hastamalaka stotram lyrics  hastamalaka stotram lyrics in tamil  hastamalaka pdf  hastamalaka story  hastamalaka meaning  hastamalaka stotram benefits  hastamalaka stotram malayalam  hastamalaka stotram audio


॥ హస్తామలకస్తోత్రమ్ ॥


 కస్త్వం శిశో కస్య కుతోఽసి గన్తా కిం
 నామ తే త్వం కుత ఆగతోఽసి । 
ఏతన్మయోక్తం వద చార్భక త్వం
మత్ప్రీతయే ప్రీతి వివర్ధనోఽసి ॥ ౧॥

 హస్తామలక ఉవాచ । 

నాహం మనుష్యో న చ దేవ-యక్షౌ న
బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్రాః । 
న బ్రహ్మచారీ న గృహీ వనస్థో భిక్షుర్న
 చాహం నిజబోధ రూపః ॥ ౨॥

నిమిత్తం మనశ్చక్షురాది ప్రవృత్తౌ
 నిరస్తాఖిలోపాధిరాకాశకల్పః । 
రవిర్లోకచేష్టానిమిత్తం యథా యః
స నిత్యోపలబ్ధిస్వరూపోఽహమాత్మా ॥ ౩॥

యమగ్న్యుష్ణవన్నిత్యబోధ స్వరూపం
 మనశ్చక్షురాదీన్యబోధాత్మకాని । 
ప్రవర్తన్త ఆశ్రిత్య నిష్కమ్పమేకం స
నిత్యోపలబ్ధిస్వరూపోఽహమాత్మా ॥ ౪॥

 ముఖాభాసకో దర్పణే దృశ్యమానో
 ముఖత్వాత్ పృథక్త్వేన నైవాస్తి వస్తు ।
 చిదాభాసకో ధీషు జీవోఽపి తద్వత్ స
 నిత్యోపలబ్ధిస్వరూపోఽహమాత్మా ॥ ౫॥

 యథా దర్పణాభావ ఆభాసహానౌ
 ముఖం విద్యతే కల్పనాహీనమేకమ్ । 
తథా ధీ వియోగే నిరాభాసకో యః స
నిత్యోపలబ్ధిస్వరూపోఽహమాత్మా ॥ ౬॥

మనశ్చక్షురాదేర్వియుక్తః స్వయం యో
మనశ్చక్షురాదేర్మనశ్చక్షురాదిః ।
మనశ్చక్షురాదేరగమ్యస్వరూపః స
 నిత్యోపలబ్ధిస్వరూపోఽహమాత్మా ॥ ౭॥

 య ఏకో విభాతి స్వతః శుద్ధచేతాః
ప్రకాశస్వరూపోఽపి నానేవ ధీషు 
శరావోదకస్థో యథా భానురేకః స
నిత్యోపలబ్ధిస్వరూపోఽహమాత్మా ॥ ౮॥

యథాఽనేకచక్షుః-ప్రకాశో రవిర్న
క్రమేణ ప్రకాశీకరోతి ప్రకాశ్యమ్ । 
అనేకా ధియో యస్తథైకః ప్రబోధః స
నిత్యోపలబ్ధిస్వరూపోఽహమాత్మా ॥ ౯॥

వివస్వత్ ప్రభాతం యథా రూపమక్షం
 ప్రగృహ్ణాతి నాభాతమేవం వివస్వాన్ ।
 యదాభాత ఆభాసయత్యక్షమేకః స
నిత్యోపలబ్ధిస్వరూపోఽహమాత్మా ॥ ౧౦॥

 యథా సూర్య ఏకోఽప్స్వనేకశ్చలాసు
 స్థిరాస్వప్యనన్యద్విభావ్యస్వరూపః
 చలాసు ప్రభిన్నః సుధీష్వేక ఏవ స
 నిత్యోపలబ్ధిస్వరూపోఽహమాత్మా ॥ ౧౧॥

ఘనచ్ఛన్నదృష్టిర్ఘనచ్ఛన్నమర్కమ్
యథా నిష్ప్రభం మన్యతే చాతిమూఢః । 
తథా బద్ధవద్భాతి యో మూఢ-దృష్టేః స
 నిత్యోపలబ్ధిస్వరూపోఽహమాత్మా ॥ ౧౨॥

 సమస్తేషు వస్తుష్వనుస్యూతమేకం
సమస్తాని వస్తూని యన్న స్పృశన్తి ।
 వియద్వత్సదా శుద్ధమచ్ఛస్వరూపం స
 నిత్యోపలబ్ధిస్వరూపోఽహమాత్మా ॥ ౧౩॥

ఉపాధౌ యథా భేదతా సన్మణీనాం
తథా భేదతా బుద్ధిభేదేషు తేఽపి ।
 యథా చన్ద్రికాణాం జలే చఞ్చలత్వం
తథా చఞ్చలత్వం తవాపీహ విష్ణో ॥ ౧౪॥

॥ ఇతి శ్రీహస్తామలకాచార్యరచితం 
హస్తామలకసంవాదస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

   హస్తామలక స్తోత్రం ఆదిశంకరుల జీవితానికి సంబంధించిందే హస్తామలక స్తోత్రం.అందులోనూ ఆయన శిష్యులలో ఒకరైన హస్తామలకాచార్యుల వృత్తాంతం ఇది. ఎంతో విస్మయాత్మకంగానూ, ఆత్మజ్ఞాన ప్రబోధకంగానూ ఈ కథ కనిపిస్తుంది. అలాగే మహనీయులు, సిద్ధపురుషులు, తపశ్శక్తి సంపన్నుల స్పర్శ మూగవారిని మాట్లాడేలా చేస్తుందని, అంధులకు చూపు తెప్పిస్తాయని, వికలాంగులకు పరుగెత్తే శక్తిని ఇస్తాయని, చెవిటి వారికి వినికిడి శక్తిని సమకూరుస్తాయని రామాయణాది ఇతిహాసాలలోనూ, పురాణాలలోనూ తరచూ కనిపిస్తుంటుంది. అహల్య శాప విమోచనం ఇందుకొక ఉదాహరణ. అలాంటి విస్మయాత్మక సంఘటన ఈ కథలో ఉంది. రామాయణం, పురాణాలు ఏనాటివో అనుకున్నా.. ఈ ఇతివృత్తం దాదాపు క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దానికి చెందినదే. దీనివల్ల మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఉన్న ఆచార్య పరంపర శక్తి ఎంతటిదో సులభంగా అవగతమవుతుంది.

 ఆది శంకరులు దేశాటనం చేస్తూ బలి అనే గ్రామానికి వచ్చారు. శిష్యసహితంగా బలి గ్రామంలో ప్రవేశించిన శంకరులకు ఓ విచిత్ర సన్నివేశం ఎదురైంది. ఆ గ్రామంలో ప్రభాకరుడు అనే ఓ వేద పండితుడు ఉన్నాడు. తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ఎంతో ఉత్తముడుగా పేరు పొందాడు ప్రభాకరుడు. అయితే ఆయన జీవితానికి ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. సంతానాన్ని కోరుకున్న ఆయనకు ఓ చక్కటి మగ శిశువు జన్మించాడు. చూపులకు ఎంతో అందంగా, ఆరోగ్యంగా ఉన్నా.. పుట్టినప్పటి నుంచి ఆ శిశువు ఎటూ కదలక, మెదలక ఉండేవాడు. అలా పెరుగుతూ పెరుగుతూ పదమూడు సంవత్సరాల వయస్సు దాకా వచ్చాడు. స్పృహలో లేక ఏది చెప్పినా వినక ఏమీ మాట్లాడక ఎటు చూస్తున్నాడో ఎదుటి వారికి తెలియకుండా అచేతనంగా పడి ఉన్న తన పిల్లవాడిని ఎందరెందరో వైద్యులకు, భూత వైద్యులకు కూడా చూపించాడు ఆ వేద పండితుడు. అయినా ఏమీ లాభం లేకపోయింది. చివరకు ఆదిశంకరులు తమ గ్రామానికి శిష్యసమేతంగా వచ్చాడని తెలుసుకుని పిల్లవాడిని వెంట తీసుకుని వెళ్ళి ఆయన పాదాల మీద పడవేసి తన సమస్యనంతా చెప్పాడు. ఎంతసేపటికీ తనకాళ్ళ మీద నుంచి లేవని ఆ జడుడిని ఆదిశంకరులు తన చేతులతో లేవనెత్తి కూర్చోపెట్టారు. 

 ఒక్కసారి అతడి వంక చూసి ఎవరు నీవు...? ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేమిటి? అని అడిగారు. పదమూడేళ్ళ పాటు ఒక్కమాట కూడా మాట్లాడక జడుడిగా పడి ఉన్న ఆ బాలుడు శంకరులు ప్రశ్నలకు గడగడా అనర్గళంగా శ్లోక రూపంలో సమాధానాలు చెప్పాడు. తానెవరంటే సర్వవ్యాప్తమూ, సర్వోన్నతమూ, చైతన్యవంతమూ అయిన పరబ్రహ్మ (ఆత్మ) అని అన్నాడు. ఆకలిదప్పులు, శ్లోకమోహాలు, జరామరణాలు అనే షడూర్ములు వికారాలు.. జననం, స్థితి, పెరగటం, తరగటం, విరగటం అనే షడ్భావ వికారాలు.. ఇవేమీ లేని సుఖస్వరూపంగా ఉన్న పరమాత్మ స్థితే తాను.. అని అన్నాడు ఆ బాలుడు. ప్రతి జీవిలోనూ ఉండేవి ఆత్మ పరమాత్మ కనుక దేహాలు ఎప్పటికీ శాశ్వతాలు కావు కనుక ఆ దృష్టితో చూస్తే తాను పరమాత్మనేనని ఆ బాలుడు ఆత్మతత్వాన్ని అక్కడున్న వారందరికీ చాలా సులభంగా వివరించాడు. అరచేతిలో ఉసిరికాయను సంస్కృతంలో హస్తామలకం అని అంటారు. 

అర చేతిలో ఉసిరి కాయను పెట్టుకొని ఎవరికి చూపించినా అదేమిటో వివరంగా చెప్పకుండానే అందరికీ అర్థమై పోతుంది. అంత సులువుగా దాదాపు పన్నెండు శ్లోకాలలో, ఉదాహరణలతో సహా ఆదిశంకరుల ముందు ఆ బాలుడు చెప్పినదంతా హస్తామలక స్తోత్రం అని ప్రసిద్ధి కెక్కింది. భగవత్పాదులు తనతో అంత చక్కగా మాట్లాడిన అతడి వంక మరోసారి చూసి అతడి శిరస్సున తన చేయి ఉంచి ఆశీర్వదించి దీక్షనిచ్చారు. ఆ బాలుడి తండ్రి అయిన ప్రభాకరుడికి తేరుకోలేని ఆశ్చర్యం కలిగించింది. ఇన్నాళ్ళు తాను కొట్టినా తిట్టినా ఏ రకమైన వైద్యాలు చేయించినా పలకని జడుడు అనుకున్న వాడు ఇంత పాండిత్యాన్ని ఎలా ప్రదర్శించ గలుగుతున్నాడు అని అనుకొంటూ కూర్చొన్నాడు. అప్పుడు భగవత్పాదులు అతడు అజ్ఞాని కాదు అని.. అజ్ఞాని అయిన వాడు ఎప్పుడూ అలా మాట్లాడలేడు అని అన్నారు. గత జన్మలో అతడొక సిద్ధ పురుషుడని, బ్రహ్మ జ్ఞాన సంపన్నుడని, తపోనిష్టలో ఉండి తనువును చాలించి జన్మించినందువల్ల ఆ నిర్వికల్ప సమాధి స్థితే ఈ జన్మలోనూ ప్రాప్తించిందన్నారు. అంతటి యోగ సిద్ధుడు సాంసారిక జీవితంలో ఉన్నందు వల్ల ప్రయోజనమేమీ ఉండదని అతడిని తన శిష్యుడిగా చేసుకుని తన వెంట తీసుకు వెళ్ళాలనుకొంటున్నట్లు జగద్గురువులు ప్రభాకరుడితో అన్నారు. ప్రభాకరుడు కూడా విషయజ్ఞాన సంపన్నుడు, శాస్త్ర కోవిదుడే కనుక శంకరుల మాటకు అడ్డు చెప్పలేదు. అప్పటి వరకూ ఏ పేరూ లేకపోయినా హస్తామలక స్తోత్రం చెప్పాడు కనుక అతడికి హస్తామలకుడు అని పేరు పెట్టి తన వెంట తీసుకువెళ్ళారు ఆది శంకరులు. 

      హస్తామలక స్తోత్రంలో హస్తామలకుడు దీనికొక చక్కటి ఉదాహరణ కూడా చెప్పాడు. ఆకాశంలో కనిపించే సూర్యచంద్రులు ఎప్పుడూ అక్కడ అలాగే కనిపిస్తారు. కానీ కదులుతున్న నీటి అలల మీద సూర్యచంద్రుల ప్రతిబింబాలను చూసినప్పుడు అవి కదులుతున్నట్లు అనిపిస్తాయి. ఇలాగే స్థిరమైన పరమాత్మ వివిధ రకాల జీవులలో ఉంటూ రకరకాల ప్రాణులనే భావన కలిగిస్తుంటున్నది ఇక్కడి పోలిక. సూక్ష్మంగా చెప్పాలంటే అన్ని జీవుల్లోనూ పరిపూర్ణ పరిశుద్ధమైన ఆ పరబ్రహ్మ ఉంటాడు కనుక సపర్వనామ భావనను అందరూ పాటిస్తూ శాంతిమార్గాన్ని అవలంభించాలన్నది ఇక్కడ కనిపించే సందేశం.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment