Parasakti in Telugu
పరాశక్తి
Rs: 250/- oneline...

మానవశరీరంలో కుండలినీ శక్తి లేదా విశ్వశక్తి యొక్క జాగృతం అనేది అతి అరుదుగా జరిగే యోగప్రక్రియ. ఇది ఆధునిక శాస్త్రపు హేతుబద్ధమైన తర్కానికి అందని అద్భుతమైన విశ్వప్రక్రియ. గ్రంథ రచయిత ఈ శక్తితో తనకు కలిగిన ప్రత్యక్ష అనుభవాలను గురించి ఈ గ్రంథంలో చాలా విపులంగా వివరించడం జరిగింది.

     ఈ శక్తి మానవశరీరంలో జాగృతమైతే ఏమి జరుగుతుందనే అంశాన్ని గురించి ఈ గ్రంథం ఊహకు అందని అద్భుతమైన విషయాలను వెల్లడిస్తుంది. అందువలన ఈ పుస్తకంలోని కొన్ని భాగాలలో వ్రాసిన విషయాలు అతి అరుదుగా లభ్యమవుతూ ఉంటాయి. అంతేగాకుండా ఈ విషయాలు మనస్సులో ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి. మానవజాతి మనుగడకు సంబంధించి సవాలుగా నిలిచి ఉన్న కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సైతం ఈ గ్రంథం నైపుణ్యంగా సమాధాన మిస్తుంది.

     ఈ గ్రంథం సమాజంలోని అన్ని వర్గాలవారి కోసం వ్రాయబడినది. మత వ్యవస్థలకు మరియు సామాజిక భేదాలకు అతీతంగా మానవజాతి శ్రేయస్సు కోసం వ్రాయబడినది. ఈ గ్రంథంలో బహిరంగపరచిన యోగరహస్యాలు, పరమానందం మరియు శాశ్వతమైన శాంతి కోసం వెదకుచున్న ఏ మానవునికైనా ఎంతో ఉపయోగపడగలవు.





ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment