*మహా సంప్రోక్షణ కార్యక్రమం* గురించి మాట్లాడుకొంటూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? ఆ సమయంలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారా? లేదా? ఒక వేళ ఇస్తే ఏ ఏ సమయంలో ఆ దర్శన భాగ్యం కల్పిస్తారన్న విషయం పై చర్చించుకొంటున్నారు.
అంతేకాకుండా మిగిలిన రోజులతో పోలిస్తే వారాంతాల్లో అంటే వీకెండ్ సమయంలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అయితే ఆ మహా సంప్రోక్షణ కూడా అదే సమయంలో జరుగుతుండటం వల్ల తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలా వద్దా అన్న విషయం పై పర్యాటకులు కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వీటన్నింటికీ సమాధానమే ఈ కథనం.
*పన్నెండేళ్లకు ఒకసారి*
నదులకు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్లే తిరుమల శ్రీవారికి కూడా అష్టబంధన బాలాలయం మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి దీనిని నిర్వహిస్తారు.
*విగ్రహ ప్రతిష్టాపన*
ఆలయ నిర్మాణాల్లో ప్రధానమైనది విగ్రహ ప్రతిష్టాపన. తర్వాత శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ పనులు. సజీవంగా ఉండే ఓ దేవతా మూర్తిని సేవిస్తున్నామనే భావన భక్తులకు కలిగేలా విగ్రహంలో ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు.
*అలా మలినమయ్యే అవకాశం ఉంది*
ఇక తిరుమలలో శ్రీవారికి ప్రతి రోజూ అనేక ఉపచారాలు, నివేదనలు జరుగుతాయి. ఈ సమయంలో పాత్రలు లేదా కొన్ని పదార్థాలు కింద పడినప్పుడు ఎంతో కొంత మాలిన్యాలు గర్భాలయంలోకి చేరుతాయి. వీటి వల్ల కొన్ని సార్లు గర్భాలయంలో పగుళ్లు వచ్చే అవకాశం ఉంది.
*అపచారంగా భావించి*
ఇది అపచారంగా భావించి పన్నెండేళ్లకోసారి గర్భాలయంలో అర్చకులే వాటికి మరమత్తులు చేస్తారు.
_ఈ క్రమంలో మొదట శ్రీవారి మూలవిరట్ పాదాలకు పద్మపీఠం మధ్యలో ఉన్న భాగాన్ని లేపంతో నిపటమే అష్టబంధన కార్యక్రమం._
*8 రకాల వస్తువులతో*
ఈ కార్యక్రమంలో భాగంగా 8 రకాల వస్తువలతో తయారుచేసిన చూర్ణాన్ని శ్రీవారి పాదల కింద మూలవిరాట్ సమీపంలో ఉంచుతారు. ఇందులో
*_నల్లసరిగళం, కరక్కాయ, ఎర్రపత్తి, వెన్న, కండచెక్కర, లక్క, చెకుముకిరాయి, బెళ్లం ఉంటాయి._*
*ఆయా ప్రదేశాల్లో ఉంచుతారు*.
ఈ వస్తువుల మిశ్రమాన్ని మూలవిరాట్ తో పాటు ఆధార్ పీఠం, పాదపీఠం మధ్యలో సన్నపాటి ప్రదేశంలో, మూలవిరాట్ పై భాగంలో గోడకు ఉన్న రంధ్రాల్లో ఈ చూర్ణాన్ని అద్దుతారు. కాల క్రమంలో ఈ మిశ్రమం కరిగిపోవడం, రంగు మారడం వల్ల మూలవిరాట్ లో శక్తి తగ్గితోతుంది.
*శక్తిని పెంపొందించడానికే*
తిరిగి ఆ శక్తిని పెంపొందించేందుకే అష్టబంధన బాలాయన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మహాసంప్రోక్షణ శ్రీవారి ఆలయంలో 1958లో ప్రారంభమయ్యింది. చివరిగా 2006లో జరిగింది. మళ్లీ ఇప్పుడు ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రారంభమవుతోంది.
*అష్టబంధన కార్యక్రమం*
ఇతర ఆలయాల్లో మాదిరి ఆలయం లోపలికి ఇంజనీరింగ్ అధికారులను అనుమతించరు. మహా సంప్రోక్షణంలో మూలవిరాట్ పాదాలు, పద్మపీఠం మధ్యన అష్టబంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
*మూడు విభాలుగా.*
ఈ బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని మూడు విభాగాలుగా నిర్వహిస్తారు.
మొదటగా శ్రీవారి మూలవిరాట్ లో ఉన్న శక్తిని కుంభంలోకి ఆవాహనం చేస్తారు. శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న పాత కళ్యాణ మంటపంలో ప్రత్యేకంగా 24 యాగశాలలను ఏర్పాటు చేస్తారు.
అక్కడ కుంభాన్ని ఉంచుతారు.
అక్కడ స్వామివారి శక్తిని ఆవాహన చేసిన కుంభాన్ని ఉంచుతారు. మూలవిరాట్ కు నిత్యం నిర్వహించే పూజా కైంకర్యాలను ఈ కుంభానికి నిర్వహిస్తారు. ఆఖరి రోజున మహా సంప్రోక్షణతో స్వామివారి శక్తిని తిరిగి మూలవిరాట్ లోకి పంపింస్తారు.
నూతనంగా నిర్మించినట్లే
ఈ కార్యక్రమంలో మూలవిరాట్ లోకి తిరిగి మూలవిరాట్ ని నూతనంగా నిర్మించినట్లేనని చెబుతారు.అష్టబంధన బాలాయన మహాసంప్రోక్షణం ఆగస్టు 11 నుంచి 15వ తేది వరకూ జరగనుంది. ఇందులో ఆగస్టు 11వ తేది శనివారం రోజు మొత్తంలో 9 గంటల సమయాన్ని మాత్రం దర్శనానికి కేటాయించనున్నారు.
ఆయా రోజుల్లో
12వ తేది ఆదివారం 4 గంటల సమయం, 13వ తేది సోమవారం 5 గంటల సమయం, 14వ తేది మంగళవారం 5 గంటల సమయం, 15వ తేది బుధశారం 6 గంటల సమయంలో మాత్రమే భక్తులకు శ్రీవారిని దర్శించే అవకాశం కల్పించనున్నారు.
మొత్తం 29 గంటల్లో
మొత్తంగా ఆగస్టు 11 నుంచి 15వ తేది వరకూ అంటే ఐదు రోజుల్లో మొత్తం 29 గంటల సమయం మాత్రమే శ్రీవారిని దర్శించడానికి అనుమతి ఉంటుంది. ఈ సమయంలో 15వేల మంది దర్శించుకోవచ్చు. కాబట్టి మీరు ఆ రోజుల్లో తిరుపతి ప్రయాణాన్ని పెట్టుకొని ఉంటే మాత్రం పునరాలోచించుకోండి.
*క్లుప్తంగా చెప్పాలంటే*
*_ఆలయంలో మరమ్మత్తు పనులను నిర్వహించడానికి నిర్దేశించిన కార్యక్రమమే మహా సంప్రోక్షణ. అయితే శ్రీవారి ఆలయంలోకి అర్చకులు, జీయ్యంగార్లు మినహా మరెవ్వరినీ అనుమతించరు._*
------------------------------
మహాసంప్రోక్షణం ఆరంభం
కుంభాల్లోకి ఆవాహనమైన దేవతామూర్తుల శక్తి
18 వేదికలపై కొలువుదీరిన కలశాలు
గర్భాలయంలో ఒక్కరిగా మిగిలిన శ్రీవారి మూలవిరాట్టు
యాగశాలలోనే సుప్రభాతం, ఏకాంత సేవలు
హుండీ ఆదాయం రూ.73 లక్షలకు పరిమితం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఉదయం 6 గంటలకు శ్రీవారి సన్నిధిలోని యాగశాలలో రుత్వికులు హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం చేపట్టారు. అంతకుముందు రుత్వికులు అర్చక భవనం నుంచి పసుపు వస్త్రాలు ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మరో 150 మంది వేద పండితులు కూడా మరో బృందంగా ఆలయ మర్యాదలతో వేంచేశారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య కళాకర్షణ కార్యక్రమంలో భాగంగా గర్భాలయంలోని శ్రీవారి మూలవర్లతో పాటు ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభాల(కలశాల)లోకి ఆవాహన చేశారు. వీటితో పాటు శ్రీభోగ శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి, శ్రీఉగ్రశ్రీనివాసమూర్తి, శ్రీచక్రత్తాళ్వారు, శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేశారు. ఉప ఆలయాల్లోని జయవిజయులు, ధ్వజస్తంభం, శ్రీవిష్వక్సేనుడు, శ్రీగరుడాళ్వారు, ప్రసాదం పోటు, లడ్డూ పోటులోని అమ్మవార్లు, శ్రీభాష్యకారులు, శ్రీయోగనరసింహస్వామి, శ్రీవేణుగోపాలస్వామి, శ్రీబేడి ఆంజనేయస్వామివారి శక్తిని కూడా కుంభాల్లోకి ఆవాహనచేసి యాగశాలకు తీసుకెళ్లారు. యాగశాలలో వెలసిన 18 వేదికలపై కుంభాలను కొలువుదీర్చారు.

తోమాలసేవ, నివేదనలు రెండుచోట్లా..
గర్భాలయంలోని శ్రీనివాసుని మూలవిరాట్టు చెంత నిత్యం ఉండే ఉత్సవమూర్తులు యాగశాలకు వేంచేపు చేశారు. ఇక శ్రీవారి మూలవిరాట్టు ఒక్కరే ఉన్నారు. యాగశాలలో మాత్రమే సుప్రభాతం, ఏకాంత సేవలు జరగనున్నాయి. తోమాలసేవతో పాటు నివేదనలు శ్రీవారి సన్నిధిలో మూలవిరాట్టుకు, యాగశాలలో ఉత్సవమూర్తులకు జరుగుతాయి.

సంప్రోక్షణ కోసం స్వర్ణ కూర్చ
శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్న మహాసంప్రోక్షణలో వినియోగించే స్వర్ణ కూర్చను తితిదే సిద్ధం చేసింది. 300 గ్రాముల బంగారంతో తయారు చేశారు. కూర్చలోకి మంత్రావాహన చేసి వైదిక క్రతువులకు ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తిని ఆవాహన చేసిన బంగారు కలశంతో పాటు ఈ స్వర్ణ కూర్చను యాగశాలలో ప్రతిష్ఠిస్తారు.
తక్కువగానే భక్తులు
తిరుమలలో యాత్రికుల రద్దీ తక్కువగానే ఉంది. శనివారం 33 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం రద్దీ అతి తక్కువగా ఉంది. ఉన్న కొద్ది మందికి కూడా వేచి ఉండే అవసరం లేకుండా ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం కొన్ని గంటల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేయాల్సి వచ్చింది. భక్తులరాక పలుచబడటంతో స్వామివారి హుండీ ఆదాయం కూడా తగ్గి ఆదివారం రూ.73 లక్షలకు పరిమితమైంది. సాధారణంగా రోజుకు సగటున రూ.3 కోట్ల ఆదాయం ఉండే విషయం తెలిసిందే.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment