ఏనాడైనా తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే! కానీ ప్రాయశ్చిత్త విధానాలను చేపట్టి మరలా అదే దుర్వ్యసనాలకు మరలితే ఏమిటి ప్రయోజనం? 
కాబట్టి ప్రాయాశ్చిత్త ఆరాధనా విధానాలను అనుసరించాక, మొక్కుబడులను నెరవేర్చుకుని తాను గతంలో చేసిన తప్పులను మరలా చేయకూడదని వాగ్దానం చేసుకున్నప్పుడే ఎలాంటి ప్రాయశ్చిత్తమైనా సంపూర్ణ సత్ఫలితాలనిస్తుంది. లేకుంటే పరిష్కారమే ఎన్నో శాపాలను మనకు కలిగిస్తుంది. 

ఉదాహరణకు సంవత్సరంలో తొమ్మిది నెలలు మన ఇష్టంగా ఎన్నో వ్యసనాలకు బానిసై జీవించి, ఒక మండలం పాటు శ్రీ అయ్యప్ప వ్రత దీక్షను పాటించి, శరీరం కొద్దిగా పరిశుద్ధమవగానే, వ్రతదీక్ష పూర్తికాగానే మరలా మద్యపానం, ధూమపానం, దుర్వ్యసనాలకు మరలితే ఎవరికిగానీ ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ఇలాంటి జీవనవిధానం శ్రీ అయ్యప్ప వ్రతదీక్షకు భంగకరం? 

ఎన్నో మహాపాపాలకు ప్రాయశ్చిత్తంగా అయ్యప్పదీక్షను కొనసాగించి, మరలా అదే దుర్వ్యసనాలు కొనసాగిస్తే పరమాత్మ అయిన శ్రీ అయ్యప్పస్వామిని అవమానించినట్లు కాదా? 
సమాజంలోని ప్రతి ఒక్క వృత్తిలోనూ ఏర్పడే అనేక రకాల కష్టాలకు తగిన పరిష్కారాలనందించి వారివారికి ఆయా వృత్తులలో ఏర్పడే ప్రమాదాలను, శాపాలనూ అధిగమించడమే తిరుఅణ్ణామలై శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వర ఆరాధన. వీటిలో ఒక్కొక్క దానినీ పరిశీలిద్దాం! 

వైద్యులకే ధన్వంతరి 

వైద్యవృత్తిలో కొనసాగే భాగ్యం కేవలం కొందరికే లభిస్తుంది! ఎవరైతే తమ పూర్వ జన్మలో శ్రీ గరుడ ఉపాసన చేసి ఉంటారో, ఎవరు బాధితులకు ఉచితంగా వైద్యం చేసి ఉన్నారో అలాంటివారే ఈ జన్మలో వైద్యులుగా జన్మిస్తారు. కానీ అందరు వైద్యులూ తమ పూర్వజన్మలలో పుణ్యకార్యాలు చేసి ఇతరుల సేవకోసం తమను అర్పించుకుని దైవానుగ్రహానికి పాత్రులై వుంటారు. వారు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవలసిందే! 
శ్రీ ధన్వంతరమూర్తి అనుగ్రహంతో, అశ్వినీదేవతల ఆశీస్సులతో ఈ జన్మలో వైద్యులుగా జీవిస్తున్నారని ప్రతి ఒక్క వైద్యుడూ భావించి అందుకు పరమాత్మకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 

వీరు తాము వైద్యవృత్తిలో కొనసాగుతున్నందుకూ, ఎముకలు, నరాలవ్యాధులు, హృదయసంబంధిత వ్యాధులు లాంటి ఒక్కొక్క వ్యాధి విభాగానికీ నిపుణలై 'రోగిని స్పృశిస్తే వ్యాధినయమయ్యే హస్తవాసి' గల వైద్యుడనే పేరు పొందేలా ఉండడానికి దైవ అనుగ్రహం పొందడానికి తిరుఅణ్ణామలై శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరుడే రక్షగా ఉంటున్నాడు. 
ఎందుకంటే అధికభాగం గండాలు, శాపాలూ వ్యాధులుగా మారి, కర్మ ఫలితాలుగా మనలను బాధిస్తున్నాయి. బాధలను తొలగించే సామాజిక సేవ అంటే అది దైవకార్యమే కదా! కానీ ధనసంపాదనే లక్ష్యంగా ఉంటే వైద్యవృత్తిలో వుండి ప్రయోజనమేమిటి? 
ప్రతి ఒక్క వైద్యుడూ శనివారంనాడు, మంగళవారం హోరా సమయంలో (ఉదయం 8-9 సాయంత్రం 3-4) తిరుఅణ్ణామలైలోని శ్రీ కంఠనివృత్తి శరభేశ్వరుని దర్శించుకుని తమ వృత్తిలోని అడ్డంకులు తొలగిపోవాలని సంకల్పించి, నైవేద్యాన్ని పెట్టి అశ్వత్థవృక్షానికి ఉత్తర దిక్కులో వేరుతో తయారైన లింగమూర్తిని లేదా స్ఫటిక లింగాన్ని తీసుకుని గిరిప్రదక్షిణం చేయాలి! 

కృష్ణపక్ష మంగళవారానికి వ్యాధులను తగ్గించే గుణముంది. కాబట్టి సిద్ధవైద్యవిధానంలో కృష్ణపక్షమంగళవారంనాడు ఔషధం స్వీకరించి చికిత్స నారంభించమంటారు. 
శనివారం మరియు చిత్రా నక్షత్ర రోజులలో వైద్యులకు శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వర ఆరాధనకు తగిన రోజులుగా పరిగణించబడుతున్నాయి. కాబట్టి, ఈ రోజులలో శ్రీ శరభేశ్వరమూర్తి ఆరాధన, గిరిప్రదక్షిణ చేపట్టడం వలన మనోవైరాగ్యం కలిగి ఎక్కడున్నా సరే, వారు కచ్చితంగా ప్రపంచంలోనే శ్రేష్ఠ వైద్యులుగా పేరుపొంది శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరుని అనుగ్రహం పొందుతారు. కానీ ప్రగాఢ విశ్వాసంతో, నిరంతర శ్రమతో వేయిసార్లయినా గిరిప్రదక్షిణ చేయడం వలన మరింత అనుగ్రహం కలుగుతుంది. నిరాశపడకండి! ఇదే మీ పవిత్రమైన, ఉత్తమమైన వైద్యజీవనమే లక్ష్యంగా ఉండనీ! 

ఉచితవైద్యసేవ భగవత్కార్యం


వైద్యవృత్తిలో ఉన్నవారు తమ జీవితకాలంలో కనీసం ఒక కోటి ప్రజలకైనా ఉచితంగా వైద్యసేవ చేస్తానని దృఢసంకల్పం చేసుకుని అలా ఆచరించాలి. ఒక్క వ్యక్తి కోటి మందికి వైద్యసేవలందించడం సాధ్యమా? అని మీరు అడగవచ్చు! 
Is it really possible ? అని ఆశ్చర్యపడకండి! 

ఉత్తమవైద్యుడుగా పేరుప్రఖ్యాతులు పొందినవారు తమ వైద్యమిత్రులు, బంధువులు, పరిచయస్థుల సహకారంతో భారతదేశంలో గల వేలాది కుగ్రామాలకు వెళ్ళి నెలకొకసారి లేదా రెండుసార్లు ఉచితవైద్య శిబిరాలు ఏర్పరచవచ్చు. ఒకసారికి కనీసపక్షం 2000 మందికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తే అతి తక్కువ సమయంలో తమ లక్ష్యాన్ని సాధించవచ్చు! దీని కన్నా మించిన దైవకార్యం మరేముంటుంది? 
తాము జన్మించి, వైద్యుడైనది ఇలాంటి దైవకార్యాలు చేయడానికే అని ప్రతి ఒక్క వైద్యుడూ భావిస్తే ఇది సాధ్యం! ఈ సేవ చేయడానికే తాము వైద్యులైనామన్న మనో సంకల్పం వారికి కలగాలి. ప్రతి శస్త్రచికిత్సకూ రూ. 20,000/-, 30,000/- అని రుసుమును వసూలు చేసి, చికిత్సలు చేస్తే మాత్రం చాలదు. 

కాబట్టి వైద్యులందరూ తమ పూర్వజన్మ పుణ్యఫలంగా తమకు ఈ వైద్య విద్య సంక్రమించిందని భావించడం కోసం శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వర ఆరాధనకు పద్ధతి ప్రకారం ఆచరించి, గతంలో సూచించిన దినాలలో గిరిప్రదక్షిణ చేస్తూ వస్తే, అద్భుతమైన జీవితం దైవానుగ్రహం వలన లభిస్తుంది. దీనిని మీకు తెలిసిన వైద్యులతో చర్చించి పేదలకు ఉచితంగా వైద్యసేవ చేయమని ప్రోత్సహించండి! 

బోధనావృత్తికి అద్భుత అనుగ్రహం చూపే శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరమూర్తి! 
అతి పవిత్రంగా భావించదగిన వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి ఒకటి! ఉపాధ్యాయులు చిన్న వయసులోనే పిల్లల మనసులో ఉత్తమ బీజాలను నాటితే వారు అప్పటినుండే క్రమశిక్షణ, ధర్మవర్తన, సత్ప్రవర్తన నేర్చుకుని దేశంలో ఉత్తమ పౌరులుగా రూపొందడానికి అవకాశం ఉంది. ప్రపంచంలోని అన్ని రంగాలలోనూ అతి పవిత్రమైన వృత్తిగా విలసిల్లుతున్నది ఉపాధ్యాయవృత్తి అని చెప్పడం అతిశయోక్తి కాదు! 
అయినా ఉపాధ్యాయులందరూ తమ మధ్య తరగతి జీవితంలో అనేకరకాల సమస్యలను ఎదుర్కోవలసివస్తున్నది! అందులోనూ కలియుగంలో దుష్ప్రవర్తన విషక్రిములలా వ్యాపిస్తూ వస్తున్న సమయంలో ఉపాధ్యాయుని పనులు ఉత్తమ శిక్షణ గల సమాజం రూపొందడానికి ఎంతగానో దోహదపడుతున్నది. 

బుద్ధి వికసనకు దోహదం చేసే బుధభగవానునికి సంబంధించిన బుధవారం నాడు తిరుఅణ్ణామలైలో శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరుని మ్రొక్కి మేడిచెట్టు వేరుతో తయారైన శివలింగాన్ని తీసుకుని లేదా కృత్తిక నక్షత్ర రోజున కరిగిన బంగారంతో తయారైన స్వర్ణ లింగాన్ని తీసుకుని ఉపాధ్యాయులు తిరుఅణ్ణామలైను ప్రదక్షిణంగా వస్తే అనేకరకాల సమస్యలు పరిష్కారం లభిస్తుందనీ, తమ ఉపాధ్యాయవృత్తిలో మరింత ఉన్నత అభివృద్ధి సాధించి సమాజంలో పిల్లల ప్రేమాభిమానాలు పొంది కీర్తి ప్రతిష్ఠలతో విలసిల్లుతారనీ, దానితో బాటు సత్సంతానం కలుగుతుందనీ అంటారు.

ప్రతి ఒక్క ఉపాధ్యాయుడూ కనీస పక్షం 500 సార్లయినా తిరుఅణ్ణామలైలోని గిరిప్రదక్షిణచేయగలిగితే ఉత్తమ వైరాగ్యంతో వారు ఉన్నతి సాధిస్తారని చెబుతారు. ఇంతేకాదు, కనీసం ఒక లక్షమంది విద్యార్థులకైనా ఉచితంగా విద్యను బోధించడానికి వారు సాయపడాలి. 
ఒక లక్షమంది విద్యార్థులకు ఉచిత విద్య అంటే కంగారు పడకండి! ఎందుకంటే ఒక ప్రతిభావంతుడైన ఉపాధ్యాయుడు ఒకే సమయంలో వెయ్యికాదు, 2000, 3000 లాంటి ఎందరికో మంచి విద్యను అందించగలడు. మరి లక్షమందే కాదు లక్షలాది మందికి విద్యనందించవచ్చు! అయితే దానికి శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరుడు సహకరించాలి! 
సాధారణంగా, ఉపాధ్యాయవృత్తిలో ఉన్నవారు మధ్యతరగతి స్థాయిలో వుంటారు. ఇలాంటి వారు వీలైనంతవరకూ వినయవిధేయతలతో, అణకువగా జీవితం గడపాలని ప్రయత్నిస్తుంటారు. వీరు తమ జీవనస్థాయిని మరింత మెరుగుపరచుకోవడానికి శ్రీ శరభేశ్వరుని ఆరాధించి ఆయన అనుగ్రహం పొందాలి. 

వ్యాపారాభివృద్ధికి అనుగ్రహించే శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరమూర్తి! 

సమాజంలో అన్ని రంగాలవారినీ అనుగ్రహించే దైవం శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరమూర్తి. ఎందువలనంటే సమాజంలోని ప్రతి ఒక్క రంగంలోనూ ఎన్నెన్నో సమస్యలూ, సంకటాలూ ఏర్పడుతుంటాయి. అన్ని సమస్యలనూ అధిగమించి ఆయారంగాలలో ఉన్నతస్థాయికి వెళ్ళేవారు ఎందరో ఉంటారు. ఏయేవిధంగా ఎంతెంత సంపాయించి, జీవించాలి అనేకన్నా, ఎంత మంచి మార్గంలో ధర్మంగా సంపాయించి జీవించాలి అనేదే ముఖ్యం. 
వ్యాపారరంగం అన్నది సమాజంలో అతి ముఖ్యమైన ఒక వృత్తి. ఎందువల్ల అంటే గృహజీవనం, బయటి ప్రపంచజీవనం అంటూ ప్రతి ఒక్కరూ తమ ఉన్నత జీవితానికీ, సాధారణ జీవనస్థాయికీ, ఉపకరణాలు కొని, పదార్థాలు తెచ్చుకుని, వండి, తిని, దానంచేసి జీవించాలి! 

పైగా ఎలాంటి వస్త్రాలు ధరించినా, ఆహారంలో కర్మఫలితాలు సులభంగా విస్తరించి వుంటాయి. అలాగే ఒక్కొక్క వస్తువు- పసుపు, బియ్యం, ఉప్పు, చింతపండు, మిర్చి, వాహనం, కుర్చీ, గడియారం- ఇలా ఏ పదార్థాలు కొన్నా దానిద్వారా పలురకాల కర్మఫలితాలు కలుగుతుంటాయి. కర్మఫలితాలంటే కేవలం దుష్కర్మలే అనుకోనవసరంలేదు. సత్కర్మఫలితాలూ ఉంటాయి. 

ఉదాహరణకు ఒక కొత్త కుర్చీ కొన్నామంటే దానిని ఏ వృక్షం కలపతో తయారుచేశారు? అది దేనికోసం ఉపయోగించబడింది. దాన్ని ఎక్కడి నుండీ తెచ్చారు? లాంటి అనేక అంశాల ఆధారంగానే ఆ కుర్చీ యొక్క కర్మఫలితాలు వుంటాయి. మనం కొనే ప్రతి వస్తువులోనూ అనేక కర్మల ఫలితాలుంటాయి. 

వ్యాపారస్థులలోనూ అతి శ్రీమంతులుగా ఉండేవారున్నారు. ధనంతో మదించిన వారంటే మాయా శక్తికారణంగా అక్కడ పంచమహాపాతకాలూ, పాపకార్యాలూ, దుష్ప్రవర్తనలూ అన్నీ కలిసి, వాటిని తొలగించడం చాలా శ్రమతో కూడిన వ్యవహారం! అదొక పెద్ద సాధన. అది సాధించాలంటే కచ్చితంగా భగవదనుగ్రహం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాపారంలో తమ జీవితం దైవాంశతో ఉన్నత స్థితికి చేరుకోవాలని ప్రయత్నించాలి. 

వ్యాపారరంగంలో ధర్మంగా వ్యాపారం చేస్తే ఈ కలియుగంలో బ్రతకడం సాద్యమా? అంటారు. సాధారణంగా ధర్మంగా వర్తించే ఉపాధ్యాయవృత్తిలో కర్మఫలితాలు అంతగా బాధించవు. కానీ వ్యాపారరంగంలో ప్రతిఒక్క వస్తువూ కొని విక్రయించేప్పుడు అందులో ఏర్పడే వ్యాపార లావాదేవీలలో కాస్త అటూ ఇటూగా వుండడం జరుగుతుంది. అప్పుడు జరిగే న్యాయ, అన్యాయ వ్యవహారాలకు తగినట్లు కర్మఫలితాలను అనుభవించడం తప్పనిసరి అవుతుంది. 
ఉదాహరణకు ఎక్కడినుండో వందలాది మూటల ధాన్యం కొని విక్రయించునప్పుడు, ఆ ధాన్యాలను ఎంతగా శుద్ధీకరించినా, ఆ ధాన్యాలలోని రాళ్ళు, మట్టి, తుప్పు, ధూళి, ధూగర అన్నిటికీ ఆ వ్యాపారే బాధ్యుడవుతాడు. దాని పాపపుణ్యాలు అతడే అనుభవించాలి! మరి వీటిలోనుండి విముక్తి పొందడం ఎలా? 

సొమ్మును తాకితే బంధంగా మారే పాపాలు! 

ఇలాగే లక్షలాది సొమ్మును తాకి, ఆ నోట్లకట్టలలో దొర్లుతూ వుండే వ్యాపారులూ ప్రతి ఒక్కరికీ ప్రతినోటూ ఏయే విధంగా వచ్చింది అనే విషయం తెలుసా? ఆ సొమ్మును వారు వాడే పరిస్థితులు ఎలాంటివి? కాని ఆ సొమ్ముకు సంబంధించిన ప్రతి విషయాన్నీ వారు గ్రహించడం సాధ్యమా? 
ఒక నగ కొనడానికి ఉపయోగించబడే రూపాయల కట్టలో దొంగిలించబడిన సొమ్ము, మరొకరిని మోసగించి, వంచించి సంపాయించబడినది, అక్రమమార్గంలో సంపాయించినది, కొల్లగొట్టబడినది, దోచినది, సన్మార్గంలో వచ్చినది, అక్రమ వ్యాపారంలో వచ్చినది ఇలా ఎన్నిరకాలుగానైనా ఉండవచ్చు! కానీ ఇలాంటి విధంగా వ్యాపారికి ధనం రాలేదే? అతను తన వ్యాపారంలో వస్తువులను కొని, విక్రయించి, క్రయవిక్రయాల ద్వారా సంపాయించాడు కదా అని మనం అనుకుంటాం! 

కానీ తనకు వ్యాపారంలో వచ్చే సొమ్ముకూ, బయటకి వెళ్ళే సొమ్ముకు మధ్య ఎన్నో లావాదేవీలు, పన్ను విధానాలు ఉండవచ్చు! ఇందుకోసం పూర్వకాలంలో గల్లాపెట్టెను ఒక నిర్దిష్ట వృక్షంలో, దిక్కులో కొండగుర్తుగా ఉన్న ప్రదేశంలో మంత్రాలచే బంధించి, రక్షించారు. ఇవన్నీ సొమ్ము వలన ఏర్పడే కర్మఫలితాల నుండి ఆ వ్యక్తిని కాపాడే విధానాలు. గల్లాపెట్టెలో ఎప్పుడూ మల్లెపూలు ఉండాలి. ఆ పెట్టెకు తగిన దైవీక విధానాలు ఎన్నో ఉన్నాయి. వీటిని ఒక పద్ధతి ప్రకారం అనుసరిస్తేనే ఆ సొమ్ము తన వద్దకు వచ్చే వారిని కాపాడుతుంది. 
ఇలా, వ్యాపారరంగంలో ఎన్నెన్నో గండాలు సంభవించే అవకాశాలున్నాయి. వీటిని నివారించే సిద్ధుల అనుగ్రహ విధానాలను శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరమూర్తి ఆరాధనా క్రమంగా ఇక్కడ పొందుపరిచాము. 
మంగళవారం, ఆర్ద్రా నక్షత్రం నాడు మర్రిచెట్టుకు ఉత్తరదిక్కులోని వేరుతో శ్రీ లింగమూర్తిని చేసి, తీసుకుని తిరుఅణ్ణామలైలో గిరిప్రదక్షిణాన్ని శ్రీ శరభేశ్వరమూర్తి వద్దనుండి ఆరంభించి, అక్కడే ముగించుకుంటే ఎన్నో రకాల గండాలనుండి సులభంగా విముక్తి పొందవచ్చు. ప్రతి వ్యాపారీ తన జీవితంలో కనీసం ఒక కోటిమందికైనా అన్నదానం చేసి ఉండాలి అని ఒక నియమం పెట్టుకున్నాడనుకోండి. అప్పుడప్పుడు వీలైనంతవరకూ అన్నదానం చేస్తూ ఉండాలి. 

కోటిమందికి అన్నదానం అంటే బెదిరిపోకండీ! ఎందుకంటే శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరుని ప్రగాఢ నమ్మకంతో నమస్కరించి మీరు వారి అనుగ్రహాన్ని పొందుతున్నప్పుడు ఒక కోటి ఏం లెక్క, ఎన్ని కోట్లమందికైనా అన్నదానం చేయగలిగే శక్తి మీకు శ్రీ శరభేశ్వరుడు అనుగ్రహిస్తాడు. 
ఒక దేవాలంయంలో ఒక శేరు బియ్యపురవ్వను, పంచదారతో కలిపి చీమలకు పంచితే, అది వేలాది చీమల కడుపు నింపుతుంది కదా! అందువలన కేవలం చీమలకు మాత్రం ఆహారం పెట్టి ఒక కోటి సంఖ్య సరిపోయింది అని భావించకండి! 

శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరమూర్తిని పద్ధతి ప్రకారం కొలిచి, గిరి ప్రదక్షిణాన్ని సూచించిన రోజులలో పాటించారంటే మీకు అన్నదానశక్తి పెరిగి మీరు మీకు తెలియకుండానే ఎన్నో సత్రాలలో, ఎన్నో సత్సంగాలలో, పూజలలో పాల్గొని అక్కడక్కడ అన్నదానం చేసే రీతిలో మీ ఆర్థిక స్థితి గతులు మెరుగుపడతాయి. 

ఎంతో ధర్మంగా, నిజాయితీగా ఉన్నా కూడా వ్యాపారంలో కొన్ని రకాల కర్మఫలితాలను అనుభవించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అనేక గండాలు, కర్మలనుండి విముక్తిపొందడం వ్యాపారరంగంలో ఒక భాగమవుతుంది. వీటిలో చిక్కుకోకుండా జీవించడానికి సహకరించేందుకే భగవంతుని అనుగ్రహం కావాలి. కాబట్టి అన్ని రకాల వ్యాపారాలలోనూ- కూరగాయలు, పండ్లు, ఇనుము, కలప, సిమెంట్‌, కిరాణా, నూనె, ధాన్యాలు - లాంటి విభాగాలకు సంబంధించిన వ్యాపారులు తిరుఅణ్ణామలై శ్రీ కంఠనివృత్తి శరభేశ్వరమూర్తిని పద్ధతి ప్రకారం, సూచించిన హోరా సమయంలో నమస్కరించి, ఆర్ద్రా నక్షత్రంలో అభిషేక, ఆరాధనలతో గిరి ప్రదక్షిణ చేసి, తగిన పరిష్కారాలనన్నిటినీ, వరాలనూ, అనుగ్రహాలనూ పొందాలి. ఇందుకు శరభేశ్వర పూజావిధానం చాలావరకూ సహకరిస్తుందన్న విషయాన్ని గ్రహించి, అన్నదానాలు చేసి, శ్రీ శరభేశ్వర ఆరాధనను కొనసాగించాలి. 

దుర్మార్గుల నుండి తప్పించుకోవడానికి 

పదవి, ధనం, మందీమార్భలం, దుర్భుద్ధి, క్రూరత్వం లాంటి వాటి కారణంగా సంకటాల బారిన పడినవారి సంఖ్య అపారం! ఇలాంటి గుణాలున్న పై అధికారులు, కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువారు మనకు తటస్థపడడం సహజమైపోయింది! ఇలాంటి వారి బారి నుండి బయటపడి, మరలా సన్మార్గానికి రావాలంటే 'తులా అంజనేత్ర దీక్ష' శక్తి గల శ్రీ కంఠనివృత్తి శరభేశ్వరుని మొక్కి ఉత్తరాషాఢ నక్షత్రంలో గిరిప్రదక్షిణ చేయాలి. 
సాధారణంగా చట్టం, న్యాయం, రక్షణా విభాగం లాంటి రంగాలలో ఉన్నవారు అశ్వత్థ వృక్షానికి ఉత్తరాన వున్న వేరుతో చేసిన శివలింగాన్ని తీసుకుని, నీలం కలిసిన బంగారు లింగమూర్తిని (స్వర్ణమూర్తి) తీసుకుని, గిరిప్రదక్షిణం చేసి తమ మొక్కులను తీర్చుకోవాలి. దీనిని నమ్మకంతో చేస్తూ వస్తే, చట్టం, రక్షక విభాగాలలో ఎదురయ్యే అనేక సంకటాలు తొలగి ధర్మమార్గంలో వారి జీవితం కొనసాగుతుంది. 

దైవ సాన్నిధ్యంలో నుండి పూజ చేసే మహద్భాగ్యం పొందిన వారికి ఎంతటి అసూయ, పంచమహాపాతకాలు, దురాలోచనలు, దుష్ప్రవర్తన లాంటివి ఉండకూడదు. ఎందుకంటే, ఏ స్థాయిలో ఉత్తమ భక్తితో శ్రీ కంఠ నివృత్తి శరభేశ్వరమూర్తిని ఆరాధిస్తున్నామో, ఆ స్థాయికి తేజస్సు, భక్తి పెరుగుతూ వుంటాయి. 

మనం మాత్రం భగవంతుని మహిమను గ్రహిస్తే చాలదు. ఆ దైవ చింతనను ఇతరులుచే గ్రహింపచేయాలన్న భావన వుండాలి. దీనికోసమే దైవవిగ్రహాలను సమీపంలోనుండి పూజించడం ఎవరికీ లభించని ఉత్తమ భాగ్యాన్ని మనకు అందించాడని గ్రహించి ఆనందించాలి. 

దష్టశమన కష్టనివారణ
శ్రీ శరభేశ్వరుడు


చిదంబర క్షేత్రంలోని పెద్దశివాలయంలో కొలువైవున్న శ్రీ శరభేశ్వర మూర్తి ప్రత్యేకత కలిగినవారు. విభిన్నమైనవారు. మంచి వరాలిచ్చి అనుగ్రహిస్తారు. ప్రత్యక్షమూర్తిగా సత్కార్యసిద్ధులను అపరిమితంగా ఇచ్చేవాడు. అత్యంత శక్తిగలవారై 'దుష్టశమన కష్టనివారణ శరభమూర్తి'గా విలసిల్లేవారు. పంచభూత తత్త్వాలను తనలో సృష్టించి, ప్రపంచంలోని సకల కోటాను కోట జీవులను కటాక్షించగల శ్రీ శరభేశ్వరమూర్తి చిదంబర క్షేత్రంలో ఆకాశతత్త్వ కటాక్ష జ్యోతిలా వెలుగొందుతున్నారు. 

ఆదివారం సాయంత్రం రాహుకాల (సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు) సమయంలో చిదంబర శివాలయంలో 'దుష్టశమనక కష్టనివారణ మూర్తిగా విలసిల్లే శ్రీ శరభేశ్వర మూర్తిని అభిషేక ఆరాధనలతో మ్రొక్కడం జీవితంలో లభించిన మహాభాగ్యం. ఇప్పటికే మనం ఎన్నోమార్లు చెప్పినట్లుగా కలియుగ మానవుల మనసులో పగ, విరోధం, క్రోధం, అనైతిక ప్రవర్తన, విచ్చలవిడి శృంగారం లాంటి గుణాలున్నందువలన హిరణ్యకశిపుని దుష్టగుణాలను శ్రీ నృసింహుడు నాశనం చేసినట్లుగా, మానవుని రాక్షస గుణాలను తొలగించి, మానవత, ఆధ్యాత్మికత, సద్భక్తి ఉన్నవారుగా ధర్మవర్తనులుగా జీవితం గడపడానికి అనుగ్రహించే అద్భుత మూర్తి. 
పంచభూత శక్తులు నిండినట్లుగా ఆలయాలు విలసిల్లినా కొన్ని ప్రదేశాలలో ప్రత్యేకంగా కొన్ని దైవీక శక్తులు పరిపూర్ణంగా దర్శనమిస్తాయి. ఈ విధంగా చిదంబర దేవాలయంలో శ్రీ శరభేశ్వర మూర్తి దుష్టశక్తులను త్వరగా నాశనం చేసే మహా అద్భుతశక్తిగా విలసిల్లుతున్నారు. 
రాహుకాలంలో, యమగండ సమయంలో రాక్షస గుణాలు తీవ్రంగా ప్రబలి అట్టహాసంగా ప్రవర్తిస్తాయి. అందుకే రాహుకాలంలో పతాకస్థాయిలో వుండే దుష్టశక్తులను ఎదిరించి, కష్టాలను అధిగమించి శుభకార్యాల ఫలితాలను పొందడానికే శ్రీ దుర్గాపూజ, శ్రీ శరభేశ్వర పూజ లాంటి అద్భుతమైన ఆరాధనా క్రమాలను రాహుకాలంలో నెరవేర్చి దానివలన లభించే అత్యంత శక్తి గల అగ్ని ప్రవాహ శక్తులతో దుష్టగుణాలను మనం భగవంతుని అనుగ్రహంతో గెలుస్తున్నాం. 
ఈ విధంగా చిదంబరం శ్రీ నటరాజ దేవాలయంలోగల శ్రీ శరభేశ్వరమూర్తిని ఆదివారంనాడు రాహుకాలంలో వెన్నపూత, పసుపుపూత, గంధంపూతలతో అభిషేక, ఆరాధనలతో సేవించి శ్రీ శరభేశ్వర కవచాన్ని ప్రగాఢ విశ్వాసంతో, భక్తితో పారాయణం చేసినందువలన అనేక దుష్టశక్తులు, దోషాలు తొలగి పలు శుభకార్యాలు సులభంగా నెరవేరుతాయి. శ్రీ శరభమూర్తికి తీయని 'సుయం' నైవేధ్యంగా పెట్టి అన్నదానం చేస్తే సత్ఫలితాలు కలిగి మనుషులు దానధర్మగుణాలతో విలసిల్లుతారు. 

ఇల్లు, కార్ఖానా నిర్మాణం, పదోన్నతి లాంటి రకరకాల సమస్యలు, ఆటంకాలు నిరాటంకంగా కొనసాగడానికి ఈ శరభేశ్వరుని పూజ ఎంతో సహకరించి, మనిషి ఉన్నతికి సాయపడుతుంది. 

వాక్యాతుర్యం పెరగడానికి


వాక్చాతుర్య ప్రతిభ కోర్టులలో, చట్ట, న్యాయ విభాగాలలో చాలా అవసరమౌతుంది. కొద్దిగానైనా సరే నోరు జారితే కేసు తలక్రిందులై ఫలితాలు తారుమారవుతాయి. లక్షలాది రూపాయలు, ఆస్తులు, ఆస్తిపంపకం, భూతగాదాల కేసులు న్యాయస్థానంలో కొనసాగుతుండగా, వాదనలలో చిన్న పొరబాటు జరిగితే కలిగే ఫలితాలు దారుణం. 
ఆదివారం శ్రీ శరభేశ్వర ఆరాధన చిదంబరంలో కొనసాగడం వలన మంచి వాక్పటిమ ఏర్పడుతుంది. ఎందువలనంటే లోనాలుక అని చెప్పబడే భాగంలో దోషాలుంటే కొన్ని దుష్టశక్తులు తలెత్తి, ఎందరో జీవితాలను బాధిస్తుంది. ఇలాంటి దోషాలను భస్మం చేయడం శ్రీ శరభేశ్వరుని ఆరాధన ద్వారానే సాధ్యం. 

మాట్లాడే చాతుర్యం పెరగడానికి 

ఎన్నో వృత్తులలో విజయం సాధించడానికి ఈ కలియుగంలో వాక్చాతుర్యం అవసరమౌతుంది. Sales representatives, sales officers, marketing managers లాంటి ఉద్యోగాలకు వాక్చాతుర్యం ఉంటే అవకాశాలు ఎక్కువ. అందులోనూ నిర్దిష్ట target ను అందుకోలేకపోతే ఉద్యోగాలను కోల్పేయే దౌర్భాగ్యం ఏర్పడుతుంది. ఐతే వ్యాపారం జరిగే దుకాణాలలో, కార్యాలయాలలో, వ్యాపార సరకులు నిండివున్న గోదాములలో ఎన్నెన్నో దోషాలుంటాయి! పోటీ, ఈర్ష్య, క్రోధం, విరోధం, పగలాంటి రాక్షసగుణాలు, సొమ్ము, పేరాశ వలన కలిగే దుర్భావనలు ఇలాంటి ప్రదేశాలలో ఎక్కువే. ఇలాంటి పరిస్థితులలో వ్యాపారం సరిగ్గా ఎలా సాగుతుంది? ఇక్కడ వాక్చాతుర్యం ద్వారా దుష్టశక్తులను గెలిచి వ్యాపారాన్ని కొనసాగించాలి! దీన్నెలా సాధించడం? 
దీనికి అనుగ్రహం శ్రీ శరభేశ్వరుని వలనే మనకు లభించాలి? ఇలా వాక్చాతుర్య ప్రతిభకు తోడుగా వుండేది నాలుక కొసలో వున్న 'లలాటంగ పూషణ శక్తి' గొంతు క్రింది భాగంలో వుండే 'కాలదువ శక్తి', దంతాలలోని దంతశోభిత శక్తి లాంటివి. వీటిని పొందడానికి సహకరించేది శ్రీ శరభేశ్వర పూజా మహిమ. అదెలా? 
శ్రీ శరభేశ్వర మూర్తి దంతాలను మనం స్మరించుకుంటే చాలు కనిపిస్తాయనుకుంటున్నారా! ఎందరో మహర్షులు దీర్ఘ తపస్సు చేసి, ఎన్నో యుగాలపాటు యోగస్థితిలో ఉండి తామే శ్రీ శరభేశ్వరుని దంతాలుగా మారిపోయారు. రూపమేలేని పరమాత్మతో ఐక్యం కావడమంటే ఇదే! కాబట్టే మాట్లాడే సామర్థ్యం పొందడానికి ఇలాంటి దంతదేవతా మూర్తుల ఆశీర్వాదాన్ని మనం పొందాలి. ఆ భాగ్యాన్ని మనకు కలుగజేసేది శ్రీ శరభేశ్వరమూర్తి. 
వామన తంత్ర సిద్ధి పెరగడానికి 
కలియుగంలో వామన తంత్రం తెలిసినవారు కొందరే! తంత్రం అంటే మోసగించడం అన్న అర్థం కాదు! ఎన్నో సత్కార్యాలు చేయడానికి కావలసిన శక్తిని మనకు అందించడంలో సాయపడేదే వామన తంత్ర మంత్రం. కానీ వీటిని ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుని సదుద్దేశంతో చక్కగా ప్రయోగించాలి. దుష్టశక్తులు కూడా సిరిసంపదలు పొందడానికి ఈ వామన తంత్రాన్ని ఉపయోగిస్తే దారుణాలు జరుగుతాయి. 

వామన తంత్రాలను ఒక స్థాయివరకూ నేర్చుకుని గడువులోపున అది పూర్తికాక, అనేక సమస్యలకు, మానసిక ఆందోళనలకూ గురైన వారెందరో! వీరు ఎంత ప్రయత్నించినా సమాజ హితం కోసం ఆ తంత్రాన్ని వినియోగించలేక ఎంతో మానసిక క్షోభకు గురైనారు. కాబట్టి వామన తంత్ర, మంత్ర శక్తులు సమాజానికి చక్కగా ఉపకరించడానికి శ్రీ శరభేశ్వర ఆరాధన, - అందులోనూ చిదంబరాలయంలోని శ్రీ శరభేశ్వర ఆరాధన చాలా సహకరిస్తుంది. 
చేతబడుల ప్రభావాల నుండి బయటపడడానికి 
చేతబడులు, దృష్టిదోషాలు లాంటి చెడును చేసే దుష్టశక్తులు ఎన్నో వున్నాయి. ఎన్నో రకాల విషాక్షరాలతో నిండిన మంత్రాలు ఎన్నో ఉన్నాయి. దుష్టతాంత్రిక విద్యలతో, విషాక్షరాలతో ఎన్నో తాయిత్తులు, తగరపు చిత్రాలు కొందరిని శారీరకంగా, మానసికంగా దెబ్బతీయడం మనం విని వున్నాము. కాబట్టి ఇలాంటి చేతబడులు, తాంత్రిక విద్యల ప్రభావానికి లోనై అవస్థపడుతున్నవారు చిదంబరం శ్రీ శరభేశ్వర మూర్తిని ఆదివారం రాహుకాలంలో ఆరాధిస్తే, ఈ క్షుద్రవిద్యలు, చేతబడులు ప్రయోగించే దుష్టశక్తులు భస్మమై, వాటి బారినుండి విముక్తి పొందవచ్చు. 
కొన్ని కార్యాలయాలు, గృహాలు, వాసస్థలాలు, బావులు, పడకగది, వంటగది లాంటివి కూడా నిర్దిష్ట దిక్కులలో నిర్మించబడక వుంటే ఆ ఇంటిలోని వారి మానసిక ప్రశాంతత దెబ్బ తింటుంది. ఇది వారి నక్షత్రం, రాశులకు తగినట్లు మారవచ్చును. ఈ వాస్తు దోషాలను సరిగా పరిష్కరించకపోతే దంపతుల మధ్య, సంతానం మధ్య ఏవో కొన్ని సమస్యలు ఉంటూనే ఉంటాయి. కొన్ని అంగవైకల్యాలతో పిల్లలు పుట్టవచ్చు! 

వాస్తు దోషాల నివృత్తికి 

వాస్తు శాస్త్రాలకూ శ్రీ శరభేశ్వర ఆరాధానకూ ఏమిటి సంబంధం? శ్రీ నృసింహుని ఉగ్రత్వాన్ని నివారించి, దానిని ఉపశమింపచేసినప్పుడు శ్రీ శరభేశ్వరుడున్న దిక్కు / శయన స్థితి చాలా విశేషమైనది. శరభేశ్వరరూపం, శరభపక్షి కోణ పీఠాలు, నేత్ర దిక్కులు, అమరివున్న భంగిమలు, నిల్చున్న స్థితి- ఇవన్నీ అనేక దిక్కులను చూస్తూ వున్నాయట! ఇవన్నీ వాస్తు శాస్త్ర ప్రకారం ఏర్పడిన శ్రీ శరభేశ్వర శిలారూపస్థితి. ఇందువలననే వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించబడని కొన్ని గృహాలలో ఏర్పడే దోషాలకు పరిహారంగా శ్రీ శరభేశ్వరమూర్తి యొక్క 'నేత్రదర్శన' భంగిమ అమరివుంది. 

మహాత్ముల దృష్టి ఎన్నో రకాల దోషాలను తొలగిస్తుంది. అలాగే చిదంబరంలోని శ్రీ శరభేశ్వరమూర్తి యొక్క అపూర్వమైన నేత్ర దృష్టి అనేక రకాల భూదోషాలను తొలగించగలదు. 
విషాక్షర మంత్ర ప్రభావం తొలగడానికి 
ఎన్నో ప్రదేశాలలో దోష నివృత్తికి విభూతిని మంత్రించి ఇవ్వడం ఒక ఆనవాయితీ! సరైన పద్ధతిలో ఈ మంత్రాలు ఉచ్ఛరించబడక పోతే వాటి ప్రభావం వలన ఎన్నో విపరీతాలు ఏర్పడతాయి. అందులోనూ మూలికల ద్వారా సరైన పద్ధతిలో విభూతి చేయబడకపోతే దానినిండా దోషాలు వుంటాయి. దీనికి నివారణగా ఏర్పడిందే శ్రీ శరభేశ్వర ఆరాధన. ఈ శరభేశ్వరమూర్తి ఆకృతినుండి వెలువడే శరభ అగ్నికి భస్మధారణం వలన సంబంధిత దోషాలను భస్మీపటం చేసేశక్తి ఉన్నది. కాబట్టి ఎన్నో విధాలైన, దోషపూరితమైన విధానాలతో మంత్రించబడిన విభూతి మాలలను, యంత్రాలను పొందినవారు చిదంబరం శ్రీ శరభేశ్వరుని ఆదివారం, రాహుకాలంలో ఆరాధిస్తూ వుంటే ఆ దుష్ప్రభావాలనుండి బయటపడతారు. 
'శరభ చంద్ర అంజనం' అనబడే అంజన కాటుక ఉన్నది. అంజనం అంటే పలురకాల దోషాలను తొలగించే కాటుక అని అర్థం. కంటి దృష్టిని తొలగించే పొన్నగంటి ఆకు, గుంటగలగరాకు లాంటి అనేక రకాల ఆకుకూరల తైలాల నుండి తీయబడిన కాటుక పెడితే చిన్న పిల్లలకు కలిగే కంటి దృష్టి దోషాలు నివారించబడుతాయన్న విషయం మనకు తెలిసిందే కదా! 

అంజనం అనబడే కాటుకకు అనేకరకాల దోషాలనూ, శాపాలను తొలగించగల దైవీకశక్తి వుంది. అందులోనూ సద్గురువు అనుగ్రహంతో, సరైన పద్ధతిలో అంజనాన్ని తయారుచేసి శ్రీ శరభేశ్వర అనుగ్రహంతో రక్షగా పెట్టుకుని దానిని ప్రతిరోజూ ప్రసాదంగా ధరిస్తూ వస్తే ఎలాంటి దోషాలయినా సులభంగా నశించిపోవలసిందే. శుభముహూర్తం లెక్కించి పొన్నగంటాకు తైలం, గుంటగలగరాకు తైలం, మందారతైలం ఈ మూడింటిని కలిపి వీటి నుండి కాటుక తయారుచేసి శ్రీ శరభేశ్వరమూర్తికి కొద్దిగా రక్షపెట్టి, ప్రసాదంగా ప్రతిరోజూ చిన్న పిల్లలకు పెడితే వారికి ఏర్పడే పలు రకాల దృష్టి దోషాలు తొలగి పిల్లలు ఈర్ష్య, క్రోధం లాంటి దోషాల వలన ఏర్పడే మందబుద్ది తొలగి చక్కగా చదివి అభివృద్ధి సాధిస్తారు. చేతబడుల దుష్టశక్తులను తరిమే కాటుక ఇది! 
ఈ శరభ చంద్ర కాటుకను ప్రతిరోజూ కన్యలు నుదుట ధరించడం వలన ఎలాంటి వివాహదోషాలైనా తొలగి శ్రీ శరభేశ్వరుని అనుగ్రహంతో వివాహం నిర్విఘ్నంగా జరుగుతాయి. 

శరభ చంద్ర అంజనం

శరభ చంద్ర అంజన తయారీ విధానం 
పొన్నగంటి ఆకు, గంటగలగరాకు, మందారతైలాలను సమప్రమాణంలో కలిపి ప్రమిదలో పెట్టి పరిశుద్ధమైన దూదితో వత్తులు చేసి దీపం వెలిగించండి! స్వచ్ఛమైన వెండి లేదా కంచు పళ్ళెంలో, కొబ్బరిచిప్పలో నూరిన చందనం పూసి దానిలో తైలాల మూలిక దీప పొగ పడేలా ఆ పళ్ళాన్ని లేదా కొబ్బరిచిప్పను దీపంపై నుంచాలి. ఈ నల్లని పొగను అప్పుడప్పుడు కొద్దికొద్దిగా సేకరించి చంద్ర అంజనాన్ని తయారుచేయాలి. 

దేవాలయ అధికారుల అనుమతితో లేదా ఆలయంలోనే రకరకాల పూజలతో ఈ అంజనాన్ని చేసి శ్రీ శరభేశ్వర మూర్తికి రక్షగా, దానిని ప్రసాదంగా కుటుంబసభ్యులు ప్రతిరోజూ భరిస్తూ వస్తే వ్యాపారం, కార్యాలయం లాంటి ప్రదేశాలలోని దోషాలు తొలగడానికి ఈ అంజన ప్రసాదం ఉపయుక్తంగా ఉంటుంది. 

తక్షణం ఆదుకునే శరభేశ్వరుడు 

సాధారణంగా స్తంభంలో వెలసివున్న శరభేశ్వరుని అందరూ కొలుస్తూ వుంటారు. స్తంభంలోని శరభేశ్వరుడు విశేషంగా భక్తులను అనుగ్రహిస్తుంటారు. అలాగే ఆకృతిగా వెలసి, పూజ చేసే సమయంలో లభించే ఫలితాల గురించి చెప్పుకుందాం! 

శ్రీ శరభేశ్వర సహస్రనామం 

భగవల్లీలలను శ్రీ శరభేశ్వరుడు ముందుగా తన దృష్టి ద్వారా, (నేత్ర దీక్ష) ఇచ్చి నృసింహుని ఉపశమింప చేస్తాడు. నేత్ర దీక్ష ద్వారా కోపాన్ని నియంత్రించే ప్రయత్నం చేయడం వలన శ్రీ శరభేశ్వరుని 'నేత్ర శిఖామణి శరభేశ్వరుడు' అని కూడా అంటూ వుంటారు. ఇలా పలు రకాల ఆకృతులలో, విధానాలలో నృసింహుని వేగాన్ని తట్టుకున్న శ్రీ శరభేశ్వరుడు వివిధ నామాలతో పిలువబడతాడు. అప్పుడు రూపొందినదే శ్రీ శరభేశ్వర సహస్రనామం. 
నేత్ర దీక్ష ద్వారా శ్రీ నృసింహుని ఉగ్రత్వాన్ని కొంతవరకూ తగ్గించిన శ్రీ శరభేశ్వరుడు తన రెక్కలతో ప్రేమగాలులు విసిరి నృసింహుని శాంతింపచూశారు. అలా రెక్కలను విస్తరించి, విసిరినప్పుడు ఆ రెక్కల నుండి అద్భుతమైన గాలులు తయారుచేశారు. తుఫాను, సుజి గాలి, తెమ్మెర అనే మూడు రకాల గాలుల గురించే మనకు తెలుసు! కానీ గాలులలో మాత్రమే 88000 వేల కోట్లున్నాయట! ఇన్ని రకాల వాయువులను మనం చెప్పే తెమ్మెర గాలికన్నా చల్లగా వీస్తుంది. ఆ గాలికి 'మదిప్పరై' అనే పేరుంచి, ఆ గాలి ఎవరిపై ప్రసరిస్తుందో వారు స్వర్గలోకపు కలలను కననారంభిస్తారు. వారి కనులు స్వర్గలోక దృశ్యాలను చూడగలరు. ఇలాగే తీరపరై, సిరప్పరై, వరుప్పరై, మలిప్పరై, తులాప్పరై అనే పలు రకాల గాలులు వీస్తూ ఉగ్రత్వాన్ని తగ్గించడానికి సహకరిస్తాయి. అప్పుడు కూడా నృసింహుని ఉగ్రత్వం తగ్గలేదు. గాలిరూపంలో నృసింహుని శాంతపరచాలని చూసిన శరభేశ్వరునికి 'నిరైనిలై శరభేశ్వరుడు' అనే పేరు వచ్చింది. 

ఇలా శ్రీ శరభేశ్వరుడు, శ్రీ నృసింహుని ఉగ్రత్వాన్ని క్రమక్రమంగా తగ్గించాడు. కొట్టి, హింసించి, ఏదో విధంగా బాధపెట్టి ఆ ఉగ్రత్వాన్ని తగ్గించలేదు. కానీ అజ్ఞానంతో ప్రజలు శరభేశ్వరుడు నృసింహుని సంహరించాడు అని భావించారు. కానీ నృసింహుని ఉగ్రత్వాన్ని పలురకాల పంచభూత శక్తుల సామర్థ్యం చేత ఉపశమింపచేశాడు అనేదే వాస్తవం. అలా ఉపశమింపచేసిప్పుడు దేవ తీర్థాలలో కాక ఇతర ప్రదేశాలలో ఆ ఉగ్రత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. కాబట్టి అద్భుత మూలికా తీర్థాలను వర్షపు జల్లులా శ్రీ నృసింహునిపై కురిపించి ప్రేమపూర్వకంగా ఆయన వేగాన్ని తగ్గించాడు. వర్షాలలో మానవులకు తెలియని రకాలెన్నో ఉన్నాయి. పూలజల్లులు, చినుకుల జల్లులు, స్పష్టతజల్లులు, మొగలిపూవు వాసనల జల్లులు, కనీసస్థాయి జల్లులు - ఇలా 98 వేల కోట్ల జల్లులున్నాయి. ఆ జల్లులు కురిసినప్పుడే నృసింహుడు ఉపశమింపనారంభించాడు. 

సాధారణంగా జల్లులు కురవగానే ప్రజలలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆ ఆనందం పెల్లుబికే సమయంలో వారు భగవంతుని అనేక విధాలుగా కొలుస్తారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే. జల్లులు కురిసేప్పుడు వరాలడగడం ప్రజల అలవాటు. అలాగే శ్రీ నృసింహుడు కూడా తనపై జల్లులు కురవగానే సంతోషించి, ''నాపై కరుణతో నాకు సాయం చేసి నా కోపాన్ని తగ్గించి నన్ను ఆనందింపచేసిన ఓ పరమాత్మ'' అంటూ శ్రీ శరభేశ్వరుని ఎన్నో విధాల స్తుతించాడు. అలా స్తుతించినప్పుడు శ్రీ నృసింహుని నోటి నుండి శ్రీ శరభేశ్వరుని 
''దురిత సహాయ శరణాగతవత్సలా'' ప్రశంస వెలువడింది. అప్పుడు శ్రీ శరభేశ్వరుడు అద్భుతంగా తన రెండు చేతులను శ్రీ నృసింహుని ఒడిలో నుంచి నిమిరారు. 

ఆధ్యాత్మిక విమానంలా కనబడిన శ్రీ శరభేశ్వరుడు ఆకాశ విమానం భూమివైపు రావడానికి తన స్పర్శ దీక్షనిచ్చి శ్రీ నృసింహుని హృదయస్థానాన్ని స్పృశించాడు. శ్రీ శరభేశ్వరుని స్పర్శ తగలగానే ఆవేశ స్వరూపుడైన శ్రీ నృసింహుడు అతనికి మొక్కాడు. ఆ స్థితిలోనే నేడు భగవాదనుగ్రహంతో 'శ్రీ వెళ్లీశ్వరర్‌ దేవాలయంలో శ్రీ శరభేశ్వరుడు దురిత సహాయ శరణాగతుడు అనే పేరిట వెలిసి అనుగ్రహించాడు. 

మైలాపూర్‌ శ్రీ వెళ్లీశ్వర ఆలయంలో అనుగ్రహించే దురిత సహాయ శరణాగత శరభేశ్వరుడు 
వెళ్లీశ్వర దేవాలయంలో ఉన్న దురిత సహాయ శరణాగత శరభేశ్వరుని కొలిచేవారు తమ జీవితంలో ఏర్పడే అనేక సమస్యలకు త్వరగా సహాయం పొందుతారు. కాబట్టి ఎలాంటి శుభకార్యాలైనా ఈ శరభేశ్వరునికి మొక్కి, పద్ధతి ప్రకారం అభిషేకం చేసి, అనేక వాసనాద్రవ్యాలు, పన్నీరు, లేతకొబ్బరిబొండాలు, పాలు, పెరుగు లాంటి శీతల పదార్థాలతో అభిషేకం చేసి మ్రొక్కితే ఆయన దురిత సహాయ శరణాగత శరభేశ్వరుడై సకల సౌభాగ్యాలనూ అందిస్తాడు. తనకు నమస్కరించేవారికి సహాయం చేయడానికి సదా నిరీక్షిస్తుంటాడు కాబట్టి ఈయనను, 
''ఓం తత్పురుషాయ విద్మహే దురిత సహాయ దేవాయ ధీమహి తన్నో దురిత సహాయ శరణాగత ప్రచోదయాత్‌'' 
అనే మంత్రంతో కనీసం 108 సార్లు పారాయణ చేసి నమస్కరించుకుంటారు. 

శనీశ్వరుని ఎదుట శ్రీ శరభేశ్వరుడు

శ్రీ వెళ్లీశ్వర పవిత్ర క్షేత్రంలో శ్రీ శనీశ్వర భగవాన్‌ ఎదుట కన్పించేలా శ్రీ శరభేశ్వరుడు ప్రతిష్ఠించబడడంలోని ఆంతర్యం ఏమిటో తెలుసా? 
'దుఃఖమూ సుఖమూ ఇతరులు ఇవ్వరు. వ్యాధులు ఉపశమింపచేసేది మనమే'. అంటారు. 
సుఖమూ, దుఃఖమూ అనే విషయాలను ప్రతి ఒక్కరూ అనుభవించే తీరాలి. వీటి ఫలితాలను అందరూ అనుభవించడానికి కారకులుగా ఉండేవారు నవగ్రహ నాయకులే. నవగ్రహాలలో అద్భుతశక్తులు గలిగి, అందరినీ సమంగా చూస్తూ ఈశ్వరుడనే బిరుదు పొంది ఫలితాలను ఇచ్చేవాడు శ్రీ శనీశ్వరుడు. ఆయన ఈశ్వరుడే అయినా ఎదుట నిలిచి ఆయనను కొలవడం మంచిది కాదంటారు, కానీ ఆయన భక్తులు తన ఎదుట నిలిచి తనను కొలుచుకునే భాగ్యం ప్రసాదించమనికోరగా, పరమేశ్వరుడు శ్రీ వెళ్లీశ్వరుని ఆలయంలో ఆయనకు శ్రీ శరభేశ్వరుని రూపంలో అనుగ్రహం చూపాడు. ఈ సంఘటన కొన్ని యుగాలకు పూర్వమే జరిగినా కలియుగంలోని మానవులు, ఇది ఇటీవలికాలంలో జరిగిందని భావిస్తున్నారు. ఈ శరభేశ్వరునీ, శ్రీ శనీశ్వరుని కొలుచుకుంటున్నారు. 

ఏలిననాటి శని, అష్టమశని, మందశని, పొంగుశని, తంగుశని, జన్మశని, కళిత్రశని, పంచమశని, శనిదశ జరిగేవారు, శని నీచంలో, శని ఉచ్ఛస్థితిలో, శని వక్రస్థితిలో ఇలా జాతకంలో శని వివిధ దశలలో ఉన్నవారందరూ శనివారం, ఆదివారాలలో 'మృదుభాషిణి అభిషేక తీర్థం అనే అభిషేకం, శ్రీ శరభేశ్వర అగరొత్తి, శత్రుమారన్‌ అగరొత్తి లాంటి వాటిని వెలిగించి, శత్రువుల వలన వచ్చే సమస్యలను తొలగించుకోవచ్చు. దీని వలన మానసిక ఆందోళన తగ్గుతుంది. ప్రార్థనలు నెరవేరుతాయి. 'సాక్షీవేద బాణ దూపం' ను శని హోరాలో వెలిగిస్తే శనీశ్వరునికి ప్రీతి కలుగుతుంది. 'మంద వేగ ధూపం' ను ప్రదోష సమయాలలో వెలిగిస్తే స్త్రీల ఋతు సమస్యలు తొలుగుతాయి. 'శరభేశ్వర శరణాగత ధూపం' వెలిగిస్తే చేసే వృత్తిలో ఉన్నతి సాధించగలరు. 
'యోగ దయా పాదాంబుజ నూనె' పూస్తే, పత్తితో కూడిన నూనెతో దీపం వెలిగించి పూజిస్తే అంధకారబంధురమైన జీవితంలో వెలుగు నిండుతుంది. జీవిత సమస్యల నుండి విముక్తి లభించే మార్గం కనబడుతుంది. (ప్రతిరోజూ లేదా ప్రతి ఆదివారమూ) గోకర్ల తైలాన్ని శ్రీ శరభేశ్వరునికి వెలిగించి పూజిస్తే, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే 'దువిధియనూనె' పూస్తే దంపతుల మధ్య అన్యోన్యత, ఐకమత్యం ఏర్పడుతాయి. 

ఈ విధంగా శ్రీ శరభేశ్వరునికి ధూపం వేసి పంచతైలాలతో దీపం వెలిగించి, రక్ష చూపించే ఆరాధన క్రమం వలన వారి వారి సమస్యలకు తగిన దుఃఖం తీరి శుభాలు పొందుతారు. ఇంతేకాదు శరభేశ్వర కవచం, శరభేశ్వర గాయత్రి లాంటి మంత్రాలను ప్రతిరోజూ కనీసం 108, 1008 మార్లు పఠించి 108 శ్లోకాలను బృందంగా పారాయణం చేయడం వలన సత్ఫలితాలు పొందవచ్చు. నిత్య ప్రదోష సమయమైన 4.30 - 6.00లో శివపురాణం చదివి శ్రీ శరభేశ్వరుని పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. 

శ్రీ శరభేశ్వరుని చిటికెన కాలి గోటిలోని శక్తి 4,00,000 కోట్ల సూర్యకిరణాలు చేరితే వచ్చే శక్తికి సమమవుతుంది. దీని వలన శ్రీ శరభేశ్వరుని మహిమ ఎలాంటిదో మనం గ్రహించవచ్చు. 

శరభేశ్వర దేవాలయ మహిమ 

శ్రీ శరభేశ్వరుని అవతారమే అనేక రకాల బీజాక్షరాల సమూహంతో నిర్మించబడింది. ఆయన బింబం అగ్ని ప్రకాశంగా మనకు ద్యోతకమవుతుంది. ఆయన అవతారంలోగల బీజాక్షర మంత్ర శక్తులు ఒక్కొక్కదానికీ అనేక అద్భుత శక్తులున్నాయి. అఖండకోటి బ్రహ్మాండ అవతార వైశిష్ట్యాన్ని, రూప వైశిష్ట్యాన్ని కేవలం పదాలతో వర్ణించలేము. 

ప్రతొక్కచోటా వెలసిన శ్రీ శరభేశ్వరుడు వివిధ భంగిమలలో కనిపిస్తుంటాడు. శత్రువులను మర్దించేప్పుడు ఒక భంగిమ, వారిని అణిచేప్పుడు ఒక భంగిమ, వారిని గెలిచేప్పుడు ఒక రూపం ఇలా ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు! శ్రీ నృసింహుడు, ప్రహ్లాదుడు, అగస్త్యుడు, కవచజలూషర్‌, తండలమహర్షి లాంటి ఉత్తములే ఆయన అసలు స్వరూపాన్ని చూడగలరు. 
యుగయుగాలలోనూ అవతరించిన శ్రీ శరభేశ్వరుడు కలియుగంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధమైన భంగిమలో ప్రత్యక్షమైనాడు. ఆయన అవతారాలు ఒక్కొక్కటీ ఆయాకాలాలలో కనబడే దుష్టశక్తుల శక్తిని భస్మం చేస్తున్నట్లుగానూ, మంచివారిని కాపాడే విధంగానూ, తర్కానికి లొంగని పలు రకాల తీర్చలేని వ్యాధులను, సమస్యలనూ పరిష్కరించేలా కనిపిస్తూ ఉంటాయి. 
మనకు తెలిసిన రంగులు కేవలం ఏడే! కానీ మనకు తెలియని, మన ఊహకు అందని రంగులు వేలాదిగా వుంటాయి. ఆ విధంగా కలియుగంలో వర్తమానకాలంలో శ్రీ శరభేశ్వరుని విగ్రహంలో రంగులు శ్రీ తండల మహర్షి చెప్పగా ప్రదర్శితమైనాయి. కాబట్టి అవి ప్రముఖంగా ప్రదర్శించబడ్డాయి. శ్రీ శరభేశ్వర అవతార ఆవిర్భావ సమయంలో, కనిపించినవారే శ్రీ తండల మహర్షి అనే విషయం గుర్తించదగినది. 

శరభపక్షిలో ఒక రెక్క శూలినిగానూ, మరో రెక్క ప్రత్యంగిరా దేవిగానూ వుంటాయి. ప్రాణుల ముఖం, పక్షి రెక్క, దేవతల ఆయుధం, మానవులహస్తం, నాగాభరణం లాంటి అనేక భంగిమలు కూడా శరభేశ్వర బీజాక్షర శక్తుల సంకేతమవుతున్నాయి. 
పాకే, ఎగిరే, కూర్చునే, నడిచే జడపదార్థంగా ఉండే సకల కదిలే / కదలని వస్తువులనూ అనుగ్రహించే వారే శ్రీ శరభేశ్వరుడు. 

కలియుగంలో ప్రతి సమస్యకూ పరిష్కారంగా వుండే శ్రీ శరభేశ్వరుని దివ్యనామములు గల 108 స్తోత్రాలను ప్రతిరోజూ ప్రదోష సమయంలో స్తుతించి ఆరాధిస్తే శ్రీ శరభేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. 

శ్రీ శరభేశ్వర కవచం

కవచ జలూషర్‌ రచించిన సూక్ష్మ బీజాక్షరాలు నిండిన శక్తి భరిత శ్రీ శరభేశ్వరస్తుతిని ప్రదోష సమయంలో ముఖ్యంగా ఆదివారం సంధ్యా సమయంలో ప్రదోష సమయం, రాహుకాలం కలిసే 4.30-6.00 మధ్య కాలంలో చదివితే ఈ స్తోత్ర బీజాక్షరాల శక్తిని అధికంగా పొంది సత్ఫలితాలు లభిస్తాయి. ఎప్పుడూ దీనిని చదువుతూ ఉండవచ్చు! భయమూ, భీతి కలిగినప్పుడు సమీపంలో ఉండి అనుగ్రహించే మంత్ర శక్తి ఇది. ఆటంకాలను తొలగించి వివాహాలను, శుభకార్యాలూ నెరవేర్చే మంత్రరాజం ఇది. స్త్రీల కుటుంబ బారాన్ని పరిష్కరించే శక్తిమంత్రమిది.
శ్రీ శరభేశ్వర గాయత్రి 
ఓం శ్రీ చాలు వేశాయ విద్మహే పక్షిరాజాయ ధీమహి 
తన్నో శరభేశ్వర ప్రచోదయాత్‌! 

ఓం గురువే శరణం




ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

1 comment:

  1. Sri Swarnakarshana Bhairava Tantram
    Sri Sarabhasaluva Tantram
    -Swami Madhusudana Saraswati

    ReplyDelete