భార్యకు వివాహేతర సంబంధం 
    పెట్టుకోవాలన్న ఆలోచనకు కారణాలివే..!

మూన్నాళ్ల ముచ్చటగా పరిణయ ప్రమాణాలు
వీగిపోతున్న వివాహ సంబంధం
చిన్నచిన్న కారణాలకే విడాకుల వరకు వెళ్తున్న జంటలు
అహం, పైచేయి కావాలన్న ధోరణి కారణం
మితిమీరిన స్వేచ్ఛ కోరుకునే వారూ అధికం
సొంతకాళ్లపై నిలబడగలనన్న అహంకారం కొందరిలో
బాధ్యతలను గుర్తించక పోవడమూ మరో సమస్య
భార్య వ్యక్తిత్వాన్ని గౌరవించని భర్తలు ఎందరో
నేను, నా భర్త అనుకుని అత్తమామల్ని నిర్లక్ష్యం చేస్తున్న భార్యలు
వివాహేతర సంబంధాలతో కూలుతున్న కాపురాలు
ప్రేమ పెళ్లిళ్లూ పెడాకులవుతుండడం ఆశ్చర్యకరం
ఎవరి కోణంలో వారు సమస్యకు బీజం
సమన్వయం, సర్దుకుపోయేతత్వం కనుమరుగు
సామాజిక సమస్యలను పట్టించుకోకుండా విడిపోతున్న వైనం
ఈ ధోరణి అసాధారణమే అంటున్న నిపుణులు
కాపురాలు విచ్ఛిన్నమయితే భవిష్యత్తు చీకటి అవుతుందని హెచ్చరిక

   కుటుంబ వ్యవస్థకు మూలాధారం వివాహం. అందుకే పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు. భారతీయ వివాహ బంధానికి ప్రపంచమే తలవంచుతుంది. సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, కుటుంబ జీవనంపై ఉన్న గౌరవం, సామాజిక అంశాలు ఇందుకు కారణం. ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతి అంటే ఈసడించుకునే పరిస్థితి పోయి ఇప్పుడు మనం కూడా అదేదారిలో నడిచేందుకు ఇష్టపడుతున్నామన్న భావన క్రమేపీ బలపడుతోంది. పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు ఒకరంటే ఒకరు ఇష్టపడి చేసుకునే ప్రేమ పెళ్లిళ్లు పెడాకులవుతున్నాయి. వందేళ్ల బంధం కాస్త మూడునాళ్ల ముచ్చటగా మారుతోంది. ఓర్పు, సహనం అన్న మాటలు దూరమయ్యాయి. అవగాహనా లోపం, అహం, మితిమీరిన స్వేచ్ఛకోరుకోవడం వంటి కారణాలు వివాహ బంధం విచ్ఛిన్నానికి కారణమవుతున్నాయి. పరస్పరం గౌరవించుకోవడానికి బదులు ఒకరిపై మరొకరు ఆధిపత్యం సాధించాలన్న ధోరణి ఈతరం యువతను కోర్టు మెట్లెక్కిస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్తుకు ప్రమాదమే అంటున్నారు నిపుణులు.

గాజువాక)(విశాఖ జిల్లా)
కాలం మారింది. పరిస్థితులూ మారాయి. పటి ష్టమైన భారతీయ వివాహ వ్యవస్థ కూడా ప్రస్తుతం ఆటుపోట్లకు లోనవుతోంది. పెళ్లి విషయంలో ఒకప్పు డు ప్రపంచమే మనల్ని చూసుకుని అనుసరించా లనుకుంటే ఇప్పుడు మనమే ఆ ప్రపంచం వైపు అడు గులు వేస్తున్నాం. బిడ్డలకు పెళ్లి చేసి ఓ ఇంటివారిని చేస్తే తమ బాధ్యత తీరుతుందని తల్లిదండ్రులు భావించేవారు. ఇప్పుడు పెళ్లిచేశాక ఎటువంటి పరిస్థి తులు ఎదుర్కోవాల్సి వస్తోందో అని మధన పడుతు న్నారు. చిన్నచిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తు న్న ఈ తరం దంపతుల పోకడ ఆ తరం వారి ఆందో ళనకు కారణమవుతోంది. ‘భార్య తన తల్లిదండ్రులను బాగా చూసుకోవడం లేదు... వేరు కాపురం పెట్టమని కోరుతుంటే భర్త అంగీకరించడం లేదు... పెళ్లయ్యాక నిద్రకు దూరమయ్యాను,ఈ గురక రాక్షసుడితో కాపురం చేయలేను... నెలసరి సమయంలో నన్ను కింద పడుకోమంటున్నాడు’... ఇలాంటి చిన్నచిన్న కారణాలతోనే ఈతరం విడాకుల వరకు వెళ్తోంది. పెళ్లయిన నెలరోజులకే ‘ఇక నీతో వేగడం నా వల్ల కాదు’ అని ఒకరినొకరు ఈసడించుకుంటున్న జంటలు ఎన్నో. తమ పెద్దరికంతో దంపతుల మధ్య సఖ్యత కుదిర్చి కాపురం నిలబెట్టాల్సిన కొందరు తల్లిదండ్రులు కూడా ‘కలిసి బతకలేనప్పుడు విడిపోయి హాయిగా ఉండడమే మేలు’ అని వంతపాడుతుండడం సమస్యకు మరింత కారణమవుతోంది. పెద్ద లు కుదిర్చిన పెళ్లిళ్లలో ఏదో అవగాహన లోపం అనుకోవచ్చు. ప్రేమ పేరుతో కొన్నాళ్లపాటు చెట్టా పట్టాలేసుకుని తిరిగి, తర్వాతే పెళ్లి చేసుకున్న ప్రేమ జం టలూ ఇదేదారిలో నడు స్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇందు కుకారణం ఏమిటి?మార్పు సాధ్యమేనా అన్న అంశాలపై నిపుణులతో మాట్లాడి ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

ఏడాదికి విడిపోతున్నవారు 13.6 లక్షలు
ఓ సర్వే ప్రకారం మన దేశంలో ఏటా విడాకులు తీసుకుంటున్న జంటలు 13 లక్షల 60 వేల మంది వరకు ఉన్నారని ఓ సర్వే అంచనా. విడాకులు తీసుకుంటున్న వారిలో విడిగా ఉండేందుకు ఇష్టపడుతున్న మహిళల సంఖ్య అధికం. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. మిజోరాంలో విడాకుల కేసులు అధికంగా ఉంటున్నాయి. అలాగే కులాంతర వివాహాలు అక్కడే ఎక్కువగా జరుగుతున్నాయి.

అహం...అసలు సమస్య
దంపతుల మధ్య అహం, తనమాటే నెగ్గాలన్న పట్టుదల చాలా సమస్యలకు మూలమవుతోంది. కొందరు మగాళ్లు భార్య ఉద్యోగం చేయకూడదని భావిస్తారు. మరికొందరు భార్య ఉద్యోగం చేసినా తన అడుగులకు మడుగులొత్తాలని ఆశిస్తారు. తను చెప్పిన దానికి గంగిరెద్దులా తలూపాలని కోరుకుంటారు. తన సంపాదన విషయం భార్య కు చెప్పడు. కానీ ఆమె సంపాదనపై పెద్దరికం కోరుకుంటాడు. ఇటువంటి ఆలోచనలకు అహమే కారణం. సర్దుకుపోయే మహిళలైతే సమస్య ఉండదు. జీవిత భాగస్వామికి కూడా అదే అహం ఉంటే ఘర్షణలు తలెత్తుతాయి. ఆత్మాభిమానం సమస్య బయటపడి కాపురాలు కూల్చు కుంటున్నారు. అలాకాకుండా మనసెరిగి మసల డం, ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం, సర్దుకుపోయే తత్వాన్ని అలవర్చుకోవడం జరిగితే ఈ సమస్య ఉండదు. నూతన దంపతుల మధ్య అవగాహన పెరగడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు సమన్వయంతో మెలగడం చాలా అవసరం.

పోల్చిచూసుకుంటే కాపురం కూలుతుంది
దంపతుల్లో చాలామందికి ఇతరులతో తమ జీవిత భాగస్వామిని పోల్చి చూసుకునే బలహీనత ఉంటుంది. తాను ఆశించినట్టు భర్త లేడనో, సంసార సుఖం విషయాన్ని పట్టించుకోవడం లేదనో అసంతృప్తికి లోనవుతుంటారు. ఈ అసంతృప్తిలో వివాహేతర సంబంధాల ఉచ్చులో పడుతుంటారు. విషయం బయటపడ్డాక కాపురాలు కూలుతుండడం ఇటీవల కాలంలో ఎక్కువయింది. వివాహేతర సంబంధాలు విభేదాలకు కారణమై చివరికి విడాకుల వరకు వెళ్తున్నాయి. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారిలోనూ ఈ సమస్య ఉండడం, అదీ పెళ్లయ్యాక గోల్డెన్‌ పీరియడ్‌గా చెప్పుకునే మూడేళ్లలోపే ఈ సమస్యలు రావడం గమనార్హం.

కారణాలు ఏమిటి?
కాపురం అన్నాక చిన్నచిన్న అలకలు, చికాకులు సహజం. వివాహ బంధం పవిత్రమైనదే కాదు, బలమైనది. కోట్లు, లక్షల రూపాయలు ఖర్చు చేసిన పెళ్లి ఆర్భాటపు సందడి సమసిపోకముందే కోర్టు మెట్లెక్కే స్థాయికి కొందరు దిగజారుతున్నారు. ఈ తరంలో ఓర్పు, సహనం కరువవ్వడమే ఇందుకు కారణం. తమకాళ్లపై తాము నిలబడగలమన్న ధైర్యంతో వివాహ బంధానికి విలువివ్వడం లేదు. ప్రతిదాన్నీ భూతద్దడంలో చూడడం పరిపా టిగా మారింది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి. వీటిలో సెక్షన్‌-9 ప్రకారం కొన్ని కేసులు దాఖలవుతుండగా, ఇరువర్గాల అంగీకారం కేసులు ఎక్కువ. సెక్షన్‌ 13, 1ఎ, 1బి కింద కేసులు దాఖలవుతున్నాయి. ఈ తరం సౌకర్యాలు, స్వేచ్ఛ కోరుకుంటున్నారు. భంగం కలిగితే సహించలేక పోతున్నారు. విడిపోయేందుకు సిద్ధపడుతున్నారు. కలిసి ఉండలేనప్పుడు విడిపోవడమే మేలన్న భావన కనిపిస్తోంది. ఒకప్పుడు విడాకులు తీసుకో వడం అంటే సమాజంలో చిన్నచూపన్న భయం ఉండేది. ఆ భయం కూడా పోయింది. సమాజం కూడా అంగీకరిస్తోంది. ఇద్దరి మధ్య సఖ్యత కుదరనప్పుడు కలిసి ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందన్న భావన ఉంది. కూతురికి సర్దిచెప్పి అత్తారింటికి పంపే తల్లిదండ్రుల సంఖ్య తగ్గిపోయింది.

ఈ కారణంగా విడాకులు అడగొచ్చు

దంపతుల్లో ఎవరికైనా వివాహేతర సంబంధం ఉంటే మిగిలిన వారు
ఎయిడ్స్‌ వంటి భయానక వ్యాధులు బాధితులైనా...
గృహహింస అధికంగా ఉన్నా...
ఇద్దరిలో ఎవరైనా కాపురానికి పనికిరాకున్నా
మొదటి వివాహాన్ని దాచి మోసంతో రెండో వివాహం చేసుకున్నా
ఇష్టం లేకుండా పెళ్లి చేసినా...
పద్దెనిమిదేళ్లలోపు వివాహం చేసినా...
మానసిక స్థితి సరిగా లేకున్నా...

పెళ్లయిన ఏడాది తర్వాత విడాకులు తీసుకునేందుకు హక్కు వస్తుంది. జ్యుడీషియల్‌ సెపరేషన్‌కు కనీసం ఆరు నెలల సమయం అవసరం.


వీటికి దూరంగా ఉండాలి

చీటికి మాటికీ వాదులాడకోవడం, మనమాటే నెగ్గాలన్న పంతం మంచిది కాదు.
ఐదునిమిషాలతో పోయే గొడవను ఐదారు రోజులు సాగదీయకూడదు.
ప్రశాంతంగా ఆలోచించి సమస్యకు పరిష్కారం చూపాలి.
ప్రశ్నించారని అహం కొనితెచ్చుకోవద్దు. నిదానంగా సమాధానాలు చెప్పాలి.
గతాన్ని తవ్వుకునే ప్రయత్నం చేయొద్దు. ప్రతి మనిషిలో లోపాలు సహజం.
పదేపదే లోపాలు ప్రస్తావిస్తూ ఎదుటి వారిని కించపర్చేలా మాట్లాడవద్దు.
తప్పు చేయడం సహజం. అదే జరిగితే నిజాయితీగా క్షమాపణ చెప్పాలి.
ప్రత్యేక సందర్భాలు, వారాంతాల్లో బయటకు వెళ్లే విషయంలో ఇరువురు కూర్చుని అవగాహనతో ఓ ప్రాంతాన్ని నిర్ణయించుకుంటే మంచిది.
డబ్బు విషయంలో తరచూ గొడవలు జరుగుతుం టాయి. ఒకరికి అవసరంలా కనిపించేది మరొకరికి అనవసరంలా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఇద్దరూ చర్చించుకుంటే ఏ సమస్యా ఉండదు.
భాగస్వామి విషయాలను ఇతరుల వద్ద ప్రస్తావించవద్దు.

చదువుకున్న వారే అధికం
ఉన్నత చదువులు చదువుకున్న వారే ఎక్కువగా బంధాలను తెంచేసుకుంటున్నారు. పవిత్ర ఆర్థిక బంధాన్ని ఆర్థిక బంధంగా మార్చేస్తున్న వారు లేక పోలేదు. ఉన్నత మధ్య తరగతి కుటుంబాల్లో మన స్పర్థలతో కోర్టు మెట్లెక్కుతున్న వారు అధికం. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న యువతుల్లో ఆర్థికంగా పురుషుడి మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేకపోవడంతో ఏ మాత్రం పొరపొచ్చాలు వచ్చినా వెంటనే విడిపోయేందుకు సంసిద్ధమవుతున్నారు.

ఇవి తప్పనిసరి

దంపతుల మధ్య దాపరికం ఉండకూడదు. ఎప్పుడైనా బయటపడితే సమస్య జఠిల మవుతుంది. అపార్థాలు చోటు చేసుకుంటాయి.
కుటుంబ అంశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకూడదు. ప్రాణమిత్రులైనా సరే.
భాగస్వామి కోసం అలవాట్లు, ఇష్టాలు మార్చుకో నవసరం లేదని గుర్తించాలి.
సమస్యలు ఎదురైతే దూరంగా పారిపోయే కంటే వాటి పరిష్కారానికి వెంటనే చర్య తీసుకోవాలి. చర్చించుకోవాలి.
బాధితుల కోణంలో చూడాలి
ఎంతో కష్టం వస్తేగాని ఎవరూ బయటకు రారు. వారి కష్టాలు ఎదుటి వారికి చిన్న సమస్యగా అనిపించ వచ్చు. ఇలాంటి కేసుల్లో కౌన్సె లింగ్‌ కీలకం. నూటికి 70 శాతం కేసులు కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్క రించవచ్చు. ఇక్కడ కూడా సాధ్యంకాని కేసులు దాదాపుగా విడాకులకు దారితీస్తాయి. గృహ హింస, తాగుడు, అనుమానం, చిత్రహింసలకు గురిచేయడం, వివాహేతర సంబంధాలు, ఆర్థిక కేసులు, భార్యలు వేధిస్తున్నట్లు వైనం తాజాగా వెలుగులోకి వస్తోంది.
కె.కనకమహాలక్ష్మి, ఫ్యామిలీ కౌన్సెలర్‌, సోషల్‌వర్క్‌ డిపార్ట్‌మెంట్‌, ఏయూ

పెళ్లికి ముందు కౌన్సెలింగ్‌ అవసరం
కుటుంబ నేపథ్యం, వ్యక్తిత్వం, భావోద్వేగాలు, వ్యవహారశైలి, ఉద్యోగ కారణాలు, అత్తగారితో వివాదాలు, ఆర్థిక విషయాలు, అనుమానం, తాగుడు, సెక్స్‌ సం బంధిత కారణాలతో చాలామంది విడిపోతున్నారు. ఉమ్మడి కుటుం బాలు లేక విలువలు తెలియడం లేదు. పెళ్లికి ముందు (ప్రీ మెరి టల్‌) కౌన్సెలింగ్‌ వల్ల భవిష్యత్తు, బంధం, వివాహం విలువ, జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం వంటి విషయాలపై అవగాహన కలుగుతుంది. తద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది. అలా సాధ్యంకాక పోయినా, గొడవలు ప్రారంభం కాగానే కౌన్సెలింగ్‌ తీసుకోవడం మేలు.  రాజు, సైకాలజిస్ట్‌, ఏయూ
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment