షేర్‌ శివాజీ  | Shivaji | Maharashtra | JaiMaharashtra | Chatrapathi Sivaji | Sivaji Maharaj | Raigad | Bijapur | Maratha Empire | Marathi | Shivaji Bhonsle | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti

ప్రభుత్వమే నిర్మాతగా మారి..!

    సాధారణంగా తాము చేపట్టిన కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడానికి తప్ప ఏ ప్రభుత్వమూ డబ్బు ఖర్చు చేయదు. తమ ప్రచారం కోసం పత్రికలకు, టెలివిజన్లకు కోట్ల రూపాయాలను కుమ్మరిస్తాయి. పాతికేళ్ల కిందట మహారాష్ట్ర ప్రభుత్వం తానే చిత్ర నిర్మాతగా మారి, ఒక సినిమా తీసింది. దాని పేరు ‘షేర్‌ శివాజీ ’. హిందీ, ఇంగ్లీషు భాషల్లో భారీగా నిర్మించారు. పెద్ద టెక్నీషియన్లు పనిచేశారు. పరీక్షిత్‌ సహాని శివాజీగా నటించాడు. అబ్బాస్‌ హిందీ సంభాషణలు రాశారు. హృషీకేశ్‌ ముఖర్జీ ఎడిటరు. రామ్‌ గబానే దర్శకుడు. జి.బాలకృష్ణ ఛాయాగ్రహకుడు. ఆ సినిమా అనుకున్ననాటికి పూర్తయింది. విడుదలై విజయం కూడా సాధించింది. ప్రభుత్వ ఖజానాకి సొత్తు చేరింది.

‘‘రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదువా’’ అన్నట్లు ప్రభుత్వమే చేపడితే ఏది లభించదు? ఒక షాట్‌లో పెద్ద నిచ్చెన అవసరమైందిట. ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ దగ్గర్నుంచి దాన్ని తీసుకొచ్చారు. అదే మామూలు నిర్మాత అడిగితే వస్తుందా? స్థలాలకి అనుమతులు లభించడంలో, యుద్ధాల్లో గుర్రాన్ని తేవడంలో అన్నింటికీ సానుకూలత లభించింది. ‘ఇలా ప్రతి రాష్ట్ర ప్రభుత్వమూ వారి రాష్ట్రంలోని ప్రముఖుడి గురించి చిత్రం తియ్యవచ్చు కదా! ప్రభుత్వ సహకారం అన్నింటా ఉంటే మంచి చిత్రం వస్తుంది కదా’ అని అనుకున్నారు. మరి ప్రస్తుతం తెరకెక్కుతున్న కొన్ని బయోపిక్‌లకు ప్రభుత్వం నుంచి ఏమేర సహాయం అందుతుందో చూడాలి!
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment