శ్రీ వినాయక వ్రతం | Sri Vinayaka Vratam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhakti pustakalu, vinayaka vratha pooja vidhanam in telugu  vinayaka chavithi pooja vidhanam telugu mp3  ganesh pooja vidhanam in telugu free download  vinayaka chavithi pooja vidhanam telugu pdf 2017  ganapathi pooja mantra in telugu  vinayaka chavithi pooja vidhanam telugu audio free download  vinayaka pooja telugu  vinayaka pooja in telugu audio  Page navigation

శ్రీ వినాయక వ్రతం 
Sri Vinayaka Vratam
online....

శ్రీ గణేశ పంచరత్నమాల
(శ్రీ శంకరాచార్య విరచితమ్)

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం
కళాధరావతంసకం విలాస లోక రక్షకం
అనాయ కైకనాయకం వినాశి తేభ దైతకం
నతాశుభాశు నాయకం నమామి తం వినాయకం

నతేతరాతి భీకరం నవోది తార్క భాస్వరం
నమత్సురారి నిర్ఘరం నతాధి కాప దుర్థరం
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం త మాశ్రయే పరాత్పరం నిరంతరం

సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం
దరేత రోదరం వరం వరేభ వక్త్ర మక్షరం
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్క­ృతాం నమస్కరోమి భాస్వరమ్

అకించ నార్తి మార్జనం చిరంత నోక్తి భాజనం
పూరారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం
కపోల దానవారిణం భజే పురాణ వారణమ్

నితాంత కాంతదంతకాంతి మంతకాంత కాత్మజం
అచింత్యరూప మంతహీన మంతరాయ కృంతనం
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
త మేకదంత మేకమేవ చింతయామి సంతతమ్

మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం
అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోచిరాత్

గణపతి ప్రార్థన

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ।
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే ॥

ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం
ప్రస్యం దన్మథులుబ్ధ మధుపవ్యాలోల గండస్థలమ్

దంతాఘాత విదారితాం రుధిరైః । సింధూర శోభాకరం
వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదమ్ కామదమ్ ॥

నీకు మ్రొక్కెదన్

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడు పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్ ॥

తలచెదనే గణనాధుని, తలచెదనే విఘ్నపతిని, దలచిన పనిగా
దలచెదనే హేరంబుని, దలచెద నా విఘ్నములవి తొలగుట కొరకున్ ॥
అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు బటుతరముగ విందుచేసి ప్రార్థింతుమదిన్ ॥

-----------------------

ఆ లోపాలు వద్దు!
వినాయక చవితి పూజలో ప్రతిష్ఠించే విగ్రహం తీసుకునేటుప్పుడు ఏఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?
వినాయక చవితినాడు ఇంట్లో, వినాయక మంటపంపై ప్రతిష్ఠించే విగ్రహం విషయంలో కొన్ని సూచనలు పాటించాలి. సాకారంగా దైవాన్ని ఆరాధించేటప్పుడు ఆ రూపం ఏ విధమైన అవయవలోపం లేకుండా శిల్ప సౌందర్యం కలదిగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. మట్టితో చేసిన వినాయక విగ్రహాలే ప్రశస్తమైనవి. లోపల డొల్ల లేకుండా నిండుగా ఉన్న విగ్రహాలను పూజించడం మంచిది.
లోహాలతో తయారు చేసిన విగ్రహాలను చవితి పూజలో ప్రతిష్ఠించవచ్చా?
ఏ లోహంతో చేసిన విగ్రహాన్నయినా పూజించవచ్చని పెద్దలు చెబుతారు. అయితే ఇంటిలో పూజించే ప్రతిమ ఆరు అంగుళాల పరిమాణం మించకుండా ఉంటే మంచిది. వినాయక చవితి నాడు పచ్చిమట్టితో చేసిన గణపతి ప్రతిమను ఏర్పాటు చేసుకోవడం బాగుంటుంది. ఆనాడు పార్వతీదేవి నలుగుపిండితో చేసిన చిన్న బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసిన పురాణకథ ఆధారంగా ఈ విశ్వాసం లోకంలో బలపడింది. అంతేగాక వినాయకుడు మూలాధారానికి అధిపతి అనీ, పృథ్వీ తత్వానికి చెందిన వాడని చెప్పే యోగశాస్త్ర రీత్యా కూడా ఈ ఆచారం అమల్లోకి వచ్చింది.
గణపతి పూజకు గరిక విశేషమైనదని అంటారెందుకు?
గరిక పూజను స్వీకరించడం గణపతి నిరాడంబరత్వాన్నీ, ప్రకృతి ప్రియత్వాన్నీ సూచిస్తుంది. వినాయకుడిని వివిధ రకాల పత్రాలతో పూజించడం వెనుక ఓ ఆంతర్యం ఉంది. పూజలో వినియోగించే రకరకాల పత్రాల గురించి, వాటిలోని ఔషధ గుణాల గురించి మనకు అవగాహన కల్పించడం ఇందులోని ముఖ్య ఉద్దేశం. అంతేకాదు గరిక.. మట్టితో ఉన్న అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు. గరికతో పూజ చేసిన వారిని విశేషంగా అనుగ్రహిస్తానని గణపతి ప్రకటించినట్లు ఓ పురాణ కథనం కూడా ఉంది.
గణేశ నవరాత్రుల్లో పూజించిన విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా ఇంట్లో ఉంచుకోవచ్చా?
చవితి పూజలో వినియోగించే విగ్రహాన్ని నిమజ్జనం చేయడమే సంప్రదాయం. అయితే అలా నిమజ్జనం చేయని పక్షంలో మన ఇంటి పెరటిలో ఎవరూ తొక్కకుండా.. చెట్టుపాదులో ఉంచవచ్చు. బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో రూపొందించిన విగ్రహాలు పూజలో ఉంచితే.. నిమజ్జనం రోజు ఉద్వాసన పలికి, తిరిగి యథావిధిగా పూజామందిరంలో ఉంచవచ్చు. పచ్చిమట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడంలో ఒక చిత్రమైన ఆంతర్యం ఉంది. నిమజ్జనం అంటే నీటిలో ముంచడం. అంటే ప్రవాహ జలంలోగానీ, కనీసం ఊరి చెరువులోగానీ నిమజ్జనం చేయాలి. వర్షరుతువులో వచ్చే ఈ పండగ వేళ పచ్చిమట్టి కోసం మనకు తెలియకుండానే చెరువులకు పూడికలు తీసే పని జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చాడో మళ్లీ అక్కడికే వెళ్తాడు వినాయకుడు. ఈ సత్యం మనకు ప్రబోధించడమే నిమజ్జనంలోని ఆంతర్యం.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి

-----------------------------------------

శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పము


ముందుగా బొట్టుపెట్టుకుని, నమస్కరించుకుని, ఈ విధంగా ప్రార్థించుకోవాలి.

ప్రార్థన :

శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥
అయం ముహూర్తస్సుముహూర్తోస్తు ॥
శ్లో॥ తదేవలగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ ।
విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతేతేంఘ్రి యుగంస్మరామి ॥
సుముహూర్తోస్తు ॥
శ్లో॥ లాభస్తేషాం, జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః ।
యేషామిందీవర శ్యామో హృదయస్థో జనార్దనః ॥
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమా మ్యహం ॥
సుమఖ శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః,
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః । «
దూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః,
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంధ పూర్వజః ।
అష్టావష్టౌ చ నామాని యః పఠేచ్ఛ­ృణుయాదపి ।
విద్యారంభే వివాహేచ ప్రవేశ నిర్గమేతథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యనజాయతే।
అభీప్సితార్థ సిద్ధర్థ్యం, పూజితో యస్సురైరపి,
సర్వవిఘ్నచ్ఛి దేతస్మై గణాధిపతయే నమః ॥
(నమస్కరించుకుని ఆచమనము – ప్రాణాయామము చేసి ఈ విధంగా సంకల్పము చెప్పుకోవాలి)

సంకల్పం :

ఓం ॥ మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (శ్రీశైలానికి ఏ దిక్కులో వుంటే ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి), అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీవిజయ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ ఇందువాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్ ….గోత్రః …. నామధేయః, శ్రీమతః ….గోత్రస్య ….నామధేయస్య (పూజ చేసే వారు గోత్రం, పేరు చెప్పుకోవాలి.

పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి) ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థయిర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షేప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీ ముద్దిశ్య, శ్రీ వరసిద్ధి వినాయకదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అంటూ కుడిచేతి మధ్యవేలితో నీళ్ళు ముట్టుకోవాలి)

ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే ।
తదంగ కలశపూజాం కరిష్యే ॥

కలశపూజ:

కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య । తస్యోపరి హస్తం నిధాయ (కలశంలో గంధం, పుష్పాలు, అక్షతలు వుంచి దానిని చేతితో తాకుతూ ఈ మంత్రం చదవాలి)
కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణుసమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మా, మధ్యే మాతృగణాస్మ­ృతాః,
కుక్షౌతుసాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ॥
ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః (మన వద్ద వున్న నీటిపాత్ర చుట్టూ గంధం రాసి బొట్లు పెట్టి అందులో తమలపాకు వుంచుకోవాలి. ఈ శ్లోకం చదువుతూ ఆకును నీటిలో సవ్య పద్ధతిలో తిప్పాలి)

॥శ్లో॥ గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥
తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యముల మీదా, దైవము మీదా, తమమీదా కొద్దిగా చిలకరించుకోవాలి. అనంతరం పసుపు గణపతిని పూజించాలి.

విఘ్నేశ్వర పూజ

గణానాంత్వాం గణపతిగ్ం హవామహే, కవిం కవీనా ముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ్యస్పత్యః ఆనశృణ్వన్నూతిభిస్సీద సాదనం॥
శ్రీ మహాగణాధిపతయే నమః ॥
ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (మధ్య వేలితో నీటిని తాకాలి)

ధ్యానం :

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అనే శ్లోకం చదువుతూ పూవులూ అక్షతలూ కలిపి పసుపు గణపతి పాదాల చెంత వుంచాలి. పూజను దేవుని పాదాల వద్ద మాత్రమే చేయాలి. శిరసుపైన పూలు కానీ అక్షతలు కానీ చల్లరాదు)

ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి (అని చెబుతూ ఉద్ధరిణతో నీటనీ పసుపు గణపతికి చూపించి ఆ నీటిని చిన్న పళ్ళెం లేదా పాత్రలో వేయాలి.

పసుపు గణపతిని గంధం, అక్షతలు, పసుపు, కుంకుమ, పూలతో పూజించాలి. అగరు వత్తులు వెలిగించి, బెల్లం లేదా పండు నైవేద్యం పెట్టి శోడశోపచార పూజ చేయాలి. యధాభాగం గుడం నివేదయామి ॥ శ్రీ మహాగణాధిపతి స్సుప్రసన్నో, సుప్రీతో, వరదోభవతు ॥ శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసాగృహ్ణామి అంటూ పూజ చేసిన అక్షతలు రెండు తీసుకొని తలపై వుంచుకోవాలి.
మరలా ఆచమానం చేసి పైన సూచించిన విధంగా సంకల్పం చెప్పుకోవాలి.
అథః శ్రీ వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే. తదంగ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే- అంటూ కుటిచేతి మధ్య వేలితో నీటిని తాకాలి.

శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠ :-
(విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి) ఓం ఆంహ్రీంక్రోం యంరంలంవం శంషంసంహం – ఇత్యాద్యేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వా, నమస్క­ృత్వా (నమస్కారం చేస్తూ) ॥ ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
శ్లో॥ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు॥
అవాహితోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ, వరదోభవ, ప్రసీద, ప్రసీద, ప్రసీద (అంటూ వినాయకుడి విగ్రహం పాదాల వద్ద అక్షతలు లేక పూలు వేయాలి)

షోడశోపచార పూజ :

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ॥
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ధి వినాయకమ్ ॥
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ॥ «
ద్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ॥
శ్రీ గణాధిపతయే నమః ధ్యాయామి॥ (వినాయకుడి విగ్రహం పాదాల వద్ద పూలు, అక్షతలు వేసి నమస్కరించాలి)
అత్రాగచ్ఛ జగద్వన్ద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ.
ఆవాహయామి॥ (మరల అక్షతలు వేయాలి)
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
ఆసనం సమర్పయామి ॥ (అక్షతలు లేదా పూలు వేయాలి)
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గన్ధపుష్పాక్షతైర్యుతమ్
అర్ఘ్యం సమర్పయామి॥ (ఉద్ధరెణతో నీరును స్వామికి చూపించి పక్కన వుంచుకున్న పాత్రలో వేయాలి)
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
పాద్యం సమర్పయామి॥ (మరలా కొంచె నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి)
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత
గృహాణాచమనందేవ తుభ్యందత్తం మయా ప్రభో
ఆచమనీయం సమర్పయామి॥ (కొంచె నీటిని స్వామికి చూపించి పాత్రలో వేయాలి)
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే
మధుపర్కం సమర్పయామి॥ (స్వామికి మధుపర్కాన్ని సమర్పించాలి.)

స్నానం :

పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత
పంచామృత స్నానం సమర్పయామి॥ (ఆవుపాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలు స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామిపై చల్లాలి)
గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః
స్నానం కురుష్వభగవన్వుమాపుత్ర నమోస్తుతే
శుద్ధోదక స్నానం సమర్పయామి॥ (కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)
రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రద గృహాణత్వం లమ్బోదర హరాత్మజ
వస్త్రయుగ్మం సమర్పయామి॥ (స్వామికి వస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకొనేట్లయితే పత్తికి పసుపు, కుంకుమ రాసి దానిని వస్త్రంగా ఇవ్వవచ్చు)
రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకమ్
గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక
ఉపవీతం సమర్పయామి॥ (యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి)
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
గంధం సమర్పయామి॥ (కొంచెం గంధాన్ని స్వామికి అలంకరించాలి)
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్
శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే
అక్షతాన్ సమర్పయామి॥ (స్వామికి అక్షతలు సమర్పించాలి)
సుగన్ధాని చ పుష్పాణి జాతీకుంద ముఖాని చ
యేకవింశతి పత్రాణి, సంగృహాణ నమోస్తుతే
పుష్పాణి పూజయామి॥ (స్వామిని పూలతో పూజించాలి)

అధ అంగపూజ

గణేశాయ నమః పాదౌ పూజయామి॥ ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి, శూర్ప కర్ణాయ నమః జానునీ పూజయామి, విఘ్న రాజాయ నమః జంఫౌ పూజయామి, ఆఖు వాహనాయ నమః ఊరూం పూజయామి, హేరంబాయ నమః కటిం పూజయామి, లంబోద రాయ నమః ఉదరం పూజయామి, గణనాథాయనమః నాభిం పూజయామి, గణేశాయ నమః హృదయం పూజయామి, స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, స్కందాగ్రజాయనమః స్కందౌపూజయామి, పాశహస్తాయ నమః హస్తౌపూజయామి, గజవక్త్రాయ నమః వక్త్రంపూజయామి, విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి, శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి, సర్వేశ్వరాయ నమః శిరఃపూజయామి, విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి॥

పూజకు కావలసిన సామగ్రి

పసుపు, కుంకుమ, గంధం, అగరువత్తులు, కర్పూరం, తమల పాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరి కాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతాలు, తోరము, దీపారాధన కుందులు, నెయ్యిలేక నూనె, దీపారాధన వత్తులు. వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసం, భక్ష్యాలు.

చిన్నారి దేవుళ్ళ పండుగ

వినాయక పూజా విధానం చిన్నారులను అమితంగా ఆకర్షిస్తుంది. వారికి పూజా విధానం, మన ఆచార సంప్రదాయాలు నేర్పేందుకు ఇది చక్కని అవకాశం. వివిధ రకాల ఆకులతో దేవుడ్ని పూజించడం ద్వారా వారికి ప్రకృతి ప్రాధాన్యతను వివరించే వీలుంది. చిన్నారులకు వీలుంటే రోజూ వేసుకొనే దుస్తులకు భిన్నమైన బట్టలు వేస్తే వారికి వినాయకచవితి పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంది. ఒకటి, మూడు, ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాన్ని తయారు చేసి, పూజలో వుంచి దానిని పిల్లలు, పెద్దలు అందరూ ధరించవచ్చు.

పూజా సన్నాహం

వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించు కోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీటవేసి, దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో వుంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పని సరిగా తయారు చేసుకోవాలి.

వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు, పూలు వేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిణ వుంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు, కుంకుమలు అవుతాయి కాబట్టి చేతికింద ఒక శుభ్రమైన గుడ్డను వుంచుకుంటే బాగుంటుంది.

అథ ఏకవింశతి పత్ర పూజ
(ఒక్కొక్క నామం చదువుతూ బ్రాకెట్‌లో పేర్కొన్న పత్రాలు తీసుకుని స్వామిని పూజించాలి)

ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి (మాచిపత్రి)
ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి (గరికె)
ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి (రేగి)
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణు)
ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి (తులసి)
ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి (మామిడి)
ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంతం)
ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి (మరువం)
ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి (వావిలి)
ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి (జాజి)
ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి (గండకీ)
ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి (జమ్మి)
ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి (రావి)
ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి (మద్ది)
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతపత్రాణి పూజయామి.

శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళిః

(ఈ క్రింది నామాలు చదువుతూ స్వామిని పూలతోగాని, అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి.)
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం దైవమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః
ఓం సుఖనిథయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః,
ఓం లంబజఠరాయ నమః,
ఓం హ్రస్వగ్రీవాయ నమః,
ఓం మహోదరాయ నమః,
ఓం మదోత్కటాయ నమః,
ఓం మహావీరాయ నమః,
ఓం మంత్రిణే నమః,
ఓం మంగళస్వరాయ నమః,
ఓం ప్రమధాయ నమః,
ఓం ప్రథమాయ నమః,
ఓం ప్రాజ్ఞాయ నమః,
ఓం విఘ్నకర్త్రే నమః,
ఓం విఘ్నహంత్రే నమః,
ఓం విశ్వనేత్రే నమః,
ఓం విరాట్పతయే నమః,
ఓం శ్రీపతయే నమః,
ఓం వాక్పతయే నమః,
ఓం శృంగారిణే నమః,
ఓం ఆశ్రితవత్సలాయ నమః,
ఓం శివప్రియాయ నమః,
ఓం శీఘ్రకారిణే నమః,
ఓం శాశ్వతాయ నమః,
ఓం బలాయ నమః,
ఓం బలోత్థితాయ నమః,
ఓం భవాత్మజాయ నమః,
ఓం పురాణపురుషాయ నమః,
ఓం పూష్ణే నమః,
ఓం పుష్కరోత్షిప్తవారిణే నమః,
ఓం అగ్రగణ్యాయ నమః,
ఓం అగ్రపూజ్యాయ నమః,
ఓం అగ్రగామినే నమః,
ఓం మంత్రకృతే నమః,
ఓం చామీకరప్రభాయ నమః,
ఓం సర్వస్మై నమః,
ఓం సర్వోపాస్యాయ నమః,
ఓం సర్వకర్త్రే నమః,
ఓం సర్వనేత్రే నమః,
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః,
ఓం సర్వసిద్ధియే నమః,
ఓం పంచహస్తాయ నమః,
ఓం పార్వతీనందనాయ నమః,
ఓం ప్రభవే నమః,
ఓం కుమారగురవే నమః,
ఓం అక్ష్యోభ్యాయ నమః,
ఓం కుంజరాసుర భంజనాయ నమః,
ఓం ప్రమోదాయ నమః,
ఓం మోదకప్రియాయ నమః,
ఓం కాంతిమతే నమః,
ఓం ధృతిమతే నమః,
ఓం కామినే నమః,
ఓం కపిత్థవనప్రియాయ నమః,
ఓం బ్రహ్మచారిణే నమః,
ఓం బ్రహ్మరూపిణే నమః,
ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః,
ఓం జిష్ణవే నమః,
ఓం విష్ణుప్రియాయ నమః,
ఓం భక్తజీవితాయ నమః,
ఓం జితమన్మథాయ నమః,
ఓం ఐశ్వర్యకారణాయ నమః,
ఓం జ్యాయసే నమః,
ఓం యక్షకిన్నర సేవితాయ నమః,
ఓం గంగాసుతాయ నమః,
ఓం గణాధీశాయ నమః,
ఓం గంభీరనినదాయ నమః,
ఓం వటవే నమః,
ఓం అభీష్టవరదాయ నమః,
ఓం జ్యోతిషే నమః,
ఓం భక్తనిథయే నమః,
ఓం భావగమ్యాయ నమః,
ఓం మంగళప్రదాయ నమః,
ఓం అవ్యక్తాయ నమః,
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః,
ఓం సత్యధర్మిణే నమః,
ఓం సఖయే నమః,
ఓం సరసాంబునిథయే నమః,
ఓం మహేశాయ నమః,
ఓం దివ్యాంగాయ నమః,
ఓం మణికింకిణీ మేఖలాయ నమః,
ఓం సమస్త దేవతామూర్తయే నమః,
ఓం సహిష్ణవే నమః,
ఓం సతతోత్థితాయ నమః,
ఓం విఘాతకారిణే నమః,
ఓం విశ్వగ్ధ­ృశే నమః,
ఓం విశ్వరక్షాకృతే నమః,
ఓం కళ్యాణగురవే నమః,
ఓం ఉన్మత్తవేషాయ నమః,
ఓం పరాజితే నమః,
ఓం సమస్త జగదాధారాయ నమః,
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః,
ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః,
ఓం విఘ్నేశ్వరాయ నమః,
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః అష్టోత్తర శతనామార్చనం సమర్పయామి.

ధూపం

శ్లో॥ దశాంగం గుగ్గు లోపేతం సుగన్ధిం సుమనోహరమ్
ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ
ధూపమాఘ్రపయామి॥
(అగరబత్తి వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించి పక్కన వున్న స్టాండులో కాని, అరటి పండుకు కానీ గుచ్చాలి.)

దీపం

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోతితం మయా
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
దీపం దర్శయామి॥ (దీపాన్ని స్వామికి చూపించాలి)

నైవేద్యం

(కొబ్బరి కాయలు ఇంకా వుంటే వాటిని తలా ఒకటి కొట్టి నైవేద్యం పెట్టాలి. అంతకు ముందు స్నానం సమయంలో కొట్టిన బ్బరికాయను, పిండి వంటలు, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు, అరటిపండ్లు మొదలైన వాటిని స్వామి ముందుంచాలి)
సుగంధాన్ సుకృతాం శ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్,
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గ్యైః ప్రకల్పితాన్।
భక్ష్యం, భోజ్యంచ లేహ్యం చ చోష్యం పానీయ మేవచ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక- మహానైవేద్యం సమర్పయామి॥ అంటూ ఆకుతో ఆ పదార్ధారన్నింటిపైన కొద్దిగా నీరు చల్లాలి. ఆ తరువాత స్వామికి నైవైద్యం పెట్టాలి.

తాంబూలం

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్,
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
తాంబూలం సమర్పయామి.
తమలపాకులు, వక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుడి విగ్రహం ముందు వుంచి నమస్కరించాలి.
నీరాజనం

సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ,
భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి॥
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా
నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ
నీరాజనం సమర్పయామి॥
(కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇచ్చి, ఆ తరువాత హారతి పాత్రపై కొంచె నీటిని వుంచి కళ్ళకు అద్దుకోవాలి)

మంత్రపుష్పం

(పుష్పం, అక్షతలు తీసుకొని నిలుచొని ఈ శ్లోకాన్ని పఠించాలి)
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపా
ధూమకేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
వక్రతుండః మహాకాయ కోటిశూర్య సమప్రభ
అవిఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా
(అక్షతలు, పూలు స్వామి పాదాల వద్ద వుంచాలి)

ప్రదక్షిణ

శ్లో॥ యానికానిచ పాపాని జన్మాన్తరకృతానిచ।
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదేపదే ॥
పాపో హం పాపకర్మాహం పాపాత్మా పాపసమ్భవః ।
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల॥
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప ॥
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ॥
(ప్రదక్షిణ చేసి నమస్కరించాలి. సాష్టాంగ ప్రణామం చేయడం సంప్రదాయం)
ఆ తరువాత మరలా కూర్చొని, కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచె నీటిని అక్షతలపై వేసుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి.
యస్యస్మ­ృత్యాచ నామోఖ్య తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణం తాం యాతి సద్వో వందే తం గణాధిపం
మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహప్రభో
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానమావాహనాది షోడషోపచార పూజయాచ, అష్టోత్తర నామార్చనయాచ, అవసర, మహా నివేదన యాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు అంటూ అక్షతలు, నీటిని పళ్ళెంలో వదలాలి. ఆ నీటిని, పంచామృతాలు, కొబ్బరి నీళ్ళను కలిపి తీర్థంగా తీసుకోవాలి.
పూజ చేసిన అక్షతలను పిల్లల శిరస్సుపై వుంచాలి. పెద్దలు కూడా ఆ అక్షతలు శిరసుపై ధరించాలి.

గణేశ ఉత్సవం ఎలా జరుపుకోవాలి?

గతంలో హైదరాబాద్‌కే పరిమితమైన గణేశ ఉత్సవాలు ప్రస్తుతం రాష్ట్రమంతటా వ్యాపించాయి. యువత సంఘటితమై వీధివీధినా గణేశుని విగ్రహాలు ఏర్పాటు చేసి, నిత్యం పూజలు, సాంస్క­ృతిక కార్యక్రమాలతో తొమ్మిది రోజుల పాటు రంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నది. నిలువెత్తు దేవుని విగ్రహం ఏర్పాటు చేసి సెభాష్ అనిపించుకుంటున్నారే కానీకొన్ని చోట్ల ఆ గణపతికి నిత్యపూజాదికాలు జరగడం లేదు. దేవుడి విగ్రహం అనేది ఏర్పాటు చేశాక నిత్యం విధిగా పూజ నిర్వహించాలి. కొండంత దేవుడికి కొండంత పత్రి సమర్పించలేకపోయినా ఫలమో, పత్రమో ఏదోఒకటి స్వామికి నివేదించాలి. గణేశుని ఉత్సవాలు నిర్వహించే వారు ఈ కింది పద్ధతిని పాటిస్తే భక్తి, ముక్తి రెండూ లభిస్తాయి.

* జల, పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత వరకు మట్టి వినాయకుని విగ్రహాలనే ప్రతిష్ఠించాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన బొమ్మలు, అతిగా రంగులు వాడిన బొమ్మలను వాడక పోవడం పర్యావరణ రీత్యా మంచిది.
* చవితి రోజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలి. ఆ రోజునుంచి నిమజ్జనం జరిపే వరకు నిత్యం ఉదయం, సాయంత్రం యధాశక్తి పూజలు నిర్వ హించాలి.
* రోజూ ఒక పూట అయినా ప్రసాదం తయారు చేసి దానిని అందరికీ పంచితే బాగుంటుంది.
* గణేశ ఉత్సవ స్థలాలు భక్తి కేంద్రాలుగా వుండాలి. రచ్చబండగా మార కుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

శ్రీ వినాయక వ్రతకథ

(వ్రతకథ చెప్పుకొనే ముందు కొన్ని అక్షతలు చేతిలో వుంచుకోవాలి.
కథ పూర్తయిన తరువాత ఆ అక్షతలను శిరసుపై వేసుకోవాలి)

పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడు.భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు.అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి “అయ్యా! మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవము పొందేలా ఏదయినా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది” అని ప్రార్థించాడు. అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.

“ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి- తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలను, విజయాలను, వైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు- నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామార్థ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి, స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తిమేరకు బంగారంతో గాని, వెండితోగాని, లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి.

అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను, రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి, యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్యభోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈవిధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములూ సిద్ధిస్తాయి.

అన్ని వ్రతములలోకీ అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధార్వాదులందరిచేతా ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా నువ్వుకూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే- నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే శ్యమంతకమణితో బాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు.

పూర్వకాలమున గజముఖుడయిన గజాననుడు అనేరాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ నీవు నాయుదరమందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్తసులభుడగు శివుడు అతడి కుక్షియందుండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో వున్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకొనే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు.

గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాదిదేవత లందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేశాడు. మహావిష్ణువు తానును చిరు గంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దులను ఆడించుచుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్లును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూతధారియగు నాహరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దు నాడించాడు. గజాసురుడు పరమానందభరితుడై “ఏమి కావాలో కోరుకోండి…. ఇస్తాను” అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుని సమీపించి “ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చింది, శివుడ్ని అప్పగించు” అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడగు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో వున్న పరమేశ్వరుడ్ని ఉద్దేశించి “స్వామీ! నా శిరస్సు త్రిలోక పూజ్యముగ చేసి, నా చర్మము నీవు ధరించు” అని ప్రార్థించాడు.

తన గర్భంలో వున్న శిపుడ్ని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భమునుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. ‘దుష్టాత్ములకు ఇటువంటి వరముసు ఇవ్వరాదు – ఇచ్చినచో పామునకు పాలుపోసినట్ల అవుతుందని సూచించాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు.

వినాయకోత్పత్తి

కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందరుని వాకిట్లో వుంచి, ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది.

శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో వున్న బాలుడు పరమశివుడ్ని అభ్యంతర మందిరం లోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమాని శివు డు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి, లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దుల పట్టియైనాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.

విఘ్నేశాధిపత్యం

ఒకనాడు దేవతలు, మునులు, మానవులు, పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యము తన కు ఇమ్మని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారుల నుద్దేశించి “మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర న దులన్నింటిలో స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంద”ని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా, సులువుగా సాగివెళ్ళాడు.

గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని, తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు. జలములన్నియూ నారాయణుని అధీనములు. అనగా నారాయణ మంత్రం అధీనంలో వుంటా యి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు.

ఆ మంత్ర ప్రభావమున ప్రతితీర్థ స్నానమందును కుమారస్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా మూడుకోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజాననుని చూచి నమస్కరించి “తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మ”ని ప్రార్థించాడు.

చంద్రుని పరిహాసం

అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజాననుకి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి, పూజించగా, విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్ని చేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసముకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు.

ఉదరం భూమికానిన చేతులు భూమికానక ఇబ్బంది పడుచుండగా, శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గవుతాయి అనే సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంత పార్వతి శోకించుచూ చంద్రుని చూచి “పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసినవారు పాపాత్ములై నీలాపనిందల పొందుదురుగాక” యని శపించింది.

ఋషిపత్నులకు నీలాపనిందలు

ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి, శాప భయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము దక్క మిగిలిన ఋషిపత్నుల రూపము ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలేయని శంకించి, ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చం ద్రుని చూచుటచే వీరికి ఈ నీలాపనింద కలిగింది.

దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగా, అతడు సర్వజ్ఞుండగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధాన పరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు. మహేశ్వరుల సేవించి, మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. పార్వతీపరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు “ఓ పార్వతీ! నీ శాపము వల్ల ముల్లోకాలకు కీడువాటిల్లింది కాబట్టి శాపన్ని ఉపసంహరించుకోవా”ని ప్రార్థించారు. తనయుడు మరల బతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది. “ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు” అని శాపాన్ని సడలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. ఇలా కొంతకాలము గడచె.

శమంతకోపాఖ్యానం

ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించి, స్తుతించాడు. మాటల సందర్భంగా స్వామీ! సాయంకాలమయింది, నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు. ఇక సెలవు అని పూర్వవృత్తాంతమంతయూ శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతట కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడ్ని ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలుపిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూశాడు. “ఆహా! ఇక నాకెట్టి అపనింద రానున్నదో” అని అనుకున్నాడు.

కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్య వరముచే శమంతక మణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. “రోజుకు ఎనిమిది బారువుల బంగారమిచ్చు దానిని ఏ ఆప్తునకైన నెవ్వరు ఇవ్వ”రనిన సత్రాజిత్తు తిరస్కరించాడు. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతక మణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగ ఇచ్చింది.

మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని, కృష్ణుడు, మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడు. అది కృష్ణుడు విని చవితి నాడు పాలల్లో చంద్రబింబమును చూచిన దోష ఫలమని అనుకున్నాడు. దానిని బాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెదుకగా ఒకచోట ప్రసేనుని కళేబరము, సింహం కాలిజాడలు, పిదప ఎలుకబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు. అచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది.

అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరచుచు, గోళ్ళతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ ఘోరముగ యుద్ధము చేసెను. కృష్ణుడు వానికి బడద్రోసి వృక్షములు, రాళ్ళతోను, తుదకు ముష్టిఘాతలముతోను రాత్రింబవళ్ళు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేసెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడగు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు. అంజలి ఘటించి “దేవాధిదేవా! ఆర్తజనపోషా! భక్తజనరక్షా నిన్ను శ్రీరామచంద్రునిగా తెలిసికొంటిని. ఆ కాలమున నాయందలి వాత్సల్యముచే వరం కోరుకొమ్మనగా, నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధం జేయవలెనని కోరుకున్నాను.

భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణ చేయుచూ అనేక యుగములు గడిపాను, ఇపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇక జీవితేచ్ఛ లేదు. నా అపరాధములు క్షమించి కాపాడుము. నీ కన్న వేరు దిక్కులేదు” అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయూ తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు. శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకు ఇటు వచ్చాను.

కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగ తన కుమార్తెనగు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యంబులకు ఆనందం కలిగించి కన్యారత్నంతోను, మణితోను శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు. సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు “అయ్యో! లేనిపోని నింద మోపి దోషమునకు పాల్పడితి”నని విచారించి “మణి సహితముగ తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపు”మని వేడుకున్నాడు.

శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని తిరిగి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతీ సత్యభామలను పరిణయమాడాడు. అంత దేవాదులు, మునులు స్తుతించి “మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకొంటిరి మాకేమి గతి” యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై “భాద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదవశంబున చంద్రదర్శనమయ్యెనేని ఆనాడు గణపతిని యధావిధి పూజించి ఈ శమంతక మణి కథను విని అక్షతలు శిరంబున దాల్చువారు నీలాపనిందలు పొందకుందురుగాక” అని చెప్పాడు. అంత దేవాదులు సంతోషించి, తమ ఇళ్ళకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమతమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖసంతోషాలతో వున్నారు.
సర్వేజనాః సుఖినోభవంతు.

విఘ్నేశ్వరుని మంగళహారతులు

శ్రీశంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతావంద్యునకును
ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును
॥ జయ మంగళం నిత్య శుభమంగళం ॥

నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు
వేరువేరుగదెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికినిపుడు ॥ జయ ॥

సుచిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజగొల్తు
శశి చూడరాదన్న జేకొంటి నొక వ్రతము పర్వమున దేవగణపతికినిపుడు ॥ జయ ॥

పానకము వడపప్పు పనస మామిడిపండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు
తేనెతో మాగిన తియ్య మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ॥ జయ ॥

ఓ బొజ్జ గణపయ్య నీ బంటునేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండుపంపు
కమ్మనినెయ్యయ్య కడుముద్దపప్పును బొజ్జవిరుగగ దినుచును పొరలుచున్ ॥ జయ ॥

వెండి పళ్ళెములోన వేయినేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసికొని దండిగా నీకిత్తు ధవళారతి ॥ జయ ॥

పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ
ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికినిపుడు ॥ జయ ॥

ఏకదంతంబును ఎల్లగజవదనంబు బాగయిన తొండంబు వలపు కడుపు
జోకయిన మూషికము పరక నెక్కాడుచు భవ్యుడగు దేవగణపతికినిపుడు ॥ జయ ॥

మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు
మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగణపతికినిపుడు ॥ జయ ॥

సిద్ధివిఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువదియొక్క పత్రి
దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ॥ జయ ॥

కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు
జాజి బలురక్కసి జమ్మిదాసానపువ్వు గరికి మాచిపత్రి మంచి మొలక ॥ జయ ॥

అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములను
భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబ్రాలు ఉండ్రాళ్ళు పప్పు ॥ జయ ॥
పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరిపూజింతు నిన్నెపుడు కోర్కెలలర ॥ జయ ॥

బంగారు చెంబుతో గంగోదకముదెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి
మల్లెపువ్వులు దెచ్చి మురహరిని పూజింతురంగైన నా ప్రాణలింగమునకును ॥ జయ ॥

పట్టుచీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు
ఇష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవ గణపతికినిపుడు ॥ జయ ॥

ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తు సమితి గూర్చి
నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కువగు పూజలాలింపజేతు ॥ జయ ॥

మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారములను
ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ॥ జయ ॥

దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును
దేవతలు మిముగొల్చు తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికినిపుడు ॥ జయ ॥

చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను
పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధ గణపతికి బాగుగాను ॥ జయ ॥

మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు
నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ॥ జయ ॥

ఓ బొజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచినన్నేలుమీ కరుణతోను
మాపాల గలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీ
॥ జయ మంగళం నిత్య శుభమంగళం ॥
కోరినవరాలిచ్చే కాణిపాకం వినాయకుడు

అప్పాలను,అరిటిపండ్లను తెప్పలుగా తెస్తురు నీకు
కుప్పలుగా వరములిత్తువు
అప్పడవో కాణిపాక పిళ్ళారప్ప

కొన్ని వందల ఏళ్ళ క్రితం జిల్లా ప్రజల గుండె గొంతుల నుంచి పుట్టుకొచ్చిన ఈ భక్తి నాదం ఇప్పుడు దేశ విదేశాలలో సైతం ప్రతిధ్వనిస్తున్నది. దేవగణాలకు అధిపతిగా అవతరించిన వినాయకుడు ఈ కాణిపాక క్షేత్రంలో స్వయంభువ విఘ్నేశ్వరుడుగా బావి నుంచి ఉద్భవించాడు. దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల పాలిట కొంగు బంగారమై ఉద్ధరిస్తున్నాడు. సత్య ప్రమాణాలకు ప్రతీకగా, మానవ పరివర్తనకు మూలస్థానంగా భాసిల్లుతున్న ఈ కాణిపాక క్షేత్రం శాతవాహనుల కాలం నుంచే విశేష పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం. ఒక చారిత్రక సత్యం. పిలిచే భక్తులకు పలికే భగవంతుడుగా భాసిల్లుతున్న ఈ విఘ్ననాధుడు ప్రస్తుతం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నాడు. లక్షలాది మంది భక్తులకు వివిధ రూపాలలో దర్శనం ఇవ్వనున్నాడు.

పుణ్యక్షేత్రాలకు నెలవైన చిత్తూరు జిల్లాలో తిరుమల, శ్రీకాళహస్తిల తరువాత కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చెప్పుకోదగ్గ అపురూప పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి వెయ్యి ఏళ్ళ చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సత్య ప్రమాణాలకు నెలవుగా ఉంది. జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణానికి 12 కి.మీ దూరంలో బహుదా నది ఒడ్డున పచ్చని పంట పొలాల మధ్య వెలసిన ఈ క్షేత్రంకు వింత గొలిపే పురాణ ప్రాశస్త్యం ఉంది.

బావిలో దేవుడు

ఇక్కడ వెలసిన వినాయకుడు స్వయంభువుడు. బావిలో నుంచి దిన దిన ప్రవర్థమానంగా పెరుగుతున్నాడన్నది భక్తుల నమ్మకం. ఇది నిజమనడానికి ఆధారాలు ఉన్నాయి. వెయ్యి ఏళ్ళ క్రితం చోళ రాజుల ఏలుబడిలో ఉన్న ఈ కాణిపాకం అప్పుడు విహారపురి అని పిలవబడేది. ఈ గ్రామంలో పుట్టుకతో మూగ, చెవుడు, గ్రుడ్డి వారైన ముగ్గురు సోదరులు ఉండేవారు. వీరికున్న కాణి విస్తీర్ణం (25 సెంట్ల భూమి) ద్వారా వ్యవసాయమే జీవనాధారం. వీరు ఈ స్థలంలోనే ఒక బావిని త్రవ్వుకుని అందులో యాతం ద్వారా నీటిని తోడి భూమి సాగు చేసుకునే వారు.

ఒకసారి వర్షాభావం కారణంగా బావిలో నీరు తగ్గడంతో వీరు బావిని త్రవ్వడానికి ఉపక్రమించారు. ఇలా త్రవ్వుతూ ఉండగా బావిలో నుంచి ఠంగ్ మని శబ్దం వినిపించడంతో ముగ్గురు సోదరులు బావిలో ఉన్న రాయిని గమనించి దానిని తొలగించడానికి గడ్డపార, పార ఉపయోగించారు. గడ్డపార రాయి మీద పడగానే రక్తం చిమ్ముకుని పైకి ఎగసిందట. ఆ రక్తం వికలాంగులైన సోదరులకు తగలడంతో వారి అంగవైకల్యం పోయిందట. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు బావిని మరి కొంత లోతుకు త్రవ్వగా గణనాధుని విగ్రహం బయట పడిందట.

దీంతో ప్రజలు భక్తి పారవశ్యంతో టెంకాయలను సమర్పిం చారు. విశేషంగా పగిలిన టెంకాయల నీటి ద్వారా గుడ్డి, మూగ, చెవుడు సోదరుల కాణి భూమి అంతా ప్రవహించింది. దీంతో కాణి భూమి పారిన ఈ స్థలానికి కాణి పారకం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది కాణిపాకంగా మారింది. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళత్తుంగ చోళుడనే రాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి. అప్పటి నుంచి బావిలోని వినాయకుడు క్రమంగా పెరుగుతూ ఉన్నాడని ప్రజల విశ్వాసం.

చారిత్రక ఆధారాలు

ఆలయ చరిత్రపై ప్రాచుర్యంలో ఉన్న కథకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లేవు కాని వినాయక విగ్రహం బావిలో ఉన్నదని, క్రమంగా పెరుగుతుందని అనడానికి ఆధారాలు ఉన్నాయి. గతంలో స్వామి వారి విగ్రహ రూపం కొంత మేరకే కన్పించేదని, కొందరు వృద్ధులు అంటున్నారు. ఇప్పుడు స్వామి వారి విగ్రహం ఉదరం, బొజ్జ వరకు కనిపిస్తోంది. స్వామి వారి విగ్రహం పెరుగుదలకు నిదర్శనం అన్నట్టు 1945 సంవత్సరంలో అరగొండ గొల్లపల్లెకు చెందిన బెజవాడ సిద్దయ్య భార్య లక్ష్మమ్మ స్వామివారికి సరిపడా వెండి కవచం చేయించింది. అయితే ప్రస్తుతం ఆ కవచం స్వామి వారికి సరిపోవడం లేదు.

స్వామి బావిలో నుంచే ఉద్భవించాడనడానికి ఆధారంగా ఎప్పుడూ విగ్రహం చుట్టూ నీళ్ళు నిలువ ఉన్నాయి. వర్షాకాలంలో ఈ బావి గుండా నీరు పారుతుంది. కాగా స్వామి వారి విగ్రహం కూడా ఇతర దేవాలయాలలోని విగ్రహాల లాగా చెక్కినట్లు లేదు. స్వామి విగ్రహం రూప సహజ సిద్ధంగా కన్పిస్తుంది. పుణ్యక్షేత్రాలలో వెలసిన విగ్రహాలకు భిన్నంగా స్వామి ఇక్కడ బావి నుంచి స్వయంభువుడుగా ఉద్భవించాడని ప్రసిద్ధి చెందడంతో ఈ పుణ్యక్షేత్రం అత్యంత ప్రాచుర్యం గడించింది.

ప్రమాణాలకు, పరవర్తనకు నెలవు

కాణిపాకం స్వయంభు వరసిద్ది వినాయక స్వామి ఆలయం సత్యప్రమాణాలకు, మానవ పరివర్తనకు నెలవుగా భాసిల్లుతోంది. పురాణ పురుషుడైన శ్రీ వరసిద్ధి వినాయకుడే ఇక్కడ న్యాయ నిర్ణేత. ఎటువంటి వివాదాలు వచ్చినా, నేరారోపణలు జరిగినా నిర్దోషిత్వం నిరూపణకు కాణిపాకంలో ప్రమాణం చేస్తావా అన్న మాటలే వినిపిస్తాయంటే స్వామి వారి మీద భక్తులకు ఉన్న నమ్మకం అర్థమవుతుంది. స్వామి వారి ముందు తప్పుడు సాక్ష్యమిచ్చిన వారు వెంటనే తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తారన్నది ప్రజల ప్రగాఢ నమ్మకం.

అందుకే ఈ ఆలయంలో సత్య ప్రమాణాలు బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీగా కొనసాగుతున్నాయి. ఇక్కడి ప్రమాణాలకు ఆంగ్లేయుల కాలంలోని న్యాయస్థానాలలో కూడా అత్యంత విలువ ఉండేది. దురలవాట్లకు బానిసలైన వారిని కూడా స్వామి వారి సన్నిధిలో చేసే ప్రమాణాలు పరివర్తులను చేస్తున్నాయి. దురలవాట్లు మానుకొంటామని ఇక్కడ ప్రమాణం చేసి ఎందరో పరివర్తన చెందారు.

నదికీ ఒక చరిత్ర

కాణిపాకం పుణ్యక్షేత్రం ప్రక్కన ప్రవహించే బహుదానది పేరు వెనుక ఒక కథ ప్రాచుర్యంలో వుంది. పూర్వం శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు అన్నదమ్ములు కాలినడకన వస్తుండగా చిన్నవాడైన లిఖితుడు ఆకలి బాధ తట్టుకోలేక ప్రక్కనున్న మామిడి తోటలో ఒక పండు కోసుకుని తిన్నాడట. అధర్మమని వారిస్తున్నా మాట వినని తమ్ముడు చేసిన దొంగతనాన్ని అన్న అయిన శంఖుడు రాజుకు తెలియజేశాడు. దీంతో రాజు లిఖితుని చేతులు నరికిస్తాడు. తమ్ముడు చేసిన చిన్న తప్పుకు రాజు వేసిన పెద్ద శిక్షను తలుచుకుని అన్న కుమిలిపోతాడు. కాణిపాకం వరసిద్ధి వినాయకుని దర్శనం కోసం ముందున్న నదిలో తమ్ముణ్ణి స్నానం చేయించాడట. దీంతో వెంటనే లిఖితునికి చేతులు రావడం జరిగిందట. బాహువులు(చేతులు) ప్రసాదించిన దృష్ట్యా ఈ నదికి బాహుదా నది అని పేరొచ్చిందని, కాలక్రమంలో బహుదా నది అయిందని పెద్దలు అంటారు.

శివకేశవ నిలయం

కాణిపాకం పుణ్యక్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజస్వామి ఆలయాలు ఉన్నాయి. వినాయక స్వామి ఆలయానికి వాయువ్య దిశలో ఉన్న శ్రీ మరకదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మహత్య పాతక నివారణ కోసం చోళ రాజ వంశస్థులు నిర్మించిన 101 శివాలయాల్లో ఒకటిగా ఈ శివాలయాన్ని నిర్మించారని అంటారు. సర్పదోష పరిహారం కోసం జనమేజయ మహారాజు నిర్మించిన ఆలయాలలో కాణిపాకంలోని వరదరాజ స్వామి ఆలయం ఒకటిగా చెబుతారు.

ఇందుకు ఖచ్చితమైన ఆధారాలు లేకున్నా ఇవి రాజుల పాలనలో నిర్మించబడ్డాయి అని ఆ నిర్మాణాల తీరు చెబుతుంది. ఈ కాణిపాకం క్షేత్రంలో వినాయక స్వామి ఆలయం ప్రాంగణంలోనే ఇంకా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని దర్శించిన కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి విఘ్నాధిపతితో పాటు శివ, కేశవ ఆలయాలు ఒకే చోట ఉండటం అరుదని, ఇది శివ కేశవ నిలయమని వ్యాఖ్యానించారు.

పూజలు, ఉత్సవాలు

శ్రీ వరసిద్ధి వినాయకస్వామికి నిత్యాభిషేకాలతో పాటు ప్రతి ఏడు 21 రోజులు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. వినాయక చవితి మొదలుకొని తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు, 11 రోజులు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఈ నెల 31వ తేదీ వినాయక చవితి మొదలుకొని సెప్టెంబర్ 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

15-20 ఏళ్ళ క్రితం చిత్తూరు, తమిళనాడుకు చెందిన కొన్ని ప్రాంతాల భక్తులకే పరిమితమైన ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. స్వామి వారి ఆలయ ప్రాశస్త్యానిన ఇంటర్‌నెట్‌లో ఉంచడంతో విదేశాల నుంచి కూడా భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తున్నారు. కానుకలు సమర్పిస్తున్నారు.
అనతికాలంలోనే ఆలయం ఆదాయం ఆరుకోట్లకు పెరిగింది. అయితే పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించడానికి స్థలాభావం కారణంగా దేవస్థానానికి వీలు పడలేదు.

త్వరలో మాస్టర్ ప్లాన్ అమలు

అనూహ్యంగా పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా వారి సౌకర్యార్ధం మాస్టర్ ప్లాన్ అమలుకు దేవాదాయ ధర్మదాయ శాఖ నడుం బిగించింది. ఈ ప్లాన్ ద్వారా ఆరు కోట్ల వ్యయంతో వసతులు కల్పన జరుగనుంది. ఇందుకు అవసరమైన స్థలాన్ని భూసేకరణ చట్టం ద్వారా సమకూర్చుకోవడం జరిగింది. ఈ స్థలంలో కళ్యాణ మండపాలు, 100 విశ్రాంతి గదులు, రోడ్లు, ఉద్యానవనాలు, అధునాతనమైన విద్యుత్ దీపాలంకరణ, పుష్కరిణిలో ఫౌంటైన్లు తదితరాలను ఏర్పాటు చేయనున్నారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శ్రీ మరకదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి, వరదరాజులు స్వామి ఆలయాలను ఒకే ప్రాకారంలోకి తెస్తూ మహాప్రాకారం నిర్మించనున్నారు.

ఇటీవలే 28 లక్షల వ్యయంతో మండపం సర్వాంగ సుందరంగా నిర్మించారు. 42 లక్షల రూపాయలతో మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని, 30 లక్షలతో వరదరాజస్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా కుంభాభిషేకం చేశారు. రాజగోపురం ముందు భాగంలో 25 లక్షల వ్యయంతో సుపద మండపం నిర్మిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ పూర్తి స్థాయిలో అమలయితే కాణిపాకం క్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక ప్రాంతంగా కూడా మారుతుందనడంలో సందేహం లేదు

తెలుగు సాహిత్యంలో గణపతి

మన కావ్య ప్రబంధాల్లో దేవతాస్తుతుల్లో భాగంగా గణపతి స్తుతి కూడా చోటుచేసుకుంది. ఆ అధినాయకుని తెలుగు పద్య కవులు ఎంతో హృద్యంగా వర్ణించారు. గణపతిపై ప్రత్యేకంగా పద్యం చెప్పిన కవులు తక్కువే- వాటిని ఒకసారి స్మరించుకుందాం.

అల్లసాని వారి అల్లిక:

“అంకము జేరి శైల తనయాస్తనదుగ్ధము లానువేళబా
ల్యాంకవి చేష్ట దొండమున నవ్వలిచన్ గబళింపబోయి, యా
వంకకుచంబుగానకహి వల్లభహారము గాంచి వేమృణా
ళాంకురశంకనంటెడు గజాస్యుని గొల్తునభీష్ట సిద్ధికిన్”

పరమశివుడు అర్ధనారీశ్వరుడు గదా! ఆ రూపంలో వున్నపుడు ఎడమవైపున్న పార్వతి వద్ద గణపతి పాలను త్రాగుతున్నాడు. ఆ సందర్భాన్ని ఆధారం చేసుకుని పెద్దన చేసిన చమత్కారం మనల్ని అలరిస్తుంది. పసిబిడ్డలు తల్లి ఒడిని చేరి ఒక వంక చనుబాలు తాగుతూ వేరొకవంక ఉన్న స్తనాన్ని చేతితో పుణకటం సహజం పార్వతీదేవి వద్ద పాలు తాగుతున్న బాలగణపతి చేసే పసితనపు చేష్టను పెద్దన చమత్కరించాడు.

అలా ఒకవైపు తాగుతున్న గణపతి రెండవవైపు తాగడానికి తొండాన్ని చాచాడు. ఆ వైపు స్తన్యము కనిపించలేదు. సర్పహారా లు కనిపించాయి. దానిని లేత తామరతూడనుకొని తొందరగా పట్టుకోబోతున్నాడు. అలాంటి విఘ్నేశ్వరుని నా కోరికలెల్ల సిద్ధించుటకై సేవిస్తానని పెద్దన స్తుతించాడు. ఈ పద్యంలోని వినాయకుని భ్రాంతి, మ నుచరిత్రకథలోని వరూధిని భ్రాంతికి సూచన అంటారు విమర్శకులు.

మొల్ల బొమ్మ కట్టించిన గణపతిని చూడండి:

చంద్రఖండకలాపు, జారువామనరూపు,
గలితచంచల కర్ణుగమల వర్ణు,
మోదకోజ్జ్వల బాహు, మూషకోత్తమవాహు,
భద్రేభవదను, సద్భక్తసదను,
సన్మునిస్తుతిపాత్రు, శైలసంభవపుత్రు,
ననుదినామోదు విద్యాప్రసాదు,
పరమదయాభ్యాస, బాశాంకుశోల్లాసు,
మరుతరఖ్యాతు, నాగోపవీతు
లోకవందిత గుణవంతు, నేకదంతు
నతులహేరంబు, సత్కరుణావలంబు
విమల రవికోటి తేజు, శ్రీవిఘ్నరాజు
బ్రధిత వాక్ప్రౌఢి సేవించి ప్రస్తుతింతు ॥

చంద్రరేఖ అలంకారంగా కలవాడు, అందమైన గుజ్జురూపం, కదిలే చెవులు, చేతిలో ఉండ్రాళ్ళున్నవాడు, మూషికవాహనుడు, గజముఖుడు, సద్భక్తులయెడ నిలిచేవాడు, పరమమునులచే స్తుతించబడేవాడు, పార్వతీపుత్రుడు, విద్యలిచ్చేవాడు, అనుదినానందకరుడు, దయామయుడు, పాశము, అంకుశము ధరించి, నాగయజ్ఞోపవీత ధారియై లోకాల మ్రొక్కులు పొందే గుణవంతుడు, ఏకదంతుడు, కరుణామయుడు, కోటి సూర్యతేజుడు, హేరంబుడు అయిన శ్రీ విఘ్నరాజును నుతిస్తాను. ఇలా వినాయకుని రూపాన్ని శబ్దాలంకార మండితంగా వర్ణించి మన కళ్ళముందు నిలుపుతుంది మొల్ల.

ఇక పోతనగారి వినాయకస్తుతి తెలుగువాళ్ళ నోళ్ళలో నానిన పద్యం:

“ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగ సం
పాదికి దోషభేదికి బ్రసన్న వినోదికి విఘ్నవల్లికావి
చ్ఛేదికి మంజువాదికి గణేష జగజ్జన నందవేదికిన్
మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్”
పై పద్యంలో ‘అద్రి సుతాహృదయానురాగ సంపాదికి’ – అని పార్వతీదేవి హృదయానురాగాన్ని పొందినవాడనటం విశేషం. విఘ్నాలు పోగొట్టి, జగజ్జనులకు మొక్కుగొని ఆనందాలిచ్చేవాడు, మూషిక వాహనుడు, ఉండ్రాళ్ళు తినేవాడు అయిన విఘ్ననాయకుని పోతన నుతించాడు.

శివకవులలో అగ్రగణ్యుడైన నన్నెచోడుడు కుమారసంభవంలో వినాయకుని వర్ణించిన తీరు ఇలా ఉంది.

తను వసితాంబుదంబు, సితదంత యుగంబచిరాంశు, లాత్మగ
ర్జనమురు గర్జనంబు, గరసద్రుచిశక్రశరాసనంబునై
చనమదవారి వృష్టిహితసస్య సమృద్ధిగ నభ్రవేళనా
జను గణనాథు గొల్తుననిశంబునభీష్ట ఫలప్రదాతగాన్ ॥
అని స్తుతిస్తాడు. ఇందులో నీలమేఘమే విఘ్నేశ్వరుని తనువు. మెరుపే తెల్లని దంతపుకొన. ఉరుమే గర్జన. ఇంద్రధనుస్సే తొండము కాంతి. ఇలా వర్షాకాలపు లక్షణాలన్నీ గణపతి యందు ఉండుటచే నతనిని వర్షాకాలంతో రూపించటం జరిగింది. వర్షాకాలం సస్యసమృద్ధిని కలిగించునట్లు గజముఖుడు మదజలమనే వర్షంతో భక్తులకు హితాన్ని కలిగిస్తాడు. అట్టి గణపతిని తన అభీష్టాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. ఇలా ఏనుగు లక్షణాలను వర్షాకాలంతో రూపించి చెప్పడం కనిపిస్తుంది.

శ్రీనాథుని వర్ణన ఇలా ఉంది:

జేజేయంచు భజింతు, నిష్టఫలసిద్ధుల్ మదింగోరి, ని
ర్వ్యాజ్య ప్రౌఢ కృపావలంబుని గటపుస్యంది దానాంబునిం
బూజాతత్పర దేవదానవ కదంబున్, బాలకేళీ కళా
రాజత్కౌతుకరంజి తోరగప్రాలంబు హేరంబునిన్ ॥
పద్యారంభం ‘జేజే యంచు భజింతు’ – ననటంలో పదాలు తెలుగువి కాకున్నా, తెలుగుదనంలా ఆకర్షిస్తుంది. అవ్యాజమైన దయను ప్రసరించేవాడు, చెక్కిళ్ళపై మదజలం స్రవించే గజముఖుని, దేవదానవుల పూజలందుకునే వానిని, పిల్లచేష్టలతో చంద్రుని నవ్వించేవాడు సర్పం యజ్ఞోపవీతంగా వ్రేలాడువాడు అయిన గణపతిని స్తుతించాడు.

పారిజాతాపహరణంలో నంది తిమ్మన చేసిన ఈ స్తుతిని చిత్తగించండి:

గజముఖుని ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క వరం ఇవ్వాలని కోరటం ఇందులో కనిపిస్తుంది.
“తనదంతాశ్రము చేత దీక్ష్ణమతి, యుద్యత్కుంభ యుగ్మంబు చే
తనితాంతోన్నతి, దానవిస్ఫురణ నుత్సాహంబు, శుండాముఖం
బున దీర్ఘాయువు నిచ్చు గావుతగుణాంభోరాశికింగృష్ణరా
యనికి న్వారణ రాజవక్త్రుడు కృపాయత్తైక చిత్తాబ్జుడై”
దంతం చివరిచేత కుశాగ్రబుద్ధిని, కుంభస్థలము చేత ఇతోధిక వృద్ధిని, మదజలంతో ఉత్సాహాన్ని, ఏనుగు ముఖంతో దీర్ఘాయువును దయతో విఘ్ననాయకుడు, రాయలకు ఇవ్వాలని ఇందులో భావం. అంటే మనం వినాయకుని ఆయా అంగాలను పూజించటం ద్వారా మనకు లభించే ఫలాన్ని చెప్పకనే చెప్పినట్లు.

‘సంగీత సాహిత్య రహస్య కళానిధి’ అనిపించుకుని వసుచరిత్ర రచనతో వాసికెక్కిన రామరాజభూషణుని స్తుతిని చూడండి. ఇది ఎంత ప్రౌఢంగా సాగిందో!
“దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీస్వయంగ్రాహముం
గంతుద్వేషికి గూర్చి శైలజ కుందడ్గంగాఘరాచాంతిన
త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ
స్వాంతంబుల్వెలయింప జాలునిభరాడ్వక్త్రుంబ్రశంసించెదన్”

వినాయకుడు దంతం పెకలించి వెండికొండను కదిలించాడు. భయపడిన పార్వతి శివుని కౌగిలించుకున్నది. అంతటితో ఆగక తొండంతో శివుని జటాజూటంలోని గంగాజలాన్నంతటినీ పీల్చాడు. ఇటువంటి ప్రయత్న తీవ్రతతో, పార్వతిని సంతోషపరచి, గంగమ్మను చిన్నబుచ్చి పుత్రధర్మాన్ని (తల్లిదండ్రులను సంతోషపెట్టే పని) సార్థకం చేసిన గజాననుని కీర్తిస్తున్నాను.

కొఱవి గోపరాజు ‘సింహాసనద్వాత్రింశిక’- ఆరంభంలో పార్వతీదేవి తొడలపై ఆడుకునే ముద్దుగణపతిని, పసిడిముద్దగా భావించి కీర్తిస్తాడు. అలాగే హంసవింశతి కావ్యకర్త అయ్యలరాజు నారాయణుడు ‘నృత్య గణపతి’ని కీర్తిస్తాడు. ప్రబోధ చంద్రోదయంలో (నందిమల్లయ, ఘంట సింగన) విఘ్నేశ్వరుని ఆకాశతత్వానికి ప్రతీకగా సంభావించటం కనిపిస్తుంది.
ఆదిభట్ల నారాయణదాసుగారు
“బొజ్జనుండ్రాళ్ళ నించిన గుజ్జువేల్ప
పాపజన్నిదముల నెలవంక దాల్ప
రమ్ముభక్తుల భవసాగరమునదేల్ప
తగునె నాబోటి నీదు తత్వంబు బోల్ప”
– అంటూ పాడిన కీర్తన తెలుగువాళ్ళ చెవులలో ఇంకా మ్రోగుతూనే ఉంది.
కరుణశ్రీ గణపతి స్తుతిని గురించి చెప్పుకోకపోతే, గణపతి స్తుతిని గురించి చెప్పుకున్నట్లే కాదు.

ఈ పద్యాన్ని చూడండి:
ఎలుక గుఱ మునెక్కి నీరేడు భువనాల
పరువెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకములనేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
‘నల్లమామా’ యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లుకుఱ
వడకు గుబ్బలి రాచవారి బిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోము పంట
అమరులందగ్రతాంబూలమందు మేటి
ఆరుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్ర విద్యార్థి! లెమ్ము జోహారులిడగ!”

ఎలుక గుర్రాన్నెక్కి ఏడేడు భువనాలు సంచరిస్తాడని, ముల్లోకాలేలే పరమేశ్వరుని ఇంటి పెత్తందారని (పెద్దకొడుకే సాధారణంగా పెత్తనం చేయటం చూస్తాం కదా! అందుకని పెత్తందారని అనటం), ఎంత గొప్పగా భావించాడు. పార్వతి విష్ణుమూర్తిని అన్నయ్యగా భావిస్తే, మరి గణపతికి మేనమామ విష్ణుమూర్తే కదా! అందుకే తన ఇంటికి అతిథిగా వచ్చిన మామయ్యను (నారాయణుని) ‘నల్లమామా’- అని వరుసలాడాడట గణపతి. విష్ణువు నల్లనివాడు కదా! అందుకని. ఈ పరియాచకాలాడే సంప్రదాయం మన తెలుగు లోగిళ్ళలో నిత్యం చూసేదే. అలాంటి తెలుగుదనాన్ని ఇక్కడ పొదిగి గణపతిని మన హృదయాల చెంతకు తీసుకొచ్చిన కరుణశ్రీ ఎంత ధన్యుడు?

“కుడుములర్పించు పిల్ల భక్తులకు నెల్ల
యిడుములందించి కలుములందించు చేయి
పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి
తెలుగుబిడ్డల భాగ్యాలు దిద్దుగాక!”

నిమజ్జనం ఎలా చేయాలి?

వినాయక చవితికి, దసరాకు నవరాత్రులు నిర్వ హించడం సంప్రదాయం. తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి, ఆ తరువాత దేవతా మూర్తులను నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్నది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో గణేశ నిమజ్జనం ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి నాడు కానీ, 3, 5, 7, 9వ రోజు కానీ నిమజ్జనం నిర్వహించాలి. అంటే బేసి సంఖ్య వున్న ఏ రోజైనా స్వామిని నిమజ్జనం చేయవచ్చు. నిమజ్జనం చేసే ముందు గణపతికి భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తీర్థ ప్రసాదాలను అందరూ భుజించి ఆ తరువాత సంప్రదాయ బద్ధంగా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించాలి. నిమజ్జన ఊరేగింపు సమయంలో ఉత్సాహంతో కేరింతలు కొట్టడం, పాటలు, నృత్యాలు సహజమే.

గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో ఎంతో శాస్త్రోక్తంగా పూజ చేసి మరీ ఉత్సవాలను ప్రారంభిస్తాం. మరి నిమజ్జనం చేసే సమయంలో ఎటువంటి సంప్రదాయం పాటించాలి? ఏ మంత్రాన్ని.. ఏ శ్లోకాన్ని పఠిస్తూ ఆ గణనాధుడ్ని నీటిలోకి వదలాలి? నిమజ్జన ఉత్సాహ సమయంలో ఈ సంప్రదాయాన్ని పాటించే వారు చాలా తక్కువమంది వుంటారు… అసాధ్యమైన విషయమేమీ కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ గణనాధుడ్ని నీటిలోకి జారవిడిచే ముందు శ్రీ గణేశం ఉద్వాసయామి … శోభనార్ధం పునరాగమనాయచ అని చెప్పుకోవడం సంప్రదాయం.

ఓం శాంతి శాంతి శాంతిః
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకస్సమస్తాస్సుఖినోభవంతు

అంతుపట్టని వింతదేవుడు

మన దేవతలలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే.పూర్ణకుంభం లాంటి ఆ దేహం, బానవంటి ఆ కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు.ఏనుగు తల, సన్నని కళ్ళు, సునిశిత పరిశీలనకు, మేథస్సుకు సంకేతాలు. ఆ వక్రతుండము, ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే’ఆత్మ’ లోని చమత్కారం. ఆ పొట్టను చుట్టి వుండే నాగము (పాము) శక్తికి సంకేతం. జగత్తునంతా ఆవరించి వున్న మాయాశక్తే ఈ నాగము
.
నాల్గుచేతులు మానవాతీత సామర్థ్యాలుకు,తత్త్వానికి సంకేతం. చేతిలో వున్న పాశ, అంకుశములు బుద్ధి,మనస్సులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే. వ్యాస భగవానుడు మహాభారతం రాయసంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. ఇదంతా విజ్ఞానం కోసం చేయవలసిన కృషికి. త్యాగానికి సంకేతాలు. మరొక చేతిలో కనిపించే మోదకం-ఉండ్రాయి ఉంటుంది. కొందరి మతం ప్రకారం అది కపిత్థం (వెలక్కాయ) ఏదిఏమైనా పైనచూస్తే గట్టిదనం లోపల తియ్యదనం ఉండేదనడానికి సంకేతం. గణేశునికి మూడు కళ్ళు, మూడవ కన్ను జ్ఞాననే త్రం. చేటలంత చెవులు మొరలాలించే ఆ దేవుడి ప్రత్యేకతను సూచిస్తాయి.

నిజం చెప్పాలంటే- గణేశమూర్తి వినోదకరమేమోగాని సుందరం కాదు. అదికూడా ఒక సంకేతమే. బాహ్యసౌందర్యానికి అంతర్గత మహోన్నతికి సంబంధం లేదని ఆ రూపం సూచిస్తుంది. వినాయకునికి సంబంధించి ఇంకో ప్రత్యేకతను ఇక్కడ చెప్పుకోవాలి. భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసివుంటే క్షమించమని చెంపలు వేసుకోవడం ఉంది కానీ, వినాయకుని ఎదుట అంత మాత్రం చాలదు. చేసిన తప్పులకు మనకు మనం శిక్ష విధించుకుంటున్నట్లుగా గుంజీలు తీయడం ఆయనంటే మనకున్న భయభక్తులకు గుర్తు. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు, నిగూఢ సంకేతాలు కలిగిన అధినాయకుడు మన వినాయకుడే.

ఎలుక గుర్రపు స్వామి

పిండితో చేసి ముద్దుల పిల్లవాని
ప్రాణమును పోసి మురిసెను పార్వతమ్మ
తండ్రిచే త్రుంచబడినట్టి తలకు బదులు
దంతి శిరముంచబడెనంట ఎంత వింత

తల్లిదండ్రుల ముద్దుల తనయుడతడు
ప్రమధ గణముల గౌరవపాత్రుడతడు
చల్లగా చూచు భక్తులనెల్ల నతడు
బొజ్జ గణపతియనబడు గుజ్జువేల్పు

చెరకు వడపప్పులన వచ్చు పరుగు లిడుచు
ఏనుగులు అశ్వములు నాకు ఏలటంచు
ఎలుకనే గుర్రముగచేసి యేగుచుండు
విఘ్నపతిగొల్వగలుగును విజయమెపుడు

మారేడు పత్రముల్ మరిమరి తెమ్మను
దానిమ్మ పూలపై తగని ప్రీతి
దేవకాంచనపూల దేహముప్పొంగును
తామరతూడుకు తలను వంచు
దర్భపోచల మీద తగని మక్కువ జూపు
వుమ్మెత్త పూలకు వుబ్బిపోవు
గన్నేరు పూలను ఎన్నైన తెమ్మను
వుత్తరేణిని గాంచ చిత్తమలరు

పండ్లు ఫలహారములకన్న భక్తులిచ్చు
పచ్చి గరికెనె తానెంతొ మెచ్చుకొనును
అల్పసంతోషి అందరి యాత్మబంధు

ఎలుక వాహనమెక్కి యేగుచుండు నెవండు
పత్రిపూజలనందు ధాత్రినెవడు
అమ్మ పార్వతిదేవి అనుగు పుత్రుండెవడు
ప్రమధ గణాలకు ప్రథముడెవడు
ముక్కంటి మెప్పించు ముద్దుకుర్రడెవండు
ఆది పూజలనందు నాతడెవడు
ఎల్లజనులను గాచు ఏకదంతుడెవండు
విఘ్నములను బాపు వీరుడెవడు

కుడుములుండ్రాళ్ళనిచ్చిన కులుకునెవడు
గజముఖంబును గల్గిన ఘనుడెవండు
వేల్పులందరు పూజించు వేల్పు ఎవడు
అట్టి దేవుని గొల్తునే ననవరతము
వివిధ రూపాల్లో గణపతి

వివిధ రూపాల్లో గణపతి

మహాగణపతిం భజే
“బ్రహ్మ విష్ణ్వాది గణానాం ఈశః”
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతాగణాలందరికీ విఘ్నేశ్వరుడు ప్రభువు.
“వినాయకో విఘ్నరాజో దైమాతుర గణాధిప
అప్యేవదంతో హేరంబో లంబోదర గజాననా”

వినాయకుడు, విఘ్నరాజు, ద్వైమాతురుడు, గణాధిపతి, ఏకదంతుడు, హేరంబుడు, లంబోదరుడు, వ్రాతపతి, ప్రమధపతి, విఘ్ననాశి, శివసుతుడు, వరదమూర్తి అను ద్వాదశ నామములతో సంప్రీతిగా ఆ దేవదేవుని పూజిస్తాం.
శ్రీ గణపత్యధర్వ శీర్షములో గణశబ్దములలో “గ్” అను హల్లును ప్రథమంగా ఉచ్ఛరించి అక్షర సముదాయంలోని “అ” మిళితం చేయడం వల్ల గ్+అ=’గ’ అయి దీనిపై అనుస్వారం ఉంచగా అర్దేందులసితమ్- అర్ధచంద్రాకృతిలో శోభించునని చెప్పబడింది.
ఓం గం ఏకాక్షరి మంత్రస్వరూపం. ఓం గణపతియే నమః గణేశ జ్ఞానం కలుగజేసే మహామంత్రం. గణ+పతే= దేవాది గణములకు ప్రభువు. బ్రహ్మస్వరూపుడు, జగత్సంహారకర్త ఛిద్రూపంతో భాసించే చిత్స్వరూపుడు.

శివపురాణం రుద్రసంహిత భాగంలో చెప్పబడిన విధంగా. నలుగు పిండితో చేసిన వినాయకుడికి అంబ కరుణ వల్ల ప్రాణప్రతిష్ఠ జరిగిందనీ, ఈశ్వరుని చేతిలో క్షత్రుడై గజాసురుని శిరస్సుతో పునః ప్రాణప్రతిష్ఠితుడై ప్రథమ, ప్రమధ గణపతిగా పూజలందుకొంటున్నాడు.
గణపతి కృతయుగంలో పది చేతులతో సింహవాహనారూఢుడిగా, త్రేతాయుగంలో ఆరు చేతులతో నెమలిని వాహనంగా కలిగినవాడుగా, ద్వాపరయుగంలో నాలుగు చేతులతో ఏనుగు ముఖంతోనూ, కలియుగంలో తెల్లని దేహంతో రెండు చేతులతోను భక్తులను రక్షించినట్లు గణేశపురాణం చెప్తోంది.
భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుడ్ని పరమశివుడు గణాధిపతిని చేశా డు. కాబట్టి ఆ రోజున వినాయకుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. వేదములు, సమస్త ఉపనిషత్తులందును గణేశుని విశిష్ట రూపవర్ణన గలదు.

“ఖర్వం స్థూలతమం గజేంద్ర వదనం
లంబోదరం సుందరం దంతాఘాత
విదారి తారి రుధిరైః సింధూర శోభాకరం
వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదం కర్మసు”
గణపతికి ఒకే దంతం ఉన్నట్లు, ఆయనకు మరొక దంతం లేకపోవడానికి గల కారణాలు తెలిపే పురాణగాథలు కొన్ని ప్రచారంలో ఉన్నాయి. ఒక సందర్భంలో పరశురాముడికి, గణపతికి జరిగిన యుద్ధంలో దంతం పోయినట్లుగా చెబుతుండగా, మరొక కథ చంద్రుడొకసారి గణపతిని అవమానించగా చంద్రుడి మీదికి తన దంతాన్ని గజాననుడు విసిరాడని చెప్తోంది.

ఏకదంత నామంలో ఉండే మరో అంతరార్థాన్ని పరిశీలిస్తే
“ఏకశబ్దాత్మికా మయాతస్యః
సర్వం సముద్భవం
భ్రాతి మోహదం పూర్ణం
నానా ఖేలాత్మికం కిల”
ఏక అంటే మాయ “దంత” అంటే నిజంగా ఉండేది. సత్తాధారుడిగా, చాలకుడిగా ఆయన ప్రపంచాన్ని నడుపుతూ ఆనందిస్తుంటాడు. “మాయ”తో ప్రపంచాన్ని నడిపేవాడు చాలకుడు.

గణపతికి ఇద్దరు భార్యలు ఉన్నట్లుగా చెబుతారు. సిద్ధి, బుద్ధి అనే పేర్లతో పిలవబడుతున్నారనీ అంటారు. సిద్ధియందు ‘క్షేమాఖ్యుడు’ బుద్ధియందు ‘అమరలాభాఖ్యుడు’ అనే పుత్రులున్నట్లు తెలుస్తోంది.
ఇంద్రుడు వృత్రాసురుని వధింపపోవునప్పుడు, రాముడు రావణుని దండెత్తునపుడు, భగీరధుడు గంగను తెచ్చునప్పుడు, దేవాసురులు అమృత మధ్య సమయమున, సాంబుడు తన కుష్టురోగాన్ని పోగొట్టుకోవడానికి విఘ్నరాజుని ప్రార్థించి లబ్ధి పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి.

భాద్రపద శుద్ధ చవితినాడు ఉదయమున లేచి స్నానమాచరించి, సంధ్యా వందనం మొదలగు నిత్యకర్మలను జేసికొని తమ శక్తికి తగినట్లుగా వెండితోగాని, బంగారంతో గాని తుదకు మట్టితో గాని వినాయక ప్రతిమను జేసికొని తన యింటి ఉత్తరవైపున, నొకపాలవెల్లి నేర్పరచి దాని నడుమ ఎనిమిది దళములు గల కమలమును యవలతోగాని, బియ్యపు పిండితో గాని నిర్మించి అచ్చట ఆ ప్రతిమ నుంచి భక్తిపూర్వకముగా తెల్లని గంధముతోను, అక్షతలతోను, పూలతోను, గరిక పోచలతోను ఇరువది ఒక్క పత్రములతోను పూజచేసి ధూప ధీపములను సమర్పించి, నేతితో వండిన కుడుములు ‘టెంకా’యను అరటిపండ్లు, నేరేడుపండ్లు, వెలగపండ్లు, చెరకుగడలు మరి అనేక విధముల లభ్యమగు భక్ష్యములు పండ్లు నైవేద్యంగా సమర్పించి వినాయకుని దనివి నొందించి భక్తితో ఈ వ్రతము నాచరించిన వారు ఎట్టి విఘ్నములు లేక కార్యసిద్ధి బడయగలరు. గణ నాయకుని ప్రసాదము వలన అట్టి మనుష్యునికి సకల కార్యములు సిద్ధించునని, స్కాంద పురాణం చెప్తోంది.

వైష్ణవ ఆగమంలో గణపతిని విష్ణువుగా పూజిస్తారు. మధ్యప్రదేశ్‌లోని మండేసేర్ నందు, కన్యాకుమారి (శుచీంద్రం)లోను, మధుర సుందరేశ్వర్ ఆలయాలలో గణపతిని స్త్రీ రూపంలో (గణపతి మూర్తిని) కొలుస్తారు. ప్రపంచంలో టిబెట్, చైనా, జపాన్, బర్మా, మెక్సికో, కంబోడియా, అమెరికా మొదలగు ప్రాంతాలలో పూజలందుకొంటున్న గణపతి దేవుడు విశ్వవ్యాపకుడు.

గణేశుడు వరేణ్య మహారాజుకిచ్చిన సందేశంలో “ఓ రాజా ఎవరైతే అంత్యకాలమందు పూర్తి విశ్వాసంతో నన్ను స్మరిస్తూ అంతిమశ్వాస విడుస్తారో వానికి పునర్జన్మ లేదు. ఎవరైతే ఏమాత్రమూ పరధ్యానము లేక నన్ను భక్తితో ఆరాధిస్తూ నా సహాయాన్ని అర్థిస్తారో వారి కష్టాలన్నింటినీ నేనే ఎదుర్కొని వారి కోరికలు తీరుస్తాను” (గణేశ సంహిత 6-6-420).

“అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్ష, రక్ష, వినాయక”
కుల మత భేదములు లేక ఎల్లరూ ఈ వ్రతమాచరించి గణేశుని కృప పొందాలని ఆకాంక్ష.
వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

శ్రీ విఘ్నేశ్వర దండకం

శ్రీ మన్మహారాజ రాజశ్వరీదేవి యంకంబులో స్తన్య పానంబుతో తన్మయత్వంబునన్ అంతులేనట్టి వాత్సల్య దుగ్ధాంబుధిన్ దేలియాడంగనిన్ జేరి యర్చించు భక్తావళిన్ సర్వవిఘ్న ప్రకాండంబులన్ రూపుమాయించి నానా వరంబుల్ ప్రసాదించి ఈరేడు లోకాల శోకాలు మాన్పించి రక్షించు చున్నట్టి యో విఘ్నరాజా భవత్పాద మందార మకరంద మాశించి నానేత్రభృంగంబులీనాడు వ్రాలెన్ కారుణ్యసారంబు ప్రసరించి కాపాడగా రమ్ము నీవానిగా నన్ను జేకొమ్ము వేదవేదాంగ వేదాంత సారంబులన్ సర్వశాస్త్రార్థ సద్విద్య సందోహముల్ నిన్ను మూలంబుగా గౌరవస్థాన మందుంచి పూజించు ముల్లోకమందెవ్వరేమైన సత్కార్య కర్మంబు జేయంగ మున్ముందుగా నీదునామంబు కీర్తించి యర్చింత్రు,

నీ నామమే సర్వగీర్వాణ సంపూజ్యమై నిత్య సన్మంగళ ప్రాభవంబై ప్రకాశించు నీ రూపు సేవించి యంభోజ సంజాతుడున్ నిర్జరేంద్రుండు నానా విదార్థంబులన్ బొంది సంతోషమున్నందు, రెల్లప్పుడున్ దేవదేవారులున్, యక్షగంధర్వ గరుడోరగాదుల్ భవన్మాయ దెలియంగలేకెంతయో విస్మయాంతాత్ములై యుందురో దేవ షాణ్మాతురుండప్పుడు యుష్మత్ ప్రభావంబు శంకించి అవనీతలం బొక్క నిమిషంబులో తివిరి నేవత్తునంచున్ మనోవేగ మొప్పారగాబోవ నీవంతలో భక్తియుక్తండవై శైలరాజేంద్రతనయన్ జగన్మాతకున్ మందగమనంబుతో జుట్టిరాగా, మహాదేవుడే నీ మహాత్వంబపూర్వంబుగా సుస్థిరత్వంబుగా చాటడామున్ను! రజతాచలేంద్రాగ్ర భాగంబునన్ శారదేందుప్రభా భాసితాశావకాశంబునన్ సహజ గాంభీర్య గమనంబుతో సంచరింపంగ దర్శించి సనకాది సన్మౌనిబృందంబు పూర్ణేందుబింబంబు నిర్జించు నీ యొక్క మత్తేభవక్త్రంబు నీ గుజ్జురూపున్ తదేకంబుగా జూచి యానందమున్ బొందదా!

తారకానాధుడానాడు సౌందర్యశోభా సమోపేత శృంగార సర్వాంగుడై తన్ను కాంతాసమూహంబు మోహంపు చిరునవ్వుతో మంచి నీరాజనంబుల్ సమర్పింపగా అన్నుమిన్నేమియున్ గానగాలేక నీ హ్రస్వరూపంబు వీక్షించి నవ్వంగ నా వారిజారిన్ భవత్కోపదావాగ్ని కిన్నాహుతిన్‌జేయ నుంకించినన్ భీతిచే గర్వమంతన్ విసర్జించి దాసోహమంచున్ నినున్ జేరగా పార్వతీనాధు జూటాగ్రచూడామణిన్ జూచి వర్షవర్షంబునన్ భక్తియుక్తంబుగ సర్వపుష్పంబులన్, సర్వపత్రంబులన్, ద్రాక్ష, జంబీర, నారంగ, రంభాది నానాఫలంబుల్ సమర్పించి యర్చించు సద్భక్తబృందంబులన్, శోభనంబుల్ ప్రసాదించి రక్షింతునంచున్ వచింపంగ, నీలదాకాశ మధ్యంబులో నుండి విద్యుల్లతా భాసురాంగుల్ నిలింపాగనల్ దివ్య ప్రసూనంపు వర్షంబు వర్షించి హర్షింపరా!

మోదకాఖాది మూషికారోహణానందలోలుండవై ముమ్మూర్తులన్ మూడు లోకంబులన్ మంత్రముగ్ధాత్ములన్ జేయవానీవు! ద్వారకానాధుడానాడు సత్రాజితున్ జేరరావించి నీ ఇంటిలో భానుదత్తం బనావృష్టి వార్యంబుగానున్న మణిరాజమిమ్మన్న, మోమాటమింతైన బాటింపకన్ వాడుశౌరిన్ తిరస్కార వాక్యంబులన్ బల్కె నొక్కింతకాలంబుమీదన్ ప్రసేనుండు తమ్ముండు మణిబూని చరియించుచుండంగ కాంతార మధ్యంబులో సింగ మొక్కండు దుష్టోగ్రదంతంబులన్ వానికాయంబు గాయంబుగా జేసి వధియింప, సత్రాజితుండీయదార్థంబు నింతైన గుర్తింపకన్ కృష్ణుడే వాని ప్రాణంబులన్ దీసి మణిగొన్న వాడంచు దుష్ట ప్రచారంబు గావింపగా, రుక్మిణీవల్లభుండాత్మ చింతించి “యేపాప మేమాత్ర మెరుగంగలేనైన దుష్కీర్తివాటిల్లె యోపార్వతీపుత్రయో మేరుగంభీర సద్గాత్ర పాపంబు పుణ్యంబులన్, సర్వకర్వంబులన్ సాక్షివీవేకదా” యంచు ప్రార్థించి, షడ్రసోపేత మృష్టాన్నముల్, పంచబక్ష్యంబులన్, భక్తినైవేద్యమర్పించి పూజించి,

ఘోరాటవిన్ బాగుగాలించి గాడాంధకార ప్రపూర్ణంబునై దుర్గమంబై పాదసంచారియై పోయి, యుద్ధంబులో సాటిలేనట్టి మేటిన్ మహాకాయు భల్లూకనాధున్ కడున్‌నొవ్వగాజేసి మెప్పించి, భానురత్నంబుతో భామతో వచ్చి నిర్ముక్త పాపుండునై కీర్తిధాముండునై యొప్పె భవత్కర్ణ సంచాలనోద్భూత ఝుంఝూనిలం బస్మదీయంపు పాపౌఘ సంజన్య దురితావళిన్ పంచబంగాళ మొనరించు సొంపుతావుల్ గుబాళించు పుష్పంబులా లేవు అర్పింప నామస్తకంబీదు చరణంబులందుంచినాడన్ భవత్ప్రీతిగా నేలుకోవయ్య యో సిద్ధి గణనాధ సర్వ కార్యర్థసిద్ధిన్ ప్రసాదించి రక్షింపుమోదేవ నిన్నెంత కీర్తించినన్ తృప్తియేలేదు మాకింత సంసార మోహంబులో నుండి కూపస్థ మండూకలీలన్ గృహంబున్ విశాల ప్రపంచంబుగా నెంచి నీపాదకంజంబులన్ మ్రొక్కి పూజింపగా నిశ్చలత్వంబు శూన్యంబు అజ్ఞాన తిమిరాంధకారంబులో పూర్ణజ్యోతి స్వరూపంపు నీవే కదా మమ్ము దరీజేర్చి గాపాడుమో ఏకదంతా, బృహత్కీర్తిమంతా సదావిఘ్నహర్తా జగత్కార్యకర్తా నమస్తే నమస్తే నమస్తే నమః.

విఘ్నదేవ!

ఒక్కసారె నీదు చెక్కిళుల్ రెంటిని
ముద్దుగొనగ నెంచు ముచ్చటెరిగి
తల వెనక్కి లాగి తల్లిదండ్రులకు మోద
మిడెడు నీదు చేష్ట నెంతునెపుడు ॥

నీదు మోము, బొజ్జ, నీవాహనము చూడ
లాస్యమాడు హాస హాస్యమందు;
వ్యావసాయికంబు నాధ్యాత్మికంబైన
వెలుగుతోచు గాదె! విజ్ఞులకును ॥

వ్యాస భారతంబు వ్రాయసగాడవై
వరలు దేవ! మాదు భావి భార
తంబు తిరుగవ్రాయ ధరపైకి రమ్మెన్ని
కలఫలంపు నాయకత్వ మొప్ప ॥

గొప్ప కరువు, “కోకకోలా”టముల పుష్క
రాలలోన మునిగితేలు మమ్ము
నిండు దయను చూచి, నిలుప ఆంధ్రజ్యోతి
వేగిరమ్ము రమ్ము! విఘ్నదేవ ॥
– డా॥ రామడుగు వేంకటేశ్వర శర్మ

విఘ్ననాయకుండ వేగరమ్ము!

మొన్నమొన్ననే గౌతమీ పుష్కరములు
రంగరంగ వైభవముగ హంగు మీర
జరుపుకొన్నట్టి భూమికి సాగిరమ్ము
పుష్కర స్నానమును జేసి పొమ్ము దివికి

అల్ప పీడనమున స్వల్పవర్షమ్ములు
కురియుచుండె; ఋతువు కురియకుండె
భాద్ర పదము నందు భద్రమ్ము గూర్చగ
విఘ్ననాయకుండ వేగరమ్ము

కుటిల వర్తనముల కుళ్ళుచుండెడివారి
మనసులెల్ల మార్చి మంచి గూర్చి
జగమునందు సమత సమకూర్చు యత్నమ్ము
ప్రజలు చేయునట్టి ప్రతిభనిమ్ము

నిన్ను గొలుచువారి నెన్నడు బాయక
కాచుచుండునట్టి కరుణ నీది
గడ్డిపోచ తోడ ఘనమైన తృప్తిని
పొందుచుందువీవు పుణ్యమూర్తి

విఘ్వేశ్వర జననం

విఘ్నేశ్వర జన్మ వృత్తాంతంపై పలు రకాల గాథలున్నాయి. వాటిని ఒక్కొక్క పురాణం ఒక విధంగా వర్ణించింది. వాటిలో వరాహ పురాణం పేర్కొన్న విఘ్నేశ్వర జన్మ వృత్తాంతం తక్కిన పురాణ కథలకు భిన్నంగా ఉంది. ఈ పురాణం విఘ్నేశ్వరుడు ఆకాశం నుంచి జన్మించినట్టు చెప్పింది. రాక్షసుల బాధ ఎక్కువ కావడంతో ఆ బాధ నుంచి విముక్తి చెందే ఉపాయం చెప్పమని ఋషులు, దేవతలు శివుడిని అడిగారు. పరమ శివుడు ఈ విషయమై సుదీర్ఘంగా ఆలోచిస్త్తూ ఒకసారి తల ఎత్తి ఆకాశం వంక చూశాడు.

అప్పుడు ఆయన కంటికి అత్యంత సుందరంగా పార్వతీదేవి కనిపించింది. శివుడు అప్రయత్నంగా ‘పంచభూతాలలో తక్కిన వాటికంతా రూపం ఉండగా ఆకాశానికి ఎందుకు లేదు’ అని ప్రశ్నించాడట! జగజ్జనని అయిన పార్వతిని చూచి పరమ శివుడే అట్లా ప్రశ్నించడంతో ఆకాశం పుత్రరూపం దాల్చి శివుడి ఎదుట నిలిచింది. అదెంత సుందర రూపమంటే పార్వతిదేవి కూడా చంచల చిత్తంతో చూసిందట. ఆ బాలుడు ఇతర దేవతా స్త్రీలను కూడా అట్లాగే భ్రమింప చేయడంతో పరమ శివుడికి కోపం వచ్చి “నీవు ఏనుగు తల, బాన కడుపుతో వికార రూపుడవు కమ్మని’ శపించాడు.

వెంటనే ఆకాశం నుంచి జన్మించిన ఆబాలుడు ఆ రూపంలోకి మారాడు. ఈశ్వరుని వల్ల విఘ్నత చెందడం వల్ల ఆయనకు విఘ్నేశ్వరుడనే పేరు వచ్చింది. అంతటితో శివుడి కోపం చల్లార లేదు ఆయన శరీరం చెమర్చింది.ఆ చెమట చుక్కల నుంచి వేనకువేలు గజాస్యులు పుట్టుకొచ్చారు. ఆ తర్వాత దేవతలం తా పరమ శివుడిని ప్రార్థించి శాంత చిత్తుని చేశారు. అలా పుట్టిన గజాస్యులు విఘ్నేశ్వరుని పరివారంగా ఉంటుందని, గణాధిపతిగానేకాక ప్రతికార్యంలో ముందుగా విఘ్నేశ్వరుడు పూజింపబడతాడని శివుడు అనుగ్రహించాడు. వరాహ పురాణం ప్రకారం విఘ్నేశ్వరుడు ఆకాశ స్వరూపం.

సంకష్ట నాశన గణేశ స్తోత్రమ్

ప్రణమ్యశిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ ।
భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుఃకామార్థసిద్ధయే ॥

ప్రథమం వక్రతుండంచ ఏకదన్తం ద్వితీయకమ్ ।
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ ॥

లంబోదరం పంచమంచ షష్ఠంచ వికటమేవచ ।
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టకమ్ ॥

నవమం ఫాల చంద్రం చ దశమంతు వినాయకమ్ ।
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్ ॥

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః ।
నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో ॥

విద్యార్థీలభతే విద్యాం ధనార్ధీలభతే ధనమ్ ।
పుత్రార్థీలభతే పుత్రాన్ మోక్షార్థీలభతే గతిమ్ ॥

జపేత్ గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలంలభేత్ ।
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః ॥

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయం సమర్పయేత్ ।
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః ॥

(ఇతి శ్రీ నారద పురాణే సంకష్టనాశనం గణేశస్తోత్రం సంపూర్ణం)


ఏకదంతుడు ఎలా అయ్యాడు?

కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో వున్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదని నివారించాడు. “పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవ్వడివి” అంటూ పరశురాముడు ధిక్కరించాడు. మాటా మాటా పెరిగి అదికాస్తా యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండంతో పరశురామున్ని పైకిఎత్తి పడవేశాడు.

పరశురామునికి కళ్ళు బైర్లుకమ్మాయి. ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గండ్ర గొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు శయన మందిరం నుంచి బయటికి వచ్చారు. నెత్తురోడుతున్న బాల గణపతిని ఎత్తుకొని పార్వతి పరశురాముడిని మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆకథ సమాప్తమైనా గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని ‘ఏకదంతుడి’ గా పేరు పొందాడు.

ఆంధ్రప్రదేశ్‌లో గణపతి

తెలుగు దేశములో శైవం క్రీస్తుపూర్వం అయిదారు శతాబ్దాల నుంచి వ్యాప్తిలో ఉన్నట్లు ఉగ్రస్వరూపుడగు రుద్రుడు ఆరాధింపబడుతున్నట్లు చరిత్ర తెలుపుతున్నది. కాని గాణాపత్యము ఎప్పుడు ప్రవేశించిందీ తెలియదు.

ఆంధ్రప్రదేశ్‌లో శివాలయాలలో సాధారణంగా గణపతి మూర్తులుంటాయి. ప్రత్యేకమైన గణపతి క్షేత్రములు ఎక్కువగా లేవు. కొంతకాలంగా చిత్తూరు జిల్లాలోని కాణిపాకం విఘ్నేశ్వరుడు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాడు.

శ్రీ కాళహస్తీశ్వరాలయ ప్రాంగణంలోను ఆలయ కుడ్యములపై స్తంభముల మీద పెక్కు భంగుల గణపతిమూర్తులు కనిపిస్తాయి. ఆవరణంలోని పాతాళ గణపతి ఆలయం యాత్రికులను అమితంగా ఆకర్షిస్తుంది. స్వామి ఆలయ ద్వారానికి దక్షిణాన గల గూటిలో ఒక గణపతి మూర్తి ఉన్నది. ఇరువైపుల కుమారస్వామి, వినాయకుల శిల్పములు చెక్కబడ్డాయి.
ప్రధాన ఆలయానికి ముందున్న మందిరంలో నిలుచున్న గణపతి విగ్రహం ఉన్నది. శిలాముఖముపైనున్న పెక్కు మూర్తులలో నృత్త గణపతిమూర్తి ఉన్నది. ప్రధానాలయములో వల్లభ గణపతి, మహాలక్ష్మీ గణపతి మూర్తులున్నాయి.

చిత్తూరు తాలూకాలోని కాణిపాకంలోని వరసిద్ధి వినాయక మందిరం ప్రసిద్ధమైనది. రేణిగుంటకు సమీపమున గల గుడిమల్లంలోని పరశు కామేశ్వరాలయంలో నృత్తగణపతి విగ్రహం ఉన్నది. పుంగనూరు సమీపమున గల లద్దిగంలోని ఇరుంగళేశ్వర దేవాలయ ఆవరణంలోను, తొండమనాడులోని ఆదిత్యేశ్వరాలయంలోను నిలుచున్న గణపతి విగ్రహాలున్నాయి.
నెల్లూరులోని మూలస్థానేశ్వరాలయం లోపలి ఆవరణంలో దక్షిణాన గణపతి మందిరం ఉన్నది. భద్రాచల కోదండరామస్వామి ఆలయ పరిసరాలలో ఉన్న 35 దేవాలయాలలో గణపతి మందిరం కూడా ఉంది. దాక్షారామ భీమేశ్వరాలయ ఆవరణంలో తూర్పున ఉన్న గోపురానికి సమీపంలో ఒక గణపతి విగ్రహం ఉన్నది. అరసవల్లి సూర్య దేవాలయములో ఒక గణపతి మూర్తి ఉన్నది. విజయవాడకు ఈశాన్యముగ ఉన్న పర్వతగుహలలో ఒక దానియందు గణపతి మూర్తి ఉన్నది. శ్రీశైలములోని గణపతి శిల్పమును గురించి ఇదివరకే పేర్కొనడం జరిగింది.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో మూడు గణపతి దేవాలయాలున్నవి. కోటలో కొండపైకి వెళ్ళే మార్గంలో ఉన్న దశభుజ గణపతి ఆలయం అతి ప్రసిద్ధమైనది. సుమారు పది అడుగుల ఎత్తుగల ఈ విగ్రహం మనల నెంతగానో ఆకర్షించును..

తెలంగాణ ప్రాంతమున పెక్కుచోట్ల గణపతి ఆలయాలున్నాయి. వేములవాడలోని రాజరాజేశ్వరాలయంలోని లక్ష్మీగణపతి విగ్రహం విశిష్టమైనది. మెదక్ జిల్లా పాలంచేరు వద్ద రాష్ట్రకూటుల కాలం నాటి పెక్కు ఆలయ శిథిలాలున్నాయి. ఇచటి ద్విభుజ, చతుర్భుజ గణపతి మూర్తులు మూడు ఉన్నాయి. శిల్పకళా ఖండాలకు ప్రశస్తిగాంచిన నందికందిలోని రామేశ్వరాలయంలో అనేక నృత్తగణపతి శిల్పాలున్నాయి.

కొండిపర్తి, గాణగాపురం, పానగల్, పాలంపేట హనుమకొండలలో అనేక చతుర్భుజ గణపతి విగ్రహాలున్నాయి. హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయ ప్రాంగణంలోని దక్షిణ కుడ్యముపై అత్యంత సుందరమైన గణపతి శిల్పం ఉన్నది.

కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో వరంగల్లు సమీపాన వందలాది దేవాలయాలు నిర్మింపబడ్డాయి. 50 గణపతి దేవాలయాలు కట్టించినట్లు చరిత్ర తెలుపుతోంది. జహీరాబాద్ సమీపాన గల రేజంతలలో గణపతి ఆలయం కొండల మధ్య ఉన్నది. ఈ గణపతి స్వయంభువని ప్రతీతి.

మహబూబ్‌నగర్ జిల్లా అలంపురంలోని బ్రహ్మేశ్వరాలయంలో గోడపై విశిష్టమైన గణపతి విగ్రహమొకటి కనిపిస్తుంది. ఈ విగ్రహం చెక్కినది కాదని విశ్వాసం. గండ్ర ఇసుకతో పసరులను కలిపి రససిద్ధుడైన శిల్పి ఒకడు ఈ వినాయకుని తయారుచేసినట్లు చెబుతారు. ఈ వినాయకుని రససిద్ధి వినాయకుడంటారు. ఈ విగ్రహం చూడటానికి చాలా నునుపుగా కనపడ్డప్పటికీ తాకితే గరుకుగా ఉంటుందని చెబుతారు.

--------------------------------
బహురూప వినాయకుడు…

శ్రీ విఘ్నేశ్వరీ

    సుయక్ష అనే రాక్షసిని సంహరించేందుకై వినాయకుడు స్త్రీరూపాన్ని ధరించినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ వినాయక రూపాన్ని విఘ్నేశ్వరీ, గణేశిని, గణేశ్వరి, గజానని, వినాయకి అనే పేర్లతో కోలుచుకుంటారు. ఈ మూర్తినే వ్యాఘ్ర (పులి) పాద గణపతి అని కూడా అంటారు. కారణం, ఈ వినాయకుని తల భాగం ఏనుగుతల వలె మెడ నుండి నడుము వరకు స్త్రీమూర్తివలె, నడుము నుంచి పాదాల వరకు వ్యాఘ్ర (పులి) పాదాల వలె గోచరిస్తుంది.

ఇటువంటి విగ్రహాలను ఉత్తరాభారదేశంలో ఎక్కువగా చూడగలము. ఉత్తరప్రదేశ్ లోని రిగ్యాన్ అనే ప్రాంతంలో వినాయకి విగ్రహాన్ని చూడగలము. రాజస్థాన్ లోని జైపూర్, షార్టీనగర్ లలో అత్యంత సుందరమైన వినాయకి విగ్రహాలున్నాయి. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ వస్తు సంగ్రహాలయంలో, ఒరిస్సాలోని షీరాపూర్ లో వినాయకి దర్శనం లభిస్తుంది. దక్షిణాదిన సుచీంద్రం, నాగర్ కోవిల్ క్షేత్రాల్లో వినాయకి కొలువై ఉంది.

వరప్రదాత

మనం వినాయక పూజ చేస్తున్నప్పుడు, వినాయక ప్రతిమను ఏయే పదార్థంతో చేసి పూజిస్తే, ఎలాంటి ఫలితం ఉంటుందన్న విషయం పురాతన గ్రంథాలలో చెప్పబడింది.

మట్టితో చేసిన గణపతి: ఉద్యోగంలో ఉన్నతిని, వ్యాపారంలో అభివృద్ధిని అనుగ్రహిస్తాడు.

పసుపుతో చేసిన గణపతి: వివాహ ప్రయత్నాలకు ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి.

పుట్టమట్టితో చేసిన గణపతి: అన్నింటా లాభం.

బెల్లముతో చేసిన గణపతి: సౌభాగ్యాలు కలుగుతాయి.

ఉప్పుతో చేసిన గణపతి: శత్రువులపై జయం.

వేపచెట్టు కలపతో చేసిన గణపతి: శత్రు నాశనం.

తెల్లజిల్లేడు మొదలుతో చేసిన గణపతి: తెలివితేటలు పెరుగుతాయి.

వెన్నతో చేసిన గణపతి: అన్ని విధాలైనా వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది.

పాలరాతితో చేసిన గణపతి: మానసిక ప్రశాంతత కలుగుతుంది.

గంధపు చెక్కతో చేసిన గణపతి: గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంతో ఉన్నతి.

స్ఫటిక గణపతి: కుటుంబములో సంతోషం.

నల్లరాయితో చేసిన గణపతి: చేసేపనిలో అనవసరపు శ్రమ తొలిగిపోతుంది.

ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి
తన్నోదంతిః ప్రచోదయాత్

పంచముఖ గణపతి

ఐదు ముఖాలతో దర్శనమిచ్చే గణపతిని హేరంబ గణపతి అని కూడ పిలుస్తుంటారు. సింహవాహనుడైన ఈ స్వామి పది చేతులతో దర్శనమిస్తుంటాడు. ముందు రెండు చేతులలో అభయ, వరద ముద్రలతో, వెనుక నున్న మిగతా ఎనిమిది చేతులలో అంకుశం, గదాయుధం, చెరకువిల్లు, శంఖు, చక్రం, పాశం, తామర పువ్వు, ధాన్యపుకంకిని పట్టుకుని నాయన మనోహరంగా గోచరిస్తుంటాడు. కొన్ని విగ్రహాలలో దాన్యాపు కంకి, తామరపువ్వులకు బదులుగా దంతం. రత్నకలశాన్ని పట్టుకుని ఉన్నట్లుగా కనిపిస్తుంటుంది. స్వామివారు తెల్లని శరీరకాంతితో మెరిసిపోతుంటారు.

నృత్యగణపతి

నేపాల్ దేశంలో గణేశ భక్తులు నృత్య గణపతినే ఎక్కువగా పూజిస్తుంటారు. ఎరుపు రంగుతో మెరిసిపోతుంటే నేపాల్ నృత్య గణపతి త్రినేత్రుడు. తన వాహనమైన ఎలుకపై కుడికాలును కొద్దిగా మడిచి పెట్టి నృత్యం చేస్తున్న గణపతి, ఎడమ కాలును పూర్తిగా పైకెత్తగా, ఆ కాలు బొజ్జను చుట్టుకుని ఉన్న నాగబంధాన్ని తాకుతున్నట్లు ఉంటుంది. పన్నెండు చేతులులో దర్శనమిచ్చే ఈ స్వామివారు విఘ్నాలను తొలగించి, కోరుకున్న కోరికలను వెంటనే తీరుస్తాడన్నది నేపాల్ భక్త జన విశ్వాసం.

అటువంటి నృత్య గణపతులను మనదేశం లోని హళబేడు హోయసలెశ్వరాలయం, మదురై మీనాక్షీ ఆలయం, బీదర్ జిల్లా జలసంగవి వంటి క్షేత్రాలలో దర్శించుకోగాలము. హళబేడు హోయసలేశ్వరాలయ గోడపైనున్న నృత్యగణపతి మూర్తి అత్యంత సుందరరూపంతో దర్శనమిస్తుంటారు. ఎనిమిది చేతులలో కనిపించే ఈ స్వామి ముందు రెండు చేతులు దండముద్ర, విస్మయముద్రతో కనిపిస్తుండగా, వెనుకనున్న ఆరు చేతుల్లో పరశు, పాశ, మోదకపాత్ర, దంత, సర్ప, కమల పుష్పాలు ఉన్నాయి. కరండమకుటంతో నృత్యం చేస్తున్న ఈ గణపతి నిలబడిన పీఠభాగంలో మరుగుజ్జులు వాయిద్యాలు వాయిస్తున్నట్లుగా చూడగలము.

ఇక, మడురమీనాక్షి దేవాలయ స్తంభం పైనున్న నృత్య గణపతి, ఎలుకపై నృత్యం చేస్తున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఎడమకాలితో ఎలుకపై నించున్న ఈ గణపతి, కుడికాలును పైకెత్తి నృత్యం చేస్తున్నట్లుగా దర్శనమిస్తుంటాడు. ఎనిమిది చేతులతో దర్శనమిచ్చే ఈ నృత్యగణపతి కుడివైపునున్న నాలుగు చేతులలో పరశు, వలయ, పుష్పం, దంతాలతో, ఎడమవైపు నాలుగు చేతుల్లో అంకుశం, పాశం, మోదకం, ఫలాలు ఉన్నాయి.

ఇప్పుడిప్పుడే మన దక్షిణభారత దేశంలో నృత్య గణపతి పూజకు విశేష ఆదరణ లభిస్తోంది.

కవల సోదర వినాయకులు

తమిళనాడులోని అరుణాచల క్షేత్ర గిరిప్రదక్షిణ అత్యంత పుణ్యప్రదమని భక్తజన విశ్వాసం. అరుణాచల గిరిప్రదక్షిణ చేసే భక్తులు ప్రదక్షిణ మార్గంలో…ముందుగా కనిపించే విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు చేసి, ప్రదక్షణను మొదలు పెడతారు.

అప్పుడు భక్తితో విఘ్నేశ్వర గర్భాలయంవైపు చూసిన భక్తులు ఆశ్చర్యంతో అప్ర్తిభులవుతుంటారు. కారణం, గర్భాలయంలో కవల సోదర వినాయకులు దర్శనమిస్తుంటారు. ఈ ఆలయంలో వినాయకుడు కవలలుగా అవతరించడానికి వెనుక ఓ ఆసక్తికరమైన ఉదంతం ఉంది.

సుమారు 452 సంవత్సరాల క్రితం, వీర బాహు దేశికుడు అనే శివ భక్తునికి స్వయంభువైన ఓ వినాయక ప్రతిమ దొరకడంతో, ఆ వినాయకునికి ఆలయాన్ని నిర్మించే పనిలో నిమగ్నమయ్యాడు. అరుణాచల క్షేత్రానికి ఉత్తర దిశలో ఆలయ నిర్మాణాన్ని చేసేందుకై భూమిని తవ్విస్తున్న అతను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత అతనికి సంతోషానికి అవధుల్లేవు. అందుకూ ఓ కారణం ఉంది.

స్వయంభువుగా లభించిన వినాయకుని కోసం ఆలయాన్ని నిర్మించే పనిలో ముమ్మరమై వున్న తనకు, ఆలయ నిర్మాణానికై పునాదులను త్రవ్వుతున్నప్పుడు, ఆ స్వయంభువు విగ్రహాన్ని పోలిన విగ్రహమే లభించింది. అదంతా దైవ నిర్ణయంగా భావించిన వీరబాహుదేశికుడు ఆ కవల గణపతులను శాస్త్రోక్తంగా ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించాడు. అరుణాచల గిరిప్రదిక్షణం చేసె భక్తులు ఈ కవల గణపతులను దర్శించుకుని పూజిస్తే, కోరుకున్న కోరికలన్నీ ఫలిస్తాయని భక్తజన విశ్వాసం.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment