శ్రీ చక్ర పూజావిధానం (పెద్దది) |  Sri Chakra Pooja Vidhanam ( Big )

శ్రీ చక్ర పూజావిధానం
  Sri Chakra Pooja Vidhanam 
Rs -- 36/-


శ్రీయంత్రం మహా శక్తివంతం

    యంత్రాలన్నీ శక్తివంతమైనవే. అందులో శ్రీయంత్రం మహామహిమాన్వితమైనది. శ్రీయంత్రంలో సర్వదేవతా మూర్తులూ నివాసం ఉంటారు.. శ్రీయంత్రాన్ని పూజించడం వల్ల అష్ట ఐశ్వర్యాలూ సిద్ధిస్తాయి. సర్వ శుభాలూ కలుగుతాయి. ఏ పని చేపట్టినా అది విజయవంతంగా నెరవేరుతుంది- అని మహర్షులు చెప్పారు. త్రిమూర్తులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

శ్రీచక్రానికి అయస్కాంత శక్తిలా విజయాలను, సంపదలను ఆకర్షించే శక్తి ఉంది. శ్రీచక్రం ఉన్న చోట అంతా శుభమే. అన్నీ విజయాలే. శ్రీచక్రం ఇంత శుభకరమైనది, శక్తివంతమైనది కనుకనే తిరుమల వేంకటేశ్వరుని ఆలయ గర్భగుడిలో, విజయవాడ కనకదుర్గ ఆలయ గర్భగుడిలోనూ, మరికొన్ని ప్రముఖ దేవాలయాల్లోనూ ఈ శ్రీచక్రాన్ని మంత్రపూరితంగా స్థాపించారు.

యంత్రం అంటే అది కేవలం రాగి రేకు కాదు. మంత్ర శక్తి కలిగిన దేవతా స్వరూపం. తిరుమల, విజయవాడ తదితర ప్రముఖ దేవాలయాల్లో శ్రీచక్రాన్ని స్థాపించిన తర్వాతే భక్తులకు ఈ దేవాలయాల పట్ల ఆకర్షణ పెరిగింది. ఇసుక వేస్తే రాలనట్టుగా భక్తుల రద్దీ ఎక్కువైంది.

శ్రీ చక్రం ఇంత మహిమాన్విత శక్తిని ఎలా సంతరించుకుందో చూద్దాం.
''వినా యంత్రేనా చేత్బూజా దేవతాన ప్రసీదతి'' అన్నారు.
అంటే శ్రీ యంత్రాన్ని స్తాపించకుంటే ఆ పూజలు నిష్ఫలం అని అర్ధం. యంత్రం అంటే కేవలం రాగిరేకు కానే కాదు. ఇందులో అద్బుతమైన మంత్ర శక్తి ఉంటుంది. దేవతలు కొలువై ఉంటారు.

శ్రీ యంత్రాన్ని రూపొందించేటప్పుడు ఆయా దేవతలకు సంబంధించిన మూల బీజాక్షరాలను స్మరిస్తారు. పవిత్ర దేవతా మంత్రాలతో యంత్రాన్ని శక్తిపూరితం అయ్యేలా చేస్తారు. ఆవిధంగా శ్రీయంత్రం మంత్రాక్షరాలతో దేవతా స్వరూపంగా తయారౌతుంది. అనేక దేవతా మంత్రాలను పఠించడం వల్ల సజక శక్తి స్వరూపం అవుతుంది. సర్వ దేవతలకూ నిలయం అవుతుంది. కనుకనే శ్రీ యంత్రం అసామాన్యమైనది

శ్రీయంత్రంలో ఊర్ధ్వ భాగంలో 4 భుజాల త్రికోణాన్ని ''శివచక్రం'' అంటారు. దాని కింద 5 త్రికోణ భుజాలను ''శక్తిచక్రం'' అంటారు. మధ్యలో ఉన్న బిందువును ''ఆదిశక్తి''గా భావిస్తారు. ఈ బిందువు నుండి కిందవరకూ ఉన్న భాగాన్ని ''భూస్థానం'' అంటారు. ఈ విధంగా బిందువు నుండి భూస్థానం వరకూ శ్రీయంత్రం 3 భాగాలుగా ఉంటుంది. అందుకే శ్రీయంత్రాన్ని ఇలా వర్ణించారు.


చతుర్భీ శివచక్రే శక్తి చక్రే పంచభిః|
నవ చక్రే సంసదిం శ్రీ చక్రం శివయోనపు||

శ్రీ యంత్రం సర్వ దేవతా స్వరూపం. ''శ్రీ '' అంటే విష్ణుమూర్తితో కూడిన శ్రీలక్ష్మీదేవి బీజాక్షర మంత్ర స్వరూపం. ''యం'' అంటే ఓంకార స్వరూపం. ఓంకారమంటే మహాశివుడు, ఆదిపరాశక్తిల సంయుక్త బీజాక్షర మంత్ర స్వరూపం. ''త్రం'' అంటే సర్వ దేవతా బీజాక్షర మంత్ర స్వరూపం. సర్వ దేవతల సర్వసిద్ధులూ శ్రీయంత్రంలో నిక్షిప్తం అయ్యి ఉన్నాయన్నమాట. శ్రీ యంత్రాన్ని పూజించడం వల్ల సర్వ శక్తులూ సమకూరుతాయి. సకల ఐశ్వర్యాలూ సిద్ధిస్తాయి. విద్య, ఉద్యోగం అన్నీ సంప్రాప్తిస్తాయి. ఇది ఇంత ఉత్కృష్టమైనది కనుకనే దీన్ని ''యంత్రరాజం'' అంటారు. అంటే, యంత్రాల్లోకెల్లా ఉత్తమమైనది.

శ్రీ యంత్ర ప్రభావం అర్ధమైంది కనుక, దీన్ని ఇంట్లో స్థాపించుకోవడం మంచిది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

1 comment: