Kalyanam Vybhogam Lyrical 
 Srinivasa Kalyanam Songs 
Nithiin, Raashi Khannam......more...

              రివ్యూ: శ్రీనివాస కళ్యాణంచిత్రం: శ్రీనివాస కళ్యాణం
నటీనటులు: నితిన్‌, రాశీఖన్నా, నందితా శ్వేత, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, రాజేంద్రప్రసాద్‌, నరేష్‌, సత్యం రాజేష్‌, ప్రవీణ్‌ తదితరులు
స‌ంగీతం: మిక్కీ జే మేయర్‌
ఛాయాగ్ర‌హ‌ణం: సమీర్‌రెడ్డి
కూర్పు: మధు
నిర్మాత: దిల్‌రాజు‌, శిరీష్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: సతీష్‌ వేగేశ్న
సంస్థ‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
విడుద‌ల‌: 09-08-2018

వరుస మాస్‌ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసి, ‘ఇష్క్‌’తో తన పంథాను మార్చుకున్న యువ కథానాయకుడు నితిన్‌. ఈ ఏడాది ‘ఛల్‌ మోహన్‌రంగా’ చిత్రంతో అలరించిన నితిన్‌..తాజాగా నటించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. కథల ఎంపికలో తనదైన ముద్రవేయడమే కాకుండా, కుటుంబ ప్రేక్షకులను సైతం థియేటర్లకు రప్పించగల నిర్మాత దిల్‌ రాజు. గతేడాది సతీష్‌ వేగేశ్నతో కలిసి ‘శతమానం భవతి’తో బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ అందించారు. ఇప్పుడు అదే దర్శకుడితో ‘శ్రీనివాస కళ్యాణం’ అంటూ మరోసారి కుటుంబ కథా నేపథ్యాన్నే ఎంచుకున్నారు. గత చిత్రంలో పండగ విశిష్టతను చెప్పిన దర్శకుడు, ఈసారి పెళ్లి ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశారు. మరి ‘శ్రీనివాస కళ్యాణం’ కమనీయంగా జరిగిందా? అతిథులుగా థియేటర్లకు విచ్చేసిన ప్రేక్షకులకు చిత్ర బృందం ఎలాంటి విందు భోజనాన్ని వడ్డించింది?

కథేంటంటే: విలువలు, కట్టుబాట్లు, సంప్రదాయాలకు పెద్ద పీట వేసే కుటుంబం నుంచి వచ్చిన యువకుడు శ్రీనివాస్‌(నితిన్‌). ప్రతి నిమిషాన్నీ డబ్బుతో కొలుస్తూ, వ్యాపారమే పరమావధిగా భావించే వ్యక్తి ఆర్కే(ప్రకాష్‌రాజ్‌). అతని కుమార్తె శ్రీదేవి(రాశీ ఖన్నా)ని చూసి ఇష్టపడతాడు శ్రీనివాస్‌. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లన్నా, పెళ్లి సంప్రదాయాలన్నా శ్రీనివాస్‌కు చాలా ఇష్టం. తన పెళ్లిని ఒక వేడుకలా చేసుకోవాలనుకుంటాడు. నాయనమ్మ(జయసుధ) కూడా తన మనవడి పెళ్లిని ఉత్సవంలా చేయాలని అనుకుంటుంది. అయితే, ఆర్కే మాత్రం సంప్రదాయాలకన్నా బిజినెస్‌కే ఎక్కువ విలువ ఇస్తాడు. మరి అలాంటి వ్యక్తి తన కూతురి ప్రేమకు విలువ ఇచ్చాడా? తన కుమార్తెను ఒక సంప్రదాయ కుటుంబంలోకి పంపించాడా? వీరిద్దరి పెళ్లి చేయడానికి అతను పెట్టిన షరతులేంటి? అనేదే కథ!ఎలా ఉందంటే: టైటిల్‌లోనే ఇది ఒక పెళ్లి నేపథ్యంలో సాగే కథ అని చెప్పేశారు. ఆచారాలు, కట్టుబాట్లు పెళ్లితంతు వీటి గురించి ఒక కథ చెప్పబోతున్నామని సినిమా రూపకర్తలు ముందే చెప్పేశారు. ఈ సినిమా దానికి తగ్గటుగానే ఉంది. ఒక్కసారిగా మనల్ని 20ఏళ్ల వెనక్కి తీసుకెళ్లాడు దర్శకుడు. అప్పట్లో తెలుగింటి పెళ్లిళ్లు ఘనంగా జరిగేవి. ఈరోజుల్లో పెళ్లి అంటే కేవలం ఒక కార్యక్రమంలా మారిపోయింది. అది కార్యక్రమం కాదు.. జీవితంలో వచ్చే ఒక మధురమైన జ్ఞాపకం అని చెప్పే ప్రయత్నం చేశాడు. ‘శతమానంభవతి’లో ఇంటిల్లిపాదీని ఆకట్టుకునేలా, వారిని థియేటర్‌లో కూర్చోబెట్టే కథాంశాన్ని ఎంచుకున్నాడు. పండగ విశిష్టతను చెబుతూ అలరించాడు. ఇందులో అదే కుటుంబ నేపథ్యాన్ని ఎంచుకుని పెళ్లి విశిష్టతను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

అటు ఆర్కే, ఇటు శ్రీనివాస్‌‌ పాత్రల చిత్రీకరణ రెండింటినీ సమాంతరంగా చూపిస్తూ, వాళ్ల అభిరుచులకు, అభిప్రాయాలకు, పెళ్లికి వాళ్లు ఇచ్చే విలువలకు, కథను ముడిపెట్టిన ఫీల్‌ నచ్చుతుంది. పెళ్లికి ముందే విడాకుల అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకోవడం ఒక కొత్త రకమైన ఆలోచన అనుకోవచ్చు. తొలి భాగంలో కథానాయకుడి పాత్రను చూపిస్తూ, సరదా సన్నివేశాలను రాసుకొంటూ కథానాయికతో ప్రేమ వ్యవహారాన్ని ముడిపెడుతూ సాగిపోయింది. ఇక ద్వితీయార్ధం పూర్తిగా పల్లెటూరికి వెళ్లిపోతుంది. పెళ్లి ఇంట జరిగే రకరకాల తంతును కథానుగుణంగా పూసగుచ్చినట్టు చెప్పారు. దాంతో ప్రేక్షకుడికి ఒక పెళ్లింట్లో కూర్చొన్న అనుభూతి కలుగుతుంది. పతాక సన్నివేశాల్లో ఏం జరగబోతోందో ప్రేక్షకుడు ముందే ఊహిస్తాడు. అయితే, అక్కడ కూడా ఎమోషన్స్‌కు పెద్ద పీట వేయడంతో కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా సినిమా నిలుస్తుంది. అయితే, చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పడం, కథానాయకుడి పాత్ర చిత్రణ, అతి సంభాషణలు, సందేశాలకు పరిమితం కావడం, కొన్ని చోట్ల కేవలం డైలాగ్‌ల కోసం సన్నివేశాలు రాసుకోవడం, ఎమోషన్స్‌ కథలో అంతర్లీనంగా కాకుండా పైపైనే అంటీ ముట్టన్నట్లు చిత్రించడం కాస్త ప్రతికూలాంశాలుగా కనిపిస్తాయి.ఎవరెలా చేశారంటే: నితిన్‌కు అండర్‌ప్లే చేసే పాత్ర దొరకడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. రాముడు మంచి బాలుడు తరహాగా కనిపిస్తాడు. దాంతో అతనిలో ఉన్న సహజసిద్ధమైన ఎనర్జీ మిస్‌ అయినట్లు అనిపిస్తుంది. ఈ కథలో ఎక్కడా నితిన్‌ను ఒక హీరోగా చూడలేం. కేవలం ఒక పాత్రగా పరిగణిస్తాం. ఇలాంటి పాత్ర ఒప్పుకోవడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. రాశీఖన్నాది ముఖ్యమైన పాత్ర అయినప్పటికీ తనని సరిగా ఉపయోగించుకోలేదేమోననిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో ఆశ్చర్యపోయినట్లు కనిపిస్తుంది. ప్రకాష్‌రాజ్‌ మరోసారి కీలకమైన పాత్ర పోషించాడు. ఆ పాత్ర ప్రవర్తించే తీరు, వినోదాన్ని పంచితే, అందులో పరివర్తన ఈ కథకు ఎమోషన్‌ జోడించింది. జయసుధ, రాజేంద్రప్రసాద్‌, నరేష్‌, సత్యం రాజేష్‌, ప్రవీణ్‌ వీళ్లందరివీ కేవలం సహాయ పాత్రలే.

మిక్కీ జే మేయర్‌ పాటలు వింటుంటే పాతట్యూన్లు గుర్తొస్తాయి. ‘కల్యాణం.. వైభోగం..’ పాట మాత్రం ఆకట్టుకుంది. పల్లెటూరి నేపథ్యంలో తీసిన సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. దాంతో వెండితెర ఆహ్లాదంగా మారుతుంది. సతీశ్‌ వేగేశ్న చెప్పాలనుకున్న విషయం చాలా మంచిది. ఈతరం తెలుసుకోవాల్సింది. అయితే, దాన్ని కథలో అంతర్లీనంగా కాకుండా కాస్త బలవంతంగా రుద్ది చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. సీరియల్‌ తరహాలో సాగే కొన్ని సన్నివేశాలు, ఈ కథలోని వేగాన్ని అందుకోలేపోయాయి. సంభాషణల్లో బలం ఉన్నప్పటికీ సన్నివేశాలు తేలిపోవడంతో వాటిలో ఉన్న పదును పూర్తిగా బయటకు రాలేదు.బలాలు
+ కుటుంబ ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాలు
+ పెళ్లి నేపథ్యం
+ నటీనటులు
+ పెళ్లి పాట

బలహీనతలు
- పండని భావోద్వేగాలు
- బలవంతంగా ఇరికించిన క్లైమాక్స్‌

చివరిగా: శ్రీనివాస కళ్యాణానికి కుటుంబ సమేతంగా వెళ్లొచ్చు.

గమనిక: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే                                                                                                                                                                     Kalyanam Vybhogam Lyrical,  Srinivasa Kalyanam Songs,  Nithiin, Raashi Khannam, Srinivasa Kalyanam, SrinivasaKalyanam, Srinivasa Kalyanam, First LookSrinivasaKalyanam Teaser, Srinivasa Kalyanam Movie Teaser, Srinivasa Kalyanam Trailer, SrinivasaKalyanam Movie Trailer, Nithin, Srinivasa Kalyanam, Nithin, Raashi Khanna, Dil Raju, Vegesna SatishLatest Movie Trailers, Latest Movie Teaser, Latest Movie Teaser 2018, Latest Movie Trailer 2018, Srinivasa Kalyanam Songs, Srinivasa Kalyanam Jukebox, Srinivasa Kalyanam Videos,  Sri Rama Navami Songs


రుక్మిణి కల్యాణము 
Rukmini Kalyanam 
-Dr. Adipudi Venkata Siva Sairam
Pages: 40 - Rs 25/-
1. ముందుగా శ్రీకృష్ణుని నిత్యపూజచేసి రుక్మిణీ కళ్యాణం పారాయణం ప్రారంభించాలి.

2. శ్రీకృష్ణ నిత్యపూజ చేయలేని వారు కనీసం కృష్ణ అష్టోత్తరము మరియు కృష్ణాష్టకము ఖచ్చితముగా చదవాలి. 

3. మీ జన్మనక్షత్రము రోజుగాని, లేదా నామనక్షత్రము రోజుగాని పారాయణ ప్రారంభించండి. 

4. వీలయినంతవరకు శుక్రవారం, గురువారాలలో పారాయణ ప్రారంభించండి. 

మీకు వివాహము నిశ్చయము కాగానే ఎనిమిదిమంది కన్యలను పిలిచి (శ్రీకృష్ణుని అష్టభార్యలుగా భావించి) చందన తాంబూలములతో రుక్మిణీ కళ్యాణం అను పుస్తకమును దానముగా ఇవ్వండి శ్రీకృష్ణుని అనుగ్రహం ఖచ్చితముగా లభిస్తుంది.

Kalyanam Vybhogam Lyrical,  Srinivasa Kalyanam Songs,  Nithiin, Raashi Khannam, Srinivasa Kalyanam, SrinivasaKalyanam, Srinivasa Kalyanam, First LookSrinivasaKalyanam Teaser, Srinivasa Kalyanam Movie Teaser, Srinivasa Kalyanam Trailer, SrinivasaKalyanam Movie Trailer, Nithin, Srinivasa Kalyanam, Nithin, Raashi Khanna, Dil Raju, Vegesna SatishLatest Movie Trailers, Latest Movie Teaser, Latest Movie Teaser 2018, Latest Movie Trailer 2018, Srinivasa Kalyanam Songs, Srinivasa Kalyanam Jukebox, Srinivasa Kalyanam Videos,  Sri Rama Navami Songs

Rs 25/-
శివపార్వతుల వివాహం జగత్ కల్యాణమే

పరమేశ్వరుని పతిగా పొందిన సతి అన్యోన్యానురాగాలతో పరమశివుణ్ణి సేవించసాగింది. సతి తండ్రి యైన దక్షుడు ఒకానొక కాలంలో అహంకారానికి వశమైనాడు. శివదూషణ చేయడానికి వశుడయ్యాడు. ఆ క్రమంలోనే తాను తలపెట్టిన యజ్ఞానికి శివుని పిలవకూడదని నిశ్చయించుకున్నాడు. తన పుత్రిక పై కూడా మమకారాన్ని వదిలివేసుకొని శివునికి ఆహ్వానం అందించకుండానే యజ్ఞాన్ని తలపెట్టాడు. సర్వలోకాలు దక్షయజ్ఞం గురించి మాట్లాడుకొంటున్నా తమకు ఆహ్వానం పలుకరేమని సతి వాపోయింది. చివరకు యజ్ఞసమయం దాకా చూచి తన తండ్రినే గదా పిలువకపోయినా ఫర్వాలేదు వెళ్లి ఆ యజ్ఞసంబరాన్ని చూచి వస్తానని తన పతితో చెప్పింది. పిలవని పేరంటం తగదు అని ఆదిభిక్షువు చెప్పాడు. కాని పతి మాట వినక సతి దక్షయజ్ఞానికి వెళ్లింది.

అక్కడ తన తండ్రి చేసే శివదూషణను వినలేకపోయింది. శివనింద విన్న ఈ శరీరం తనకు అక్కర్లేదని ఆ యజ్ఞకుండంలోనే సతి శరీరత్యాగం చేసింది. ఈ సంగతి విన్న శివుడు రుద్రుడయ్యాడు. ప్రళయాగ్నిలాగా మారాడు. శివగణం తరలివెళ్లింది. దక్షుని తల తెగింది. అతని అహంకారం నశించింది. చివరకు దక్షుడు శివ శరణం చేశాడు. అపార కృపావత్సలుడైన శివుని అనుగ్రహంతో మేకతలను దక్షునికి అమర్చారు. శరీర త్యాగం చేసిన సతిని భుజాన వేసుకొని ప్రళయకాల రుద్రుడైన పరమశివుడు శివతాండవం చేశాడు. తపోవనాలకు వెళ్లిపోయాడు. ధ్యానమగ్నుడయ్యాడు.

సతి మేనకా హిమవంతుల ఇంట ముద్దులోలికే చిన్నారిగా మారింది. ఉమ నామంతో వ్యవహరించబడింది. చిన్ననాటినుంచే శివధ్యానంతో తన్మయత్వం చెందేది. యుక్తవయస్సురాగానే తాను పరమేశ్వరుని ఇల్లాలు కావాలని తపస్సు చేయడానికై తల్లిదండ్రులనుంచి అనుమతి కోరింది. ఆ తల్లి అపర్ణయై పంచాగ్నుల మధ్య తీక్షణమైన తపస్సు చేసింది.
ఈ సంగతి తెలిసిన శివుడు మాయా బ్రహ్మచారి వేషం వేసుకొని అక్కడకు వచ్చాడు. తన చెలులతో సాయంతో తపస్సు చేసుకొంటున్న గిరిజను చూచాడు. విశ్రాంతి పేరిట ఉమాశ్రమంలో అడుగుపెట్టాడు. తన చెలులతో ఆ మాయాబ్రహ్మచారికి మేనక సుత ఆతిధ్యమిచ్చింది. కఠినమైన తపస్సుకు కారణమేమిటని మాటలను కలిపాడు మాయావటువు. చెలికత్తెలే ఆ బ్రహ్మచారికి ఉమ తరఫున బదులిచ్చారు. తాను బ్రహ్మచారినే కనుక వివాహేచ్ఛతో తపస్సుకు పూనుకొని ఉంటే ఉమాదేవికి అంగీకారమైతే వివాహానికి అడ్డు ఉండబోదని చెప్పాడు.

కేవలం పరమశివుని కోరి తపస్సుకు ఉపక్రమించిదని తెలుసుకున్న బ్రహ్మచారి ఆ శివుని దగ్గర ఏముంది బూడిద తప్ప. ఈ దేవిని చూస్తేనేమో పట్టుపీతాంబరాలుకట్టుకునే సుకుమారిగా ఉంది. పైగా పర్వతరాజ పుత్రిక పార్వతి ఎన్నో ఆభరణాలను దిగవేసుకొనే నైపుణ్యానికి తగిన అవయవ సౌందర్యం కలది. కాని. అక్కడ శివుని దగ్గర బుసలు కొట్టే పాములు, గాడ్రించే పులితోలు, పైగా శివుని చేతిలో త్రిశూలం అన్నీ భయంకరాలే పైగా శ్మశాన నివాసి ఎద్దు నెక్కి తిరుగువాడు ఇటువంటివాడిని కోరి మరీ తపస్సు చేయడం అవివేకమైన పనికదా. దానికి బదులుగా తన్ను వివాహమాడితే ఎంతో సుందరంగా వుంటుందని చెప్పే మాయాబ్రహ్మచారిని ఉరిమి చూస్తూ తన చెలులతో బయటకు పంపించివేయమంది ఆ పార్వతి.

శివునిపై గాఢమైన అనురాగాన్ని పెంచుకుంటున్న గౌరిని చూచి మందహాసం చేస్తూ తన అసలు స్వరూపాన్ని చూపాడు పరమశివుడు. అమితానంద భరితయైన పార్వతి తన తండ్రియైన హిమవంతుని అనుమతి తీసుకొని తన్ను వివాహం చేసుకోవడానికి మార్గం సులువు చేసుకోమని చెప్పే హితబోధను విన్న పరమశివుడు హిమవంతుని దగ్గరకు కబురు పంపాలనుకొన్నాడు.

విషయం తెలుసుకున్న దేవగణమంతా తరలివచ్చింది. హిమవంతుని దగ్గరకు వెళ్లి పెళ్లిమాటలు మాట్లాడారు. పార్వతీ పరమేశ్వరుల వివాహానికి శ్రీకారం చుట్టారు. బ్రహ్మాది దేవతలంతాకలసి పార్వతీ పరమేశ్వరులకు వివాహాన్ని చేశారు. సకలలోకాలు ఆనందించాయి. తారకాసుర భంజనం జరిగి తీరుతుందని శివకుమారుడు ఉద్భవిస్తాడని అంతా శుభాలు జరుగుతాయని సర్వులూ శుభాలు పలికారు. - చోడిశెట్టి
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment