ఒక యోగి ఆత్మ కథ | Oka Yogi Atma Katha | Autobiography of a Yogi (Telugu) Oka Yogi Atma Katha Paramahamsa Yogananda Self Published ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద సెల్ఫ్ పబ్లిష్డ్ History Biography హిస్టరీ చరిత్ర Charithra స్వీయచరిత్రలు Sweeyacharitra Autobiography జీవిత చరిత్రలు Jeevithacharitra| GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu  Autobiography of a Yogi  (Telugu, Paperback, Paramahansa Yogananda)
ఒక యోగి ఆత్మకథ

Oka Yogi Atma Katha

Rs 175/-    

    మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. అన్ని భావోద్వేగాలూ మన శరీరంలో, మనసులో ప్రతిఫలిస్తాయి. అసూయ, భయం కారణంగా ముఖం కళావిహీనం అవుతుంది. ప్రేమ దాన్ని ప్రకాశించేలా చేస్తుంది.  - పరమహంస యోగానంద
 
ఆత్మపరిశీలన ఎందుకు!
       ఒక యోగి ఆత్మకథ! ఈ పేరు వినగానే దాని రచయిత పరమహంస యోగానంద కూడా స్ఫురిస్తారు. స్వామి వివేకానంద తరువాత, పాశ్చాత్య దేశాలలో భారతీయ సంస్కృతికి మరింత గౌరవాన్ని ఇనుమడింపచేసిన వ్యక్తి యోగానంద. చిన్నప్పటి నుంచి అలౌకికమైన సంపద కోసం, అంతులేని ప్రశాంతత కోసం తపించినవారు. తన గురువు స్వామి యుక్తేశ్వర్‌ను కలుసుకున్నాక కానీ ఆయన వెతుకులాట ఓ కొలిక్కి రాలేదు. ఈ మధ్యలో ఎందరో సాధువులు, మర్మయోగులు ఆయనకు తారసిల్లారు. అలాంటి ఒక సందర్భంలో కోల్‌కతాలోని కాళీఘాట్‌లో ఆయనను ఓ సాధువు కలిశారు. ఆ సమయంలో యోగానందతో సాధువు అన్న కొన్ని మాటలు చాలా విలువైనవిగా అనిపిస్తాయి. అవేమిటంటే...

‘నేను చాలాకాలం చిత్తశుద్ధిగా అంతఃపరిశీలనను అభ్యసించాను; జ్ఞానార్జనకు అత్యంత బాధాకరమైన మార్గమిది. ఆత్మ పరీక్ష చేసుకోవడం, తన ఆలోచనలను నిర్విరామంగా పరిశీలన చేసుకోవడం కఠోరమైన విదారక అనుభవం. అత్యంత ప్రబలమైన అహంకారాన్ని సైతం అది నుగ్గు చేస్తుంది...’

‘మనిషి బడాయిల్లోంచి బయటపడేవరకు శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోలేడు. అనేక శతాబ్దాలుగా పంకిలమైన ఉన్న మానవ మనస్సు లెక్కలేనన్ని ప్రపంచమాయలతో కూడిన దుర్భర జీవితాన్ని సృష్టిస్తోంది. మనిషి మొదట, తనలోని శత్రువులతో జరిపే పెనుగులాట ముందు, యుద్ధభూమిలో జరిగే పోరాటాలు తీసికట్టే అనిపిస్తాయి!’

‘సంకుచితమైన తన కష్టంలోనే మునిగిపోయి, ఇతరుల జీవితాల్లోని దుఃఖాలకు స్పందించే శక్తిని కోల్పోయినవాడు లోతులేని మనిషి. శస్త్రంతో మాదిరిగా సునిశితంగా ఆత్మపరిశీలనను అభ్యసించినవాడు, మొత్తం మానవాళి పట్ల జాలి పెరుగుతూ ఉండటం గమనిస్తాడు. చెవులు ఊదరగొడుతూ, అధికార పూర్వకంగా అహంకారం వెల్లడించే కోరికల నుంచి అతనికి విముక్తి కలుగుతుంది,’ ఈ మాటలు చెబుతూ తరతరాల ఆధ్మాత్మిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకోమని యోగానందను దీవిస్తూ ఆ సాధువు తన దారిన సాగిపోయాడు. కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం యోగానంద మీద తీవ్ర ప్రభావం చూపాయి. తరువాతి కాలంలో మార్గదర్శకంగా నిలిచాయి.
------------------- 

ఒక యోగి ఆత్మకథ ప్రముఖ భారతీయ యోగి పరమహంస యోగానంద రచించిన సంచలన ఆధ్యాత్మిక రచన. ఇందులో ఆయన ఆత్మకథను పొందుపరిచాడు. ఈ పుస్తకం ఎంతో మంది విదేశీయులకు యోగాను, ధ్యానాన్ని పరిచయం చేసింది. ఇప్పటి దాకా దాదాపు 25 భాషల్లోకి అనువదించబడింది. ఆయన రచించిన పుస్తకాలన్నింటిలో ఈ పుస్తకం ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

ఈ పుస్తకంలో ప్రధానంగా యోగానంద తన గురువు కోసం అన్వేషణ, ఆ ప్రయత్నంలో భాగంగా ఆయనకు ఎదురైన ఆధ్యాత్మిక అనుభవాలు, అప్పట్లో పేరు గాంచిన ఆధ్యాత్మిక వేత్తలైన థెరెసా న్యూమన్, శ్రీ ఆనందమయీ మా, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ బహుమతి గ్రహీతయైన సి.వి. రామన్, అమెరికాకు చెందిన శాస్త్రజ్ఞుడు లూథర్ బర్బాంక్ మొదలైన వారితో గడిపిన ముఖ్యమైన ఘట్టాలు నిక్షిప్తం చేయబడ్డాయి. ఆయన గురువైన యుక్తేశ్వర్ గిరితో అనుబంధం, గురు శిష్యుల మధ్య సంబంధాల గురించి కూడా వివరాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఆయన ఈ పుస్తకాన్ని వీరికే అంకితం చేశాడు.

యోగానంద పిన్న వయసులోనే భారతదేశంలోని గొప్ప యోగులను కలవడం తటస్థించింది. ఉన్నత పాఠశాల విద్య పూర్తి కాకముందే ఆయన కనబరిచిన అనేక ఆధ్యాత్మిక శక్తులను, గురువు దగ్గర ఆయన శిక్షణ గురించిన విశేషాలు యోగానంద తమ్ముడైన సనంద లాల్ ఘోష్ రచించిన పుస్తకంలో సవివరంగా వివరించబడ్డాయి.

బాల్యంలోనే ఆధ్యాత్మికత వైపు మొగ్గు
ఆధ్యాత్మిక ప్రభావాలు, వారసత్వం
గురుశిష్య సంబంధాలు
క్రియాయోగం

పునర్ముద్రణలు
ఆయన జీవిత కాలంలో ఈ పుస్తకం మూడు ఎడిషన్లు వెలువడింది. మొదటిది 1946లో, రెండవది 1949లో, మూడవది 1951లో వెలువడ్డాయి

FREE
Free pdf
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

3 comments:

  1. నా అభిప్రాయం

    నేను సాధారణంగా మనుషులనే నమ్మను. అంటే దేవున్నీ, దయ్యాలను నమ్ముతానని కాదు. అలాగని నమ్మననీ కాదు. అలాంటి నేను (సన్యాసులను సన్నాసులు అనుకునే నేను ) ఒక యోగి ఆత్మ కథ చదివి నమ్మి, దానితో ప్రభావితమై ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయగాలిగానంటే మరి ఆ సాధువు వ్రాసింది నిజమేనా?!! నేనూ నిజమయ్యే ఉంటుందని నమ్మాలనుకుంటాను. మరి ఎవరైనా నమ్మి ఉంటారా?! అనే ప్రశ్నే వ్యర్ధం! ఒక విషయాన్ని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు చాలామందే ఉంటారు. వాదోపవాదాలు చేసుకుంటూ, ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటూ కాలం వెల్లబుచ్చుతుంటారు.

    పరమహంస యోగానంద జీవితంలో జరిగాయని అయన ఆత్మకథలో ప్రచురితమైనవి నిజాలో, కావో నాకు తెలియవు కానీ... నాకు మాత్రం కొన్ని బలమైన సాక్ష్యాలనిచ్చాయి. కొన్ని వాఖ్యాలు ప్రగాఢ విశ్వాసాన్ని కలిగించాయి. ఏ విషయాన్నైనా ఇతరులకు చెప్పి నమ్మిన్చాలనుకునే వాళ్ళు ఆ విషయం నిజమేనని కొన్నిసార్లు ఋజువు చేయల్సికూడా వస్తుంది. అలా కొన్ని ఋజువయ్యాయి నా విషయంలో!

    ఏ మనిషీ బౌతిక సుఖాలను, సౌఖ్యాలను త్యజించి అంతరాత్మను స్మరించుకుంటూ అనంతాత్మలో కలవలేడు. అలా చేయడానికి ఏ మనిషికైనా కొన్ని వేల లేదా కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. మనిషికి బౌతిక జీవనంపై మోహం తగ్గినపుడే అనంతాత్మలో ఐక్యమవ్వాలనే ఆలోచన పుడుతుంది. అ ఆలోచన వచ్చినపుడే అన్వేషణ మొదలవుతుంది.అన్వేషనలోనే అనంతంలో లీనమవడానికి మన అడుగులు ముందుకు పడతాయి. అలా నా అడుగులు అన్వేషణ వరకు మాత్రమే రాగలిగాయి.

    ఏమీ తెలియదనుకునే చీకటి వైపు లేదా అంతా తెలుసు అనుకునే వెలుగు వైపు, ఎటు వెళ్ళినా చివరకు చేరే గమ్యం అదే కదా!
    అంతా అనంతమే కదా!!

    -భార్గవి కులకర్ణి

    ReplyDelete
  2. Autobiography of a Yogi .. Oka Yogi atma katha (Telugu)
    https://youtu.be/DbVFLG38wOM

    ReplyDelete
  3. ఒక యోగి ఆత్మకథ
    నేను యోగ లో డిప్లమో చేస్తున్న సమయంలో ఆ కోర్స్ కి సంబంధం లేక పోయినా యోగ, యోగి అన్న పేరున్న ప్రతి పుస్తకమూ కొనేదాన్ని. అలా నాకు పరిచయమైనదే 'Autobiography of a yogi.'
    కొంతకాలం నా దగ్గరున్న ఆ పుస్తకం పుస్తక ప్రియులెవరో దోచిన కారణంగా ఈ మధ్య మళ్ళీ కొన్నాను. ఈ సారి తెలుగు వెర్షన్‌ 'ఒక యోగి ఆత్మ కథ.'

    శ్రీ పరమహంస యోగానంద రాసిన వారి ఆత్మ కథే ' ఒక యోగి ఆత్మ కథ.'యోగి జీవితం, యోగ విద్యలు వీటిగురించి స్వయంగా ఒక యోగి రాసిన గ్రంధం ఇది. పుస్తకంలోని ముందు మాటలో ఎంతో మంది ప్రశంసలు అందజేసారు. అందులో ఒకటి ఇలా ఉంది.... "ఒక ఆకర్షణీయమైన జీవితాన్ని, ఎన్నడూ విని ఉండనంత విశిష్టమైన ఒక వ్యక్తిత్వన్ని సాటిలేని శక్తి తోనూ స్పష్టతతోనూ ఈ పుస్తకం వెల్లడి చేస్తుంది; పాఠకుడు ఆద్యంతం ఉత్కంఠతతో నిండిపోతాడు.... కేవలం మానసికమైన ఆధ్యాత్మికమైన మానవ కృషి మాత్రమే శాశ్వతమైన విలువ ఉన్నదనీ, మానవుడు తన ఆంతరంగిక శక్తి తో భౌతికమైన అవరోధాలనన్నింటినీ జయించ గలడనీ ఈ పుటల్లో తిరుగు లేని ఋజువు లభిస్తుంది.... ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకువచ్చే శక్తి ఈ ప్రముఖమైన జీవిత చరిత్రకుందని మనం ఎంచాలి."

    మొదటి సారి నేను ఈ పుస్తకం చదివి నప్పుడు ఆ నాల్గు రోజులూ కొత్త లోకంలో విహరిస్తున్న అనుభూతి. చదువుతున్నంత సేపూ సంభ్రం, ఆశ్చర్యం నన్ను ముంచెత్తుతూనే ఉంది.
    రెండవ సారి నింపాదిగా, కులాసాగా చదువుకున్నాను. మళ్ళీ అబ్బురపడ్డాను, ఆశ్చర్య పోయాను!
    సరళమైన శైలీ, అద్భుతమైన సంఘటనల చిత్రణ. ఆద్యంతమూ వదల కుండా చదివించేస్తుందీ పుస్తకం.

    సనాతన భారతీయ ధ్యాన ప్రక్రియ అయిన క్రియా యోగాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయటమే పరమ హంస యోగా నందుల జీవిత కర్తవ్యం అని ఆయన గురువు గారి జోస్యం. ఆ దిశగానే ఆయన జీవితం సాగుతుంది.
    ఆయన కి తారసపడిన యోగుల ఫొటోలు మధ్య పేజీల్లో పొందుపర్చారు.

    బాల్యం తో మొదలెట్టి కుటుంబము, విద్యాభ్యాసము, తన గురువుతో గడిపిన రోజులు..తనకి తారసపడిన యోగులు, ఎదురైన సంఘటనలు, ఆయన కలుసుకున్న మహాత్ములు ఇతర యోగుల గురించి, వారి అద్భుత శక్తుల గురించి ఆసక్తి కరమైన ఎన్నో సంగతులు వివరిస్తూ అన్నింటివెంటా మనల్ని పరుగులు పెట్టించేస్తారు. . ఆయన నిర్మల భక్తి, దృఢ విశ్వాసము చదువరులను ముగ్ధులను చేస్తాయి.
    ఎన్ని సార్లు చదివినా విసుగు పుట్టించనిది, ఏ పేజీయైనా నేరుగా తెరచి చదువుకోగలది 'ఒక యోగి ఆత్మ కథ.'

    ReplyDelete