జపం–నియమాలు | Japam niyamala |  కరమాల, జపం, జపమాల, మణిమాల, వర్ణమాల.

జపం–నియమాలు… 
-నాగవరపు రవీంద్ర

ఏ ఉపాసన, సాధనలోనైనా జపమాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. జపక్రియాల వల్ల కలిగే సమస్త ఫలాలూ మాల మీదే ఆధార పది ఉంటాయి. జప సమయంలో పలికే మంత్రాల సంఖ్యను లెక్కించు కోవడానికి ఈ మాల ఉపయోగపడుతుంది. మాలలు మూడు రకాలు.1 కరమాల  2వర్ణమాల  3మణిమాల....

కరమాల

చేతివేల్లను పరస్పరం అతికించి, అరచేతి వైపుకు కొద్దిగా వంచి, వేళ్ళ కణుపుళ మీద నిశ్చిత క్రమంలో జపం చేసుకునే క్రియను ‘కరమాల’ అంటారు. దేవీదేవతలకి కరమాలతో చేసె జపసంఖ్యను లెక్కించడానికి వేర్వేరు రీతులుంటాయి.

జపంలో ప్రయోగించే చేతివేళ్ళకు ఎంతో ప్రాముఖ్యత ఉందని శివాజ్ఞా గ్రంథంలో పేర్కొన్నారు. బొటనవేలు మోక్షదాయిని, చూపుడువేలు శత్రునాశిని, మధ్యవేలు ధనదాయిని. ఇలా ఒక్కో వేలుకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది. బొటనవేలు, మధ్యవేలు – వీటి కలయికతో సమస్త సిద్దూలూ ప్రాప్తిస్తాయి. బొటనవేలుతో జపం చేయటం సిద్ధిదాయకం. మధ్యవేలుతో జపం చేస్తే పాపం పెరుగుతుంది. అందుకని బొటన ఉంగరపు వేళ్ళతో జపం చేసుకోవాలి.

వర్ణమాల

వర్ణ సమూహంతో కూడినది వర్ణమాల. స్వరాలు, వ్యంజనాలు కలిసిన ఈ సమూహంలో 51 వర్ణాలు ఉంటాయి. మొదటి అక్షరాన్ని సుమేరుగా భావించుకుని మిగిలిన 51 వర్ణాల మీద క్రమంగా మంత్ర గణన చేయాలని వర్ణమాల ఉపయోగనిధి చెబుతుంది. కాని, మామూలు మనిషి ఆచరించ లేనంత జటిలమైన ప్రక్రియ. కనుక ఈ విధానం అంతగా వ్యాప్తి చెందలేదు. ఎక్కువ సంఖ్యగల జపనిధిని నిర్విర్తించటానికి ఈ పద్ధతి అనువనైది కాదు.

మణిమాల

ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువగా వాడుతున్న జపమాల-మణిమాల. తులసిపూసలు, రుద్రాక్షలు, తామరతూళ్ళ గింజలు, ముత్యాలు, పగడాలు, స్పటికపూసలు, బంగారం, వెండిపూసలు, శంఖులు, రాజమణి, వైజయంతి మొదలైనవాటి పూసలను ఒకే సూత్రంలో గుచ్చి, తయారుచేసే మాలను ‘మణిమాల’ అంటారు. వైష్ణవ మంత్రాలకు తులసిపూసల మాల; గణేశ మంత్రానికి ఏనుగు దంతాల మాల; కామాక్షీదేవి మంత్రజపానికి రుద్రాక్షమాల లేక ఎర్రచందనపూసల మాల ఉత్తమమైనవి మంత్ర మహావర్ణ గ్రంథం దేవతాఖండంలోని ప్రథమ ఖండంలో చెప్పబడింది.

సత్కర్మాల ఫలసిద్ధికై పూసలను పుట్టుదారంతో మాలగా గుచ్చుకోవాలి. వైష్ణవీమాలను పద్యసూత్రంతో, శైవీమాలను ఊలుదారంతో పూసమాలను గుచ్చుకోవాలి. ఇతర దేవీదేవతల మంత్రజపానికై నూలు దారంతో మాలను గుచ్చుకోవాలి. ఈ సంగతులన్నీ మంత్రమహార్ణవ గ్రంథంలో పేర్కొన్నారు. మాలతో జపం చేసుకోవడానికి రెండు పూసల మధ్య నుంచి మాలను నడిపించాలి. చూపుడువేలుతో జపమాలను స్పృశించకూడదు. సాధకుడు తన ఎడమచేతితో జపమాలను తాకకూడదు. జపం చేసుకునే మాలను చేతికి చుట్టుకోకూడదు. తలమీదగాని, కంఠంలో గానీ ధరించరాదు. జపం పూర్తయిన తర్వాత మాలను పరిశుభ్రమైన చోట భద్రపరచుకోవాలి. మంత్ర మహార్ణవం, మంత్ర మహోదధి మొదలైన గ్రంధాలలో మణిమాల విషయంలో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించి తెలిపారు.

జాగ్రత్తలు

జపమాలను అటూ ఇటూ ఊపకూడదు. అలా ఊపితే సాధనఫలం పూర్తిగా దక్కదు. మాలలోని పూసలు విరిగి ఉంటే, దుఃఖం ప్రాప్తిస్తుంది. కనుక కొన్ని పూసలు విరిగి ఉన్న మాలతో జపం చేయకూడదు. జపం చేసేటప్పుడు మాల నుంచి శబ్దం రాకుండా చూసుకోవాలి. అలా శబ్దం వచ్చే మాలతో జపం చేసుకునే సాధకుడు వ్యాధిగ్రస్తుడవుతాడు. జపం చేసుకునే సమయంలో మాల చేతినుంచి జారి కింద పడిపోతే సాధన లేక ఉపాసన పరిపూర్ణం కాదు. జపం చేసుకునే సమయంలో జపమాల దారం తెగిపోతే సాధన – జపాల ఫలం ప్రాప్తించదు. ఇది అరిష్టాన్ని సూచిస్తుంది. కనుక ఈ జాగ్రత్తలన్నిటినీ సాధకుడు పాటిస్తూ జపమాలను ఉపయోగించుకుంటే సత్ఫలితాలను పొందవచ్చు.

కుడిచేతిని గౌముఖి (ఆవుముఖం వంటి సంచి)లో పెట్టుకుని జపం చేసుకోవాలి. గౌముఖి లేకపోతే శుభ్రమైన వస్తంతో కుడిచేతిని కప్పి ఉంచాలి. తలమీద చేతిని గాని, బట్టను గాని ఉంచకూడదు. చూపుడు వేలును వేరుగా ఉంచి జపం చేసుకోవాలి. మనిమాలను ఉంగరం వేలుమీద పెట్టి, బొటనవేలితో స్పృశిస్తూ మధ్యవేలు మీదుగా ఆ మాలను తిప్పాలి. సుమేరును అతిక్రమించకూడదు. ఒక మాలజపం పూర్తయిన తరవాత మళ్ళి తిప్పే సమయంలో సుమేరు దగ్గర నుంచి మాలను వ్యతిరేక దిశలో తిప్పి జపం చేసుకోవాలి. జపం చేసుకునే సమయంలో అటూ ఇటూ కదలటం, కునిపాట్లు పడటం, మాట్లాడటం, మాలను చేతిలోంచి కింద పడేయటం ఇవన్నీ చేయకూడదు. మధ్యలో మాట్లాడాల్సివస్తే భగవంతుణ్ణి స్మరించుకుని జపాన్ని మళ్ళీ మొదలుపెట్టాలి. ఇంట్లోని ఏకాంతప్రదేశం, గోవులకు సమీపంగా ఉన్న చోటు, పవిత్రమైన అడవి, తోట, తీర్తస్థలం, నదీతీరం, దేవాలయం ఇవన్నీ జపం చేసుకోవడానికి ఉత్తమమైన ప్రదేశాలు.

ప్రాతఃకాలంలో అయితే చేతిని తిన్నగా, వేళ్ళు పైకి ఉండేట్లుగా, హృదయానికి సమీపంలో ఉంచుకుని జపం చేసుకోవాలి. సాయం సమయంలో అయితే కుడిమోకాలును నిలబెట్టి, చేతిని కిందవైపు ఉండేట్లుగా వెనక్కి తిప్పి, ముక్కుకు సమీపంలో ఉంచి జపం చేసుకోవాలి. మధ్యాహ్న వేళ అయితే చేతివేళ్లు పైకి ఉండేట్లు చేతిని నిలువుగా నాభికి సమీపంలో ఉంచి జపం చేసుకోవాలి. మంత్రాన్ని మెల్ల మెల్లగా నోటితో పలుకుతూ చేసె జపాన్ని ‘వాచిక జపం’ అని అంటారు. ఇతరుల చెవికి వినపడనంత మెల్లగా మంత్రాన్ని పలుకుటూ చేసే జపం ‘సుపాంశు జపం’. నాలుక, పెదవులను కదల్చకుండా చేసే జపాన్ని ‘మానసిక జపం’ అని అంటారు. మనసులోనే చేసుకునే జపవిధానం కనుక ఇది ఉత్తమమైనదిగా భావింపబడుతోంది. జిహ్వ-పెదవులు కదల్చకుండా మనసులోనే జపించటం జరుగుతుంది. కనుక ఈ జపవిధానంలో స్వర, లయాదుల దోషాల ప్రసక్తి ఉండదు.

శుద్ధి చేసిన తరువాతే మణిమాలను ఉపయోగించాలి. మణిమాలను శుద్ధి చేసే విధానం – తొమ్మిది తమలపాకులను గాని, రావి ఆకులను గానీ తీసుకొచ్చి, ఎనిమిది ఆకులతో అష్టదళాకృతిని తాయారుచేసుకోవాలి. తొమ్మిదో ఆకును అష్టాదళాకృతి మధ్యలో పెట్టి, దానిమీద మాలను ఉంచి పవిత్రపరచాలి.

ఊం, అం, ఆం, ఇం ఈం, ఉం, ఋం, లుం, ల్రుం, ఎం, ఏం ఓం, ఔం, అం, అః, కం, ఖం, గం, ఘం, డం, చం, ఛం, జం, ఇ’ం, టం, ఠం, డం, ణం, తం, థం, దం, ధం, నం, పం, ఫం బం, భం మం, యం, రం, లం, వం, శం, షం, సం, హం, క్షం – ఈ మంత్రాలను జపిస్తూ పంచగవ్యాలతొ మాలను అభిషేకించాలి. దాని తరవాత దిగువ ఇచ్చిన మంత్రాన్ని ఉచ్చరిస్తూ గంగాజలంతొ మాలకు స్నానం చెయించాలి.

మంత్రం: –
ఓం సద్యోజాతం ప్రపధాని సద్యోజాతాయ వై నమోనమః|
భవే భవే మాటి భవే భవస్య మం భావోబ్దవాయ నమః||

దిగువ మంత్రంతో మాలకు గంధం అలది, చందనాడులను దానిపై చల్లాలి.

మంత్రం:-
ఓం వామదేవాయ నమో, జ్యేష్టాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కలివికరణాయ నమో!
బల వికారణాయ నమః, బలాయ నమో, బల ప్రథమనాయ నమః, సర్వభూత దమనాయ నమో, నమో మనోనమనాయ నమః, గంధ సమర్పయామి||

ఆ తరవాత కింది మంత్రంతో మాలకు సాంబ్రాణి, అగరబత్తీలు మొదలైన సుగంధద్రవ్యాలతో ధూపం వేయాలి.

మంత్రం:-
ఓం అధోరేభ్యో థ ధౌరేభ్యో ధోరధోరతరేభ్యః|
సర్వైభ్య సర్వశవైభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః||

తరువాత దిగువనిచ్చిన తత్పురుష పఠిస్తూ చందనం, కుంకుమపూవ్వులతో మాలకు లేపనం చేయాలి.

మంత్రం:-
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్|

మాలలోని ప్రతిపూస మీ ఈశాన మంత్రాన్ని జపించాలి.

ఈశాన మంత్రం: –
ఓం ఈశాన్యః సర్వ విద్యానమీశ్వరః సర్వభూతానాం!
బ్రహ్మాదిపతి బ్రహ్మణో ధి పతిప్రహ్మశివో మే అస్తుసదాశివోమ్||

తరవాత మణిమాల సుమేరు పూసను క్రమంగా ఈశాన, అఘోర మంత్రాలను పదిసార్లు చదువుతూ శుద్ధి చేయాలి. ఇలా శుద్ధి చేసిన తరవాత పంచోపచారాలతో మాలను పూజించాలి. గంధం, ధూపం, దీపం, పుష్పాలు, నైవేద్యం…వీటిని సమర్పించటానికి పంచోపచారాలు అంటారు.

గంధార్పణ మంత్రం:-
పరమానందసౌరభ్యపరిపూర్ణ దివాంతరమ్|
గృహాణ పరమం గంధం కృపయా పరమేశ్వర||

పుష్పారణ మంత్రం:-
తురీయం తుగుణసంపన్నం నానగుణమనోహరమ్|
ఆనంద సౌరభ పుష్పం గృహ్యతామిదత్తమమ్||

ధూప మంత్రం:-
వనస్పతిరసో దివ్యో గంధాఢ్యః సుమనోహరః|
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపో యాం ప్రతిగృహ్యతామ్||

దీపదర్శన మంత్రం:-
సుప్రకాశో మహాద్వీపః సర్వతస్తి మిరాపః|
సవాహ్మభ్యంతర జ్యోతిర్దీపో యం ప్రతిగుహ్యాతామ్||

నైవేద్యార్పణ మంత్రం:-
సత్పాత్రసిద్ధం సుహాబివధానేక భక్షణమ్|
నివేదయామి దేవేశ సానుగాయ గృహాణ తత్||

ఆ తరవాత మాలను ఇలా ప్రార్థించాలి –
ఓం మహామాయే మహామాలే సర్వశక్తి స్వరూపిణీ|
చతువైర్గస్త్వయిన్యస్త స్త్రస్మాన్మే సిద్ధిదా భవ||
అవిఘ్నం కురుమాలే త్వం గృహణామ దక్షిణే కరే|
జపకాలే ఛ సిద్ధ్యర్ధ ప్రసది మమ సిద్ధయే||

పై విధంగా ప్రార్థించి మాలగ్రహన్ మంత్రదేవత సూర్య భగవానుడిని ధ్యానిస్తూ హృదయానికి సమీపంలో ఉండేట్లుగా మాలను పట్టుకుని, మంత్రంలోని అక్షరాలను స్మరిస్తూ ఆ రోజు మధ్య వరకు జపం చేసుకోవాలి. జపం ముగిశాక ఓంకారాన్ని ఉచ్చరించాలి. లేకపోతే 108 సార్లు జపం చేసి, 108 ఆహుతులతో హోమం చేయాలి. మరో మంత్రాన్ని ఈ మాల మీద జపించకూడదు. మాలను సురక్షితమైన స్థానంలో సగౌరవంగా భద్రపరుస్తూ కింది మంత్రాన్ని ఉచ్చరించాలి.

ఓం త్వం మాలే సర్వేదేవానాం సర్వాసిద్ధిపరదా మతా|
తేన సత్యేన మే సిద్ధి దేహి మాతర్నమో స్తుతే||

మాల సూత్రం (దారము) పాతదైపోతే, మళ్ళీ కొత్తదారంతో గుచ్చుకుని 100 సార్లు జపం చేయాలి.

ఈ విధంగా మాలను పవిత్ర పరచిన తరవాత పైన చెప్పిన విధంగా మంత్రజపం చేయడం వల్ల సంపూర్ణ ఫలితం దక్కుతుంది. సాధన, ఉపాసన తప్పనిసరిగా సఫలమవుతాయి.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment