Jyotisha Sastra Chitkalu: Jyotisha Sastra Chitkalu, JyotishaSastraChitkalu, Jyotisha Sastramu, Jyotisha, Jotisha, Jothisha, M. Satyanarayana Siddhanti, M.SatyanarayanaSiddhanti, M. Satyanarayana Sidhanti, Mohan Publications  Granthanidhi | MohanPublications | bhaktipustakalu

జ్యోతిష శాస్త్ర చిట్కాలు

Author: M. Satyanarayana Siddhanti
Pages: 208 -- Rs 120/-

     ''జ్యోతిషశాస్త్ర చిట్కాలు'' (1856 జ్యోతిష ఫలసూత్రములు)యను ఈ గ్రంథము నందు 'హోరా' విభాగము నందలి కొన్ని ఫలితాంశములు చర్చించబడినవి. పాఠకులకు శ్రమలేకుండా, సులభముగా అర్థము కాగలందులకు, సంస్కృత మూల శ్లోకములను విడచి, అందలి అర్థసారమును తెలుగు వచన రూపములో సమకూర్చుట జరిగినది. ''ఇందలి ఫలితములు ప్రాచీన ఋషులు దెల్పిన ప్రామాణిక ఆధార గ్రంథములలోనివేయని పాఠకులు మరచి పోకూడదు. ''శాస్త్రీయ విషయములలో అనుభవము వ్యక్తిగతము, చంచలము నైనది. కావున ప్రామాణికమైన శాస్త్రమే శాశ్వతమైన, సర్వకాలముల యందు నిలచి యుండగలదను ధర్మశాస్త్ర వాక్యములను పాటింపుచు...ఈ పుస్తకమునం దట్టి ప్రామాణికములగు శాస్త్రస్థ విషయములనే వ్రాయుట జరిగినది. ముఖ్యముగ మానవ జీవితములకు కలుగు శుభాశుభ కర్మలకు సంబంధించిన భావ ఫలితములు అనగా ''1.తను భావము 2.ధన భావము 3.భ్రాతృ భావము 4.మాతృ భావము 5.పుత్ర భావము 6.శత్రు భావము 7. కళత్ర భావము 8. ఆయుర్భావము 9. భాగ్య భావము 10.రాజ్య భావము11. లాభ భావము 12. వ్యయ భావము అను ద్వాదశభావముల యొక్క ఫలితములను సాధ్యమైనంత విపులముగ దెల్పుట జరిగినది. ''ఈ గ్రంథము ద్వారా పాఠక లోకము తగిన ప్రయోజనమును పొందగలద''ని ఆశించెదను. పొరపాట్లు దొర్లియున్న మన్నింప ప్రార్థింపుచూ సదా మీ ఆదరాభిమానముల నాశించు....

                                                 - యమ్. సత్యనారాయణ సిద్ధాన్తి




ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment