చిట్టి చిట్కాలు |  Chitti Chitkalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu  ChittiChitkalu, Chitti Chitkalu, Tips, Tip, Small Tips, Kitchen Tips, Tips for Women, Beauty Tips, Chitka, Vamsi, Vasundhara, N.Sri Vani Vasundhara, Mohan Publications, Login to add a comment


చిట్టి చిట్కాలు
Chitti Chitkalu
Pages: 88 - 30/-


    చిట్టి చిట్కాలు' పేరుతో స్త్రీల కోసం ఒక పుస్తకాన్ని మన ముందుకు తెస్తున్నారు. ఇందులో బ్యూటీకి సూత్రాలు, మిలమిలలాడే కనులకోసం, అభ్యంగన స్నానంతో అందం, స్వెక్టర్లను ఉతికే విధానం, పాదాల సౌందర్యం, చెప్పులుంచే చోటు, వేసవిలో ఇంటిని అందంగా ఆహ్లాదంగా ఉంచుకోవడం ఎలా, ఫ్రిజ్‌ వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆకులతో వైద్యం, మీరు స్లిమ్‌గా వుండలంటే ఏం చేయాలి?, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, ప్రశాంత జీవితం కోసం ఏం చేయాలి?, రకరకాలుగా వస్త్రధారణ, అందంకోసం వదులుకోవలసిన అలవాట్లు, నష్టాలు, అందమైన గోళ్ళుకోసం, రాత్రిపూట హాయిగా నిద్రపట్టాలంటే , వంటగది జాగ్రత్తలు, మేకప్‌ జాగ్రత్తలు, వేసవిలో పిల్లలకు దాహం తీర్చడం.... లాంటి అనేక విషయాలు వివరంగా చిట్కాల రూపంలో తెలుపబడినవి.

-------------------------

ఫ్రిజ్‌లో ఏయే పదార్థాలు పెట్టకూడదంటే..

చిట్టి చిట్కాలు |  Chitti Chitkalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

ఇంట్లో ఫ్రిజ్‌ ఉంటే ఆ సౌలభ్యమే వేరు. పండ్లను, కూరగాయలను, ఇతర పదార్థాలను అందులో పెట్టేస్తే రెండు, మూడు రోజులైనా తాజాగా ఉంటాయి. ఒకసారి కొని తెచ్చి, ఫ్రిజ్‌లో పెట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు బయటకు తీసి వాడుకోవచ్చు. అందువల్లే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్‌ కనిపిస్తోంది. కానీ చాలా మందికి ఫ్రిజ్‌లో ఏవి పెట్టాలో, ఏవి పెట్టకూడదో తెలియదు. తీరా అవి పాడైతే ఎందుకు పాడయ్యాయో అర్థం కాక, విక్రేతలను తిడుతుంటారు. ఇది సరికాదు. అందువల్ల ఫ్రిజ్‌లో ఏవి పెట్టకూడదో ఒక్కసారి తెలుసుకుందాం..

కీరదోస..
కీరదోసను ఫ్రిజ్‌లో పెట్టరాదు. చల్లదనాన్ని దోస అస్సలు తట్టుకోలేదు. దీంతో మెత్తబడిపోయి, సొట్టలు పడుతాయి. రెండు, మూడురోజుల్లోనే పనికిరాకుండా పోతాయి. ఇక కట్‌ చేసి పెట్టుకుంటే నీరుగారిపోతాయి. కీరదోసను బయట గది ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు చాలా రోజుల పాటు నవనవలాడుతూ ఉంటాయి.

వెల్లుల్లి..
వెల్లుల్లి గడ్డలనుగానీ, రెబ్బలనుగానీ ఫ్రిజ్‌లో పెడితే తేమ కారణంగా పాడైపోతాయి. రాత్రి వంటకో, మరునాడు లంచ్‌కో తప్ప ఫ్రిజ్‌లో ఉంచకపోవడమే మంచిది.

టమాట..
టమాటను ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో పెట్టరాదు. చల్లదనానికి పై పొర పాడైపోతుంది. అందుకనే గది ఉష్ణోగ్రతలోనే ఉంచడం మంచింది.

తేనె..
చాలా మంది బాటిళ్లలోని తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతారు. చల్లదనానికి తెనె చిక్కబడుతుంది. అందులోని చక్కెర కణాలన్నీ ఉండల్లా చుట్టుకుంటాయి. అందుకే తేనె చిక్కబడి, బంకమన్నులా మారినా ఆశ్చర్యం లేదు.

ఉల్లిపాయలు..
ఉల్లిపాయలను మరీ ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉంచితే పాడైపోతాయి. వెలుతురు సోకని చల్లని ప్రదేశంలో వీటిని ఉంచాల్సిన మాట నిజమే కానీ ఫ్రిజ్‌లో పెట్టరాదు. పెడితే మెత్తబడుతాయి.

నట్స్‌..
బాదం పప్పు, వాల్‌నట్స్‌, ఎండు ఖర్జురా.. ఇతరత్రా నట్స్‌ను ఫ్రిజ్‌లో పెడితే వాటిలోని నూనె నిశ్లేషంగా ఉంటుంది. అందువల్ల రుచి కోల్పోతాయి. అందుకని గాలిచొరబడని డబ్బాలో ఈ నట్స్‌ను పోసి, మూత గట్టిగా బిగిస్తే సరిపోతుంది.

మామిడి..
పండినవైతే కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. పండకుంటే మాత్రం పెట్టవద్దు. ఫ్రిజ్‌లోని చల్లదనం కాయను త్వరగా పండనివ్వదు. పండే వరకు బయట ఉంచి పండాకే ఫ్రిజ్‌లో పెట్టాలి. అది కూడా కవర్‌లో చుట్టి పెట్టాలి.

పుచ్చకాయ..
పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టినా, బయట పెట్టినా ఒకటే. అందువల్ల ఫ్రిజ్‌లో పెట్టి స్థలాన్ని వృథా చేయడం వల్ల ఎలాంటి లాభం లేదు. కోసిన ముక్కలను ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.

ఆలుగడ్డ..
ఫ్రిజ్‌లో ఆలుగడ్డలను పెట్టరాదు. ఫ్రిజ్‌లోని చల్లదనం ఆలుగడ్డల్లోని పిండి పదార్థారాన్ని చెక్కరగా మారుస్తుంది. దీంతో వాటి రుచి తగ్గుతుంది. పైగా రంగు కూడా మారుతుంది. అందుకే ఆలుగడ్డలను బయటి వాతావరణంలో వెలుతురు సోకని చోట నిల్వ ఉంచితే మంచిది.

అరటిపండ్లు..
అరటిపండ్లు మగ్గాలంటే పొడి వాతావరణం అవసరం. అందువల్ల వాటిని ఫ్రిజ్‌లో ఉంచరాదు. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల సరిగ్గా పండవు సరికదా, పండు పై తోలు నల్లబడిపోతుంది. రుచి తగ్గుతుంది.

బ్రెడ్‌..
బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెడితే ఆ చల్లదనానికి అందులోని పిండి పదార్థం చక్కెరగా మారి, దాని సహజ రుచిని కోల్పోతుంది. అంతేకాక, వేగంగా పాడైపోతుంది.

--------------------


జీవితం ‘వెన్నెల సంతకం’ కావాలంటే.. 
శృంగారం మాటెత్తితే ఇప్పటికీ మన సమాజంలో ముఖం చిట్లిస్తారు.. నిజానికి దంపతులను ఒకటిచేసి వారి నడుమ దైహిక మానసిక బంధానికి నారూ నీరూ పోసి మునుముందుకు నడిపించేది శృంగారమే. పెళ్లిలో వరుడు ‘ధర్మేచ - అర్థేచ- కామేచ- మోక్షేచ’ అని ప్రమాణం చేస్తాడు. మోక్షం ఇహలోకానికి సంబంధించింది కానందున దాని గురించి పక్కన పెట్టినా మనిషి హాయిగా, సుఖంగా బతకాలంటే పురుషార్థాలలోని మిగిలిన మూడూ అవశ్యమే. వైవాహిక జీవితంలో మనసులు దగ్గరవడానికి శృంగారం దారిచూపినా ఆ తర్వాత దంపతులు ఒక మనసు రెండు తనువులుగా కలిసిపోవడం ఖాయం. వాత్సాయనుడు ‘కామం’ అనేది మానవ జీవితంలో విడదీయలేని భాగమనీ, భార్యాభర్తల బంధాన్ని బలవత్తరంగా మార్చే అద్భుతమైన శక్తి దానిలో ఉందని అన్నాడు.

శృంగారంలో కొన్ని మర్యాదలు తెరచాటుకు పోక తప్పదు. శయన మందిరంలో ఆ ఇద్దరే! ఎవరు ఎవరిని బతిమాలతారో ఎవరు ఎవర్ని బుజ్జగిస్తారో ఎవరు ఎవర్ని లాలిస్తారో ఎవరు ఎవర్ని పాలిస్తారో ఆ పంచబాణుడికే తెలియాలి. పారిజాత పుష్పం కోసం జరిగిన గొడవలో అలకపాన్పు ఎక్కిన సత్యభామను ప్రసన్నం చేసుకోవడానికి సాక్షాత్తు శ్రీకృష్ణుపరమాత్ముడే ఎన్నోమెట్లు దిగొచ్చాడు. ఆ సందర్భంగా పొరపాటునో గ్రహపాటునో ఆమె పాదం భగవానుడి శిరస్సుకు తగిలి కిరీటం పడిపోయినా ఆయన ఆగ్రహించలేదు. సత్యను దండించలేదు. పైగా -
‘నను భవదీయదాసుని మనమ్మున 

నెయ్యపు కిన్కపూని తా 
చిన యది నాకు మన్ననయ! 
చెల్వగు నీపద పల్లవంబు మ 
త్తనుపులకాగ్రకంటక వితానము 
దాకిన నొచ్చునంచు నే 
ననియద, నల్కమానవుగదా 
యికనైన అరాళ కుంతలా!’ అంటూ బతిమాలాడు.

‘నీ దాసుడినైన నన్ను తన్నినందుకేం బాధలేదు.. సుకుమారమైన నీ పాదాలు నా శరీరంమీది పుల్కలనే ముళ్లు గుచ్చుకుని ఎక్కడ కందిపోతాయోనన్నదే నా బాధ.. సరే అయిందేదో అయింది ఇకనైనా అలకమాను చెలీ’ అన్నది దీని స్థూలార్థం. ప్రేమానురాగాలతో తడిసిముద్దయ్యే ఇలాంటి దాంపత్యం ఏనాటికీ వసివాడదు కదా? భార్య అలక బూనినప్పుడు భర్త, భర్త బిగదీసుకున్నప్పుడు భార్య ఆలించి లాలించితేనే గదా ముచ్చట!
యుద్ధంలోనూ, సాహితీ సమరాంగణంలోనూ, శృంగారంలోనూ అరేయ్‌ ఒరేయ్‌ అసేయ్‌ ఒసేయ్‌ అన్నా తప్పులేదని కవి చౌడప్ప ఏనాడో సెలవిచ్చాడు.
పగలంతా దంపతులు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా రాత్రయేసరికి ఏకమైపోతారు. అందుకే భార్యాభర్తల గొడవల్లోకి ఎవరూ తలదూర్చరు. ఎందుకంటే వారిద్దరూ ఎప్పటికీ ఒకటే!
దాంపత్యజీవితాన్ని రసరమ్యంగా మల్లెల పొదరిల్లులా మార్చగల శక్తి శృంగారానికే ఉంది. యాంత్రికంగా కోర్కె తీర్చుకోవడం శృంగారం కానేరదు. దంపతుల నడుమ ఆత్మీయతనీ, అనురాగాన్నీ మారాకు వేయించేదీ పరస్పరం ప్రేమని, ఆరాధననీ, నమ్మకాన్నీ, ఇష్టాన్నీ, సఖ్యతనీ పెంపొందించేదే సిసలైన శృంగారం.
ఇందాక పరలోక సంబంధిత మోక్షాన్ని గురించి ఇప్పుడు ఆలోచించక్కరలేదు అనుకున్నాం గదా! దాని గురించి ఓ కవి ఎంత చక్కగా చెప్పాడో చూడండి..
‘ముక్తికాంత దోర్ద్వయ బంధనమునకు నొదుగు 

వేళ.. దేహవస్త్రము తొడుసేల యంచు 
అద్ది జగమను చిలుకకొయ్యకు తగిల్చి, 
హాయిగా కుల్కు మునియు గృహస్థొ? యతియొ?

ముక్తికాంత లేదా మోక్ష కాంత కౌగిల్లో ఒదిగిపోయే వేళ దేహవస్త్రం తీసి ఈ జగత్తనే చిలుకకొయ్యకు తగిలించిన ఆ ముని గృహస్థుడా లేక యోగియా అని సందేహం. మోక్షం పొందాలంటే దేహం అడ్డేకదా.. అందుకే దాన్ని వస్త్రంలా తీసి లోకమనే మేకుకు తగిలించాడట ఆ యోగి.. శృంగార క్రీడలో వస్త్రాలను తొలగించుకోవడం సహజమే కదా.. అదే ఇక్కడ కవి చమత్కారం.
కష్టసుఖాలు రెండింటిలో విడిపోకుండా ఉండేది, మనస్సుకు విశ్రాంతిని ఇచ్చేది, వార్ధక్యం వచ్చినా రుచి తగ్గనిదీ అయిన దాంపత్యం వర్ధిల్లుగాక అని భవభూతి ఉత్తర రామచరితంలో శృంగారం గురించి చెప్పాడు. శృంగారం అంటే కేవలం శారీరక కలయికకు సంబంధించినదని అనుకోకూడదు. దంపతులకు అన్ని వయసుల్లోనూ దశల్లోనూ వెంట ఉంటూ వారిలో ప్రేమదీపాన్ని ఆరిపోకుండా కాపాడేదిగా భావించాలి. నవదంపతులు ఈ విషయాలన్నీ గ్రహించి తమ వైవాహికజీవితంలో వెన్నెల పంటలు పండించుకోవాలి.

------------------------------
గృహిణికి చిట్కాలు

పొద్దున్నే ముఖం కడుక్కునేటప్పుడు చన్నీళ్ళతో కంటిరెప్పలమీద ఎక్కువ నీళ్ళు కొటుకుంటూ ( కళ్ళు మూయాలి ) ఉంటే రక్తప్రసరణ చక్కగా జరిగి కళ్ళు మిలమిలా మెరుస్తాయి

పెదవులకు రోజూ కొబ్బరినూనె రాయండి గులాబీ రంగులో ఉంటాయి చి కొబ్బరినూనెలో మెంతులువేసి తలకు రాసు కుంటే వెంట్రుకలు నల్లబడి జుత్తు రాలిపోదు

ముదిరిన కొబ్బరిముక్కలను ఉప్పు జాడిలో వేసి ఉంచితే నాల్గు అయిదు రోజులదాకా చెడిపో కుండా ఉంటాయి . చి రక్త విరోచనాల నివారణకు పెరుగులో మెం తులు కలుప్ఞకోని ఆ మెంతులు మింగాలి

మెంతులుగాని మరమరాలులోని కూజాలో వేసుకొని మంచినిళ్ళు తాగుతూ వ్ఞంటే చలువ చేస్తుంది చి మెంతులు నానవేసి మెత్తబడ్డాక రుబ్బి ఆ పిండిపి ముఖానికి రాసి ఓపావుగంట ఆగి కడిగే యండి కొన్నాళ్ళకి మీ ముఖం నున్నగా కాంతివం తగా ఉంటుంది

అంతేకాదు మొదటిమలురావ్ఞ. చి తులసిరసం తీపి దానిలో తేనె కలిపి త్రాగితే పక్షవాతం కొంత నయమౌతుంది చి జామ ఆకుపసరు కాళ్ళకు రుద్దుకుంటే కొన్నా ళ్ళకు సంజు వ్యాధి నయమౌతుంది

ప్రతిరోజూ మెంతికూర రసంలో చెమ్చా తేనె కలిపి పడుకునే మందు రోజుకు ఒక్కసారి తాగితే హాయిగా నిద్రపడుతుంది చి బాగా జలుబు చేసి భారంగా ఉన్నట్లుయితే వేడి నీటి వేసుకొని త్రాగండి చి చింతచిగురు ఉడకబెట్టి బెల్లం కలిపి ఉండ లుగాచేసి పిల్లలకు పెడితే వాని రక్తం శుభ్రపడు తుంది

దోస గింజలు వేయించి దంచి పొడుం చేసి భోజనంలో తీసుకుంటే కడుపులోని అజీరికత దోషం హరిస్తుందిఅలారం సరిగ్గా వినబడాలంటే డబ్బారేకు మీద గడియారం పెట్టాలి కోడిగ్రుడ్లు డొల్లలు-టీ కాచిన పొడి -ఉల్లి తొక్కలు ఎండబెట్టి గులాబి మొక్కలకు వేస్తే మంచి పూలు పూస్తాయి. ====
బాడీ షుగరింగ్‌తో అవాంఛిత రోమాలకు దూరం

శరీరంపై అనవసరపు వెంట్రుకలతో బాధ పడుతున్నారా. బాధపడ వద్దు. వీటిని క్లీన్‌ చేసుకోవడానికి చాలా విధానాలు అందుబాటులో ఉ న్నాయి. అందులో కొన్ని మీకోసం…

బాడీ షుగరింగ్‌ :
బాడీషుగరింగ్‌ అనే పద్ధతితో శరీ రంపై ఉండే అనవసర వెంట్రుకలను తొలగించుకోవచ్చును. దీనికి కావలసినవి సగం చెక్క నిమ్మరసం, పంచదార ఒక చిన్నక ప్పు, తేనె పావ్ఞ కప్పు. మూడు బాగా కలిపి స్టవ్‌ మీద లేదా మైక్రో వోవెన్‌లో గాని బుడగలు వచ్చేవ రకు వేడిచేసి పక్కన పెట్టుకోండి. శరీ రంలో ఎక్కడయితే వెంట్రుకలు ఉన్నాయో ఆభాగాన్ని శుభ్రంగా కడిగి పొడిబట్టతో తుడుచు కోండి. కొద్దిగా మొక్కజొన్నపిండి, అదిగాని అందుబా టులో లేన ట్లయితే ఇంట్లోని ఏదో ఒక పిండిని లేదా పౌడ ర్‌ తీసుకుని రా యండి. ఇలా చేయటం వల్ల ఆభాగంలోనూనె లాగివేయ బడు తుంది.ఆ త ర్వాత వెంట్రుక లు పెరిగే దిశలో పలుచగా గోరువెచ్చని బాడీ షుగరింగ్‌ వ్రాయండి. ఆ పై పలుచటి గుడ్డ తీసుకొని కప్పివేయండి. ఆ గుడ్డపై చేతివేళ్లతో సుతారం గా రాయండి.

క్షణం తరువాత వెంట్రుకలు పెరిగే దిశకు వ్యతిరేక దిశలోంచి చటుక్కున తీసివేయండి. కొద్దిపాటి నొప్పి వచ్చినా భరించి తీసివేయండి. అలా రెండు మూడుసార్లు చేయండి. మిగిలిన బాడీ షుగరింగ్‌ని మళ్లీ వాడాలనుకున్నప్పుడు మళ్లీ వేడిచేసి వాడుకో వచ్చు. మీకేదయినా ఇబ్బంది. మరింత బాధ ఉంటే ఒక్కసారితో ఆపేసి బ్యూటీషియన్‌ని సంప్రదించండి.
వ్యాక్సింగ్‌ :
చాలా తేలికగా, నిదానంగా చేసుకునే పద్ధతి. పై బాడీ షుగరింగ్‌ పద్ధతి కంటే ఇది చేసుకోవటం చాలా తేలిక. ఈ పద్ధతిలో పైపొరలో వెంట్రుకలను లాగివేసి, చర్మాన్ని మామూలు పద్ధతిలో ఉం చుకోవచ్చు. మొదట వ్యాక్సింగ్‌ను సన్నటి సెగమీద వేడిచేయాలి. వేడి అయిన వ్యాక్సింగ్‌ను పల్చగా తయారైన తరువాత శరీరాన్ని పట్టగలిగే వేడి చూసుకుని అనవసర వెంట్రుకలు ఉన్న ప్రదేశంలో కింద నుండి పై వైపుగా రాసి దానిపై కాటన్‌ క్లాత్‌ను వేసి కొంచెంగా అదిమి వెంట నే కింద నుండి పై వైపుగా లాగివేయాలి. వ్యాక్సింగ్‌ను రాసే ముందు తప్పనిసరిగా పౌడర్‌ అద్దడం మర వద్దు. చేసుకోవటం కష్టంగా ఉండదు. పైగా శ్రమ కూడా తక్కువ.
పిల్లల్లో వెంట్రుకలు తొలగించే పద్ధతి :
పసుపు, ఉలవ పిండిని పేస్ట్‌లా కలిపి వెంట్రుకలున్న ప్రదేశంలో మృదువ్ఞగా రాయండి. పూర్తిగా ఆరిపోయాక నెమ్మదిగా తొలగించండి. ఆ ప్రదేశంలో రోజురోజుకి వెంట్రుకలు కన్పించకుండా పోతాయి. ఆల్మండ్‌ నూనెతో మసాజ్‌ చేయటం ద్వారా కూడా వెంట్రుకలను పోగొట్టుకోవచ్చు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment