జాతక చక్రం వేయడం ఎలా? | Jathaka Chakram Veyadam Ela ?

జాతక చక్రం వేయడం ఎలా? 
 Jathaka Chakram Veyadam Ela ? 
Rs 36/-

     జాతకుని గురించి తెలుసు కోవాలంటే జన్మ లగ్నము ఖచ్చితముగా తెలియాలి . దీనితో పాటు ప్రతి గ్రహము జాతక చక్రములో ఉన్న స్థితిని ముఖ్యముగా లగ్న స్థితి , చంద్రస్థితి , సూర్యుని స్థితిని పరిశీలించాలి .
మరియు నవాంశ మొదలగు అనేక చక్రములను పరిశీలించి ఫలితములను తెలుసుకోవాలి .


     మానవుని జనన సమయములో ఉన్న గ్రహముల చారమును బట్టి రాశీ చక్రమును వేసుకోవాలి . తదుపరి నవాంశ చక్రమును వేయాలి . పూర్వము మన మహర్షులు రాశి , నవాంశ చక్రముల గురించి చెప్పుచూ రాశి మానవునకు దేహమైతే నవాంశ ప్రాణము వంటిదని అన్నారు . ప్రాణము లేనిదే దేహమునకు విలువలేదు కదా ? కాబట్టి ఫలితము నిర్ధారణ చేయుటలో నవాంశ యొక్క ప్రాముఖ్యము చాలా ఎక్కువగా ఉంటుంది . ఈ నవాంశ చక్రమును ఎలా వేయాలో చూద్దాం . 


   జన్మ లగ్న ప్రమాణమును తొమ్మిది భాగాలుగా విభజించాలి . అలాగే గ్రహముల చారమును కూడా తొమ్మిది భాగములుగా విభజించాలి . జాతకులు జన్మించిన లగ్నము గానీ , జనన కాలములో ఉన్న గ్రహముల స్థితి గానీ ఉన్న స్థానములను బట్టి సులువుగా నవాంశ చక్రమును వేయు పధ్ధతి ఈ విధముగా ఉన్నది .


గ్రహములు మేష , సింహ , ధను రాశులలో ఉన్నప్పుడు మేషము నుండి నవాంశ ను లెక్కించాలి .
వృషభ , కన్యా , మకర రాశులలో ఉన్నప్పుడు మకరము నుండి
మిధున , తులా, కుంభము లలో ఉన్నప్పుడు తుల నుండి
కర్కాటక , వృశ్చిక , మీన రాశులలో ఉన్నప్పుడు కర్కాటకము నుండి నవాంశ ను లెక్కించాలి .


ఉదా : ఒకరు పుబ్బ నక్షత్రము రెండవ పాదములో చంద్రుడు ఉన్నప్పుడు జన్మించినాడని అనుకొంటే రాశి చక్రములో చంద్రుడు సింహ రాశిలో ఉంటాడు . సింహ రాశిలో మఖ నాలుగు పాదములు గడచి పుబ్బ రెండవ పాదము నడుస్తుండగా జన్మించారు కాబట్టి పుబ్బ నక్షత్రము రెండవ పాదము అనేది సింహ రాశికి సంభందించి ఆరవ పాదము అవుతుంది.
పై సూత్రము ప్రకారము మేషరాశి నుండి ఆరవ రాశి అయిన కన్యా రాశిలో చంద్రుని సంచారము నడచును . కావున నవాంశ చక్రములో కన్యా రాశిలో చంద్రుడు ఉంటాడు . ఈ విధముగా మిగతా గ్రహములకు కూడా నవాంశ ను లెక్కించి వేసుకోవాలి .




ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment