Business Today 10 mins ·  #RelianceJio announces optical fiber-based, fixed line broadband called #JioGigaFiber; #JioPhone2 with Blackberry-like design, advanced feature launched at Rs 2,999 and #XioamiMiA2 spotted with all 'About Phone' information. Watch more in this episode of Daily Tech Wrap with Danny D'Cruze. #TechnologyNews #BusinessTodayVideo






జియో.. మీ జీవిత భాగస్వామి! 
ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఆవిష్కరణ 
ఆగస్టు 15 నుంచి నమోదు 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పుట్టుకే ఓ సంచలనం. 
చిన్న పాయలా మొదలైన ఆ కంపెనీ ఇపుడు ఓ మహా సముద్రం. 
చేయని వ్యాపారం లేదు.. కళ్లజూడని లాభాలు లేవు. 
జియోతో ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ ఇవ్వడం తనకే చెల్లింది. 
ఇక డేటా కూడా అత్యంత చౌకగా ఇవ్వడమూ చూశాం. 
ఇపుడు ప్రపంచంలోనే డేటా వినియోగంలో అగ్రగామి భారతే. 
ఇదంతా ప్రస్తుతం.. భవిష్యత్‌ విషయానికొస్తే.. 
ఇంటింటికీ అత్యధిక వేగంతో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను తీసుకొస్తాం. 
అమెజాన్‌ వంటి ఇ-కామర్స్‌ దిగ్గజాలకు పోటీనిస్తాం. 
2025 కల్లా 125 బిలియన్‌ డాలర్ల కంపెనీగా మారుస్తాం. 
ఇవీ.. గురువారం ముంబయిలో జరిగిన రిలయన్స్‌ వార్షిక సాధారణ సమావేశంలో ముకేశ్‌ అంబానీ వాటాదార్లకిచ్చిన హామీలు. 

ఇవి అమల్లోకి వస్తే.. ఇంటింటిలో రిలయన్స్‌ ఉండబోతున్నట్లే లెక్క.
41వ వార్షిక సాధారణ సమావేశం‘‘మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ముందుకు పరుగులు తీశాం. కానీ ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విషయంలో భారత్‌ ఇంకా 134వ స్థానంలో ఉంది. అత్యంత బలహీనమైన నెట్‌వర్క్‌ ఇందుకు కీలక కారణం. దాన్ని మేం అధిగమిస్తాం. ఇక కొత్త ‘మాన్‌సూన్‌ హంగామా’ ఆఫర్‌ కింద పాత జియోఫోన్‌ను ఇచ్చి రూ.501కే కొత్త జియోఫోన్‌ను పొందొచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్‌ డేటా నెట్‌వర్క్‌గా భారత్‌ మారడానికి జియోనే కారణం. నెలకు 240 కోట్ల జీబీ వినియోగం అవుతోందిపుడు. రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపారానికి మరింత చేయూతనిచ్చే విధంగా ఆన్‌లైన్‌ - టు - ఆఫ్‌లైన్‌ ఇ-కామర్స్‌ సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. జియోకున్న డిజిటల్‌ మౌలిక వసతులు, సేవల బలాల వల్ల రిలయన్స్‌ రిటైల్‌కు బలమైన మార్కెట్‌ స్థానం లభిస్తుంది. 2025 కల్లా రిలయన్స్‌ తన పరిమాణాన్ని రెట్టింపు చేసుకుంటుంది. రిలయన్స్‌ రిటైల్‌ గతేడాదిలో 35 కోట్ల మంది వినియోగదార్లను ఆకర్షించింది. 7500 స్టోర్లతో దేశంలోని అతిపెద్ద రిటైల్‌ సంస్థగా మారింది. అది మరింత వృద్ధి చెందుతుంది. ఇక సంప్రదాయ వ్యాపారమైన పెట్రోరసాయనాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పారాక్సిలీన్‌ కాంప్లెక్స్‌, పెట్‌కోక్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్ట్‌, ఆఫ్‌-గ్యాస్‌ క్రాకర్‌ ఏర్పాటుపై పెడుతున్న పెట్టుబడులు చివరి దశలో ఉన్నాయి. పెట్రోరసాయనాలకున్న గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ‘చమురు నుంచి రసాయనాల’ మార్పిడి కీలక పాత్ర పోషించనుంది. మేం దీన్ని మరింత బలోపేతం చేస్తాం.
- రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ

1ప్రపంచంలోనే అతిపెద్ద కొత్త ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఆవిష్కారం ఇదే. 1100దేశవ్యాప్తంగా ఒకేసారి 
1100 నగరాల్లో ఈ సేవలు 
ప్రారంభమవుతాయి. ఇప్పటికే కసరత్తు మొదలైంది.
ఆగస్టు 
15జియోగిగాఫైబర్‌ కోసం వచ్చే నెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. మొదటగా ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగిన ప్రాంతాల్లో ఈ సేవలను అందిస్తారు. మైజియో లేదా జియో.కామ్‌ ద్వారా ఈ రిజిస్ట్రేషన్లను చేసుకోవచ్చు. టీవీ ద్వారా ఫోనుజియోగిగా హోమ్స్‌ బ్రాండ్‌ కింద టీవీ కోసం సెట్‌టాప్‌ బాక్స్‌తో పాటు.. సెక్యూరిటీ కెమేరాలు, డోర్‌ సెన్సార్లు కూడా అందిస్తారు. దీని ద్వారా వినియోగదార్లు తమ ఇంటిని ‘స్మార్ట్‌’గా మార్చుకోవచ్చు. సెట్‌టాప్‌ బాక్స్‌ వల్ల టీవీలను వీడియో కాలింగ్‌కు ఉపయోగించుకోవచ్చు. పెద్ద కంపెనీలతో పాటు.. చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎస్‌ఎమ్‌ఈ)లకు సైతం ఈ జియోగిగా బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తుంది.



చాలా తక్కువ సమయంలోనే 10 కోట్ల మంది జియోఫోన్‌ వినియోగదార్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అత్యంత ప్రజాదరణ ఉన్న ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూ ట్యూబ్‌లను జియో ఫోన్‌లో తీసుకొస్తున్నాం. మీ ఇంట్లో గోడ గోడకూ వై-ఫై కవరేజీ ఉంటుంది. ప్రతీ గృహోపకరణం, ప్లగ్‌ పాయింట్లు, స్విచ్‌లు సైతం స్మార్ట్‌గా మారిపోతాయి. ప్రతీ క్షణం భద్రతనందించే కెమేరాలు మీకుంటాయి. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు(అలర్ట్‌లు) మీకు అందిస్తుంటాయి.
- ఈశా అంబానీ, ఆకాశ్‌ అంబానీ

జియో ఫోన్‌2 
ధర రూ.2999గతేడాది ఏజీఎమ్‌లో జియోఫోన్‌ తీసుకొచ్చిన రిలయన్స్‌ జియో దానికి కొనసాగింపుగా జియోఫోన్‌ 2ను గురువారం ఆవిష్కరించింది. ముకేశ్‌ కవల సోదరీసోదరులైన ఈశా, ఆకాశ్‌ల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఫోన్‌ ధర రూ.2999. అయితే జులై 21 నుంచి మొదలయ్యే ‘మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌’ కింద పాత జియోఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ కింద ఇచ్చి కొత్త జియోఫోన్‌ 2ను రూ.501 చెల్లించి తీసుకోవచ్చు. గతేడాది జియోఫోన్‌ను రూ.1500కు కంపెనీ తీసుకొచ్చింది. మూడేళ్ల తర్వాత హ్యాండ్‌సెట్‌ను వెనక్కి ఇస్తే ఆ రూ.1500ను కంపెనీ తిరిగి చెల్లిస్తామని వాగ్దానం చేసింది. అయితే ప్రతీ ఏడాది కనీసం రూ.1500 రీఛార్జ్‌లు చేయించుకోవాల్సి ఉంటుంది. 

‘జియోఫోన్‌ 2’ ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మాట్లాడుతూ ‘ప్రస్తుతం భారత్‌లో 2.5 కోట్ల జియోఫోన్‌ వినియోగదార్లున్నారు. రిలయన్స్‌ జియోకు 21.5 కోట్ల మంది వినియోగదార్లున్నారు. ప్రపంచంలోనే ఏ కంపెనీ కూడా సేవలు మొదలుపెట్టిన 22 నెలల్లో 21.5 కోట్ల మంది వినియోగదార్లను సాధించలేద’ని పేర్కొన్నారు. ఇప్పటికే డిజిటల్‌ మౌలిక వసతులపై మేం రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామని ఆయన వివరించారు.ఇవీ ప్రత్యేకతలు* జియోఫోన్‌ 2 అవడానికి ఫీచర్‌ ఫోన్‌ అయినా.. స్మార్ట్‌ఫోన్‌కున్న సదుపాయాలున్నాయి. ఫేస్‌బుక్‌, యూ ట్యూబ్‌, వాట్సాప్‌లను ఆగస్టు 15 నుంచి పొందవచ్చు. ప్రస్తుత ఫోన్లో ఈ అప్లికేషన్లు లేవు. 

* కాయ్‌ఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 512 ఎమ్‌బీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉన్నాయి. ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు మెమొరీని పెంచుకోవచ్చు. 
* వెనక 2 మెగాపిక్సల్‌ కెమేరా, ముందు వీజీఏ కెమేరాలున్నాయి. 
* క్వెర్టీ కీ ప్యాడ్‌, డ్యూయల్‌ సిమ్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో ఎల్‌టీఈ, వీఓఎల్‌టీఈ, వీఓవై-ఫై సదుపాయాలున్నాయి. ఎఫ్‌ఎమ్‌, బ్లూటూత్‌, జీపీఎస్‌, వై-ఫై, ఎన్‌ఎఫ్‌సీలకూ ఉపయోగపడుతుంది.

1100 నగరాల్లో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌జియో సేవలతో ఊహకందని రీతిలో మొబైల్‌ వినియోగదార్లను పెంచుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. మరో డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇపుడు ప్రతీ ఇంట్లోకి రానుంది. అత్యంత వేగంతో ఫిక్స్‌డ్‌ లైన్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను ఇళ్లకు, కంపెనీలకు అందివ్వాలని భావిస్తోంది. ముకేశ్‌ అంబానీ గారాలపట్టి ఈశా అంబానీ గురువారమిక్కడ జరిగిన కంపెనీ 41వ వార్షిక సాధారణ సమావేశంలో ‘జియో గిగాఫైబర్‌’ సేవలను ఆవిష్కరించారు. ‘జియో గిగాఫైబర్‌’ కోసం ఆగస్టు 15 నుంచి వినియోగదార్లు నమోదు చేసుకోవచ్చు. సేవలు ఎప్పటి నుంచి మొదలయ్యేదీ ఇంకా చెప్పనప్పటికీ.. ఈ సేవలు మాత్రం ఇంటి రూపును మార్చనున్నాయి. 

ఎన్ని సదుపాయాలో: ఫైబర్‌ టు ద హోమ్‌(ఎఫ్‌టీటీహెచ్‌) సాంకేతికత ఆధారంగా ఇచ్చే ఈ జియోగిగాఫైబర్‌ ద్వారా అత్యధిక వేగంతో ఇంటర్నెట్‌; పెద్ద తెరలుండే టీవీలపై అల్ట్రా హై డెఫినిషన్‌ వినోదం; మల్టీ పార్టీ వీడియో కాన్ఫరెన్సులు, వాయిస్‌ యాక్టివేటెడ్‌ వర్చువల్‌ అసిస్టెన్స్‌, వర్చువల్‌ రియాల్టీ గేమింగ్‌, డిజిటల్‌ షాపింగ్‌, స్మార్ట్‌ హోమ్‌ సొల్యూషన్స్‌.. ఇలా ఎన్నో సదుపాయాలను కంపెనీ అందివ్వనుంది. అంటే ఈ బ్రాడ్‌బ్రాండ్‌ ద్వారా వేగవంతమైన అప్‌లోడ్‌, డౌన్‌లోడ్లు ఉంటాయి. సెకనులో పదో వంతులో ఎన్నో పనులు చేసుకోవచ్చు. ఇక గిగాఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌తో ఒక సెట్‌-టాప్‌ బాక్స్‌ను కూడా ఇస్తారు. దీని వల్ల మనం టీవీని మాటతో(వాయిస్‌ కమాండ్‌ ఫీచర్‌ ద్వారా) నడిపించవచ్చు. అదే విధంగా టీవీ ద్వారా కాల్స్‌ కూడా చేసుకోవచ్చు.

ఇంటిలోకి ఫైబర్‌: చాలా వరకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ బిల్డింగ్‌ వరకు మాత్రమే వస్తాయి. ఆ తర్వాత సంప్రదాయ కేబుల్‌ ద్వారా ఇంటింటికి అనుసంధానం చేసుకోవాలి. దీని వల్ల ఇంటర్నెట్‌ వేగం చాలా తగ్గుతుంది. అయితే జియో గిగాఫైబర్‌ మాత్రం ఎఫ్‌టీటీహెచ్‌ పరిజ్ఞానం కారణంగా నేరుగా ఇంట్లోకి వస్తుంది. దీని వల్ల వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వేల కొద్దీ ఇళ్లలో ప్రయోగాత్మక పరీక్షలు జరుగుతున్నాయి.

రేటు తెలియదు కానీ: ప్రస్తుతానికి సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్నది బయటకు వెల్లడి కాలేదు. అదే విధంగా ఎంత టారిఫ్‌ ఉంటుందన్నదీ తెలియదు. అయితే కనీసం 100 ఎమ్‌బీపీఎస్‌ వేగంతో వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ను రిలయన్స్‌ ఆఫర్‌ చేసే అవకాశం ఉంది.

ప్రభావం ఎంత ఉండొచ్చంటే: ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎఫ్‌టీటీహెచ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ పథకాలను కోల్‌కతా, చెన్నైలలో అందిస్తోంది. అయితే జియో భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా ఈ సేవలను అందించనుంది. ఇప్పటికే పలు నగరాల్లో పైలట్‌ ప్రాజెక్టులు కూడా చేస్తోంది. జియో తీసుకొచ్చే ఈ ఎఫ్‌టీటీహెచ్‌ సేవల వల్ల వెంటనే గృహ బ్రాడ్‌బ్యాండ్‌ ధరలు తగ్గుముఖం పడతాయి. ఎయిర్‌టెల్‌, యాక్ట్‌ వంటివి తమ ధరలను తగ్గించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుత 4జీ పథకాలను ఈ బ్రాడ్‌బ్యాండ్‌తో కలిపి అందించే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద మొబైల్‌ సేవల మార్కెట్‌పైనా దీని ప్రభావం పడుతుంది. కాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ మాట్లాడుతూ ‘మొబైల్‌ టెలిఫోన్‌ మార్కెట్లో జియో తీసుకొచ్చినంత ఒత్తిడి తాజా బ్రాడ్‌బ్యాండ్‌ విషయంలో తీసుకురాకపోవచ్చ’ని అభిప్రాయపడ్డారు.


















ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment