Valmiki Ramayanam (Telugu)

Sripada Ramayanam in telugu
by Sripada Subramanya Sastry

శ్రీపాద రామాయణం

- శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

Online.....

     రామాయణం ఆదికావ్యం. వాల్మీకి మహర్షి రచించినది. అసలు సిసలైన తెలుగు రచయిత, తెలుగు కధక చక్రవర్తి, కలకండలాంటి తెలుగు రాయడంలో దిట్ట, తెలుగు వచనానికి కండబలం, గుండెబలం యిచ్చిన రచయిత - శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వాల్మీకి రామాయణాన్ని ఏకాండకు ఆకాండ చొప్పున బాలకాండ నుండి ఉత్తరకాండ వరకు వాడుక తెలుగులో వచనానువాదం చేశారు. ఇంతటి సరళంగా, మూలం చెడకుండా అనువాదంచేసినవారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో!

             శ్రీపాదవారి రామాయణం చదివినవారూ, విన్నవారూ కూడా పాపవిముక్తులవుతారు. ఇది ధనధాన్యసంపదలు కలిగిస్తుంది. కీర్తి, ఆయువూ వృద్ధిచేస్తుంది. కార్య నిర్వాహకులకు విజయసిద్ధి కలిగిస్తుంది. కొడుకులు కావాలనేవారు కొడుకులూ, ధనం కావలసినవారు ధనమూ, శ్రీరామపట్టాభిషేకం వింటే పొందుతారు. స్త్రీలందరూ రాముణ్ణి కని కౌసల్యలాగా, లక్ష్మణుణ్ణి కని సుమిత్రలాగా, భరతుణ్ణి కని కైక లాగా జీవపుత్రులై ఆనందిస్తారు. శ్రీపాదవారి రామాయణం విన్నవారు దీర్ఘయుష్మంతులవుతారు. ఆర్షమైన యీ ఆదికావ్యం ఎవరు శ్రద్ధగా వింటారో, వారు కష్టాలన్నీ గడిచి సుఖపడతారు. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు వెళ్ళి వారి బంధుమిత్రులను కలుసుకుంటారు. కోరికలన్నీ తీరి ఆనందం అనుభవిస్తారు. ఈ రామాయణం వింటే దేవత లానందిస్తారు. సకల విఘ్నాలూ తొలగిపోతాయి. అందరికీ జయం లభిస్తుంది. రజస్వలలైన స్త్రీలు కొడుకులను కంటారు. ఈ రామాయణం చదివేవాళ్ళ యెడలా, వినేవాళ్ళ యెడలా రాముడు దయాపరుడై ఉంటాడు. స్త్రీలిది వింటే కుటుంబవృద్ధీ, ఉత్తమసుఖమూ, సకలశుభాలూ పొందుతారు. ఇది ఆరోగ్యకరం, యశస్కరం, సౌభ్రాతృతకం, బుద్ధికరం, సుఖప్రదం. ఓరజస్కరమైన యీ ఆఖ్యానం నియమంగా వినాలి. ఇది విన్నా, గ్రహించినా దేవతలందరూ సంతుష్టులవుతారు. రామాయణం విన్నవారి పితృదేవతలు కూడా సంతోషిస్తారు. వాల్మీకి మహర్షి రచించిన యీ గొప్పగ్రంథం యెవరు ప్రతిమీద ప్రతి చొప్పున పంచి పెడతారో వారు అంతమందీ స్వర్గానికి వెళతారు. తెలుగుపాఠకులారా! ఇది పూర్వం జరిగిన కధ. మీకు శుభాలు ప్రాప్తించాలి. మీరిది శ్రద్ధగా చదవండి. మీకు ఇష్టులైనవారికి బహుమతిగా ఇవ్వండి. విష్ణుమూర్తి మహాత్మ్యం అమోఘం.

Chanakya Sutralu in telugu

చాణక్య 100 నీతి సూత్రాలు

72 pages Rs 30/-

అసలు నీతి అంటే ఏమిటి? నీతి అనే పదాన్ని మనం నిత్యకృత్య వ్యవహారంలో తరచుగా ఉపయోగిస్తుంటాం. నిఘంటువులు దీనికి న్యాయము, ఉపాయము, సత్ప్రవర్తనము, విధము, రీతి అనే అర్ధాలను ఇస్తున్నాయి.

ఏదైనా సరియైన లేక న్యాయమైన పద్ధతిలో ప్రవర్తించటం అనే అర్ధం 'నీతి' అనే పదానికి వర్తిస్తుందని భావించవచ్చు. పండితులు 'ఆయాదేశవాసుల వేషభాషాదులు, రాజ్య పరిపాలనా విధానము, వారు సమకూర్చుకొనే వివిధ సంపదలు, అనుభవించే భోగాలు, జీవన విధానము మొదలైన బాహ్య విషయాలకు సంబంధించినది 'నాగరికత' అని, వ్యక్తికి, వ్యక్తికి మధ్య ఉండే సంబంధ విశేషాలు, అభిరుచులు, ఆధ్యాత్మిక ప్రవృత్తి మొదలైన ఆంతరిక సంబంధి సంస్కృతి అని స్థూలంగా నిర్వచించారు. ఈ రకమైన సంస్కృతి, నాగరికతలు కలిగిన జీవన విధానాన్ని ఆచరించటమే నీతి. ఇవి సాధించటానికి పాలకులు, ప్రతి పౌరుని యోగక్షేమాలకు ప్రాధాన్యం ఇస్తూ, పాలనా విధానాలను రూపొందించుకొని, శాంతి, సోదరత్వాలు వర్ధిల్ల చేయటానికి అవలంబించవలసిన పద్ధతులే నీతి అని చెప్పవచ్చు.

ఈ గ్రంథంలో చాణక్యుడు వ్యక్తిగా, కుటుంబంలో ఒకనిగా, సమాజంలో ఒక సభ్యునిగా, ఒక పాలకునిగా పాలక వర్గ సభ్యునిగా ఆచరింపవలసిన కర్తవ్యాలు, పాటించవలసిన నియమాలు పరస్పర విరుద్ధ భావాలకు తావు ఇవ్వకుండా తెలియజేయబడ్డయి. ఈ సూత్రాల కూర్పులో చాణక్యుని మేధోశక్తి ద్యోతకమౌతుంది.

ఈ చాణక్య నీతి సూత్రాలు కూడ తెలుగువారి ఆదరాభిమానాలకు పాత్రం కాగలదని భావిస్తూ.
Rojuko Neeti Katha - 

రోజుకో నీతి కథ

Rs : 270/-

మహానుభావుల ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదివితే వారు తమ జీవితంలో ఎన్ని కష్టాలు పడిందీ, ఆ కష్టాలను ఎలా ఎదుర్కొందీ తెలుస్తుంది. వాటిని మన జీవితాలకు అన్వయించుకొని అపజయాలు ఎదురైనపుడు నిరాశ, నిస్పృహలు చెందకుండా విజయాలను సాధించవచ్చు.

నీతి కథల్లాంటివి చదువుతున్నప్పుడు ఆ పాత్రలన్నీ మన కళ్ళముందు కదలాడుతున్నట్టే వుండి, మన జీవితంలో ఎలా నడుచుకోవాలో, ఎలా నడచుకోకూడదో తెలియజేస్తాయి. పుస్తకాలు చదివే అలవాటున్న పిల్లలు వారు చదివింది తొందరగా అర్థం చేసుకోగలరు. ఈ అనుభవం తరగతిలో పాఠాలు చదువుతున్నపుడు బాగా ఉపయోగపడుతుంది. అలాంటి పిల్లలే ఫస్ట్‌ ర్యాంకులో వుంటారు. మిగిలిన పిల్లలకంటే మీ పిల్లల్ని ముందు వరుసలో నిలబెడుతుంది. పుస్తకాలు చదవడంవల్ల పిల్లల్లో ఆలోచనా శక్తి పెరుగుతుంది, కొత్త పదాలు తెలుస్తాయి. చక్కని భాష వొంటబట్టి మంచి శైలి అబ్బుతుంది. పుస్తకాలు బాగా చదివేవారు రిటైర్‌ అయినా జీవితంలో రిటైర్‌ కాకుండా ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవిస్తారు.

ఈ పుస్తకం మీరు రోజుకో గంట చదివితే పదిరోజుల్లో పూర్తి చేయవచ్చు. అయితే నేటి కాలానికి అనుగుణంగా ఇందులో 365/366 నీతి కథల్ని ''రోజుకో నీతి కథ'' పేరుతో నేటి పిల్లలకు, పెద్దలకు, ఉపాధ్యాయులకు, రాజకీయ నాయకులకు అందిస్తున్నాం.

ఇందులో పురాణాల్లోని నీతి కథలు, ఈసఫ్‌ నీతి కథలు లాంటివి, టాల్‌స్టాయ్‌ పిల్లల కథలు లాంటివి, రష్యన్‌, ఆఫ్రికన్‌ జానపద కథలు, తెలుగు వారి జానపద కథలు వున్నాయి. ఇవి చదివేవారికి నీతి, వివేకం, విజ్ఞానం, వినోదం కలిగించే కథలు. పేజీలు : 350
SRI RAMANA MAHARSHI PRAVACHANAMULU - 300 - TELUGU

శ్రీ రమణ మహర్షి ప్రవచనములు - 300
తెలుగు
Rs 30/-
 Telugu Paryaya Pada Nighantuvu

తెలుగు పర్యాయపద నిఘంటువు

540 pages - 400/-Telugulo Tappu Oppula Nighantuvu 

తెలుగులో తప్పు ఒప్పుల నిఘంటువు

Rs: 126 pages - 70/-Kavi Choudappa Satakam 

కవి చౌడప్ప శతకం

 168 పద్యాలు Rs 25/-

పెద్దలూ, యువకులూ తప్పక చదివి ఆస్వాదించాల్సిన పద్యాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ఈ పుస్తకంలో 168 నీతి, శృంగార పద్యాలు భావంతో ఇవ్వబడినవి. Bhartruhari Shubhashitalu

భర్తృహరి సుభాషితాలు

Rs : 40/-

భర్తృహరి రెండు ప్రభావవంతమైన సంస్కృత గ్రంథాలు రచించిన సంస్కృత కవి. ఇతను 5వ శతాబ్దానికి చెందినవాడు. సుభాషిత త్రిశతి రచయిత భర్తృహరి. ఇది సంస్కృత లఘుకావ్యం. ఇందు నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలు ఉన్నాయి.

      సుభాషిత త్రిశతి లేక సుభాషిత రత్నావళి యను నది కావ్యములలో లఘుకావ్యజాతిలో చేరినను. ఈ కావ్యమును రాసిన భర్తృహరి విఖ్యాత సంస్కృత భాషా ప్రాచీన కవులలో ఒకడు. అతనిని, ఆతని గ్రంథములను గూర్చి విశ్వసనీయము లగు చారిత్రికాధారములు కానరావు. అతని జీవితములోని కొన్ని సంభవములు మాత్రము కథారూపమున అనుశ్రుతముగా సంప్రదాయబద్ధమై లోకమున వ్యాపించి యున్నను అవి ఒకదానికొకటి పొంది పొసగి యుండకపోవుటచే నానా విధ గాథలకును సామరస్య మేర్పరచుట దుస్సాధ్యమేయగును. భర్తృహరి ఉజ్జయినీ రాజ వంశస్తుడనియు, తనకు రాజ్య పరిపాలనార్హత యున్నను తన భార్య దుశ్శీలముచే సంసారమునకు రోసి, రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కున కప్పగించి తాను వానప్రస్థుడయ్యెననియు నొక ప్రతీతి ఉంది. ఈ విక్రమార్కుడే విక్రమ శకాబ్దమునకు మూల పురుషుడు. అది యటుండనిండు. భర్తృహరి విరచితమైన లఘు శతకముల నుండి యతనికి జీవితమున నాశా భంగము మిక్కిలిగా యేర్పడెననియు, స్వకుటుంబమును, యిరుగుపొరుగులను సూక్ష్మ దృష్టితో పరిశీలించుట వలన స్త్రీ శీలమునందు అతనికి సంశయము బలపడెననియు విశదమగును. అతనిని గూర్చి గ్రంథస్థమైన విషయములలో గొన్నింటిని పేర్కొందము.Vidura Neeti telugu
విదుర నీతి
72 pages : Rs 40/-Telugu Nanardha Pada Nighantuvu 

తెలుగు నానార్థ పద నిఘంటువు

420 pages Rs 250/-

విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు, రచయితలకు ఉపయోగపడే తెలుగు సాహిత్య నిఘంటువు 'తెలుగు నానార్థ పద నిఘంటువు'.
12500 పదాలకు పైగా నానార్థాలతోపాటు పారిభాషికాలు; వ్యతిరేకార్థాలు; ప్రకృతి - వికృతులు; న్యాయాలు-సూక్తులు; సడ సపప్పుళ్ళు, జంటపదాలు, పోలికలు, ఉజ్జీ మాటలు...; తెలుగు జాతీయాలు; వుత్పత్త్యర్థాలుగల నిఘంటువు. ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment