పారద గణపతి

పాదరసంతో తయారుచేసిన గణపతినే ‘పారద గణపతి’ అంటారు. పాదరసంతో తయారు చేసిన శివలింగాలను విరివిగా పూజిస్తూ ఉంటారు. పారదలింగాల ఆరాధన విశేష ఫలప్రదమైనది. అలాగే పాదరసంతో తయారు చేసిన గణపతిని అర్చించడం కూడా గొప్ప ఫలితాలనిస్తుంది. జ్ఞానవృద్ధి, మనోస్థైర్యాల కోసం పారద గణపతి ఆరాధన చక్కని సులభమార్గం. వినాయక చవితిరోజున పూజమందిరంలో చేతి బొటనవేలి పరిమాణంలో ఉండే పారద గణపతిని ప్రతిష్ఠించి పూజించడం మంచిది.

వినాయక చవితినాడు వీలు కాకుంటే ఏదైనా నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున పారద గణపతిని పూజమందిరంలో ప్రతిష్ఠించుకోవడం మంచిది. పాదరసంతో లక్ష్మీదేవితో కలసి ఉన్న గణపతి రూపాన్ని ఒకేమూర్తిగా తయారు చేయించిన పారద లక్ష్మీగణపతిని పూజించినట్లయితే ఆర్థిక ఇక్కట్లు, ఆటంకాలు తొలగిపోతాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో పారద లక్ష్మీగణపతిని పూజించడం వల్ల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారద గణపతిని లేదా పారద లక్ష్మీగణపతిని పూజమందిరంలో ప్రతిష్ఠించిన తర్వాత నిత్య ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి.– పన్యాల జగన్నాథ దాసు

--------------------

        పాదరస గణపతి జాతకచక్రం లో చంద్రుడు అనుకూలంగా లేనప్పుడు మనస్సు చంచలంగా ఉంటుంది.మానసిక చికాకులు ఉంటాయి.ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం.సరియైన నిర్ణయాలు తీసుకోలేక పోవటం. తల్లితండ్రులకి సంబందించిన సమస్యలు,స్ధిర ఆస్తులకు సంబందించిన సమస్యలు ఉంటాయి .

పాదరస గణపతి ని పూజించటం వలన ఈ సమస్యలు నివారించవచ్చును.
పాదరసం అంటే చైతన్యానికి ప్రతీక. పాదరస గణపతి మహా శక్తివంతమైంది. పాదరసం ఒకచోట స్థిరంగా నిలవకుండా పారుతూ ఉంటుంది కనుక దీన్ని ''పారద'' అని కూడా అంటారు.స్థిరంగా నిలవకుండా సర్వత్రా ప్రవహిస్తూ ఉంటుంది కనుక పారద గుణాన్ని విశ్వవ్యాపకత్వం అన్నారు.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, దుర్గాదేవి, లక్ష్మీదేవి, గణపతి తదితర దేవుళ్ళు విశ్వవ్యాప్త గుణం ఉంది. వీరంతా అయోనిజులు. అంటే మాతృగర్భం లోంచి పుట్టినవారు కాదు. స్వయమ్భువులుగా ఉద్భవించారు. పాదరస గణపతి అమూల్యమైంది, అద్భుతమైంది. ఈ పాదరస గణపతిని పూజించడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో చూద్దాం.

--> పాదరస గణపతిని పూజా మందిరంలో ప్రతిష్టించుకుని 
            పూజించేవారి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

--> పాదరస గణపతిని అర్చించేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.

--> పాదరస గణపతిని నమ్ముకున్న వారికి అకాల మృత్యుభయం ఉండదు.

--> పాదరస గణేశుని ప్రార్థించినట్లయితే అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి.

--> పారద విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించేవారికి ఏ సమస్యలూ, చిరాకులూ తలెత్తవు.

--> ''ఓం లంబోదరాయ నమః'' అనే మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే అత్యున్నత స్థితికి చేరుకుంటారు.   
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment