దేవీ భాగవతం | Devi Bhagavatha Keywords for Sri Devi Bhagavatam Mohan Publications: SriDeviBhagavatamMohanPublications, Sri Devi Bhagavatam Mohan Publications, Sri Devi Bhagavatam, SriDeviBhagavatam, Religious Books, Religious, Hindu, Devotional Books, Kollipara Kota Nagaiah, KolliparaKotaNagaiah, Kollipara Kota Nagayya, KolliparaKotaNagayya, Mohan Publications, MohanPublications GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

దేవీ భాగవతం 
Devi Bhagavatham
Rs 108/-

    శ్రీదేవి, కరుణామయి, ఆదిశక్తి, మహామాయి, శ్రీ భువనేశ్వరి, అయిన ఆమె చల్లని చూపులు సదా ప్రసరింపజేసి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగునట్లుగా మానవాళికి మంగళమగుగాక! జన్మనిచ్చి, శరీరాన్నిచ్చి, మాతృభావన దశనుండి,అన్ని ప్రాణులకు ఆధారభూతురాలై శక్తినిచ్చే తల్లియైున ఆ జగన్మాత పాదాలవద్దకు చేర్చటానికి, సాధారణ దేహబుద్ధి గల మానవులకు సోపానాలు శ్రీదేవి పూజలు పామరులను పశుత్వం నుండి దైవత్వం దిక్కుకు నడిపించేదే శ్రీదేవీ భాగవతము.

     శ్రీదేవి అందరికీ తల్లే అయినా, సౌమ్యులు, శిష్టులు అయిన బిడ్డలకు ప్రసన్నురాలిగా, దుష్టులు, దుర్మార్గులు అయిన బిడ్డలకు రౌద్రమూర్తిగా కనబడుతుంది. ఆ జగన్మాత. ఆతల్లి కోపగించితే హరిహర బ్రహ్మాదులు కూడ ఆమె ఎదుట నిలువతీరని, పరాశక్తి అవతారమైన దుర్గ రౌద్ర స్వరూపిణిగా, అలవికాని అసురుల సంహారాన్ని చేసి స్త్రీలు అబలలుకారని సబలలులని నిరూపించింది శ్రీదేవీ భాగవతమందు. నిత్యజీవితమందు జగన్మాతకిచ్చే విలువను కన్నతల్లికిచ్చి మానవాళి మంచిమనుగడ సాగించాలి. మానవుడు తన కన్నతల్లిలో, కట్టుకున్న ఇల్లాలిలో, కూతురులో కోడలిలో కూడ శ్రీదేవిని దర్శింగల మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. ''అమ్మ'' అనే పదము కమనీయమైనది. ''యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః'' ఆ జగజ్జనని ప్రతిజీవికి తల్లియై, అమ్మలగన్న అమ్మ అయినది. అనంత కాల స్వరూపిణి, సృష్టిస్థితిలయాత్మకమైన విశ్వసంసార పరిభ్రమణమునకు సాక్షీ భూతురాలు శ్రీలలితా, శ్రీదేవియే. సన్మంగళానిభవంతు సర్వజనులకు మంగళమగుగాక!
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment