గణపతి సహస్రనామాలు | Ganapati Sahasranamalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

గణపతి సహస్రనామాలు 
Sri Ganapati SahasraNamalu 
Rs 27/-

ఋణ విమోచన గణపతి స్తోత్రం 

అస్య శ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్ర మంత్రస్య | సదాశివ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీ ఋణహర్తృ గణపతి దేవతా | గౌం బీజం | గం శక్తిః | గోం కీలకం | సకల ఋణనాశనే వినియోగః |

శ్రీ గణేశ | ఋణం ఛింది | వరేణ్యం | హుం | నమః | ఫట్ |
ఇతి కర హృదయాది న్యాసః |

ధ్యానం
సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||

స్తోత్రం

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౧ ||

త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౨ ||

హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౩ ||

మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౪ ||

తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౫ ||

భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౬ ||

శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౭ ||

పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౮ ||

ఇదం ఋణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||

దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్
పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || ౧౦ ||

శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్
ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || ౧౧ ||

ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణ మీరితం
సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || ౧౨ ||

బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్
అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || ౧౩ ||

లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్
భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||

ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం ||

సంకష్టనాశన గణేశ స్తోత్రం

నారద ఉవాచ –
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || ౧ ||

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ ||

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ ||

నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ ||

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || ౫ ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ ||

జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ ||

అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || ౮ ||

గణపతి సాక్షిగా... 

 Ganapati literature srisailam


    ఆ గణపతి శివభక్తుల అఖండ భక్తికి, శ్రీశైలయాత్రకు తొలిసాక్షి. ఇల కైలాసపు విశేషాలకు ముఖ్య సాక్షి. క్షేత్రానికి వచ్చే జన నానుడిలో శ్రీశైలయాత్ర చేసేవారు ముందుగా సాక్షిగణపతిని దర్శించి క్షేత్రానికి వచ్చినట్లుగా తెలుపుకోవాలనీ, ఆయన ఈ యాత్రను నమోదుచేసి తన తండ్రి మల్లికార్జునస్వామివారికి, తల్లి భ్రమరాంబాదేవికి తెలియజేస్తాడని కథనం. అపు‘రూపం’ గణపతి రూపాలలోనే అత్యంత విశిష్టమైన రూపం ఇదని క్షేత్ర మాహాత్మ్యం చెబుతోంది. ఈ రూపం మరే ఇతర గాణాపత్య సాహిత్యంలోను మనకు దొరకదు. ఈ మూర్తి ఆసీన రూపంలో కొలువై వుంటాడు. ప్రసన్న వదనంతో, వక్రతుండంతో, ఎడమచేత పుస్తకాన్ని, కుడిచేత లేఖిని (కలం)ని, మిగిలిన రెండు చేతులతో పాశం, అంకుశం ఆయుధాలను ధరించి దర్శనమిస్తాడు. ఓంకార గణపతి ఓనమాలు దిద్దుతూ పుస్తకంపై ఆయన లిఖిస్తున్న ఓనమాలు శివపంచాక్షరీ (ఓం నమశ్శివాయ) మంత్రమే. అక్షరాలను లిఖిస్తూ కనిపిస్తున్న ఈ స్వామిని వ్రాతపతి అని అధర్వణ వేదం తెలిపింది. ముద్గల పురాణం చెప్పిన 32 గణపతి రూపాలో ద్విజగణపతి రూపానికి, ఈ సాక్షిగణపతి రూపానికి చాలా దగ్గర పోలిక వుంది. అక్కడ కూడా స్వామి పుస్తకం, లేఖిని మొదగు ఆయుధాలతో దర్శనమిస్తాడు. పుస్తకం, లేఖిని అజ్ఞానాన్ని, అవిద్యను నాశనం చేసే ఆయుధాలే. కనుక ఈ గణపతిని పూజిస్తే విద్య లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.

మహాభారతం నాటి రూపం
ఐదవ వేదంగా ప్రసిద్ధి పొందిన మహాభారతం రచించింది వేదవ్యాసుడైనా , కొన్ని లక్షల శ్లోకాలను నిరాటంకంగా గణపతి లిఖించాడు. ప్రస్తుతం శ్రీశైలంలోని సాక్షిగణపతి రూపం ఆ లేఖక గణపతిని గుర్తుకు తెస్తుంది. అయితే ఇక్కడ వ్యాసుడు మాత్రం మనకు కనపడడు. శ్రీశైలం యుగయుగాల నాటిదని క్షేత్రపురాణం చెబుతోంది. ద్వాపర యుగంలో పంచపాండవులు ద్రౌపదితో కలిసి క్షేత్రానికి వచ్చినట్లు క్షేత్ర మాహాత్మ్యం తెలుపుతోంది. – డా. ఛాయా కామాక్షీదేవి
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment